సీఎంగా కొనసాగే హక్కు కిరణ్‌కు లేదు | Kodandaram Demands for cm kiran kumar reddy comments | Sakshi

సీఎంగా కొనసాగే హక్కు కిరణ్‌కు లేదు

Published Fri, Aug 9 2013 2:45 PM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

సీఎంగా కొనసాగే హక్కు కిరణ్‌కు లేదు - Sakshi

సీఎంగా కొనసాగే హక్కు కిరణ్‌కు లేదు

హైదరాబాద్ : కిరణ్కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కులేదని తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ అన్నారు. పార్టీలో...బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఇటువంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని ఆయన శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ వల్లే ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేస్తున్నారని కోదండరామ్ మండిపడ్డారు.

సీఎం తీరుకు నిరసనగా మూడు రోజుల పాటు ర్యాలీలు, దిష్టిబొమ్మలు దగ్దం కార్యక్రమాలు చేపడతామన్నారు. 10,11, 12 తేదీల్లో నిరసన చేస్తామని తెలిపారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమకార్యాచరణను తీవ్రతరం చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ మంత్రులు కూడా సంబరాలు వదిలి పక్షపాతంతో వ్యవహరిస్తున్న సీఎం కింద తాము పనిచేయలేమని స్పష్టం చేయాలని కోదండరామ్ డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement