డీజీపీ దినేష్‌రెడ్డి పదవీకాలం పొడిగింపు? | DGP Dinesh reddy tenure extend? | Sakshi
Sakshi News home page

డీజీపీ దినేష్‌రెడ్డి పదవీకాలం పొడిగింపు?

Published Wed, Aug 21 2013 3:53 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

డీజీపీ దినేష్‌రెడ్డి పదవీకాలం పొడిగింపు? - Sakshi

డీజీపీ దినేష్‌రెడ్డి పదవీకాలం పొడిగింపు?

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) వేణుంబాక దినేష్‌రెడ్డి పదవీకాలాన్ని మూడు నెలల పాటు పొడిగించేందుకు కేంద్ర హోంశాఖ తన సమ్మతిని తెలియజేసినట్లు విశ్వసనీయ సమాచారం. 2011 జూలైలో డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన దినేష్‌రెడ్డి వచ్చే నెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన పదవీకాలాన్ని ఏడాది పొడిగించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపింది. దీన్ని పరిశీలించిన కేంద్ర హోంశాఖ  అదనంగా మూడు నెలలు మాత్రమే పొడిగించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు దినేష్‌రెడ్డి ఈ ఏడాది డిసెంబర్ 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement