హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, డీజీపీ దినేష్ రెడ్డి రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ ఆరోపించారు. వారికి పదవుల్లో కొనసాగే నైతిక హక్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకూ ముల్కీ అమరవీరుల వారోత్సవం నిర్వహిస్తామని కోదండరామ్ మంగళవారమిక్కడ తెలిపారు.
వచ్చే నెల 7వ తేదీన హైదరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహిస్తామని కోదండరామ్ వెల్లడించారు. రాష్ట్ర విభజన అంశంలో సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని అమలు చేయటంలో జాప్యం వల్లే ఈ గందరగోళం నెలకొందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల తీరు సక్రమంగా లేదని కోదండరామ్ అన్నారు. దీనిపై త్వరలో వారిని కలవనున్నట్లు ఆయన తెలిపారు.
కిరణ్, దినేష్లకు పదవిలో కొనసాగే హక్కులేదు
Published Tue, Aug 27 2013 1:51 PM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM
Advertisement
Advertisement