Seemandhra agitation
-
ఇలాంటి ‘అవిశ్వాసం’ చరిత్రలో తొలిసారి: అశోక్‌బాబు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షులు అశోక్‌బాబు చెప్పారు. ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అదే పార్టీపై అవిశ్వాసం పెడతామనడం దేశచరిత్రలోనే మొదటిసారని, దీన్నిబట్టి సీమాంధ్రలో ఉద్యమం ఎంత బలంగా ఉందో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలని సూచించారు. రాజీనామా చేయని కేంద్ర మంత్రులు, ఎంపీలకు సాంఘిక బహిష్కరణ చేయడంతోపాటు వారికి రాజకీయ భవిష్యత్తులేకుండా చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్‌కు దిగ్విజయ్‌సింగ్ రాకను చెడు సంకేతంగా భావిస్తూ ‘డిగ్గీరాజా గో బ్యాక్’ అనే నినాదంతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. విభజన బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరేందుకు రెండు మూడు రోజుల్లో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని కలవనున్నట్లు వెల్లడించారు. ఏపీఎన్జీవోల సంఘం ఎన్నికలకు సంబంధించి ఈ నెల 22న నామినేషన్ల ప్రక్రియ ఉంటుందని, 5న ఎన్నికలు జరుగుతాయని అశోక్‌బాబు తెలిపారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, సంఘం నగర అధ్యక్షులు పీవీవీ సత్యనారాయణ, ఆంధ్రామేధావుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు పాల్గొన్నారు. విభజనను వ్యతిరేకించాలని మజ్లిస్‌కు వినతి శాసనసభ సమావేశాల్లో ‘రాష్ట్ర విభజన’ను వ్యతిరేకించి సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని ఏపీఎన్జీవో సంఘం మజ్లిస్ పార్టీకి విజ్ఞప్తి చేసింది. అశోక్‌బాబు ఆధ్వర్యంలోని బృందం మంగళవారం దారుస్సలాంకు వెళ్లింది. అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీ అందుబాటులో లేకపోవడంతో పార్టీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, ఇతర శాసన సభ్యులతో సమావేశమైంది. శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర విభజనను వ్యతిరేకించి సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని మజ్లిస్ పార్టీ నాయకత్వాన్ని విజ్ఞప్తి చేశామని అనంతరం అశోక్‌బాబు మీడియాతో చెప్పారు. -
రేపే సమైక్య శంఖారావం సభ
-
సీమాంద్ర ఎంపీల రాజీనామాలపై స్పీకర్ స్పందన
-
సమ్మెను విరమింపచేసేందుకు ముఖ్యమంత్రి ఒత్తిడి!
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ గత 70 రోజులుగా సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నేతలు చేపట్టిన సమ్మెను విరమింప చేసేందుకు ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేపట్టినట్టు తెలుస్తోంది. మంగళవారం ఉదయం సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సమ్మె విరమించాలని ఉద్యోగ సంఘాల నేతలపై ముఖ్యమంత్రి ఒత్తిడి తీసుకువచ్చినట్టు తెలిసింది. సోమవారం నాడు జరిగిన రాష్ట్ర కేబినెట్ ఉప సంఘ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలకు, రాష్ట్ర మంత్రులకు మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే సమ్మె చేస్తున్న నేతలపై మంత్రి కొండ్రు మురళి చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు మండిపడ్డ సంగతి తెలిసిందే. కేబినెట్ ఉపసంఘం సమావేశం తర్వాత అశోక్ బాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లయితే తాము సమ్మె విరమణపై ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలో సమ్మె విరమణకు ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఆసక్తి అన్నివర్గాల్లో నెలకొంది. -
'రామయ్యా'కు ఉద్యమ సెగ తప్పదా?
తెలంగాణ నోట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత సీమాంధ్ర ప్రాంతంలో పరిస్థితులు చేజారి పోయాయి. సీమాంధ్రలో ఉద్యమాల కారణంగా విద్యుత్, రవాణాతోపాటు ఇతర రంగాల్లో కూడా సంక్షోభాలు నెలకొన్నాయి. గత 70 రోజులుగా సీమాంధ్రలో ఉద్యమ ప్రబావం ఉవ్వెత్తున్న ఉన్న కారణంగా టాలీవుడ్ లో నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన భారీ బడ్జెట్, అగ్ర నటుల చిత్రాలు వాయిదా పడ్డాయి. సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితుల కారణంగా వాయిదాకు నోచుకోని అత్తారింటికి దారేది? చిత్రం లీక్ అయిందన్న వార్తలతో కొంత సానుభూతిని మూటకట్టుకొని ఉద్యమ సెగను దాటేసి.. ప్రేక్షకుల వద్దకు చేరుకుంది. అయితే అత్తారింటికి దారేది విడుదలకు పెద్దగా ప్రతిఘటన లేకపోవడంతో మిగితా భారీ బడ్జెట్ చిత్రాలు రామయ్యా వస్తావయ్యా.. ఎవడు చిత్రాలకు పెద్దగా అడ్డంకులు ఉండవని చిత్ర పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అయితే ఊహించని రీతీలో తెలంగాణపై కేంద్రం అడ్డగోలు నిర్ణయం తీసుకోవడంతో పరిస్థితిలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ నేపథ్యలో అక్టోబర్ 10 తేదిన విడదలయ్యే రామయ్యా వస్తావయ్యా చిత్ర విడుదలపై మళ్లీ సందేహాలు నెలకొన్నాయి. ప్రస్తుత పరిస్థితులను బేరిజు వేసుకున్న చిత్ర నిర్మాత దిల్ రాజు.