Dinesh reddy
-
చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదు
-
వేమిరెడ్డికి ఎన్నికలకు ముందే షాకులు..!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వెంటాడుతున్న ఓటమి భయం.. స్వపక్షం నుంచే ఎదురవుతున్న నిరసనలు.. ఖర్చు పేరిట పీల్చిపిప్పి చేస్తున్న నేతలు.. ఇలా వరుస షాకులతో టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి ఎన్నికలకు ముందే చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రత్యక్ష రాజకీయాలతో ఏ మాత్రం సంబంధంలేని ఆయన ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు. ఆత్మీయ సమావేశాల పేరిట డబ్బులిచ్చి జనాలను తరలిస్తున్నా, అభ్యర్థులు మాట్లాడే సమయానికి వీరు నిష్క్రమిస్తుండటంతో పుండుమీద కారం జల్లిన పరిస్థితి వేమిరెడ్డికి ఏర్పడింది. టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజకీయ పరిస్థితి ఓ అడుగు ముందుకు.. నాలుగడుగులు వెనక్కి అనే రీతిలో సాగుతోంది. ప్రచారానికి వెళ్తున్న వేమిరెడ్డి దంపతులకు స్వపక్ష నేతల నుంచే అవమానాలు, నిరసనలు స్వాగతం పలుకుతున్నాయి. జిల్లాలో టీడీపీ గ్రాఫ్ మెరుగుపడకపోవడం.. పైగా ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాల్లేవనే సంకేతాల తరుణంలో కీలక నేతలుగా ప్రచారం చేసుకుంటూ అందిన కాడికి గుంజాలనే ఉద్దేశంతో కొందరు ఆయన చుట్టూ కోటరీగా ఏర్పడ్డారు. వలసలను ప్రోత్సహిస్తున్నా పెరగని ప్రజాదరణ భారీ ప్యాకేజీలతో టీడీపీలోకి వలసలను ప్రోత్సహిస్తున్నా, క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి ప్రజాదరణ ఏ మాత్రం పెరగడంలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టిన అత్యుత్తమ పదవులతో పాటు గౌరవ మర్యాదలు పొందిన వీరి పరిస్థితి ప్రస్తుతం ఒక్కసారిగా తిరగబడింది. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పట్టుబట్టి టీడీపీ కోవూరు అభ్యర్థిగా తన భార్య వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేరును ఖరారు చేయించారు. వాస్తవానికి ఏళ్ల పాటు కష్టించి తానే అభ్యర్థినని విస్తృత ప్రచారం చేసిన పోలంరెడ్డి దినేష్‌రెడ్డికి ఈ పరిస్థితి మింగుడుపడలేదు. తనను పక్కనబెట్టడాన్ని జీర్ణించుకోలేని దినేష్ తనదైన శైలిలో రాజకీయాలకు తెరలేపారు. వెన్నంటే ఉంటూ నిరసనలకు సై.. వేమిరెడ్డి వెన్నంటే దినేష్‌రెడ్డి ఉంటూ తెరచాటు రాజకీయాలు చేస్తున్నారనే ప్రచారమూ జరుగుతోంది. అధిష్టాన ఆదేశాలతో పార్టీ కోసం పనిచేస్తూ.. ప్రశాంతక్కను గెలిపించుకుందామంటూ మండలాల వారీగా ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తున్న దినేష్.. పరోక్షంగా వారికి నిరసన సెగ చూపేలా కేడర్‌ను సమాయత్తపరుస్తున్నారని సమాచారం. ఇందుకూరుపేట మండలానికి ఆదివారం ఆమె వెళ్లగా, టీడీపీ వర్గీయులు భారీగా గుమిగూడి గో బ్యాక్.. ప్రశాంతి.. డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కొద్దిసేపు నిరీక్షించినా పరిస్థితి సద్దుమణగకపోవడంతో ఆమె వెనుదిరిగారు. ఇదే సమయంలో దినేష్‌రెడ్డి నాయకత్వం వర్థిల్లాలి అంటూ నినదించడం.. అనంతరం తన వర్గంతో కలిసి వెళ్లి ఆత్మీయ సమావేశాన్ని ఆయన నిర్వహించడాన్ని దీనికి ఉదాహరణగా చూపుతున్నారు. ఆత్మీయ సమావేశాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలతో ప్రశాంతిరెడ్డికి వెన్నుపోటు తప్పదనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. ఆగండయ్యా..! కోవూరులోని నెల్లూరు గ్రాండ్ హోటల్, బుచ్చిరెడ్డిపాళెం టోల్‌ప్లాజా వద్ద వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాలను నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతుండగానే, సభ నుంచి వెళ్లేందుకు కేడర్ సన్నద్ధమయ్యారు. ఎక్కడికెళ్తున్నారు.. ఆగండి అని వేమిరెడ్డి వేడుకున్నా పట్టించుకోకుండా అందరూ బయల్దేరారు. ఖర్చులంటూ ఒత్తిడి నెల్లూరు పార్లమెంట్ పరిధిలో టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్న అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల కోసం వేమిరెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. వేమిరెడ్డి నివాసంలో నాలుగు రోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు వారు డిమాండ్ చేశారని తెలిసింది. ఇంకా నామినేషన్ల పర్వమే ప్రారంభం కాలేదు.. అప్పుడే డబ్బులేంటి.. తర్వాత చూద్దామని ఆయన చెప్పారని సమాచారం. ఇవి చదవండి: కూటమిలో వేరు కుంపట్లు -
పద్ధతిగా తండ్రీకొడుకులను పక్కకు పెట్టిన చంద్రబాబు
కోవూరు: నియోజకవర్గంలో పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, దినేష్‌రెడ్డి ఆధిపత్యానికి టీడీపీ అధిష్టానం క్రమంగా కత్తెరేస్తోంది. ఈ పరిస్థితుల్లో తమ పయనమెటో తేల్చుకోలేక అగమ్యగోచర స్థితిలో వీరు కొట్టుమిట్టాడుతున్నారు. వాస్తవానికి కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న వీరు పార్టీ అధినేత చంద్రబాబును కలిసి మాట్లాడొచ్చారు. ఇది జరిగిన రెండు రోజులకు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి అనే పదవిని దినేష్‌రెడ్డికి కట్టబెట్టారు. 24 గంటల్లోనే మరో ఝలక్ ఇది జరిగి 24 గంటలు కాక ముందే కోవూరు టీడీపీ అభ్యర్థి గెలుపు బాధ్యతలను నియోజకవర్గంతో సంబంధంలేని వ్యక్తికి అప్పజెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో ఇటీవలే చేరిన నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్‌యాదవ్‌కు ఈ బాధ్యతను అప్పగించి తండ్రీకొడుకులను పద్ధతిగా పక్కనబెట్టారు. నియోజకవర్గంలో పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా రూప్‌కుమార్‌యాదవ్‌ను వీరు ఇక సంప్రదించక తప్పదు. తండ్రీకొడుకులపై నమ్మకం లేకే టీడీపీ ఈ నిర్ణయానికి వచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలంరెడ్డి పయనమెటో..? ప్రస్తుత పరిణామాలతో పోలంరెడ్డి నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజకీయంగా వేమిరెడ్డి బలపడితే ఇక తమకు ఎలాంటి రాజకీయ భవిష్యత్తు ఉండదని, ఈ తరుణంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని పోలంరెడ్డిపై అనుచరులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. కేడర్ ఒత్తిడితో పాటు అధిష్టాన వైఖరితో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని అనుచరులతో చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. -
‘బీజేపీ సభలకు వెళ్తే రేషన్ కట్ చేస్తారా’
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో అరాచక శక్తులు పెరిగిపోయాయని బీజేపీ నేతలు దినేష్ రెడ్డి, సుధీష్ రాంబొట్ల విమర్శలు గుప్పించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ పాలనపై నిప్పులు చెరిగారు. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావును గృహ నిర్బంధం చేయడమే కాకుండా ఆయనను పరామర్శించేందుకు వెళ్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను రోడ్డుపైనే నిర్బంధించడం బాధాకరమని దినేష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పై అధికారులు చెప్పడం వల్లనే కన్నాను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. ఆయన పట్ల అమర్యాదగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. ముళ్లపూడి బాపిరాజుతో బహిరంగ చర్చకు వెళ్తున్న మాజీ మంత్రి మాణిక్యాల రావును నిర్బంధించాల్సిన అవసరమేంటని సుధీష్ రాంబొట్ల ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక మాజీ మంత్రికే ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే... ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకున్న సామాన్యుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ సభలకు వెళ్లిన వారిని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారనీ, రేషన్ కార్డులను తొలగిస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నారని నిప్పులు చెరిగారు. టీడీపీ నేతలు ఇప్పటికైనా ప్రజా సమస్యలపై దృష్టి పెడితే మంచదని హితవు పలికారు. ఆంద్రప్రదేశ్‌కు సాయం చేసేందుకు కేంద్ర సర్కారు సిద్ధంగా ఉందని అన్నారు. -
మరణిస్తూ మహాదానం
► నెల్లూరులో దినేశ్‌రెడ్డి బ్రెయిన్‌డెడ్.. చనిపోతూ అవయవదానం ► పత్యేక హెలికాప్టర్లో గుండె, కాలేయం హైదరాబాద్‌కు తరలింపు ► కిమ్స్‌లో యువకుడికి కాలేయ మార్పిడి ► నెల్లూరులో మరో ఇరువురికి కిడ్నీల దానం సాక్షి, హైదరాబాద్/నెల్లూరు రూరల్: తను కన్నుమూస్తూ మరో ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపి అమరజీవిగా నిలిచాడు నెల్లూరుకు చెందిన దినేశ్‌రెడ్డి (32). నెల్లూరు నవాబుపేటలో నివాసముంటున్న ఆయనకు ఈనెల 13న రాత్రి ఫిట్స్ వచ్చాయి. దీంతో తల్లిదండ్రులు శ్రీహరిరెడ్డి, వసంతలక్ష్మిలు హుటాహుటిన నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు మెదడుకి శస్త్ర చికిత్స చేశారు. చికిత్స పొందుతుండగానే మరోమారు ఈనెల 18న బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కోమాలోకి వెళ్లారు. దీంతో వైద్యులు దినేష్‌రెడ్డి బ్రెయిన్‌డెడ్ అయ్యాడని నిర్ధారించారు. అనంతరం శోకసంద్రంలోనే దినేశ్‌రెడ్డి అవయవదానానికి తల్లిదండ్రులు అంగీకరించగా, వైద్యులు జీవన్‌దాన్‌కు సమాచారమిచ్చారు. జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేసుకుని హైదరాబాద్ కిమ్స్‌లో కాలేయ, గుండె మార్పిడి చికిత్సకు ఎదురు చూస్తున్న ఇద్దరు బాధితులకు సమాచారం ఇచ్చారు. అవయవమార్పిడి చికిత్సకు వారు అంగీకరించడంతో వారికి చికిత్స చేస్తున్న వైద్య బృందం వెంటనే ప్రత్యేక హెలికాప్టర్లో నెల్లూరు చేరుకుంది. దాత నుంచి గుండె, కాలేయం, కిడ్నీలను సేకరించింది. రెండు కిడ్నీలను నెల్లూరు కిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఇద్దరు బాధితులకు అమర్చగా, గుండె, కాలేయాన్ని ప్రత్యేక బాక్స్‌లో భద్రపరిచి ఉదయం 6.30 గంటలకు నెల్లూరులో గ్రీన్‌చానల్ ద్వారా జిల్లా పోలీసు కవాతు మైదానానికి తీసుకొచ్చి, అక్కడి నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయానికి ఉదయం 7.30కి చేర్చారు. ట్రాఫిక్ పోలీసుల సహాయంతో కిమ్స్‌కు తరలించారు. మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన 36 ఏళ్ల యువకునికి కాలేయాన్ని విజయవంతంగా అమర్చారు. ఒక కిడ్నీ నారాయణ ఆసుపత్రికి, మరో కిడ్నీని నగరంలోని కిమ్స్‌కు, కళ్లను మోడరన్ ఐ బ్యాంకుకి తరలించారు. దాత నుంచి సేకరించిన గుండె స్వీకర్తకు మ్యాచ్ కాలేదు. దాత హైబీపీతో బాధపడుతుండటం, 1సెంటీమీటర్ల మందం లో ఉండాల్సిన గుండె రక్త నాళాలు 1.5 సెంటీమీటర్ల మందంలో ఉండటంతో అవయవమార్పిడికి పనికి రాలేదు. దీంతో గుండె మార్పిడి చికిత్సను విరమించుకున్నట్లు కిమ్స్ సీఈవో భాస్కర్‌రావు వెల్లడించారు. -
విడవలూరు యవకుడికి బ్రెయిన్‌డెడ్
-
విడవలూరు యవకుడికి బ్రెయిన్‌డెడ్
నెల్లూరు: విడవలూరుకు చెందిన దినేష్‌రెడ్డి అనే యవకుడికి బ్రెయిన్ డెడ్ అయింది. దాంతో యవకుడు దినేష్‌రెడ్డి అవయవాలను దానం చేసేందుకు అతడి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. ఈ నెల 13న దినేష్‌రెడ్డికి ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్‌కు గురయ్యాడు. అయితే దినేష్‌రెడ్డి బ్రతకడం కష్టమని వైద్యులు చెప్పడంతో అతడి తల్లిదండ్రుల అంగీకారం మేరకు నెల్లూరు జిల్లాలోని నారాయణ ఆస్పత్రిలో విజయవంతంగా అవయవదానం ఆపరేషన్ చేశారు. దినేష్ రెడ్డి కిడ్నీని నెల్లూరులోని కిమ్స్ ఆస్పత్రికి తరలించి.. మరొక కిడ్నీని నారాయణ ఆస్పత్రిలో ఉంచారు. గుండె, కాలేయాన్ని గ్రీన్ ఛానెల్ ద్వారా హైదరాబాద్‌కు అధికారులు తరలించినట్టు సమాచారం. -
నయీమ్‌ను చూడలేదు: దినేశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ బతికున్నంతకాలం అతన్ని చూడలేదని, ఎన్కౌంటర్ తర్వాతే మీడియాలో చూశానని రిటైర్డ్ డీజీపీ, బీజేపీ నేత వి.దినేశ్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో శని వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నయీమ్ అధ్యాయం ముగిసిందన్నారు. నయూమ్‌ను ఎన్కౌంటర్ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు అభినందనలు తెలిపారు. అవినీతి, అరాచకాలకు, గ్యాంగ్స్టర్లకు ప్రధాని మోదీ ప్రభుత్వం, బీజేపీ చాలా దూరమన్నారు. నయీమ్ ఘటనపై ఏర్పాటైన సిట్ పటిష్టంగా దర్యాప్తు చేయాలని, దోషులను కఠినంగా శిక్షించేలా చూడాలని దినేశ్‌రెడ్డి కోరారు. సిట్ పనితీరు సరిగ్గా లేకుంటే ఊరుకునేదిలేదని స్పష్టం చేశారు. తాను డీజీపీగా పనిచేసినంతకాలం నయీమ్‌ను పట్టుకునే అవకాశం రాలేదన్నారు. మాజీ మావోయిస్టులను ఇన్ఫార్మర్లుగా వాడుకోవడం సహజమని, అయితే నయీమ్‌లాగా గ్యాంగ్స్టర్లను ప్రోత్సహించడం సరికాదన్నారు. మాజీ డీజీపీకి నయీమ్‌తో సంబంధాలున్నాయని మీడియాలో వార్తలు రావడం సరికాదన్నారు. తొందరపడి, పనిగట్టుకుని ఒక మీడియా తనపై దుష్ర్పచారం చేస్తోందని దినేశ్‌రెడ్డి ఆరోపించారు. ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్య జరిగినప్పుడు తాను పక్కన ఉన్నట్టు ప్రచారం చేయడం కూడా సరికాదన్నారు. అప్పుడు తాను 400 గజాల దూరంలో ఉన్నానని దినేశ్‌రెడ్డి వెల్లడించారు. డీజీపీ స్థాయి వంటి వారికి నయీమ్ లాంటి వారితో ప్రత్యక్ష సంబంధాలు ఉండవన్నారు. అమాయకులను వేధిస్తే కూడా ఊరుకునేది లేదని దినేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. -
దినేశ్ రెడ్డి ప్రెస్‌మీట్ వాయిదా
-
దినేశ్ రెడ్డి ప్రెస్‌మీట్ వాయిదా
హైదరాబాద్: మాజీ డీజీపీ, బీజేపీ నాయకుడు దినేశ్ రెడ్డి విలేకరుల సమావేశం వాయిదా పడింది. బీజేపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ వద్దని ఆ పార్టీ నాయకులు సూచించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత మరోచోట ఆయన విలేకరుల సమావేశం నిర్వహించే అవకాశముంది. ఎన్కౌంటర్ లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీంతో పలువురు పోలీసు మాజీ ఉన్నతాధికారులుకు సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విలేకరుల సమావేశంలో ఆయన వివరణ ఇస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి, టీడీపీ నాయకులు ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి ఈ వ్యవహారంపై వివరణయిచ్చారు. నయీం ముఠాతో తమకు ఎటువంటి సంబధాలు లేవని స్పష్టం చేశారు. మరోవైపు హైదరాబాద్ కు చెందిన మాజీ మంత్రికి నయాం గ్యాంగ్ తో సంబంధాలున్నట్టు ఆరోపణలు వచ్చాయి. -
మాజీ డీజీపీ బంధువు ఇంట్లో భారీ చోరీ
హైదరాబాద్:హైదరాబాద్: మాజీ డీజీపీ దినేష్ రెడ్డి బంధువు ఇంట్లో మంగళవారం రాత్రి భారీ చోరీ జరిగింది. జూబ్లీహిల్స్ లోని ఆయన సోదరుడి కుమార్తె ఇంట్లో సుమారు కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలతో పాటు పలు విలువైన వస్తువులు అపహరణకు గురయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ రోడ్ నెం-58 లో ఉండే దినేష్ రెడ్డి సోదరుడి కుమార్తె దివ్యారెడ్డి గతనెల 4 న అమెరికా వెళ్లింది. వెళ్లు ముందు వజ్రపు ఉంగరాలు, గాజులు దుస్తుల మధ్యలో ఉంచి, వాటిని ఒక బ్యాగ్ లో పెట్టి తన తల్లి వద్దకు పంపింది. అయితే దుస్తుల్లో నగలు పెట్టిన విషయాన్ని తల్లికి చెప్పడం మరిచిపోయింది. గత నెల 17 న దివ్యారెడ్డి అమెరికా నుంచి తిరిగి రావడంతో తల్లి తన వద్ద ఉన్న బ్యాగులో మరికొన్ని దుస్తులు పెట్టి తిరిగి పంపింది. అయితే అప్పటి నుంచి దివ్యారెడ్డి బ్యాగ్ లోని నగలను చూసుకోలేదు. కాగా గత నెల 30 న బ్యాగ్ లో చూసుకోగా నగలు కనిపించలేదు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా దివ్యారెడ్డి నివాసంలో ఎలాంటి సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసులకు నిందితుల ఆచూకీ కనిపెట్టడం కష్టతరంగా మారింది. -
'హోదాతో పనిలేదు.. ఎవరికైనా నోటీసులివ్వచ్చు'
-
'హోదాతో పనిలేదు.. ఎవరికైనా నోటీసులివ్వచ్చు'
స్పష్టమైన ఆధారాలుంటే ఏసీబీ ఎవరికైనా నోటీసులు ఇవ్వచ్చని మాజీ డీజీపీ, బీజేపీ నాయకుడు దినేష్‌రెడ్డి చెప్పారు. నోటీసులు ఇవ్వడానికి హోదాలతో సంబంధం లేదని, అలాగే అందుకు ఎవరి పర్మిషన్లు కూడా అవసరం లేదని వ్యాఖ్యానించారు. చట్టం పరిధిలో ఉన్న అంశాలపై గవర్నర్ కూడా జోక్యం చేసుకోలేరని ఆయన అన్నారు. ఫోన్ ట్యాపింగ్ మీద కేంద్రం సుమోటోగా జోక్యం చేసుకోబోదని, నోటీసులు ఇచ్చే అంశం తెలంగాణ ఏసీబీ పరిధిలోనే ఉంటుందని ఆయన తెలిపారు. ప్రజల స్వేచ్ఛకు, ఆస్తులకు రక్షణ లేకపోతే సెక్షన్-8లో గవర్నర్ జోక్యం చేసుకుంటారని దినేష్ రెడ్డి వివరించారు. అంతేతప్ప మొత్తం శాంతి భద్రతలు పూర్తిగా గవర్నర్ చేతుల్లోకి వెళ్లవన్నారు. రాష్ట్రపతి పాలనలో మాత్రమే గవర్నర్‌కు పూర్తి అధికారాలు ఉంటాయని తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రులపై దాడులు జరిగితే గవర్నర్ జోక్యం చేసుకుంటారన్నారు. -
దినేష్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా
న్యూఢిల్లీ : మాజీ డీజీపీ దినేష్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణను ఆగస్ట్ 12వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి మధ్యంతర నివేదికను సీబీఐ కోర్టుకు సమర్పించింది. కాగా దినేష్ రెడ్డి ఆస్తులపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. దినేష్‌డ్డితో సహా ఆయన సతీమణి కమలా రెడ్డికి చెందిన అన్ని ఆస్తుల లావాదేవీలపై పూర్తి విచారణకు ఆదేశించాలంటూ ఐపీఎస్ అధికారి ఉమేష్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
గెలుపును అడ్డుకోవడానికి కుట్ర: దినేష్‌రెడ్డి
హైదరాబాద్: వైఎస్సార్ సీపీ గెలుపును అడ్డుకోవడానికి అధికారులు, అన్ని పార్టీల నాయకులు అడుగడుగునా కుట్రలు పన్నారని ఆ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి దినేష్‌రెడ్డి అన్నారు. బుధవారం కేపీహెచ్‌బీ కాలనీలోని మూడవఫేజ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అనేక చోట్ల అధికారులు ఓటరు స్లిప్‌లను పంచలేదన్నారు. కావాలనే వందలాది ఓట్లను తొలంగించారన్నారు. అయినా వైఎస్ ప్రవేశపెట్టిన పథకాల వల్ల లబ్ధి పొందిన యువత తప్పకుండా వైఎస్సార్ సీపీకి ఓటు వేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. -
దినేష్ రెడ్డితో దురుసుగా వ్యవహరించిన పోలీసులు
-
'మల్కాజ్‌గిరిలో నా గెలుపు ఖాయం'
-
'మల్కాజ్‌గిరిలో నా గెలుపు ఖాయం'
హైదరాబాద్ : మల్కాజ్ గిరిలో తన విజయం ఖాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్థి దినేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంపై నమ్మకం, పార్టీ ప్రజాదరణ, తన గత చరిత్రే గెలిపిస్తాయని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో సచ్చీలత తన ఒక్కడికే ఉందని, తనపై ఎలాంటి ఆరోపణలు లేవని దినేష్ రెడ్డి అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు టోల్‌ఫ్రీ నెంబరు ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చానని, ఆ మాట నిలబెట్టుకుని టోల్‌ఫ్రీ నెంబరు ఏర్పాటు చేశానని దినేష్ రెడ్డి తెలిపారు. మల్కాజ్ గిరిలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అలాగే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు. -
నయా నాయకులు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సార్వత్రిక ఎన్నికలు సరికొత్త రాజకీయాలకు తెరలేపాయి. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించని వ్యక్తులు హఠాత్తుగా ప్రధాన పార్టీలకు అభ్యర్థులయ్యారు. శాసనసభ, పార్లమెంటు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగారు. వీరిలో అంతో ఇంతోరాజకీయ నేపథ్యమున్న వారు కొందరైతే.. రాజకీయాలకు సంబంధంలేని వారు మరికొందరు. జిల్లాలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాలు, 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజార్టీ స్థానాల్లో అన్ని పార్టీల నుంచి కొత్త ముఖాలు తెరమీదకొచ్చాయి. మొత్తమ్మీద 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా జిల్లా రాజకీయాల్లో నయా నాయకులు దర్శనమిస్తున్నారు. నేరుగా చట్టసభలకే.. ఇప్పటివరకు చట్టసభలకు ఎన్నికైన పలువురు నాయకులు క్షేత్రస్థాయిలో రాజకీయంగా పేరెన్నిక గలవారో.. స్థానిక ఎన్నికల నుంచి నేతలుగా ఎదిగినవారో ఉండేవారు. తాజాగా ట్రెండు మారింది. దీంతో నేరుగా చట్టసభల నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల తరఫున పోటీచేస్తున్న కొత్త నేతలు ప్రచార పర్వంలో ఉత్సాహభరితంగా దూసుకుపోతున్నారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న తూళ్ల వీరేందర్‌గౌడ్ తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచారు. మాజీ హోంమంత్రి టి.దేవేందర్‌గౌడ్ తనయుడైన వీరేందర్ గతంలో రాాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి కూడా మొదటిసారిగా తలపడుతున్నారు. మాజీ హోంమంత్రి సబితారెడ్డి తనయుడిగా సుపరిచితుడైనప్పటికీ ఎన్నికల పోటీలో మాత్రం కొత్త ముఖమే. అదేవిధంగా ఇదే స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా ఎన్నికలకు కొత్త వ్యక్తే. దివంగత ఉప ముఖ్యమంత్రి కొండా వెంకటరంగారెడ్డి మనవడిగా స్థానికంగా పేరున్నప్పటికీ తొలిసారిగా ఎన్నికల రణంలో నిలిచారు. మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి కొత్త అభ్యర్థుల హవా కనిపిస్తోంది. మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి రాష్ట్ర ప్రజానీకానికి సుపరిచితులే అయినప్పటికీ.. రాజకీయాలకు మాత్రం కొత్తే. ఈయన వైఎస్సార్ సీపీ నుంచి లోక్‌సభ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా చామకూర మల్లారెడ్డి పోటీలో ఉన్నారు. ఈయన సీఎంఆర్ విద్యా సంస్థల చైర్మన్‌గా సొసైటీలో పేరున్నప్పటికీ.. కొత్తగా రాజకీయ అరంగేట్రం చేస్తూ ఎన్నికల బరిలోకి దిగారు. ఉప్పల్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న బండారు లక్ష్మారెడ్డి కూడా మొదటిసారిగా ఎన్నికల సంగ్రామంలోకి దిగారు. ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి సోదరుడైన లక్ష్మారెడ్డికి ప్రత్యక్ష రాజకీయల్లోకి రావడం ఇది కొత్తే. ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి కూడా కొత్తగా ఎన్నికల్లో నిలిచిన వ్యక్తే. ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఆర్.కృష్ణయ్య రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నేత. ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేయలేదు. తాజా ఎన్నికల్లో మొదటిసారిగా పోటీ చేస్తున్న కృష్ణయ్యను ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. తాండూరు టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న నరేష్ సైతం మొదటిసారిగా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ప్ర భుకుమార్ కూడా మొదటిసారిగా పోటీలో నిలిచారు. అదేవిధంగా వికారాబాద్ నియోజకవర ్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థి క్రాంతికుమార్ సైతం కొత్తవారే కావడం గమనార్హం. -
ఐఏఎస్... ఐపీఎస్... ఓ ప్రొఫెసర్!
ఎన్నికలకు మరో వారం రోజులు సమయం మాత్రమే ఉండడంతో తెలంగాణలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. పోలింగ్‌కు సమయం దగ్గరపడడంతో ఇప్పుడు అందరి దృష్టి 'హాట్ సీటు'పై నెలకొంది. మల్కాజ్గిరి లోకసభ స్థానంపై స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల వారు దృష్టి సారించారు. ఇక్కడ ఎవరు విజయం సాధిస్తారో ఇతమిత్థంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. విద్యావంతులు పోటీ పడుతుండడంతో అమితాసక్తి నెలకొంది. ఒక ఐఏఎస్, ఐపీఎస్, ప్రొఫెసర్ ప్రత్యర్థులుగా బరిలో ఉండడంతో మల్కాజ్గిరి ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర డీజీపీగా పదవీవిరమణ చేసిన దినేష్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుండగా, మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ లోక్‌సత్తా తరపున పోటీకి దిగారు. జర్నలిజం ప్రొఫెసర్ డాక్టర్ కె. నాగేశ్వర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎవరి విజయంపై వారు దీమాగా ఉన్నారు. కిందిస్థాయి నాయకులను కలుపుకుని దినేష్‌రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. వైఎస్ జగన్, షర్మిల ప్రచారం తనకు కలిసివస్తుందని భావిస్తున్నారు. షర్మిల ఇప్పటికే ప్రచారం పూర్తిచేయగా, జగన్ త్వరలో ఈ నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. జయప్రకాష్ నారాయణ, నాగేశ్వర్ విద్యావంతుల ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు. ఈ ముగ్గురిని ప్రజలను ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి. -
వైఎస్సార్‌సీపీతోనే అభివృద్ధి సాధ్యం: దినేష్‌రెడ్డి
కుషాయిగూడ, న్యూస్‌లైన్: ఒంట్లో శక్తి ఉన్నంత వరకూ ప్రజాసేవకే అంకితమవుతానని వైఎస్సార్సీపీ మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి దినేష్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఈసీఐఎల్ మహేష్ నగర్లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం, ప్రచార రథాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాల అమలు కేవలం తమ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందన్నారు. రెండు ప్రాంతాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీ చర్లపల్లి డివిజన్ అధ్యక్షుడు మేకల నవీన్ నాయుడు.. దినేష్‌రెడ్డికి మహానేత వైఎస్ భారీ చిత్రపటాన్ని బహుకరించారు. కార్యక్రమంలో నాయకులు కుమార్ యాదవ్, పురుషోత్తంరెడ్డి, డాక్టర్ కొండారెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు కీసర: దినేష్‌రెడ్డి సోమవారం కీసరలో రోడ్‌షో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తమ పార్టీకి మహిళలు బ్రహ్మరథం పడుతున్నారని, వారి అండతో వైఎస్సార్ సీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం దినేష్‌రెడ్డి కీసరగుట్టలో శివుడి అభిషేక సేవలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా సేవాదళ్ కన్వీనర్ సుఖేందర్‌రెడ్డి, కీసర ఇన్ చార్జి ముజీబ్ పాల్గొన్నారు. -
ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చా...
పోలీసు వ్యవస్థలో మార్పులు తెచ్చా దినేశ్‌రెడ్డి వెల్లడి మోతీనగర్, న్యూస్‌లైన్: నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చానని, పోలీసు వ్యవస్థలో తాను డీజీపీగా ఉన్నప్పుడు అనేక మార్పులు తెచ్చానని వైఎస్సార్సీపీ మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి దినేష్‌రెడ్డి వెల్లడించారు. రాజన్న రాజ్యంతోనే ఇరు రాష్ట్రాలవారు సుఖసంతోషాలతో ఉంటారని స్పష్టంచేశారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మోతీనగర్ అల్లాపూర్ ప్రధానమార్గంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం ప్రారంభం,.... ఆయా ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. గత పాలకులు పదవులను కాపాడుకోవడంలోనే నిమగ్నమయ్యారని విమర్శించారు. కూకట్పల్లి ఎమ్మెల్యే అభ్యర్థి జంపన ప్రతాప్ మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యం వల్ల కూకట్పల్లి నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిపోయిందన్నారు. సీనియర్ నాయకుడు సత్యంశ్రీరాంగం మాట్లాడుతూ జగన్‌ను నేటియువకులు ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. మహానేత పథకాలతోనే గెలుపు మలేసియాటౌన్‌షిప్/కుత్బుల్లాపూర్:మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని దినేశ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేపీహెచ్‌బీ కాలనీలో జరిగిన రోడ్‌షోలో ఆయన పార్టీ కూకట్పల్లి అభ్యర్థి జంపన ప్రతాప్‌తో కలిసి మాట్లాడారు. నిస్వార్థంగా సేవ చేస్తానని.. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జగన్‌తోనే అభివృద్ధి సాధ్యమంటూ..రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సుస్థిర పాలనకే పట్టం కట్టండి : సుస్థిరపాలన రావాలంటే వైఎస్సార్సీపీకే పట్టంకట్టాలని దినేష్‌రెడ్డి పిలుపునిచ్చారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి కొలన్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి బుధవారం రాత్రి రోడ్‌షో నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభించి ఆయన మాట్లాడారు. దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న మల్కాజిగిరి నుంచి తనకు అవకాశమిస్తే ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తానని హామీఇచ్చారు. ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు చూపుతున్న ఆదరణ తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని, ఇలాగే కొనసాగితే గెలుపు సునాయసమని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం షాపూర్‌నగర్ చౌరస్తాలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
అవకాశమివ్వండి అభివృద్ధి చేస్తా
మేడ్చల్, న్యూస్‌లైన్: మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలిపిస్తే దాని పరిధిలోని మేడ్చల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని వైఎస్సార్ సీపీ మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి దినేష్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మేడ్చల్ పట్టణంలో పాదయాత్ర నిర్వహించిన అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగరానికి సమీపంలో ఉన్న మేడ్చల్ నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిఉండడం బాధాకరమన్నారు. గతంలో మేడ్చల్ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి ప్రజలను మోసంచేసి ఓట్లు దండుకున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ అలాంటిది కాదని, చేసే పనులే చెబుతామని, చెప్పిన పనులు తప్పకుండా చేస్తామని అన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేయడం వల్ల దివంగత సీఎం రాజశేఖరరెడ్డి అందించిన సువర్ణ పాలన మరోసారి పొందవచ్చన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో మురికి వాడ లు, రోడ్లు బాగలేకపోవడం, ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతుం టే ఇక్కడి పాలకులు ఏమేరకు అభివృద్ధి చేశారో స్పష్టమవుతోందన్నారు. తనకు ఒకసారి అవకాశం కల్పిస్తే సమస్యలు లేని నియోజకవర్గంగా మేడ్చల్‌ను తీర్చిదిద్దుతానన్నారు. తాను డీజీపీగా ఉన్న సమయంలో ప్రజా సమస్యలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చానన్నారు. డీజీపీగా ఉం డి పోలీసులను ప్రజలకు చేరువ చేసిన ఘనత తనదేనన్నారు. ఆర్టీసీ ఎండీగా ఉండి నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల్లోకి తీసుకువెళ్లానన్నారు. మేడ్చల్ నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటుచేసి ప్రజల సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానన్నా రు. సమావేశంలో ఆర్టీసీ ఎన్ఎంయూ నాయకుడు మహమూద్, నియోజ కవర్గ నాయకులు సుఖేందర్‌రెడ్డి, అనిల్, పలు మండలాల నాయకులు పాల్గొన్నారు. స్వతంత్ర అభ్యర్థి ప్రకాష్ వంజరి సంఘీభావం మేడ్చల్ రూరల్: మేడ్చల్ అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రము ఖ వైద్యుడు డాక్టర్ ప్రకాష్ వంజరి వైఎస్సార్సీపీకి పూర్తి మద్దతు తెలిపారు. సోమవారం వైఎస్సార్సీపీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి దినేష్‌రెడ్డి మేడ్చల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయనకు మద్దతు ప్రకటించారు. మేడ్చల్‌లో దినేష్‌రెడ్డిని కలిసి వైఎస్సార్సీపీకి తన పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన చెప్పారు. తాను మొదటి నుంచి వైఎస్ అభిమానినని, ఆయన అభిమానులంతా ఐక్యంగా ఉండి వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాల న్నారు. ఈ సందర్భంగా దినేష్‌రెడ్డి స్వ తంత్ర అభ్యర్థి వంజరి ప్రకాష్‌కు స్వాగ తం పలికారు. కార్యకర్తలతో కలిసి పని చేయాలని కోరారు. -
"జేపీకి తెలియకుండానే 'ఇదంతా' జరిగుంటుందా ?"
-
లోక్‌సభ స్ధానానికి దినేష్ రెడ్డి నామినేషన్
-
ముఖ్యమంత్రి అంటే వైఎస్సారే.
తాను చూసిన ముఖ్యమంత్రుల్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అత్యంత గొప్పవారని, తండ్రి ఆశయ సాధన కోసం జగన్ పార్టీ స్థాపించారని వైఎస్సార్ సీపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి, విశ్రాంత డీజీపీ దినేష్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హైదర్‌నగర్‌లోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున ఫంక్షన్ హాల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి మనిషీ సమాజసేవ చేయాలని ఆలోచిస్తాడని, మానవసేవే మాధవ సేవగా భావించి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. పోలీస్ శాఖలో ఉన్నప్పుడు కూడా విలువలకు కట్టుబడి ఉన్నానని, నమ్మిన సిద్ధాంతం కోసం రాజీ పడకుండా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీలో ఉన్నప్పుడు అప్పుల్లో ఉన్న సంస్థను మూడేళ్లలో అభివృద్ధి పథంలోకి తీసుకొనివచ్చానని ఈ సందర్భంగా విరించారు. జగన్‌ను నమ్ముకొని పార్టీలో చేరినవెంటనే మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం ఇచ్చారన్నారు. మల్కాజ్గిరి మిని ఇండియా అని, అందరం కలిసి ముందుకు సాగుదామని దినేష్‌రెడ్డి అనగానే సభకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో నే షనల్ మజ్దూర్ యూనియన్ నాయకుడు మహబూబ్, పార్టీ నాయకులు జంపన ప్రతాప్, నవీన్‌కుమార్, డి.శివనారాయణ, కొలన్ శ్రీనివాసరెడ్డి, సురేష్‌రెడ్డి, సత్యం శ్రీరంగం, పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'వైఎస్ జగన్‌పై కావాలనే తప్పుడు కేసులు'
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కావాలనే తప్పుడు కేసులు పెట్టారని రాష్ట్ర మాజీ డీజీపీ దినేష్ రెడ్డి చెప్పారు. ఆరోపణలు రుజువు కాకుండానే ఆయనపై అభియోగాలు మోపడం సరికాదని ఆయన అన్నారు. దినేష్ రెడ్డి సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన లోటస్ పాండ్‌లో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా దినేష్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానని దినేష్ రెడ్డి తెలిపారు. దివంగత మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలను తాను దగ్గర నుంచి చూశానని అన్నారు. ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ సీపీలో చేరానని, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించడం జగన్ కు మాత్రమే సాధ్యమని దినేష్‌రెడ్డి చెప్పారు. పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని దినేష్‌రెడ్డి చెప్పారు. -
వైఎస్ఆర్సీపీలో చేరిన దినేష్ రెడ్డి
-
దినేశ్ రెడ్డి, ఉమేష్ కుమార్ పిటిషన్లను కొట్టేసిన సుప్రీం
రాష్ట్రానికి చెందిన ఇద్దరు మాజీ ఐపీఎస్ అధికారులకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి, మరో మాజీ ఐపీఎస్ అధికారి ఉమేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టేసింది. ఆదాయానికి మించి అక్రమాస్తులను కూడబెట్టారని తనపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ సుప్రీం కోర్టు సూచనలను కంటే ఎక్కువగా దర్యాప్తు చేస్తోందని దినేష్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని అడ్డుకోవాలంటూ ఆయన విన్నవించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అక్రమాస్తుల కేసులో దినేశ్ రెడ్డిపై సీబీఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. మరో ఐపీఎస్ అధికారి ఉమేశ్ కుమార్ ఫిర్యాదు మేరకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలావుండగా తనపై విచారణను మేజిస్ట్రేట్ కోర్టులో జరపాలంటూ మరో ఐపీఎస్ అధికారి ఉమేష్‌కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. -
ప్రసాదరావు నియామకానికి గ్రీన్‌సిగ్నల్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా బి.ప్రసాదరావు నియామకానికి మార్గం సుగమమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒకటి, రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులను విడుదల చేయనుంది. ఏసీబీ డెరైక్టర్ జనరల్‌గా ఉన్న ప్రసాదరావు.. సెప్టెంబర్ 30 నుంచి డీజీపీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. డీజీపీ నియామకంపై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఢిల్లీలో బుధవారం భేటీ అయింది. ఐపీఎస్ 1979 బ్యాచ్‌కి చెందిన అరుణా బహుగుణ, టీపీ దాస్, బి.ప్రసాదరావు, ఎస్ఏ హుడా, 1981 బ్యాచ్‌కి చెందిన జేవీ రాముడు, ఏకే ఖాన్ పేర్లను డీజీపీ పదవికి యూపీఎస్సీ పరిశీలించింది. అరుణా బహుగుణ, దాస్, ప్రసాదరావుతో కూడిన ముగ్గురి ప్యానల్‌కు యూపీఎస్సీ ఆమోదం తెలిపింది. ఈ సమావేశానికి సీఎస్ పి.కె. మహంతి కూడా హాజరయ్యారు. ఈ ముగ్గురిలో ఒకర్ని డీజీపీగా నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దీంతో ప్రసాదరావును డీజీపీగా నియమించడం లాంఛన ప్రాయమేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోసారి క్యాట్‌ను ఆశ్రయించిన దినేశ్ రెడ్డి మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి మరోసారి కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. డీజీపీగా తన పదవీ విరమణకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ, ఇన్చార్జి డీజీపీగా ప్రసాదరావు నియామకాన్ని సవాల్ చేస్తూ దినేశ్‌రెడ్డి క్యాట్‌లో మరో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తనను రెండేళ్లపాటు డీజీపీ పదవిలో కొనసాగించాలంటూ దినేశ్‌రెడ్డి గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను సవరించేందుకు అనుమతించాలని ఆయన తరఫు న్యాయవాది బుధవారం క్యాట్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పిటిషన్‌పై ధర్మాసనం స్పందిస్తూ కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. అయితే ప్రసాదరావు నియామకంపై అభ్యం తరం ఉంటే మరో పిటిషన్ దాఖలు చేసుకోవాలని.. ప్రస్తుత పిటిషన్లో ప్రసాదరావు ప్రతివాదిగా లేరని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శ్రీధర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనితో, ప్రసాదరావును ప్రతిపాదిగా చేరుస్తూ ఇంప్లీడ్ పిటిషన్ వేయాలంటూ ధర్మాసనం దినేశ్‌రెడ్డిని ఆదేశించింది. -
హెచ్‌పీఎస్ @:90
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్... నగరంతో తొమ్మిది దశాబ్దాల అనుబంధం. ఎందరో ప్రముఖులకు మార్గనిర్దేశనం చేసిన విద్యానిలయం. ఇరుకు గదుల్లో... విద్యను వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలకు భిన్నంగా ప్రత్యేకత చాటుకుంది. సువిశాల ప్రాంగణంలో... అత్యాధునిక వసతులతో... నాణ్యమైన విద్యను అందిస్తూ దేశంలోనే విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. నేడు హెచ్‌పీఎస్ 90 వసంతాల ఉత్సవం జరుపుకొంటున్న సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. దేశంలోని 20 ప్రసిద్ధ పాఠశాలల్లో బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒకటని ప్రఖ్యాత ‘వరల్డ్ మ్యాగజైన్’ గుర్తించింది. 140 ఎకరాల సువిశాల ప్రాంగణం... పెద్ద క్రీడా మైదానం... ఎటు చూసినా పచ్చందం... అత్యాధునిక వసతులతో చూడగానే ముచ్చటగొలుపుతుంది హెచ్‌పీఎస్. ఉన్నత వర్గాల వారి కోసం ముఖ్యంగా నవాబులు, జాగీర్దార్లు, బ్రిటిష్ అధికారుల పిల్లల చదువుల కోసం 1923లో ‘జాగీర్దార్ స్కూల్’ పేరుతో ప్రారంభమైందీ పాఠశాల. అప్పటి జాగీర్దార్లలో ఒకరైనా సర్ వికార్-ఉల్-ఉమా బహుల్‌ఖానగూడ పేరుతో ఉన్న ప్రస్తుత బేగంపేటలో దీర్ఘకాల లీజ్ ప్రాతిపదికన పాఠశాలకు స్థలాన్ని కేటాయించారు. బ్రిటిష్ విద్యావేత్త షాక్రాస్ మొదటి ప్రిన్సిపాల్‌గా... ముగ్గురు విద్యార్థులతో పాఠశాల మొదటి బ్యాచ్ ప్రారంభమైంది. పబ్లిక్ స్కూల్‌గా... 1950లో ప్రభుత్వం జమిందారీ వ్యవస్థను రద్దు చేయడంతో... అప్పటి వరకు కేవలం ప్రముఖుల పిల్లలకే పరిమితమైన జాగీర్దార్ స్కూల్ పబ్లిక్ స్కూల్‌గా రూపాంతరం చెందింది. నాటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధకృష్ణన్ మొదటి అధ్యక్షుడిగా హెచ్‌పీఎస్ సొసైటీ ఏర్పాటైంది. బాలులకు మాత్రమే పరిమితమైన హెచ్‌పీఎస్... 1988 నుంచి కోఎడ్యుకేషన్ విద్యాలయంగా మారిపోయింది. ఒకరా... ఇద్దరా..! ఈ పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన ఎందరో నేడు ఉన్నత శిఖరాలను అధిరోహించారు. రాజకీయ నాయకులుగా, సినీతారలుగా, బడా వ్యాపారవేత్తలుగా ఉన్నారు. వారిలో కొందరు... ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, కేంద్ర మంత్రి పళ్లం రాజు, శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, స్టార్ హీరోలు నాగార్జున, వెంకటేష్, రామ్‌చరణ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, లండన్‌లో కోబ్రా బీర్ వ్యవస్థాపక చైర్మన్ కరణ్బిల్లి మోరియా, ఐ2 టెక్నాలజీస్ సీఈఓ సంజీవ్సిద్ధు, అడోబ్ సిస్టమ్స్ సీఈఓ శంతను నారాయణ, గాయకుడు తలజ్ అజీజ్, ఎంటీవీ వీజే నిఖిల్ చిన్నప్ప, క్రికెట్ వ్యాఖ్యాత హర్షభోగ్లే, ఫ్రాన్స్‌లో భారత మాజీ రాయబారి వీర్మొహిసిన్ సయిద్, కెనడాలో స్థిరపడ్డ ఫెయిర్‌ఫాక్స్ చైర్మన్ రాజ్వత్సా, ఇటీవల వార్తల్లో నిలిచిన బిజినెస్ మ్యాన్ ప్రేమ్‌వత్సా. ప్రముఖులు ఎంతో మంది విద్యాభ్యాసం చేసిన హెచ్‌పీఎస్‌లో చదువుకోవడం చాలా ఆనందంగా ఉంది. దశాబ్ధాలు గడిచినా పాఠశాల ఖ్యాతి తరగకపోవడం విశేషం. ఇప్పటికీ నగరంలోని తల్లిదండ్రులు తమ పిల్లలకు హెచ్‌పీఎస్‌లో సీటు సంపాదించడానికే తొలి ప్రాధాన్యం ఇస్తారు. ఇది పాఠశాలకే గర్వకారణం. - మర్రి ఆదిత్యారెడ్డి, పూర్వ విద్యార్థి, హెచ్‌పీఎస్ సొసైటీ సభ్యుడు -
ఎస్పీ బదిలీ వెనుక
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు’ తయారైంది ఎస్పీ శ్యాంసుందర్ పరిస్థితి! సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి మధ్య సాగిన మాటల యుద్ధం ఎస్పీపై బదిలీ వేటు పడేలా చేసిందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. దినేష్‌రెడ్డి సీఎం కిరణ్‌పై ఆరోపణలు చేసిన 20 రోజుల్లోగానే ఎస్పీని బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడటం ఇందుకు బలం చేకూర్చుతోంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూలు వెలువడటానికి సరిగ్గా ఒక్క రోజు ముందు.. అంటే జూలై 2న అప్పటి ఎస్పీ షహనవాజ్ ఖాసీంను ప్రభుత్వం బదిలీ చేసింది. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించే ఖాసీం ఉంటే పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఆటలు సాగవనే ఉద్దేశంతోనే ఆయన్ను బదిలీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం వల్ల కొత్త ఎస్పీని నియమించే అవకాశాలు లేవని, కిందిస్థాయి అధికారులను గుప్పిట్లో పెట్టుకుని యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడి.. దొడ్డిదారిన ఎన్నికల్లో విజయం సాధించవచ్చునని అధికార పార్టీ నేతలు ఎత్తులు వేశారు. అయితే.. రాష్ట్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో డీసీపీ-2గా పనిచేస్తోన్న ఎస్.శ్యాంసుందర్‌ను జిల్లా ఎస్పీగా నియమించాలని సర్కారుకు సూచించింది. ఆ మేరకు శ్యాంసుందర్‌ను జిల్లా ఎస్పీగా నియమిస్తూ జూలై 11న సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. జూలై 12న ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. పలు సందర్భాల్లో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో పంచాయతీ ఎన్నికల కోడ్ ముగియగానే తనను బదిలీ చేస్తారని బాహటంగానే చెబుతూ వచ్చారు. అయితే.. తెలంగాణ ఏర్పాటుకు సీడబ్ల్యూసీ, యూపీఏ పక్షాలు నిర్ణయం తీసుకోవడంతో ‘అనంత’లో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. దీన్ని నీరుగార్చేందుకు ఎస్పీ శ్యాంసుందర్ శతవిధాలా ప్రయత్నించారు. ఉద్యమకారులపై విచక్షణారహితంగా లాఠీలు ఝుళిపించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో రౌడీలు, ఫ్యాక్షనిస్టులు తిష్ట వేశారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ తీరుపై సమైక్యవాదులు విరుచుకుపడ్డారు. ఆయన ఎక్కడికెళ్లినా అడ్డుతగిలారు. ఉద్యమవేడి తగ్గేదాకా ఎస్పీ అడుగు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే శ్యాంసుందర్‌పై బదిలీ వేటు పడుతుందనే అభిప్రాయం అప్పట్లోనే పోలీసు వర్గాల్లో బలంగా వ్యక్తమైంది. అయితే.. అప్పట్లో బదిలీ ఉత్తర్వులు వెలువడలేదు. డీజీపీ దినేష్‌రెడ్డి సెప్టెంబరు 30న ఉద్యోగ విరమణ చేసిన విషయం విదితమే. పదవీకాలాన్ని పొడిగించుకునేందుకు ఆయన తీవ్రప్రయత్నాలు చేశారు. అవి ఫలించలేదు. ఈ క్రమంలో ఈ నెల 8న సీఎం కిరణ్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.‘అనంతపురం జిల్లా ఎస్పీ శ్యాంసుందర్‌ను బదిలీ చేయాలని సీఎం నాపై ఒత్తిడి తెచ్చారు. శ్యాంసుందర్‌ను నిజామాబాద్ ఎస్పీగా నియమించడం ద్వారా సీఎం రాజకీయ ప్రత్యర్థి అయిన డి.శ్రీనివాస్‌కు చెక్ పెట్టాలన్నది ఆయన ఉద్దేశం. కానీ.. నేను ఆ ఒత్తిళ్లకు తలొగ్గలేదు. అందుకే డీజీపీగా నా పదవీకాలాన్ని సీఎం పొడిగించలేదు’ అంటూ దినేష్‌రెడ్డి ఆరోపించారు. ఇవి అప్పట్లో సంచలనం రేపాయి. ఈ నేపథ్యంలోనే ఎస్పీ శ్యాంసుందర్‌పై బదిలీ వేటుకు సీఎం కిరణ్ సిద్ధమయ్యారు. దినేష్‌రెడ్డి ఆరోపణలు చేసిన 20 రోజుల్లోగానే శ్యాంసుందర్‌పై బదిలీ వేటు వేయించారు. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. గతంలో పనిచేసిన హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం డీసీపీ-2 పోస్టుకే శ్యాంసుందర్‌ను బదిలీ చేయడం గమనార్హం. శ్యాంసుందర్ ఎక్కడ పనిచేసినా వివాదాస్పదంగా మారడం.. ఆ తర్వాత బదిలీ కావడం రివాజుగా మారింది. గుంటూరు, వరంగల్జిల్లాల్లో పనిచేసినప్పుడూ ఇదే రీతిలో బదిలీవేటు పడింది. ముచ్చటగా మూడోసారి కూడా వివాదాస్పదం కావడంతో బదిలీ వేటు పడినట్లు పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
ఎస్పీ, ఏఎస్పీ బదిలీ
సాక్షి ప్రతినిధి, అనంతపురం : జిల్లా నూతన ఎస్పీగా మస్తీపురం రమేష్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈయన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. జిల్లా ఎస్పీగా పనిచేస్తోన్న ఎస్.శ్యాంసుందర్‌పై బదిలీ వేటు పడింది. ఏఎస్పీ(పరిపాలన) నవదీప్ సింగ్‌ను కూడా బదిలీ చేయడం గమనార్హం. పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సూచన మేరకు జిల్లా ఎస్పీగా ఎస్.శ్యాంసుందర్‌ను నియమిస్తూ జూలై 11న సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. మూడున్నర నెలలు తిరగక ముందే ఆయనపై బదిలీ వేటు పడటం గమనార్హం. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఎస్పీ శ్యాంసుందర్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారిన విషయం విదితమే. ఇటీవల సీఎం కిరణ్‌పై మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి ఆరోపణలు చేసిన సందర్భంలోనూ శ్యాంసుందర్ పేరును ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆయనపై బదిలీ వేటు పడుతుందనే ఊహాగానాలు ఈ నెల ఎనిమిది నుంచి విన్పిస్తున్నాయి. అవి ఆదివారం వాస్తవరూపం దాల్చాయి. ఇక ఎస్పీ శ్యాంసుందర్ కన్నా పక్షం రోజులు ముందు ఏఎస్పీగా నియమితులైన నవదీప్‌సింగ్‌పై కూడా సర్కారు బదిలీ వేటు వేసింది. ఈయనను మల్కాజిగిరి డీసీపీగా నియమించింది. ఏఎస్పీగా నియమితులైన నాలుగు నెలల్లోగానే నవదీప్‌సింగ్‌ను బదిలీ చేయడం గమనార్హం. ఐపీఎస్ అధికారులను ఒక పోస్టులో నియమించాక కనీసం రెండేళ్లపాటు బదిలీ చేయకూడదన్నది నిబంధన. దాన్ని ఉల్లంఘించి ఎస్పీ, ఏఎస్పీలపై బదిలీవేటు వేయడం గమనార్హం. శ్యాంసుందర్ స్థానంలో కొత్త ఎస్పీగా నియమితులైన ఎం.రమేష్‌రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా మస్తీపురం గ్రామానికి చెందిన వారు. 1996 గ్రూప్-1 బ్యాచ్‌కు చెందిన ఈయన.. డీఎస్పీగా పోలీస్ శాఖలో ప్రవేశించారు. అప్పాలో పని చేసిన ఈయన 2001లో అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందారు. రామగుండం, వరంగల్‌లో ఓఎస్డీగాను, 2004 నుంచి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేశారు. 2009లో ఇంటెలిజెన్స్ ఎస్పీగా చేరిన ఆయన అదే ఏడాది డిసెంబర్లో అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) జాయింట్ డెరైక్టర్(తెలంగాణ రీజియన్)గానూ విధులు నిర్వర్తించారు. 2011లో ఐపీఎస్ హోదా పొందారు. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. ఆ జిల్లాలో 18 నెలల పాటు సేవలందించారు. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించే రమేష్‌రెడ్డికి నిజాయితీ అధికారిగా పేరుంది. ఆయన బుధవారం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని పోలీసువర్గాలు వెల్లడించాయి. -
సీఎంకు దినేష్‌రెడ్డి వత్తాసు: శంకర్రావు
హైదరాబాద్: సీఎం కిరణ్, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి ఇద్దరూ తోడు దొంగలేనని మాజీ మంత్రి పి.శంకర్రావు అన్నారు. సీఎం డైరెక్షన్ మేరకే దినేష్‌రెడ్డి వ్యవహరించారని ఆయన ఆరోపించారు. సీఎం, ఆయన సోదరుడు సంతోష్‌రెడ్డి చట్టవ్యతిరేక చర్యలకు దినేష్‌రెడ్డి వత్తాసు పలికారని అన్నారు. దినేష్‌రెడ్డి డీజీపీగా పదవీ విమరణ పొందిన వెంటనే సీఎం కిరణ్‌పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవి నుంచి కిరణ్ కుమార్‌రెడ్డిని తప్పించడం ఖరారైపోయిందని అంతకుముందు శంకర్రావు అన్నారు. ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సీఎం అవుతారని ఆయన జోస్యం చెప్పారు. హైకమాండ్ సీఎం ప్లగ్ పీకేయడం ఖాయమన్నారు. -
'సంతోష్‌రెడ్డి భూకబ్జా వివరాలు బయటపెట్టాలి'
హైదరాబాద్: మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి స్థాయి దిగజారి మాట్లాడారని మంత్రులు శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు విమర్శించారు. పదవిలో ఉన్నప్పుడు దినేష్‌రెడ్డి మాట్లాడితే విలువ ఉండేదన్నారు. హత్యకేసులో ఓ మంత్రి ప్రమేయం ఉందని చెప్పిన దినేష్‌రెడ్డి ఆ వివరాలు వెల్లడించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు. ఆ మంత్రిపై కేసు దాఖలు చేయకుండా సీఎం దృష్టికి ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. సీఎం సోదరుడు సంతోష్‌రెడ్డి భూకబ్జా వివరాలను దినేష్‌రెడ్డి బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దినేష్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వం సమీక్షించాలని కేఎల్ఆర్ సూచించారు. -
దినేశ్‌రెడ్డి ఆరోపణల నేపథ్యంలో.. సీఎంపై వెల్లువెత్తిన విమర్శలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిపై మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో సీఎంపై విమర్శలు వెల్లువెత్తాయి. దినేశ్ ఆరోపణలపై విచారణ జరిపి, నిజాలను బయటపెట్టాలని దాదాపు అన్ని పార్టీల నేతలు డిమాండ్ చేశారు. ీకిరణ్పై క్రిమినల్ కేసు పెట్టి, సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కిరణ్‌పై సీబీఐ దర్యాప్తు చేయాలని టీఆర్ఎస్ మరో ఎమ్మెల్యే కేటీఆర్ కోరారు. దినేశ్‌రెడ్డి ఆరోపణలు తీవ్రమైనవని, వెంటనే సీఎంను బర్తరఫ్ చేయాలని బీజేపీ నేత బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. సీఎం జైలుకెళ్లే రోజు దగ్గర్లోనే ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దినేశ్‌రెడ్డి ఆరోపణల నేపథ్యంలో సీఎంను వెంటనే బర్తరఫ్ చేయాలని మాజీ మంత్రి శంకర్రావు డిమాండ్ చేశారు. కిరణ్ సోదరుడిపై విచారణ జరపాలని సీపీఎం, సీపీఐల రాష్ట్ర కార్యదర్శులు రాఘవులు, నారాయణ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేసిన మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి ముసుగు త్వరలోనే తొలగుతుందని ్టమ్రంత్రి శైలజానాథ్ వ్యాఖ్యానించారు. దినేశ్ రెడ్డివి పిచ్చోడి మాటలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. -
అక్కసుతోనే సీఎంపై విమర్శలు: ఆనం రామనారాయణరెడ్డి
సాక్షి, హైదరాబాద్: భూకబ్జాలు, సీబీఐ విచారణ, సుప్రీంకోర్టులో కేసు కారణంగా డీజీపీ పదవీ కాలాన్ని పొడిగించలేదన్న అక్కసుతోనే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై, ఆయన కుటుంబంపై మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. రెండేళ్ల కిందట నలుగురు సీనియర్ అధికారులు కె.ఆర్.నందన్, గౌతంకుమార్, శివశంకర్, ఉమేష్కుమార్లను కాదని దినేశ్రెడ్డ్డిని డీజీపీగా నియమించడం కుట్రేనా అని ప్రశ్నించారు. మంగళవారం సచివాలయంలో మంత్రి పితాని సత్యనారాయణతో కలిసి ఆనం విలేకరులతో మాట్లాడారు. ‘‘గ్రామస్థాయి రాజకీయ నాయకులు చేసేలా ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేయడం వల్ల నీ స్థాయి దిగజారుతుందే కాని ముఖ్యమంత్రిది కాదు. డీజీపీ పదవి ముఖ్యమంత్రి నీకు పెట్టిన భిక్ష’’ అని వ్యాఖ్యానించారు. సీఎం సోదరుడు సంతోష్‌రెడ్డిపై చేసిన ఆరోపణలకు సంబంధించి దినేశ్‌రెడ్డి వద్ద సాక్ష్యాలు ఉంటే బయటపెట్టాలని, వాటిని సుప్రీంకోర్టుకు సమర్పించాలని ఆనం సవాల్ చేశారు. తనపై ఉన్న సీబీఐ కేసు నుంచి తప్పించుకోవడానికి సీఎం బంధువులపై మాజీ డీజీపీ ఆరోపణలు చేస్తున్నారన్నారు. తెలంగాణ వస్తే నక్సలిజం పెరుగుతుందని సీఎం చెప్పమన్నారని పేర్కొనడాన్ని ఆనం తప్పుబట్టారు. ‘‘కేంద్రానికి అన్నీ తెలుసు. సీఎంకు నీ సలహా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? తనకున్న సమాచారం మేరకు సీఎం కేంద్రానికి, పార్టీ అధిష్టానానికి ఇంతకంటే ఎక్కువే చెప్పారు’’ అని వివరించారు. డీజీపీగా ఆయన ఉద్యోగం ఊడిందని, ఇప్పుడు సీఎం ఉద్యోగం ఊడగొట్టాలని ప్రయత్నిస్తున్నారా ప్రశ్నించారు. ఏపీఎన్జీవోల సభకు అనుమతి కోసం సీఎం ఒత్తిడి చేశారన్న దినేశ్ వ్యాఖ్యలపై ఆనం మండిపడ్డారు. ‘ఆయనేమైనా కమిషనరా? డీసీపీనా? అనుమతి ఇవ్వడానికి డీజీపీకి సంబంధం ఏమిటి’ అని ధ్వజమెత్తారు. క్యాంపు కార్యాలయం చీకటిరాజ్యానికి అడ్డాగా మారిందన్న దినేశ్‌రెడ్డి.. మరి రెండేళ్లు దానిచుట్టూ ఎందుకు తిరిగారని ప్రశ్నించారు. ఆయన ముందుగా ఆస్తుల లెక్కలు సీబీఐకి, సుప్రీంకోర్టుకు చెప్పుకో అని పేర్కొన్నారు. పలు ప్రశ్నలకు సమాధానం దాటవేసిన మంత్రి కాగా, దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో సరిగా వ్యవహరించలేని దినేశ్‌ను ఇంతకాలం ఎందుకు కొనసాగించారు? నలుగురు సీనియర్లను కాదని ఆయనకు డీజీపీ పదవిని ఎలా కట్టబెట్టారు? మీపై ఆరోపణలు చేసే సరికి ఆయన అసమర్థుడని, పోలీసు బాస్‌గా వ్యవహరించాడని చెప్పడం సరైనదేనా అన్న ప్రశ్నలకు మంత్రి జవాబు చెప్పలేక దాటవేశారు. -
కబ్జాలకు సహకరించనందునే కక్షకట్టారు
సీఎంపై దినేశ్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు కిరణ్ సోదరుడు ఎన్నో భూ కబ్జాలకు పాల్పడ్డారు సీఎం, ఆయున తమ్ముడి కుంభ కోణాలపై న్యాయపోరాటం చేస్తా ఎవరికీ భయపడను.. ఇది ఎవరయ్య జాగీరూ కాదు అనంతపురం ఎస్పీని నిజామాబాద్‌కు బదిలీచేసి డీఎస్‌కు చెక్పెట్టాలన్నారు.. తెలంగాణ వస్తే నక్సలైట్ల సమస్య పెరుగుతుందని చెప్పమన్నారు ఏపీఎన్జీవోల సభకు సీఎం ఒత్తిడితోనే అనుమతి ఆయున చెప్పినవి చేయునందునే నన్ను తప్పించారు సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి తమ్ముడు సంతోష్‌రెడ్డి ఎన్నో భూ కబ్జాలకు పాల్పడ్డాడు... అందుకు సంబంధించిన ఆధారాలన్నీ నా దగ్గరున్నాయి... సీఎం తమ్ముడి భూ కబ్జాలకు సహకరించనందునే డీజీపీగా కొనసాగించకుండా నన్ను తప్పించారు... నన్ను తప్పించేందుకు ముఖ్యమంత్రి కుట్రచేశారు.... అని మాజీ డీజీపీ వి.దినేశ్ రెడ్డి వుంగళవారం తీవ్రమైన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లోని ఒక హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో దినేశ్ రెడ్డి మాట్లాడారు. భూ కబ్జాలకోసం ముఖ్యమంత్రి సోదరుడు సంతోష్‌రెడ్డి ఎన్నోమార్లు తనకు ఫోన్‌చేశారని, కానీ తాను అంగీకరించలేదని స్పష్టంచేశారు. వుుఖ్యవుంత్రి పదవిని అడ్డంపెట్టుకుని సీఎం తమ్ముడు కొన్ని వేలకోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారన్నారని, ఈ అక్రమాలు చేయించేందుకు ముఖ్యమంత్రి కూడా తన వద్దకు ఎంతో మందిని పంపారని, అక్రవూలకు అంగీకరించనందునే ఆయున తనపై కక్ష కట్టారని దినేశ్ రెడ్డి ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకే విలేకరుల సమావేశం ఏర్పాటు చేశానన్నారు. సీఎం కక్షకట్టి ఏదైనా చేస్తారనే భయం తనకు లేనేలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘ఇది ఎవరయ్య జాగీరూకాదు. నేనెవరికీ భయపడబోను. ఎవరినైనా ఎదుర్కొనే సత్తా నాకూ ఉంది. నేనేం బలహీనుడిని కాదు. అన్ని విధాలా ఎదుర్కొనేందుకు నా వాళ్లూ ఉన్నారు. సమర్థంగా ఎదుర్కొనగలను’’ అని ఆయున ఆవేశంతో చెప్పారు. ముఖ్యమంత్రి, అతని సోదరుడి అక్రమాలపై న్యాయపోరాటానికి సిద్ధమని, ఎవరైనా న్యాయ పోరాటం చేస్తాన న్నా తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలను అందిస్తానని వురో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అనంతపురం ఎస్పీని తప్పించాలన్నారు తెలంగాణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యుసీ) నిర్ణయుం అనంతపురం జిల్లాలో జరిగిన ఆందోళన సందర్భంగా జాతీయ నేతల విగ్రహాల ధ్వంసం కేసుల్లో నిందితులను అరెస్టుచేసినందుకు ఆ జిల్లా ఎస్పీని బదిలీకోసం సీఎం, తనపై ఒత్తిడిచేశారని, ఎస్పీని నిజామాబాద్‌కు బదిలీచేసి మాజీ పీసీసీ అధ్యక్షడు డి శ్రీనివాస్‌కు చెక్‌పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారని ఆరోపించారు. అరుుతే, శాంతిభద్రతల రక్షణలో సమర్ధంగా వ్యవహరించినందున ఆ ఎస్పీ బదిలీకి తాను అంగీకరించలేదన్నారు. మరికొందరు ఐపీఎస్ అధికారులు, డీఎస్పీల బదిలీలపై కూడా సీఎం ఒత్తిడి తెచ్చారని, ఎన్నికల కమిషన్ ఇచ్చిన పోస్టింగ్‌ల విషయంలో బదిలీలకు సీఎం పట్టుపట్టారని దినేశ్ రెడ్డి చెప్పారు. తెలంగాణ వస్తే నక్సల్స్ సమస్య పెరుగుతుందని చెప్పమన్నారు రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే నక్సలైట్ల సమస్య పెరుగుతుంద ంటూ ముఖ్యమంత్రి, కేంద్రానికి నివేదిక ఇచ్చారని, అది ఊహాజనితం వూత్రమేనని తాను ఢిల్లీలో మీడియాతో చెప్పినందుకే కిరణ్‌కుమార్ రెడ్డి తనపై కినుక వహించారన్నారు. ఢిల్లీకి వెళ్లినపుడు తనతో మాట్లాడకుండానే సీఎం వెళ్లిపోవడాన్ని కొందరు ఎంపీలు గవునించారని, నక్సలైట్ల సమస్యపై తనకు అనుకూలంగా మాట్లాడనందునే ఆయున కోపంగా ఉన్నారని ఎంపీలు తనతో చెప్పారన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైతే నక్సలైట్ల సమస్య పెరుగుతుందని చెప్పాల్సిందిగా సీఎం తనపై ఒత్తిడితెచ్చారని ఆరోపించారు. విభజనపై సీడబ్ల్యుసీ ప్రకటనకు 15 రోజులు ముందుగానే కేంద్రంలోని తన బ్యాచ్ అధికారుల సహకారంతో 40 కంపెనీల బలగాలను సీమాంధ్ర జిల్లాలకు తెప్పించానని, అదనపు బలగాలను సీమాంధ్రకు ముందుగానే తరలించడం ఇష్టంలే క, ముఖ్యమంత్రి తనపై ఆగ్రహం వ్యక్తంచేశారని. ‘‘ఎవరినడిగి అదనపు బలగాలు తెప్పించారు. ఏం చేస్తున్నావో నీకు అర్ధవువుతోందా?’’ అని వుుఖ్యవుంత్రి అన్నారని వివరించారు. గచ్చిబౌలిలో సీమాంధ్ర న్యాయవాదుల సభకు అనుమతిపై ముఖ్యమంత్రి ఒత్తిడితెచ్చినా తాను ఒప్పుకోనందునే ఆయున తనపై కోపంపెంచుకున్నారన్నారు. ఎల్బీ స్టేడియంలో ఏపీఎన్జీవోల సభకు సీఎం ఒత్తిడితోనే అనుమతివ్వాల్సి వచ్చిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సీఎం నమ్మించి మోసం చేశారు డీజీపీగా పదవీ కాలం పొడిగింపుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తనను నమ్మించి మోసంచేశారని దినేష్‌రెడ్డి ఆరోపించారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకూ తన పదవీ కాలం కొనసాగించాల్సి ఉందని, ఎవరూ కోర్టుకు వెళ్లకుండా నివారించేందుకు, పొడిగింపు జీవోను చివరి నిమిషయంలో ఇస్తానని సీఎం గతంలో తనకు హామీ ఇచ్చారని, చివరకు తాను కోర్టుకు వెళ్లడానికి వీల్లేకుండా సెప్టెంబర్ 27న తన పదవీ విరమణ నోటిఫికేషన్ ఇచ్చారని అన్నారు.వుుఖ్యవుంత్రి ఇలా తనను నమ్మించి వెన్నుపోటు పొడిచారన్నారు. అత్యంత విఫలమైన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డేనని, అతన్ని తొలగించాలనే స్థాయి తనదికాదని అన్నారు. మంత్రికో న్యాయం...నాకో న్యాయమా...! సీబీఐ ఆరోపణలు ఎదుర్కొన్న రాష్ట్ర మంత్రులను తొలగించకుండా, అదే సీబీఐ కేసును సాకుగా చూపుతూ తనను డీజీపీగా కొనసాగించకపోవడం ఏమిటని దినేశ్ రెడ్డి ప్రశ్నించారు. హత్య కేసులో తీవ్రమైన ఆరోపణలున్న రాష్ట్రమంత్రి ఒకరికి సంబంధించి కీలక సాక్ష్యాధారాలను సీఎంకు అందించినా, సదరు మంత్రిని కొనసాగించారని ఆరోపించారు. మరో హత్య కేసులో ఐపీఎస్ అధికారిపై ఛార్జిషీటు దాఖలైనా, ఆ అధికారిని తప్పించకుండా కొనసాగించారన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా దినేశ్ రెడ్డి చెప్పారు. ఒక పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయబోతున్నారన్నది, కేవలం ఊహాగానమేనన్నారు. అమెరికాకు వెళ్లి రెండు నెలలపాటు విశ్రాంతి తీసుకునే ఆలోచనలో ఉన్నానన్నారు. -
దినేష్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్‌లో కల్లోలం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మాజీ డీజీపీ దినేష్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కల్లోలం సృష్టించాయి. సిఎం సోదరుడు సంతోష్ రెడ్డి భూకబ్జాలను అడ్డుకోవటంతో తనను టార్గెట్ చేశారని, తనపై కక్ష కట్టారని ఆయన ఆరోపించారు. అనంతపురం జిల్లా ఎస్పి శ్యాంసుందర్ సస్పెండ్ చేయమని సీఎం తనపై ఒత్తిడి తెచ్చినట్లు చెప్పారు. తనకు నమ్మకం ద్రోహం చేశారని, ఫెల్యూర్ సిఎం అని తీవ్రస్థాయిలో విమర్శించారు. దినేష్ రెడ్డి వ్యాఖ్యలు సీఎం పీఠాన్ని కుదుపుతున్నాయి. సిఎం పదవి నుంచి తొలగించాలని పలు పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. డీజీపీ వ్యాఖ్యలను ఆధారంగా తీసుకొని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై సుమోటో కేసు నమోదు చేయాలని టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రాజకీయ పలుకుబడితో భూ దందాలు చేస్తున్న సీఎం తమ్ముడిపై కేసు నమోదు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలైతే తలా ఒక మాట అంటున్నారు. కొందరు ముఖ్యమంత్రిని సమర్ధిస్తుంటే, మరికొందరు ఇదే అదనుగా విమర్శలు మొదలు పెట్టారు. సీఎంను గద్దె దింపాలని గొడవ చేస్తున్నారు. ఎవరి స్థాయిలో వారు తీవ్రంగా రెచ్చిపోతున్నారు. తెలంగాణ నేతలైతే మరీను. ఒంటికాలుమీద లేస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఏకంగా పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. కిరణ్ హయాంలో ప్రభుత్వ పాలన స్తంభించింది. శాంతి భద్రతలు పరిరక్షించడంలో సీఎం విఫలమయ్యారన్నారు. అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న కిరణ్ కుమార్ రెడ్డిని వెంటనే డిస్మిస్ చేయాలన్నారు. దినేష్ రెడ్డికి డీజీపీ పదవి కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన భిక్ష అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. నలుగురు సీనియర్ అధికారులను కాదని డీజిపి పదవి ఆయనకు కట్టబెట్టినట్లు అసలు విషయం బయటపెట్టారు. మరో మంత్రి రఘువీరా రెడ్డి దినేష్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. -
చంద్రబాబు కోరిక తీర్చాం: దిగ్విజయ్
-
చంద్రబాబు కోరిక తీర్చాం: దిగ్విజయ్
న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని విభజించాలనే చంద్రబాబు కోరికను తాము తీర్చామని, అయినా ఆయన ఎందుకు దీక్ష చేస్తున్నారో తమకు తెలియడం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్‌సింగ్ అన్నారు. రాష్ట్రాన్ని విభజించాలని చంద్రబాబు స్వయంగా తమకు లేఖ రాసిచ్చారని వెల్లడించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి చేస్తున్నవన్ని నిరాధార ఆరోపణలని కొట్టిపారేశారు. తన పదవిని పొడింగించలేదనే అక్కసుతోనే ఆయనీ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర విభజన తీరు సరిగా లేదంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ నిన్న వ్యంగ్యంగా స్పందించారు. ‘విభజన తీరు సరిగా లేకుంటే ఎలా ఉండాలో ఆయన్నే చెప్పమనండి’ అంటూ వ్యాఖ్యానించారు. విభజనపై అన్ని పార్టీలను సంప్రదించామని, టీడీపీ సహా దాదాపు అన్ని పార్టీలు పలు సందర్భాల్లో విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చాయని వివరించారు. ఇప్పుడు ఆ పార్టీలు వైఖరులు మార్చుకుంటే కాంగ్రెస్ ఏం చేస్తుందని ఆయన సూటిగా ప్రశ్నించారు. -
దినేష్‌రెడ్డి అహంకారంతో మాట్లాడారు: ఆనం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి చేసిన విమర్శలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తప్పుబట్టారు. సీఎంను విమర్శించేస్థాయి దినేష్‌రెడ్డికి లేదని అన్నారు. నలుగురు సీనియర్లను కాదని రెండేళ్లు డీజీపీగా అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. డీజీపీ పోస్ట్ ఎలా వచ్చిందే గుర్తుందా అంటూ సూటిగా ప్రశ్నించారు. దినేష్‌రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రిటైర్మెంట్ వయసు దాటినా పదవిలో కొనసాగాలనుకోవడం మంచిదికాదన్నారు. డీజీపీ పదవి నుంచి దినేష్‌రెడ్డిని తొలగించారనడం సరికాదన్నారు. ముఖ్యమంత్రిపై కక్ష సాధిస్తావా అంటూ నిలదీశారు. భూకబ్జాకోరుడని దినేష్రెడ్డిపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందని, దాని నుంచి సచ్ఛీలుడిగా బయటపడిన తర్వాత మాట్లాడాలన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే గుణపాఠం చెప్పడానికి పోలీసు మాజీ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని మంత్రి ఆనం అన్నారు. -
ముఖ్యమంత్రి కిరణ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి: పాల్వాయి
ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డిని పీడీ యాక్ట్ కింద వెంటనే అరెస్ట్ చేయాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల అభిమానాన్ని చూరగొనే వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించాలని పాల్వాయి సూచించారు. శాంతి భద్రతలు పరిరక్షించడంలో విఫలమైన, అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని వెంటనే డిస్మిస్ చేయాలి అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రదేశ్ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర విభజనపై మళ్లీ అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలని పీసీసీ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడం ఆయన వ్యక్తిగతం అని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. మాజీ డీజీపీ దినేష్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో పలు పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. -
కిరణ్ కుమార్ రెడ్డి ఓ ఫెయిల్యూర్ సీఎం: దినేష్ రెడ్డి
-
కిరణ్ కుమార్ రెడ్డి ఓ ఫెయిల్యూర్ సీఎం: దినేష్ రెడ్డి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మాజీ డీజీపీ దినేష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి తన సోదరుడు సంతోష్ రెడ్డి భూకబ్జాలను అడ్డుకోవటంతో తనను టార్గెట్ చేశారని ఆయన ఆరోపించారు. కిరణ్ సోదరుడి భూకబ్జాలను ఆపినందుకే తనపై కక్ష కట్టారని దినేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా ఎస్పీ శ్యాంసుందర్ విషయంలో ముఖ్యమంత్రి చెప్పినట్లు నడుచుకోనందునే తనను డీజీపీగా కొనసాగించలేదని ఆయన అన్నారు. శ్యాంసుందర్ ను సస్పెండ్ చేయమని తనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. తన పదవీ కాలాన్ని పదవికాలాన్ని పొడిగిస్తానని చెప్పి.. ఆ తర్వాత నమ్మక ద్రోహం చేశారని దినేష్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రిపై న్యాయపోరాటం చేస్తానని దినేష్ రెడ్డి తెలిపారు. అవసరం అయితే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు. అధికారంలో ఉన్న సీఎంపై ఆరోపణలు చేస్తున్న మీపై చర్యలు తీసుకుంటే ఎలా అనే ప్రశ్నకు .. అధికారం బాప్ కా జాగీర్ కాదు.. తనకు ఉండే మద్దతు తనకు ఉందని.. తన ప్రణాళిక తనకు ఉంది అని దినేష్ రెడ్డి ఘాటుగా సమాధానమిచ్చారు. అంతే కాకుండా కిరణ్ కుమార్ రెడ్డి ఓ ఫెయిల్యూర్ సీఎం అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సలైట్లు బలపడుతారనేది ఊహాజనితమేనని ఆయన అన్నారు. తన వెనుక రాజకీయ నేతల ఒత్తిడి లేదని అన్నారు. సీఎం ఒత్తిడితోనే సీమాంధ్ర ఉద్యోగుల సభకు అనుమతి ఇచ్చానన్నారు. సీఎంపై చర్యలు తీసుకునే వారు తీసుకుంటారని వ్యాఖ్యలు చేశారు. సీమాంధ్రలో ఉద్యమాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయన్నారు. తను రాజకీయాల్లో ప్రవేశించాలనే ఆసక్తి లేదని దినేష్ రెడ్డి మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం మీ వెనక ఉండి నడిపిస్తుందా అని అడిగిన ప్రశ్నకు .. తనక జరిగిన అన్యాయానికి, వెన్నుపోటుకు మాత్రమే స్పందిస్తున్నాను అని అన్నారు. కాగా తన పదవీ కాలం పొడిగించాలంటూ దినేష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఆయన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. -
సుప్రీం కోర్టులో దినేష్‌రెడ్డికి చుక్కెదురు
సాక్షి లీగల్ కరస్పాండెంట్, న్యూఢిల్లీ: డీజీపీగా తన పదవీకాలం పొడిగింపునకు ఆదేశాలివ్వాలన్న దినేష్‌రెడ్డి అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇదే విన్నపాన్ని తిరస్కరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ (ఎస్ఎల్పీ)ను తోసిపుచ్చుతూ సోమవారం తీర్పు వెలువరించింది. తాను సెప్టెంబర్ 30న పదవీవిరమణ చేయాల్సి ఉన్నప్పటికీ ప్రకాశ్‌సింగ్ కేసు (2006)లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తన పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దినేష్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ దినేష్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసింది. -
సుప్రీంకోర్టులో దినేష్ రెడ్డికి చుక్కెదురు
న్యూఢిల్లీ : మాజీ డీజీపీ దినేష్ రెడ్డికి న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురు అయ్యింది. తన పదవీ కాలాన్ని పొడిగించాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. 2014 డిసెంబర్ వరకూ తనను డీజీపీగా కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దినేష్‌రెడ్డి.... సుప్రీంకోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఆయన తన పదవీ కాలాన్ని పొడిగించాలని హైకోర్టును కూడా ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే దినేష్ రెడ్డికి అక్కడ కూడా నిరాశే ఎదురైంది. దినేష్‌రెడ్డి పదవీ కాలం పూర్తయినందున డీజీపీగా ఆయనను కొనసాగించలేమంటూ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. నిబంధనల ప్రకారం మరోసారి దినేష్‌రెడ్డి పదవీ కాలం పొడిగింపు సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన డీజీపీగా ప్రసాదరావును నియమించింది. -
కొత్త డీజీపీగా ప్రసాదరావు దాదాపు ఖరారు
హైదరాబాద్ : కొత్త పోలీస్ బాస్‌గా ఏసీబీ డీజీ ప్రసాదరావు పేరు దాదాపు ఖరారైనట్లే. డీజీపీగా దినేష్ రెడ్డి పదవీ కాలం నేటితో ముగియనుంది. ఈరోజు సాయంత్రం ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రసాదరావు ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. మరోవైపు దినేష్ రెడ్డికి పోలీసు విభాగం ఘనంగా వీడ్కోలు పలికింది. కాగా దినేష్ రెడ్డి ఈరోజు ఉదయం గవర్నర్ నరసింహన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. -
వీడ్కోలు వందనం స్వీకరించిన దినేష్ రెడ్డి
హైదరాబాద్ : డీజీపీ దినేష్ రెడ్డి పదవీ కాలం నేటితో ముగియనున్న సందర్భంగా ఆయన సోమవారం వీడ్కోలు వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీస్‌గ్రౌండ్స్‌లో పోలీస్ విభాగం కవాతు నిర్వహించి ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ కార్యక్రమానికి అందరూ ఐపీఎస్‌లు, అడిషనల్ డీజీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా దినేష్ రెడ్డి మాట్లాడుతూ డీజీపీగా రెండేళ్ల మూడు నెలలు పని చేశానన్నారు. తాను బాధ్యతలు చేపట్టినప్పుడు రాష్ట్రం అల్లకల్లోలంగా ఉందని.... అయితే అందరి సహకారంతో శాంతిభద్రతలు అదుపులోకి తీసుకు వచ్చినట్లు దినేష్ రెడ్డి తెలిపారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం గొప్పగా పని చేస్తోందని చెప్పారు. తన పదవీ కాలంలో శాంతి భద్రతలు కాపాడటానికి సహకరించిన పోలీసులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
తాత్కాలిక డీజీపీగా ప్రసాదరావు?
