దినేష్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్లో కల్లోలం | Dinesh Reddy's comments create flutter in Congress | Sakshi
Sakshi News home page

దినేష్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్లో కల్లోలం

Published Tue, Oct 8 2013 9:04 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

దినేష్ రెడ్డి వ్యాఖ్యలతో  కాంగ్రెస్లో కల్లోలం - Sakshi

దినేష్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్లో కల్లోలం

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మాజీ డీజీపీ దినేష్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్లో కల్లోలం సృష్టించాయి. సిఎం సోదరుడు సంతోష్ రెడ్డి భూకబ్జాలను అడ్డుకోవటంతో తనను టార్గెట్ చేశారని, తనపై కక్ష కట్టారని ఆయన ఆరోపించారు. అనంతపురం జిల్లా ఎస్పి శ్యాంసుందర్  సస్పెండ్ చేయమని సీఎం తనపై ఒత్తిడి తెచ్చినట్లు చెప్పారు. తనకు నమ్మకం ద్రోహం చేశారని, ఫెల్యూర్ సిఎం అని తీవ్రస్థాయిలో విమర్శించారు.

దినేష్ రెడ్డి వ్యాఖ్యలు సీఎం పీఠాన్ని కుదుపుతున్నాయి. సిఎం పదవి నుంచి తొలగించాలని పలు పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.  డీజీపీ వ్యాఖ్యలను ఆధారంగా తీసుకొని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై  సుమోటో కేసు నమోదు చేయాలని టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రాజకీయ పలుకుబడితో భూ దందాలు చేస్తున్న సీఎం తమ్ముడిపై కేసు నమోదు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలైతే  తలా ఒక మాట అంటున్నారు. కొందరు ముఖ్యమంత్రిని సమర్ధిస్తుంటే, మరికొందరు ఇదే అదనుగా విమర్శలు మొదలు పెట్టారు.  సీఎంను గద్దె దింపాలని గొడవ చేస్తున్నారు. ఎవరి స్థాయిలో వారు తీవ్రంగా రెచ్చిపోతున్నారు. తెలంగాణ నేతలైతే మరీను. ఒంటికాలుమీద లేస్తున్నారు.  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఏకంగా పీడీ యాక్ట్ కింద  అరెస్ట్ చేయాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.  కిరణ్ హయాంలో ప్రభుత్వ పాలన స్తంభించింది.  శాంతి భద్రతలు పరిరక్షించడంలో సీఎం  విఫలమయ్యారన్నారు. అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న  కిరణ్ కుమార్ రెడ్డిని వెంటనే డిస్మిస్ చేయాలన్నారు.

దినేష్‌ రెడ్డికి డీజీపీ పదవి కిరణ్‌ కుమార్ రెడ్డి పెట్టిన భిక్ష అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. నలుగురు సీనియర్‌ అధికారులను కాదని డీజిపి పదవి ఆయనకు కట్టబెట్టినట్లు అసలు విషయం బయటపెట్టారు. మరో మంత్రి రఘువీరా రెడ్డి  దినేష్‌ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement