free darshan
-
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో భక్తులు నారాయణగిరి ఉద్యానవనం వరకు బారులు తీరారు. శనివారం 74,845 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,122 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.4.44 కోట్లు ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనమవుతోంది. రేపు తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆళ్వార్ తిరుమంజనం పేరుతో ఆలయ శుద్ధి కార్యక్రమం, సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ.. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కొత్త వస్త్రంతో స్వామివారిని పూర్తిగా కప్పి వేసి గర్భగుడిని, పూజా సామాగ్రిని సుగంధ ద్రవ్యాల లేపనంతో శుద్ది చేశారు. 2024 మార్చి నెల శ్రీవారి దర్శనం, ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల తేదీలను ప్రకటించింన టిటిడి ► నేడు ఉదయం 10 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం ఆన్ లైన్ లో నమోదు చేసుకోవచ్చు. ► డిసెంబరు 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జితసేవలైన కల్యాణోత్సవం,ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుదల. ► డిసెంబరు 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి తెప్పోత్సవాల టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతారు. ► డిసెంబరు 21న మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, దర్శన టికెట్ల కోటాను విడుదల. ► డిసెంబరు 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు అందుబాటులో ఉంటాయి. ► డిసెంబరు 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదుల కోటాను విడుదల చేస్తారు. ► డిసెంబరు 23న మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శనటికెట్ల కోటాను విడుదల చేస్తారు. ► డిసెంబరు 25న ఉదయం 10 గంటలకు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టకెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతారు. ► డిసెంబరు 25న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను విడుదల. ► డిసెంబరు 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతిలోని శ్రీవారి సేవ కోటాను, అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 3 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. ► https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టిటిడి సూచన. -
TTD: తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ
సాక్షి, తిరుపతి: తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనం కోసం 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిచూస్తున్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉంటే.. గురువారం శ్రీవారిని 59,335 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 23,271 కాగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.29 కోట్లుగా తేలింది. -
తిరుమలకు విపరీతంగా పెరిగిన రద్దీ
సాక్షి, తిరుపతి: తిరుమలకు విపరీతంగా భక్తుల రద్దీ పెరిగింది. శ్రావణ మాసం ముగుస్తుండడంతో.. భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి(ఉచిత దర్శనం) కోసం 18 గంటలు, ప్రత్యేక దర్శనం కోసం 4 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(ఆదివారం, 10) శ్రీవారిని 84,449 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 33,570గా ఉంది. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4.47 కోట్లుగా లెక్క తేలింది. రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం రేపు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయ శుద్ధి చెయ్యనున్నారు అర్చకులు. ఈ నెల18 నుండి 26 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 17న అంకురార్పణ, 18 ధ్వజారోహణం నిర్వహిస్తారు. ప్రభుత్వం తరపున ముఖ్యమంతత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నెల 22వ తేదీన గరుడ సేవ ఉండగా.. ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాల్ని అనుమతించరు. ఇక బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సిఫారసు లేఖలు రద్దు ఉంటుందని తెలియజేసింది టీటీడీ. అలాగే.. వాహనసేవలు తిలకించడానికి గ్యాలరీలు ఏర్పాటు చేశారు. -
తిరుమలలో నేడు ఉట్లోత్సవం.. ఆర్జిత సేవలు రద్దు
సాక్షి, తిరుపతి: తిరుమలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోయి ఉంది. బయట క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది. ఇక.. ఇవాళ తిరుమల మాడవీధులలో ఉట్లోత్సవం నిర్వహించనున్నారు. దీంతో ఇవాళ ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ. ఆయా సమయాల్లో ఉట్లోత్సవం, మలయప్ప స్వామివారి ఊరేగింపు ఉంటుందని పేర్కొంది. తిరుమలలో ఈ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య ఆలయ నాలుగు మాడ వీధులలో అత్యంత వైభవంగా ఉట్లోత్సవం నిర్వహించనున్నారు. తిరుమాడ వీధులలో ఉట్లోత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తీసుకొస్తారు. ఈ ఉట్లోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ్టి.. కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. శ్రావణ మాసం ముగింపు కావడంతో.. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ క్యూ కాంప్లెక్స్ నిండిపోయి.. భక్తులు బయట క్యూ లైన్లలో నిల్చున్నారు. టోకెన్ లేని భక్తులు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న(సెప్టెంబర్ 7, 2023) 58,855 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అందులో.. 29,014 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండి ఆదాయం రూ. 4.65 కోట్లుగా లెక్కతేలింది. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటలు
సాక్షి, తిరుపతి: తిరుమలలలో స్వామివారి దర్శనం కోసం భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠ కాంప్లెక్స్‌లో కంపార్ట్మెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. వెలుపల క్యూలైన్ లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(ఆగష్టు 31, 2023)న తిరుమల శ్రీవారిని 59, 808 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,618 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.6కోట్లుగా లెక్క తేలింది. అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరిగే రెండు బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని చేస్తోంది టీటీడీ. ఇదీ చదవండి: సెప్టెంబర్ 18న తిరుమలకు సీఎం జగన్ -
Tirumala: పెరిగిన భక్తుల రద్దీ
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు 18 కంపార్ట్మెంట్లలో నిండిపోయి ఉన్నారు. టికెట్లు లేని సర్వదర్శనానికి(ఉచిత దర్శనం) ఏడు గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(ఆగష్టు 30, 2023) స్వామివారిని 71,132 భక్తులు దర్శించుకున్నారు. 26,963 తలనీలాలు సమర్పించుకున్నారు. రూ. 4.06 కోట్ల హుండీ ఆదాయం లెక్కగా తేలింది. -
తిరుమల: సర్వదర్శనానికి 18 గంటల సమయం
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. 25 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. మరోవైపు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు నేటితో ముగియనున్నాయి. దీంతో రేపటి నుంచి ఆర్జిత సేవలు పునరుద్ధరిస్తారు. ఇక నిన్న(సోమవారం, ఆగష్టు 28) 68,263 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.65 కోట్లుగా తేలింది.తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య 28, 355గా తేలింది. ద్వారకాతిరుమలలో పవిత్రోత్సవాలు ఏలూరు: నేటి నుంచి ద్వారకాతిరుమలలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. అంకురార్పణతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. 30వ తేదీన పవిత్రాదివాసం, 31వ తేదీన పవిత్రావరోహణ నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల సమయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. స్వామివారి ఉచిత దర్శనం కోసం 13కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దర్శనానికి వెళ్ళే భక్తులకు 6 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక నిన్న(శనివారం, ఆగష్టు 19) స్వామివారిని 79,242 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 36,039 కాగా, స్వామివారి హుండీ ఆదాయం 4.76 కోట్లుగా లెక్క తేలింది. ఇదీ చదవండి: ఇక ఆక్టోపస్ బృందం పర్యవేక్షణలో శ్రీవారి ఆలయం -
తిరుమల: సర్వదర్శనానికి 12గం. సమయం
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి ఉచిత దర్శనం కోసం 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. అలాగే.. ప్రత్యేక దర్శనానికి 3. గంటలు పడుతోంది. శుక్రవారం నాడు.. స్వామివారిని 69,378 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 28,371 మంది తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.76 కోట్లు రూపాయలుగా తేలింది. రెండు బ్రహ్మోత్సవాలు అధికమాసం సందర్భంగా ఈ ఏడాది తిరుమల శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఇదీ చదవండి: వేడుకగా అర్జున తపస్సు -
TTD: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. పది కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. ఇక నిన్న (మంళవారం) 64 వేలమంది స్వామివారిని దర్శించుకున్నారు. 26 వేల మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 3.06 కోట్లుగా లెక్క తేలింది. తిరుమల పుష్ప పల్లకీ సేవ.. ఫొటోలు వీక్షించండి -
తొలి ఏకాదశి.. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
సాక్షి, తిరుపతి: తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ పెరిగింది. తొలి ఏకాదశి పర్వదినం కావడంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగానే క్యూ కట్టారు. దర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3గంటలు సమయం పడుతోంది. ఇక నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 71,615గా ఉండగా.. హుండీ ఆదాయం రూ. 3.68 కోట్లుగా తేలింది. -
