
ఉద్యమానికి సీఎం కన్వీనర్, డీజీపీ కో కన్వీనర్
కరీంనగర్ : కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ మరోసారి ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కన్వీనర్గా, డీజీపీ దినేష్ రెడ్డి కో కన్వీనర్గా సీమాంధ్ర ఉద్యమాన్ని నడిపిస్తున్నారని ఆయన గురువారమిక్కడ ఆరోపించారు.
సుప్రీంకోర్టులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీజీపీ దినేష్ రెడ్డి పదవిలో కొనసాగటం అనైతికమని పొన్నం వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనపై నిర్ణయం జరిగిపోయిందని, ఎన్ని ఉద్యమాలు, ఆందోళనలు చేసినా ఉపయోగముండదని ఆయన అన్నారు. సీమాంధ్ర ఉద్యమాలపై ముఖ్యమంత్రి పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్నారని పొన్నం విమర్శించారు.