-
దినేష్‌రెడ్డికి మళ్లీ చుక్కెదురు!
డీజీపీగా కొనసాగించాలన్న పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డికి హైకోర్టులోనూ చుక్కెదురైంది. 2014 డిసెంబర్ వరకూ తనను డీజీపీగా కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దినేష్‌రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దినేష్‌రెడ్డి పదవీ కాలం పూర్తయినందున డీజీపీగా ఆయనను కొనసాగించలేమంటూ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. నిబంధనల ప్రకారం మరోసారి దినేష్‌రెడ్డి పదవీ కాలం పొడిగింపు సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అశుతోష్ మొహుంతా, జస్టిస్ దామా శేషాద్రినాయుడులతో కూడిన ధర్మాసనం ఆదివారం సాయంత్రం తీర్పు వెలువరించింది. డీజీపీగా పొడిగింపు సాధ్యం కాదంటూ క్యాట్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ దినేష్‌రెడ్డి శనివారం అత్యవసరంగా హౌస్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఆదివారం ఉదయం జస్టిస్ మొహుంతా తన నివాసం వద్దే వాదనలు విన్నారు. దినేష్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదన వినిపిస్తూ.. పదవీ విరమణ గడువుతో సంబంధం లేకుండా.. వచ్చే ఏడాది చివరి వరకూ దినేష్‌రెడ్డికి డీజీపీగా కొనసాగే అర్హత ఉందన్నారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి తోసిపుచ్చారు. దినేష్‌రెడ్డి తొలు త 2011 జూన్ 30న డీజీపీగా నియమితులయ్యారని, ప్రకాశ్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 2012 సెప్టెంబర్ 29న యూపీఎస్సీ సూచనల ప్రకారం ఆయనను డీజీపీగా మరోసారి ప్రభుత్వం నియమించిందన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30తో పదవీ కాలం పూర్తయిందని తెలిపారు. నిబంధనల ప్రకారం పదవీ విరమణ చేసిన వ్యక్తికి ఎటువంటి పొడిగింపునివ్వరాదన్నారు. దినేష్‌రెడ్డి పదవీ విరమణను ప్రభుత్వం ఇప్పటికే నోటిఫై చేసిందని, దానిని దినేష్‌రెడ్డి సవాలు చేయలేదని నివేదించారు. వాస్తవానికి క్యాట్ మధ్యంతర ఉత్తర్వులపై హైకోర్టుకు రావడానికి వీల్లేదన్నారు. కేంద్ర హోంశాఖ తరఫున అదనపు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ సమీర్‌కుమార్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, డీజీపీ ఆస్తులపై వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో ఆయన పదవీ కాలాన్ని పొడిగించలేమన్నారు. వాదనలు విన్న ధర్మాసనం సాయంత్రం 5.20కి తీర్పు వెలువరిస్తూ దినేష్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. తాత్కాలిక డీజీపీగా ప్రసాదరావు? సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర తాత్కాలిక డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డీజీపీ)గా బయ్యవరపు ప్రసాదరావును నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుత డీజీపీ దినేష్‌రెడ్డి పదవీకాలం సోమవారంతో ముగియనుంది. తన పదవీకాలాన్ని పొడిగించాల్సిందిగా దినేష్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో కొత్త డీజీపీ నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు తాత్కాలికంగా ప్రసాదరావును డీజీపీగా నియమించాలని నిర్ణయించినట్టు సమాచారం. డీజీపీ నియామకంపై కసరత్తు కొలిక్కి వచ్చాక.. అర్హులైన ఐదుగురు పోలీసు ఉన్నతాధికారుల పేర్లను యూపీఎస్సీకి ప్రభుత్వం పంపనుంది. వీరిలో ముగ్గురి పేర్లను యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తుంది. ఆ ముగ్గురిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తికాల డీజీపీగా నియమిస్తుంది. ఈ పక్రియకు వారం రోజులు పట్టే అవకాశం ఉండటంతో.. తాత్కాలిక డీజీపీగా ప్రసాదరావును నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. -
డిజిపి దినేష్ రెడ్డిపిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు
-
డిజిపి దినేష్ రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
హైదరాబాద్: డిజిపి దినేష్ రెడ్డి పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. క్యాట్ తీర్పును హైకోర్టు సమర్ధించింది. దినేష్ రెడ్డి పదవీ కాలం రేపటితో ముగియనుంది. ఇక ఆయన పదవీ కాలం పొడిగింపునకు అవకాశాలు మూసుకుపోయాయి. పదవీ విరమరణ వయస్సుతో సంబంధం లేకుండా డీజీపీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రెండేళ్ల పాటు సేవ చేయొచ్చునని, ఆ మేరకు తన పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించాలని దినేష్ రెడ్డి కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)లో దాఖలు చేసిన పిటిషన్లో కోరారు. దినేష్‌రెడ్డి విన్నపాన్ని తోసిపుచ్చింది. దాంతో ఆయన క్యాట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆదివారం వాదనలు ముగిశాయి. తీర్పును సాయంత్రం 5 గంటలకు ప్రకటించింది. క్యాట్ తీర్పునే హైకోర్టు సమర్ధించింది. -
దినేష్ రెడ్డి పిటీషన్ పై రేపు హైకోర్టులో విచారణ
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ దినేష్ రెడ్డి క్యాట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టులో ఆదివారం విచారణ కు రానుంది. ఏడాది కాలం పాటు తన పదవీ కాలన్నీ పొడగించాలని కోరుతూ శనివారం ఆయన హౌస్ మోషన్ పిటీషన్ హైకోర్టులో దాఖలు చేశారు. దీనిని హైకోర్టు రేపు ఉదయం 11గం.లకు విచారించనుంది. పదవీ విరమరణ వయస్సుతో సంబంధం లేకుండా డీజీపీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రెండేళ్ల పాటు సేవ చేయొచ్చని, ఆ మేరకు తన పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడగించాలని ఆయన ఆ పిటిషన్లో కోరారు. తనను మరో ఏడాదిపాటు డీజీపీగా కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న దినేష్‌రెడ్డి విన్నపాన్ని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే డీజీపీగా ఆయన రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేశారని, ఇక ఆయనను డీజీపీ కొనసాగించలేమని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పడంతో ..దీనిపై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ జారీ చేయలేమని శుక్రవారమే క్యాట్ తేల్చిచెప్పింది. క్యాట్ అలా చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే... ప్రభుత్వం ఆయన పదవీ విరమణ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. 1953 సెప్టెంబర్ 18న జన్మించిన దినేష్‌రెడ్డి ఈనెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె.మహంతి అందులో పేర్కొన్నారు. -
క్యాట్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేసిన దినేష్ రెడ్డి
తన పదవీ కాలాన్ని పొడిగించేది లేదంటూ క్యాట్ వెలువరించిన నిర్ణయాన్ని డీజీపీ దినేష్ రెడ్డి హైకోర్టులో సవాలు చేశారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో హౌజ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పదవీ విరమరణ వయస్సుతో సంబంధం లేకుండా డీజీపీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రెండేళ్ల పాటు సేవ చేయొచ్చని, ఆ మేరకు తన పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడగించాలని ఆయన ఆ పిటిషన్లో కోరారు. తనను మరో ఏడాదిపాటు డీజీపీగా కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న దినేష్‌రెడ్డి విన్నపాన్ని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే డీజీపీగా ఆయన రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేశారని రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించిన నేపథ్యంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ జారీ చేయలేమని శుక్రవారమే క్యాట్ తేల్చిచెప్పింది. క్యాట్ అలా చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే... ప్రభుత్వం ఆయన పదవీ విరమణ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. 1953 సెప్టెంబర్ 18న జన్మించిన దినేష్‌రెడ్డి ఈనెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె.మహంతి అందులో పేర్కొన్నారు. -
కొత్త పోలీస్ బాస్ ఎవరు ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసుశాఖకు కొత్త బాస్ ఎవరు? ప్రస్తుతం డీజీపీ దినేష్‌రెడ్డి ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయనను కొనసాగించే అవకాశం లేదని ప్రభుత్వం కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్(క్యాట్)కు స్పష్టంచేసిన నేపథ్యంలో కొత్త డీజీపీ ఎవరు కాబోతున్నారనే అంశం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈనెల 30వ తేదీన కొత్త డీజీపీ నియామకంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం డీజీపీ నియామకానికి సంబంధించి ఐదుగురు డీజీపీ స్థాయి అధికారుల జాబితాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కి పంపితే వారిలో ముగ్గురి పేర్లను ఎంపికచేసి ప్రభుత్వానికి పంపుతుంది. ఆ ముగ్గురిలో ఒకర్ని ప్రభుత్వం ఎంపిక చేయవచ్చు. ప్రసాదరావుకే అవకాశాలు!: ఏసీబీ డెరైక్టర్ జనరల్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్న ప్రసాదరావును కొత్త డీజీపీగా ప్రభుత్వం నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీఎం కిరణ్‌ని సచివాలయంలో బుధవారం ఆయన కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొన్ని కీలకమైన పోస్టులతోపాటు ఆర్టీసీ ఎండీ, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా పనిచేసి ఉండటం ప్రసాదరావుకు అదనపు అర్హత. రాష్ట్రంలో వీఆర్ఎస్ తీసుకున్న ఐఏఎస్ అధికారి ద్వారా ఢిల్లీ రాహుల్‌గాంధీ కోటరీలో కూడా ప్రసాదరావు ఎంపిక అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇంకా డీజీపీ పదవి రేసులో సీఆర్పీఎఫ్ ప్రత్యేక డెరైక్టర్‌గా కేంద్ర సర్వీసులో ఉన్న అరుణాబహుగుణ కూడా ఢిల్లీనుంచే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. అదే బ్యాచ్‌కి చెందిన హోం శాఖ ముఖ్య కార్యదర్శి టీపీ దాస్‌కు రాజ్‌భవన్ వర్గాల నుంచి మద్దతు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
దినేష్‌రెడ్డిని కొనసాగించాలని ఆదేశించలేం: క్యాట్
సాక్షి, హైదరాబాద్: తనను మరో ఏడాదిపాటు డీజీపీగా కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న దినేష్‌రెడ్డి విన్నపాన్ని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) తోసిపుచ్చింది. ఇప్పటికే డీజీపీగా ఆయన రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేశారని రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించిన నేపథ్యంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ జారీ చేయలేమని తేల్చిచెప్పింది. అయితే దినేష్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం విచారణకు స్వీకరించిన క్యాట్... దీనిపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. దినేష్‌రెడ్డి పదవీ విరమణకు నోటిఫికేషన్ దినేష్‌రెడ్డిని డీజీపీగా కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని క్యాట్ స్పష్టం చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే... ప్రభుత్వం ఆయన పదవీ విరమణ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. 1953 సెప్టెంబర్ 18న జన్మించిన దినేష్‌రెడ్డి ఈనెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె.మహంతి అందులో పేర్కొన్నారు. -
డీజీపీ దినేష్‌రెడ్డి రిటైర్మెంట్ ఫై జీవో జారీ
హైదరాబాద్:డీజీపీ దినేష్ రెడ్డి రిటైర్మెంట్ నోటిఫై చేస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. తన నియామకం జరిగిన తేదీ నుంచి రెండేళ్ల పాటు పదవిలో కొనసాగేలా అవకాశమివ్వాలని దినేష్ రెడ్డి విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో క్యాట్ ను ఆశ్రయించిన దినేష్ కు అక్కడా చుక్కెదురైంది. డీజీపీగా దినేష్ రెడ్డి పదవీకాలం ఈనెల 30తో ముగియనుంది. దీనిపై శుక్రవారం క్యాట్ తన తుది తీర్పు వెల్లడించింది. ఆయన వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. దినేష్ రెడ్డిని డీజీపీగా ఇక కొనసాగించలేమని రాష్ట్ర ప్రభుత్వం క్యాట్‌కు నివేదిక ఇవ్వడంతో ఆయన ఆశలకు గండిపడక తప్పలేదు. మరో ఏడాది పాటు తన పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతూ డిజిపి దినేష్ రెడ్డి క్యాట్ హైదరాబాద్ బెంచిని ఆశ్రయించారు. 'ప్రకాష్ సింగ్ - భారత ప్రభుత్వం' కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పదవీ విరమణ వయసుతో నిమిత్తం లేకుండా డీజీపీగా తన నియామకం జరిగిన తేదీ నుంచి రెండేళ్ల పాటు పదవిలో కొనసాగేలా అవకాశమివ్వాలని దినేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సుప్రీం తీర్పు ఆధారంగానే తన నియామకం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. -
డీజీపీ దినేష్ రెడ్డిని అడ్డుకుంటాం:కోదండరామ్
హైదరాబాద్: రాష్ట్ర డీజీపీగా దినేష్ రెడ్డి కొనసాగే అర్హత లేదని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు. ఉన్నత న్యాయ స్థానానికి వెళ్లైనా సరే దినేష్ రెడ్డిని అడ్డుకుంటామన్నారు. దినేష్ రెడ్డిని డీజీపీ ఇక కొనసాగించలేమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ కు ఒక నివేదిక ఇవ్వడంతో అతను పెట్టుకున్న ఆశలకు గండిపడింది. చట్ట ప్రకారం అతనికి పదవిలో కొనసాగే అర్హత లేదని ఆయన తెలిపారు. ఈనెల 29వ తేదీన తాము చేపట్టే సకలజనుల భేరీని విజయవంతం చేయాలని ఆయన విజ్క్షప్తి చేశారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు దసరా బోనస్ ఇవ్వాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తెలుపుతూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీకే మహంతి తరఫున స్పెషల్ జీపీ శ్రీధర్‌రెడ్డి క్యాట్‌కు గురువారం మెమో సమర్పించారు. దినేశ్‌రెడ్డి ఆస్తుల కేసుపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ ప్రాథమిక విచారణ చేస్తోందని మెమోలో పేర్కొన్నారు. దర్యాప్తు పురోగతిపై నాలుగు నెలల్లో నివేదికను సమర్పించాల్సి ఉందని, ఈ నేపథ్యంలో డీజీపీగా దినేశ్‌రెడ్డిని కొనసాగించబోమని తెలిపారు. పదవీ కాలం పొడిగింపునకు దినేశ్‌రెడ్డి చేసుకున్న విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించినట్టు వివరించారు. ప్రకాశ్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు అమలుపై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని, వాటిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందని వివరించారు. పదవీ విరమణ వయస్సుతో నిమిత్తంలేకుండా రెండేళ్ల పదవీకాలాన్ని కొనసాగించే విషయంలోనూ స్పష్టత అవసరవుని, ప్రకాశ్‌సింగ్ కేసులో తీర్పు ఆధారంగా డీజీపీ పదవీ కాలాన్ని తమిళనాడు ప్రభుత్వం పొడిగించినంత మాత్రాన, దాన్ని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం వివరించింది. దీంతో, ఈ పిటిషన్‌పై విచారణను ముగిస్తున్నట్లు క్యాట్ ధర్మాసనం ప్రకటించింది. -
దినేష్ రెడ్డికి క్యాట్‌లో తప్పని నిరాశ
డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) దినేష్ రెడ్డికి క్యాట్‌లో చుక్కెదురైంది. తన పదవీ కాలాన్ని మరింత పొడిగించాలంటూ డీజీపీ క్యాట్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై శుక్రవారం క్యాట్ తన తుది తీర్పు వెల్లడించింది. ఆయన వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. దినేష్ రెడ్డిని డీజీపీగా ఇక కొనసాగించలేమని రాష్ట్ర ప్రభుత్వం క్యాట్‌కు నివేదిక ఇవ్వడంతో ఆయన ఆశలకు గండిపడక తప్పలేదు. మరో ఏడాది పాటు తన పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతూ డిజిపి దినేష్ రెడ్డి క్యాట్ హైదరాబాద్ బెంచిని ఆశ్రయించారు. 'ప్రకాష్ సింగ్ - భారత ప్రభుత్వం' కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పదవీ విరమణ వయసుతో నిమిత్తం లేకుండా డీజీపీగా తన నియామకం జరిగిన తేదీ నుంచి రెండేళ్ల పాటు పదవిలో కొనసాగేలా అవకాశమివ్వాలని దినేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సుప్రీం తీర్పు ఆధారంగానే తన నియామకం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా దినేష్ రెడ్డి పదవీకాలం ఈనెల 30తో ముగియనుంది. -
'డీజీపీగా దినేష్ రెడ్డి ను కొనసాగించలేము'
హైదరాబాద్:డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)గా దినేష్ రెడ్డి కి క్యాట్ లో చుక్కెదురైంది. తన పదవీ కాలాన్ని మరింత పొడిగించాంలంటూ డీజీపీ క్యాట్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై గురువారం విచారించిన క్యాట్ డీజీపీ అభ్యర్థనను తిరస్కరించింది. డీజీపీ గా ఇక కొనసాగించలేమని రాష్ట్ర ప్రభుత్వం క్యాట్ కు నివేదిక ఇవ్వడంతో దినేష్ రెడ్డి పెట్టుకున్న ఆశలకు గండిపడక తప్పలేదు. సెప్టెంబర్ 30, 2014 వరకూ తన పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతూ డిజిపి దినేష్ రెడ్డి క్యాట్ హైదరాబాద్ బెంచిని ఆశ్రయించారు. 'ప్రకాష్ సింగ్ తదితరులు - భారత ప్రభుత్వం తదితరుల' కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పదవీ విరమణ వయసుతో నిమిత్తం లేకుండా డిజిపిగా తన నియామకం జరిగిన తేదీ నుంచి రెండేళ్ళపాటు పదవిలో కొనసాగేలా అవకాశమివ్వాలని దినేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సుప్రీం తీర్పు ఆధారంగానే తన నియామకం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా దినేష్ రెడ్డి పదవీకాలం ఈనెల 30తో ముగియనుంది. -
దినేష్ రెడ్డి కొనసాగింపుపై క్యాట్‌లో వాదనలు
-
దినేష్ రెడ్డి కొనసాగింపుపై క్యాట్‌లో వాదనలు
హైదరాబాద్ : డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)గా దినేష్ రెడ్డి పదవీ కాలంపు పొడిగింపుపై గురువారం క్యాట్‌లో విచారణ కొనసాగుతోంది. డిజిపిగా తన పదవీ కాలాన్ని సెప్టెంబర్ 30, 2014 వరకూ పొడిగించాలని కోరుతూ డిజిపి దినేష్ రెడ్డి క్యాట్ హైదరాబాద్ బెంచిని ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై దినేష్ రెడ్డిని కొనసాగించాలా.... వద్దా అనే దానికి రాష్ట్ర ప్రభుత్వం క్యాట్‌కు నివేదిక ఇవ్వనుంది. 'ప్రకాష్ సింగ్ తదితరులు - భారత ప్రభుత్వం తదితరుల' కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పదవీ విరమణ వయసుతో నిమిత్తం లేకుండా డిజిపిగా తన నియామకం జరిగిన తేదీ నుంచి రెండేళ్ళపాటు పదవిలో కొనసాగేలా అవకాశమివ్వాలని దినేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సుప్రీం తీర్పు ఆధారంగానే తన నియామకం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా దినేష్ రెడ్డి పదవీకాలం ఈనెల 30తో ముగియనుంది. -
సమైక్య ఉద్యమాన్ని నడుపుతోంది సీఎం, డీజీపీలే
నర్సాపూర్, న్యూస్‌లైన్: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డి ఆధ్వర్యంలోనే సమైక్య ఉద్యమం నడుస్తోందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ధ్వజమెత్తారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసులు, సీమాంధ్ర నాయకులే రాజ్యం నడుపుతున్నారన్నారు. రాష్ర్టంలో తెలంగాణ ప్రజలకు ఒక న్యాయం, సీమాంధ్ర ప్రజలకు ఒక న్యాయం కొనసాగుతోందన్నారు. తెలంగాణవాదులు దీక్షలు, ర్యాలీలు, సభలు పెట్టుకోవాలంటే నిషేదాజ్ఞలు అమలులో ఉన్నాయంటూ ఆంక్షలు విధిస్తున్న పోలీసు అధికారులు సీమాంధ్ర నాయకులు సభలు పెట్టుకునేందుకు అన్ని విధాలా సహకరించడం విచారకరమన్నారు. సకల జనభేరిని విజయవంతం చేయాలి ఈ నెల 29న హైదరాబాద్‌లో నిర్వహించనున్న సకల జన భేరిని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ పిలుపు నిచ్చారు. జిల్లాలోని ప్రతి నియోజక వర్గం నుంచి వెయ్యి మంది కార్యకర్తలు తరలి రావాలన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి దేవేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మన్నెవీరేశం, దేవేందర్‌రెడ్డి, హబీబ్‌ఖాన్, కుమ్మరి నగేష్, ఖుస్రూ, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు. -
డీజీపీ దినేష్ రెడ్డి పదవీకాలంపై విచారణ వాయిదా
హైదరాబాద్ : డీజీపీ దినేష్ రెడ్డి పదవీకాలం పొడిగింపు పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) బుధవారానికి వాయిదా వేసింది. ఎల్లుండికల్లా దినేష్ రెడ్డి పదవీకాలం పొడిగిపుపై ప్రభుత్వం... క్యాట్‌కు సమాచారం ఇవ్వనుంది. అంతకు ముందు ప్రభుత్వ న్యాయవాది... ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఢిల్లీలో ఉన్నందున దినేష్ రెడ్డి పదవీకాలంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. డీజీపీగా దినేష్‌రెడ్డి కొనసాగింపుపై ఈనెల 23వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని క్యాట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. -
ఆ ఆస్తులతో నాకు సంబంధంలేదు: డిజిపి దినేశ్ రెడ్డి
హైదరాబాద్: సుప్రీం కోర్టు పిటీషన్లో పేర్కొన్న ఆస్తులతో తనకు ఎలాంటి సంబంధంలేదని డీజీపీ దినేశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీబీఐ కేసుపై వివరణ ఇచ్చారు. పిటిషన్లో పేర్కొన్నట్లుగా 1500 ఎకరాలతో తనకు సంబంధంలేదని చెప్పారు. 542 సేల్స్ డీడ్స్‌లో కేవలం ఏడున్నర ఎకరాలకు సంబంధించి మాత్రమే తనవిగా వివరించారు. సీబీఐ విచారణలో అన్ని విషయాలూ బయటపడతాయని చెప్పారు. ఎంపీ సంతకాన్నిఫోర్జరీచేసి మళ్లీ తనపై ఫిర్యాదు చేశారన్నారు. 1977 బ్యాచ్‌కు చెందిన డిజిపి దినేశ్ రెడ్డితో సహా ఆయన సతీమణి కమలా రెడ్డికి చెందిన అన్ని ఆస్తుల లావాదేవీలతో పాటు ఆయన కుటుంబ సభ్యులు వై.రవిప్రసాద్, ఏ.కృష్ణారెడ్డి జరిపిన అన్ని లావాదేవీలపై పూర్తి విచారణకు ఆదేశించాలని ఐపీఎస్ అధికారి ఉమేష్ కుమార్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ఉమేష్ కుమార్ పిటిషన్‌లోని అభియోగాలను దినేష్ రెడ్డికి ఎదుర్కోవల్సిందేనని స్పష్టం చేసింది. దర్యాప్తులోని అభ్యంతరాలను ట్రయిల్ కోర్టులో తేల్చుకోవాలని డీజీపీకి సుప్రీంకోర్టు సూచించింది. దినేష్ రెడ్డి ఆస్తులపై సీబీఐ విచారణకు సుప్రీం కోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లోగా విచారణ దశ నివేదికను సమర్పించాల్సిందిగా జస్టిస్ బి.ఎస్. చౌహాన్, ఎస్.ఎ. బొబ్దెతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు దినేశ్ రెడ్డిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ ప్రారంభించింది. అతనిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రాథమిక విచారణ నివేదికను నమోదు చేసినట్లు సీబీఐ వర్గాలు నిన్న తెలిపాయి. దర్యాప్తులో భాగంగా దినేశ్ రెడ్డిని కూడా సిబిఐ విచారించనుంది. డీజీపీ దినేశ్ రెడ్డి భార్యకు రంగారెడ్డి జిల్లా చంపాపేట, మహేశ్వరం, మేడ్చల్ లలో 90కి పైగా భూముల లావాదేవీలు అమ్మటం, కొనటం జరిగిందని ఉమేష్ కుమార్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కాగా దినేష్‌రెడ్డి తన భార్య పేరుతో బెనామీగా ఆస్తులను కూడబెట్టారంటూ ఉమేశ్ కుమార్, అలాగే షూ కుంభకోణంలో ఉమేశ్ కుమార్ నిందితుడిగా ఉన్నారంటూ దినేష్‌రెడ్డి పరస్పర ఆరోపణలతో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. -
ఆస్తుల కేసు దర్యాప్తుపై డిజిపి వివరణ
-
దినేశ్ రెడ్డిపై సీబీఐ విచారణ షురూ
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర డీజీపీ వి.దినేశ్ రెడ్డిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ ప్రారంభించింది. అతనిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రాథమిక విచారణ నివేదికను నమోదు చేసినట్టు బుధవారం సీబీఐ వర్గాలు తెలిపాయి. మరో ఐపీఎస్ అధికారి ఉమేశ్ కుమార్ ఫిర్యాదు మేరకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 1977 బ్యాచ్‌కు చెందిన దినేశ్ రెడ్డి ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు వచ్చాయి. వీటిపై విచారణ చేపట్టి నాలుగు వారాల్లోగా విచారణ దశ నివేదికను సమర్పించాల్సిందిగా జస్టిస్ బి.ఎస్. చౌహాన్, ఎస్.ఎ. బొబ్దెతో కూడిన సుప్రీం ధర్మాసనం సీబీఐని ఆదేశించిన సంగతి తెలిసిందే. -
'గీతారెడ్డిని పదవి నుంచి తొలగించాలి'
హైదరాబాద్ : ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి గీతారెడ్డి, డీజీపీ దినేష్ రెడ్డి తక్షణమే పదవులకు రాజీనామాలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి లేఖ రాశారు. గీతారెడ్డిని పదవి నుంచి తొలగించాలని నారాయణ ఈ సందర్భంగా సీఎంకు సూచించారు. అలాగే పేదలకు అందాల్సిన ఆహార పదార్థాలను రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేయాలని నారాయణ తన లేఖలో ముఖ్యమంత్రిని కోరారు. -
జీ 24 గంటల జర్నలిస్టులు విడుదల
హైదరాబాద్ : డీజీపీ దినేష్రెడ్డిపై అసత్య కథనాలు ప్రసారం చేసిన కేసులో 'జీ 24 గంటలు’ చానల్ జర్నలిస్టులు రవి, అక్తర్ బుధవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. చానల్లో తప్పుడు కథనాలు ప్రసారం చేసినట్టుగా వచ్చిన ఆరోపణలపై చానల్ విలేకర్లు రవికుమార్, అక్తర్లను అరెస్ట్ చేసి హుస్సేనీఆలం పోలీసులు రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. డీజీపీ గురువారం హైదరాబాద్ పాతబస్తీలోని ఫతేదర్వాజాలో ప్రముఖ ముస్లిం మత గురువు హజ్రత్ హబీబ్ ముజ్తబా అల్ హైద్రూస్‌ను కలవడంపై అవాస్తవాలు ప్రసారం చేశారంటూ ‘జీ 24 గంటలు’ చానల్‌పై రెండు కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. డీజీపీ వెళ్లి హైద్రూస్‌ను కలవడంపై ‘జీ 24 గంటలు’ చానల్లో ‘స్పెషల్ స్టోరీ’ ప్రసారం చేసింది. -
డీజీపీ పదవి ముగిసినా కొనసాగింపా..!
సాక్షి, మంచిర్యాల : తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు శతవిధాలా ప్రయత్నించిన రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దినేష్రెడ్డిపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అమితప్రేమ చూపుతున్నారని పెద్దపల్లి ఎంపీ వివేకానంద విమర్శించారు. శనివారం మంచిర్యాలలో తన నివాస గృహంలో ఆయన విలేకరులతో మా ట్లాడారు. డీజీపీగా దినేష్‌రెడ్డి పదవి కాలం ము గిసినా ఆయన స్థానంలో కొత్త డీజీపీ నియామకం విషయంలో నోరు మెదపడం లేదన్నారు. 30 జూలై 2011లో దినేష్‌రెడ్డిని డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. సాధారణం గా డీజీపీకి రెండేళ్ల పదవి కాలం ఉంటుందని.. ఇ ప్పటికే ఆ పదవి కాలం ముగిసిందని చెప్పారు. మ రొకరిని డీజీపీగా నియమించాల్సి ఉండగా.. సీ మాంధ్రలో కొనసాగుతున్న సమైక్య ఉద్యమం పే రుతో దినేష్‌రెడ్డిని కొనసాగించాలని చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో దినేష్‌రెడ్డి తెలంగాణవాదులపై తప్పుడు కేసులు బనాయించి.. బైండోవర్లు చేసి తీవ్ర ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సభలు.. సమావేశాల కోసం అనుమతి కోరి తే ఆఖరి దశలో అనుమతి ఇచ్చిన డీజీపీ సమైక్యవాదంతో సీమాంధ్రులు చే పడుతున్న కార్యక్రమాలకు కోరిన వెంటనే అనుమతి ఇస్తున్నారని అన్నా రు. దినేష్‌రెడ్డి స్థానంలో కొత్త డీజీపీని నియమిం చాలని డిమాండ్ చేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ కృష్ణారావు, టీఆర్ఎస్ నాయకులు సుదమల్ల హరి కృష్ణ, పానుగంటి శ్రీనివాస్, తేజ పాల్గొన్నారు. -
పాత్రికేయుల అరెస్టులా?
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో మతఘర్షణలు రేకెత్తించే విధంగా తప్పుడు కథనాలను ప్రసారం చేశారన్న ఆరోపణలతో జీ 24 గంటల చానెల్ సిబ్బందిపై పోలీసులు తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ ఢిల్లీలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి నిధులు శనివారం ఏపీభవన్ ప్రధాన ద్వారం ఎదుట నిరసన తెలిపారు. అక్రమ కేసులు ఎత్తివేసి, రాష్ట్ర డీజీపీపై చర్యలు తీసుకోవాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని వారు డిమాండ్ చేశారు. పాత్రికేయులపై తప్పుడు కేసులు పెట్టడంపై మీడియా ప్రతినిధులు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామిని కలిసి డీజీపీ వ్యవహారశైలిపై ఫిర్యాదు చేస్తూ తమకు న్యాయం చేయాలని వినతిపత్రం అందచేశారు. సానుకూలంగా స్పందించిన గోస్వామి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని విచారణకు ఆదేశించినట్టు మీడియా ప్రతినిధులు తెలిపారు. మరోవైపు పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న పోలీసుల వ్యవహారాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం ఆయనకు కూడా వినతి పత్రాన్ని అందచేయనున్నారు. -
డీజీపీ దినేష్‌రెడ్డి పిటిషన్‌పై క్యాట్‌లో విచారణ
హైదరాబాద్ : డీజీపీగా దినేష్‌రెడ్డి కొనసాగింపుపై ఈనెల 23వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. డీజీపీ వ్యవహారంపై రెండు వారాల గడువు ఇవ్వాలని క్యాట్‌ను ప్రభుత్వం కోరినా.... క్యాట్ అనుమతి ఇవ్వలేదు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం తన పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించాలని కోరుతూ డీజీపీ దినేష్‌రెడ్డి చేసుకున్న విజ్ఞప్తిపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ అంతకు ముందు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. -
ఉద్యమానికి సీఎం కన్వీనర్, డీజీపీ కో కన్వీనర్
కరీంనగర్ : కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ మరోసారి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కన్వీనర్‌గా, డీజీపీ దినేష్ రెడ్డి కో కన్వీనర్‌గా సీమాంధ్ర ఉద్యమాన్ని నడిపిస్తున్నారని ఆయన గురువారమిక్కడ ఆరోపించారు. సుప్రీంకోర్టులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీజీపీ దినేష్ రెడ్డి పదవిలో కొనసాగటం అనైతికమని పొన్నం వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనపై నిర్ణయం జరిగిపోయిందని, ఎన్ని ఉద్యమాలు, ఆందోళనలు చేసినా ఉపయోగముండదని ఆయన అన్నారు. సీమాంధ్ర ఉద్యమాలపై ముఖ్యమంత్రి పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్నారని పొన్నం విమర్శించారు. -
మరో ఏడాది డీజీపీగా కొనసాగించండి
క్యాట్‌ను ఆశ్రయించిన దినేష్‌రెడ్డి.. నేడు విచారణ సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు తననే డీజీపీగా కొనసాగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ డీజీపీ దినేష్‌రెడ్డి కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన మంగళవారం క్యాట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ప్రకాష్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం డీజీపీగా నియమితులైన అధికారిని రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగించాల్సి ఉంటుందని తెలిపారు. యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా రెండోసారి 2012లో నియమితుడినైన తనకు ఈ తీర్పు వర్తిస్తుందని, ఇప్పటికే ఇతర రాష్ట్రాలు దీనిని అమలు చేస్తున్నాయని డీజీపీ క్యాట్ దృష్టికి తెచ్చారు. సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ తనను మరో ఏడాదిపాటు కొనసాగించాలని కోరుతూ ఈ నెల 21న రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాతపూర్వకంగా వినతిపత్రం ఇచ్చానని, అయితే దీనిపై ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదని తెలిపారు. వచ్చే నెలాఖరు నాటికి పదవీ విరమణ చేయాల్సి ఉన్న నేపథ్యంలో.. క్యాట్‌లో తన పిటిషన్‌పై విచారణ ముగిసేవరకూ తనను డీజీపీగా పదవీ విరమణకు అనుమతించకుండా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని దినేష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ బుధవారం విచారణకు రానుంది. -
డీజీపీ దినేష్‌రెడ్డి పదవీకాలం పొడిగింపు?
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) వేణుంబాక దినేష్‌రెడ్డి పదవీకాలాన్ని మూడు నెలల పాటు పొడిగించేందుకు కేంద్ర హోంశాఖ తన సమ్మతిని తెలియజేసినట్లు విశ్వసనీయ సమాచారం. 2011 జూలైలో డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన దినేష్‌రెడ్డి వచ్చే నెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన పదవీకాలాన్ని ఏడాది పొడిగించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపింది. దీన్ని పరిశీలించిన కేంద్ర హోంశాఖ అదనంగా మూడు నెలలు మాత్రమే పొడిగించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు దినేష్‌రెడ్డి ఈ ఏడాది డిసెంబర్ 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. -
సీమ ఉన్నతాధికారులతో డీజీపీ రహస్య సమావేశం
సాక్షి ప్రతినిధి, అనంతపురం : డీజీపీ దినేష్‌రెడ్డి గురువారం తిరుపతిలో రాయలసీమ పరిధిలోని ఎస్పీలు, డీఐజీలు, ఐజీతో రహస్యంగా సమావేశమయ్యారు. ఉదయం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో స్వాతంత్య్ర దిన వేడుకల్లో పాల్గొన్న డీజీపీ దినేష్‌రెడ్డి సాయంత్రానికి హుటాహుటిన తిరుపతికి చేరుకుని, కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం ఎస్పీలు, డీఐజీ, ఐజీతో రహస్యంగా సమావేశమయ్యారు. సమైక్యాం ధ్రఉద్యమ నేపథ్యంలో రాయలసీమలో భద్రత గురిం చి సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. అవసరమై తే మరిన్ని బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించినట్లు సమాచారం. సమైక్యాంధ్రఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటున్న వారిని బైండోవర్ చేయాలని, విశ్వవిద్యాలయాలపై ప్రత్యేక నిఘా వేయాలని డీజీపీ ఆదేశించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ‘రాయల తెలంగాణ’ నేపథ్యంలోనే..? ఓట్లు సీట్లే పరమావధిగా రాష్ట్ర విభజనకు నడుం కట్టిన కాంగ్రెస్ మరోకుట్రకు తెరతీసిందేమోననే అనుమానాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీని దెబ్బకొట్టాలనే లక్ష్యంతో కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేసేలా కుట్ర జరుగుతోందని భావిస్తున్నారు. సీమకు చెందిన కొందరు నాయకులు ఇటీవల రాయల తెలంగాణ ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడం ఇందుకు బలం చేకూరుస్తోంది. -
రైలు ఆపితే జైలే : డీజీపీ దినేష్‌రెడ్డి
సీమాంధ్ర ఉద్యమకారులకు డీజీపీ దినేష్‌రెడ్డి హెచ్చరిక విభజన గురించి 15 రోజుల ముందే తెలుసని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: రైళ్ల రాకపోకలను అడ్డుకునేందుకు పట్టాలపైకి వెళితే.. నాన్‌బెయిలబుల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, చిన్న రాయిని ముట్టుకున్నా కేసు పెడతామని డీజీపీ వి.దినేష్‌రెడ్డి హెచ్చరించారు. రైల్‌రోకో చేయాలనే నిర్ణయాన్ని సీమాంధ్ర ఉద్యమకారులు విరమించుకోవాలని సూచించారు. రైల్రోకోలపై నిషేధం ఉందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. గురువారమిక్కడ డీజీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆందోళనకారులను గుర్తిం చేందుకు రైల్వేస్టేషన్లు, రైలు పట్టాలపైనా వీడియో చిత్రీకరణ చేస్తామన్నారు. హెలికాప్టర్ ద్వారా ఏరియ ల్ సర్వే చేస్తున్నామని వివరించారు. రైల్‌రోకోను నిరోధించేందుకు ప్రస్తుతం ఉన్న అదనపు బలగాలకు తోడు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)ను కూడా రంగంలోకి దించుతున్నామన్నారు. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల రైలు మార్గం మధ్యలో మన రాష్ట్రం ఉందని, ఇక్కడ రైల్‌రోకో నిర్వహిస్తే సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయం 15 రోజుల ముందుగానే తనకు తెలుసని, ముందస్తు జాగ్రత్తగా సీమాంధ్రలో 55 కంపెనీల పారా మిలటరీ బలగాలను మోహరించామని డీజీపీ వెల్లడించారు. ర్యాలీలకు రాజధానిలో అనుమతిలేదు సమైక్యాంధ్ర కోరుతూ హైదరాబాద్‌లో ర్యాలీలు నిర్వహించేందుకు ఎలాంటి అనుమతీ లేదని దినేష్‌రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంతోపాటు పలు కార్యాలయ ఉద్యోగులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రదర్శనలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. అయితే, సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనే విధంగా వ్యవహరించవద్దన్నారు. రాజధానిలో నివసించే సీమాంధ్ర ప్రజలకు పూర్తి భద్రత కల్పిస్తామని, ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఏపీఎస్పీ డీఐజీ షేక్ మహ్మద్ ఇక్బాల్ తన రాజీనామాను ఉపసంహరించుకున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా డీజీపీ చెప్పారు. పోలీసులకు ప్రాంతీయ వైషమ్యాలు లేవు.. పోలీసు అధికారులు, సిబ్బందికి రాజకీయ, కుల, మత, ప్రాంతీయ విభేదాలు ఉండవని డీజీపీ అన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా పోలీసుశాఖ పనిచేస్తుందని తెలిపారు. సీమాంధ్ర ఆందోళనల విషయంలో డీజీపీ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారంటూ తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఒకరు చేసిన వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. విగ్రహాల ధ్వంసం, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల విధ్వంసం ఘటనలపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని వివరించారు. ఆందోళనలను చానళ్లలో పదేపదే చూపించడం మంచిది కాదని, కేబుల్ యాక్టు ప్రకారం చర్యలు తీసుకుంటామని ఇప్పటికే టీవీ చానల్ యాజమాన్యాలకు సమాచారం పంపామని నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ చెప్పారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై హత్య కుట్రకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదూ అందలేదని, హత్యకు సుపారీ ఇచ్చిన వ్యవహారంపై ఫిర్యాదు ఇస్తే దర్యాప్తు చేస్తామని డీజీపీ చెప్పారు. రైల్వే ఆస్తులకు నష్టం కలిగించినా, ప్రయాణికుల భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా రైల్వే చట్టాన్ని ప్రయోగిస్తామని పోలీసుశాఖ స్పష్టంచేసింది. రైళ్లను అడ్డుకోవడం, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించడం వంటి నేరాలకు ఏడాది జైలు నుంచి జీవిత ఖైదు వరకూ విధించే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారుల స్పష్టం చేశారు. -
రెచ్చగొడితే.. క్రిమినల్ కేసులు: దినేష్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆందోళనల సందర్భంగా రెచ్చగొట్టే వాఖ్యలుచేస్తే క్రిమినల్ కేసులు నమోదుచేస్తామని పోలీసుశాఖ ప్రకటించింది. ఆందోళనల సందర్భంగాప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను నష్టపరిచే విధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నిజిల్లాల ఎస్పీలకూ డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) వి. దినేష్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు పోలీసు ప్రధాన కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదలచేసిం ది. ఆందోళనలను పురస్కరించుకుని హింసాత్మక ఘటనలకు దిగితే ఉపేక్షించేది లేదని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. సీమాం ధ్రలో ఆందోళనల సందర్భంగా హింసాత్మక ఘటనలకు సంబంధించి ఈ వారం రోజుల వ్యవధిలో 124 కేసులు నమోదు చేశామ ని, ఆ కేసుల్లో 221 మంది నిందితులను అరెస్టుచేశామని వివరించారు. మరో వెయ్యిమందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. జాతీయనేతల విగ్రహాల ధ్వంసానికి పాల్పడినవారిపై కఠి నంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. విగ్రహాల ధ్వంసానికి సంబంధించి ఇప్పటివరకూ 39 కేసులు నమోదుచేసి 94 మందిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. విగ్రహాల ధ్వంసానికి పాల్పడిన వారిపై ఐపీసీ సెక్షన్ 153 (ఎ) సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేస్తున్నామని, ఈ కేసు నిరూపితమైతే మూడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు. శాంతియుత పద్ధతుల్లో ఆందోళనలు, నిరసనలు చేసే వారిపై పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోబోరని, హింసాత్మకఘటనలకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు. కఠినచర్యలు తీసుకోండి: సీఎం సీమాంధ్ర ఆందోళనలు మరింత ఉధృతం అవుతున్న నేపథ్యంలో వాటిని నివారించేందుకు మరింత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. సీమాంధ్రలో ఆందోళనల సందర్భంగా జాతీయ నేతల విగ్రహాల ధ్వంసంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయినట్లు సమాచారం. దీంతో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సీఎం స్పష్టం చేశారు. ఆందోళనల విషయంలో కఠినంగా వ్యవహరించాలంటూ సీఎం ఆదేశించిన నేపథ్యంలో పోలీ సులు వేగం పెంచారు. విగ్రహాలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆ స్తుల ధ్వంసం కేసుల్లో అరెస్టులను మరింత వేగవంతం చేశారు.