తిరుమల: ఉచిత దర్శనానికి 15 గంటల సమయం
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి చెంతకు భక్తుల క్యూ కొనసాగుతోంది. స్వామివారి దర్శనానికి 17 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని సర్వదర్శనానికి(ఉచిత) 15 గంటలు సమయం పడుతోంది. అలాగే.. ప్రత్యేక దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది. ఇదిలా ఉంటే మంగళవారం శ్రీవారిని 71,935 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.11 కోట్లుగా తేలింది. ఇదీ చదవండి: సాధారణ భక్తుల కోసం.. టీటీడీ ప్రయోగం సక్సెస్ -
శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం
సాక్షి, తిరుపతి: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి(ఉచిత) 15 గంటల సమయం పడుతోంది. అలాగే.. దర్శనం కోసం 20 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. నిన్న(సోమవారం, జూన్ 19) శ్రీవారిని 69,879 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 29,510 మందిగా నమోదు అయ్యింది. ఇక తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.82 కోట్లుగా తేలింది. అదనపు లడ్డూ కౌంటర్లు.. టీటీడీ కీలక నిర్ణయం -
TTD: సర్వదర్శనానికి 20 గంటల సమయం
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి చెంతకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్టుమెంట్లలో దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఇక ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉంటే.. నిన్న(ఆదివారం) శ్రీవారిని 86,181 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.59 కోట్లుగా తేలింది. ఇక తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 30,654గా ఉంది. ఇక.. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల సెప్టెంబరు నెల కోటాను ఇవాళ(జూన్ 19న) విడుదల చేయనుంది టీటీడీ. సుప్రభాతం, అర్చన, తోమాల, అషాదటళ పాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్లైన్ లక్కీ డిప్ కోసం ఉదయం 10గంటల నుంచి జూన్ 21వ తేదీ ఉదయం 10గంటల వరకు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు నగదు చెల్లించి టికెట్‌ను ఖరారు చేసుకోవాలి. కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవాకు సంబంధించిన టికెట్లు జూన్ 22న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. సెప్టెంబరు మాసం కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవ వర్చువల్ సేవల కోటా, సంబంధించిన దర్శన టికెట్ల జూన్ 22న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. సెప్టెంబరు నెల అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను ఈనెల 23న 10 గంటలకు విడుదల చేస్తారు. ఆగస్టు 27 నుంచి 29 వరకు జరగనున్న పవిత్రోత్సవాల సేవా టికెట్ల కోటాను.. జూన్ 22వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. మరోవైపు నేడు టీటీడీ పాలక మండలి భేటీ అయ్యి.. పలు కీలక నిర్ణయాలు తీసుకోనుందని తెలుస్తోంది. ఇదీ చదవండి: జూన్‌లో తిరుమల వెంకన్న దగ్గరకు ఎందుకు వెళ్లాలంటే.. -
దర్శనం బాధ్యత ప్రభుత్వానిదే : చందూలాల్
హైదరాబాద్: తరచూ పర్యాటక శాఖ హోటళ్లలో విడిది చేసే వారికి ఖర్చుల్లో రాయితీ లభించనుంది. స్థానిక దేవాలయాల దర్శనాలకు వెళ్లినపుడు ప్రత్యేక దర్శనం ఉచితంగా కల్పించే బాధ్యతను పర్యాటక శాఖ తీసుకోనుంది. పర్యాటక శాఖ అధీనంలోని హరిత హోటళ్లకు గిరాకీ పెంచే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తిరుమలలో అమల్లో ఉన్న విధానాన్ని తెలంగాణలో కూడా వర్తింపచేయాలని నిర్ణయించింది. మంగళవారం పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ ఆ శాఖ జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాదాద్రి, భద్రాచలం, బాసర, కాళేశ్వరం, వేములవాడ వంటి ప్రముఖ దేవాలయాలకు వచ్చే భక్తులు పర్యాటక శాఖ హోటళ్లలో బసచేసే వారి దైవ దర్శన బాధ్యతను పర్యాటక శాఖే తీసుకుంటుందన్నారు. గిరిజన విద్యాసంస్థల్లోని విద్యార్థుల విజ్ఞాన, విహారయాత్రల వ్యయాన్ని గిరిజినాభివృద్ధి సంస్థ భరిస్తుందన్నారు. రాష్ట్రంలో బౌద్ధ ప్రాధాన్యమున్న ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని, ఇందుకు ప్రత్యేకంగా బుద్ధ సర్క్యూట్ ప్రాజెక్టుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చందూలాల్ వెల్లడించారు. రూ.200 కోట్లతో ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. స్వదేశీ దర్శన్ ప్రాజెక్టులో భాగంగా ట్రైబల్ సర్క్యూట్‌కు మొదటి విడతలో కేంద్రం విడుదల చేసిన రూ.17 కోట్లతో పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. మేడారం, లక్నవరం, తాడ్వాయి, దామరవాయి, ములుగు గట్టమ్మ దేవాలయం, మల్లూరు, బొగత జలపాతం తదితర ప్రాంతాల్లో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఎకో టూరిజం ప్రాజెక్టు కింద సింగోటం, కొల్లాపూర్, శ్రీశైలం ప్రాజెక్టు ప్రాంతం, అక్కమహాదేవి గుహలు, మల్లెల తీర్థం ప్రాంతాల్లో కూడా పనులు చేపట్టినట్లు వెల్లడించారు.