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన రామయ్యా వస్తావయ్యా చిత్రాన్ని దసరా పండగకు విడుదల చేయాలనే భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతి దసరా పండుగ మాదిరిగానే బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని నిర్మాత దిల్ రాజు పరీక్షించుకునేందుకు సిద్దమవుతున్నట్టు సమాచారం. గతంలో దసరా పండగ సందర్భంగా దిల్ రాజు విడుదల చేసిన కొత్త బంగారు లోకం (2008), బృందావనం (2010) చిత్రాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇటీవల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ.. ప్రతి దసరా పండగ మాదిరిగానే ఈ సంవత్సరం కూడా తనకు భారీ విజయం దక్కబోతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అయితే రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు చిత్రాల విడుదలకు అనుకూలంగా లేదనది వాస్తవమే. అయితే సీమాంధ్రలో నెలకొన్న ఉద్యమ ప్రభావాన్ని తట్టుకుని రామయ్యా వస్తావయ్యా చిత్రం విడుదల సాధ్యమేనా.. ఒకవేళ నిర్మాతలు విడుదల చేయాలనే నిర్ణయంతో ముందుకు వెళితే.. ఆ చిత్ర ప్రదర్శన సజావుగా సాగుతుందా అనే ప్రశ్నలు పరిశ్రమలో తెలెత్తుతున్నాయి. ఉద్యమ సెగను తట్టుకుని ఏ విధంగా అడ్డంకులను ఎదుర్కొని రామయ్యా వస్తావయ్యా విడుదలవుతుందో వేచి చూడాల్సిందే! -
తెలంగాణ నోట్ రెడీ.
-
సాయంత్రం అయిదు గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం
-
తెలంగాణ నోట్‌పై కేంద్ర కేబినెట్ దృష్టి?
-
తెలంగాణ నోట్‌పై కేంద్ర కేబినెట్ దృష్టి?
న్యూఢిల్లీ : తెలంగాణ అంశంపై కేంద్ర కేబినెట్ మరోసారి దృష్టి సారించనుంది. సీమాంధ్రలో సమైక్య ఉద్యమం హోరెత్తుతున్న వేళ తెలంగాణ నోట్‌ను పెండింగ్‌లో పెట్టిన కేంద్ర మంత్రివర్గం.... ఇప్పుడు పూర్తి స్థాయిలో పరిశీలించనుందనే వార్తలు జాతీయ మీడియాలో హోరెత్తుతున్నాయి. ఈ మేరకు ఇవాళ సాయంత్రం అయిదున్నరకు కేంద్ర కేబినెట్ సమావేశమవుతుందని నేషనల్ మీడియా పేర్కొంటోంది. టేబుల్ ఎజెండా రూపంలో తెలంగాణ నోట్... కేబినెట్ సమావేశంలో చర్చకు రానున్నట్లు సమాచారం. తెలంగాణపై హోంశాఖ రూపొందించిన ముసాయిదా నోట్ ఈ సమావేశానికి వస్తుందని, ఇందుకు సంబంధించి కేంద్రంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయని తెలిపింది. కేబినెట్లో ఆమోదించిన తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపిస్తారని, ఆ తర్వాత వారం, పది రోజుల్లో అసెంబ్లీకి పంపించే దిశగా కసరత్తు సాగుతోందని నేషనల్ ఛానెల్‌లు పేర్కొంటున్నాయి. సీమాంధ్రలో వెల్లువెత్తుతున్న ఆందోళనలు, సీఎం కిరణ్ వ్యవహారశైలి తదితర అంశాలను కూడా కేంద్రం, కాంగ్రెస్ అధిష్ఠానం నిశితంగా పరిశీలిస్తున్నాయని ఆ ఛానెళ్లు వెల్లడిస్తున్నాయి. తెలంగాణ అంశానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రధాని మన్మోహన్సింగ్ చేసిన వ్యాఖ్యలు జాతీయ మీడియా కథనాలకు బలం చేకూరుస్తున్నాయి. -
సీమాంధ్ర ఉద్యమానికి సీఎం క్యాంపు కార్యాలయమే వేదిక
సీమాంధ్ర ఉద్యమానికి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయమే వేదికగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం బర్కత్‌పురలోని బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయంలో కాచిగూడ కార్పొరేటర్ కన్నె ఉమారాణి అధ్యక్షతన జరిగిన డివిజన్ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీది మోసాల చరిత్ర అని, నమ్మించి వంచించటం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయటానికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసి చేతులు దులుపుకుందని ఆరోపించారు. సీమాంధ్రలో జరిగే ఉద్యమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అండదండలున్నాయని, సాక్షాత్తూ సీఎం కిరణే తన కార్యాలయం నుంచి ఆ ఉద్యమాన్ని ఉసిగొల్పటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. అధిష్టానం తెలంగాణ ప్రకటన చేస్తే అందుకు భిన్నంగా కిరణ్ సీమాంధ్ర ఉద్యమానికి నేతృత్వం వహించటంలో అంతర్యమేమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. యాభై రోజులు గడుస్తున్నా ఇచ్చిన ప్రకటనకు రూపులేదని, హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, వీరప్పమొయిలీ, అహ్మద్‌పటేల్, దిగ్విజయ్‌సింగ్‌లతో మాట్లాడించి ప్రజలను అయోమయానికి గురిచేస్తూ రెండు ప్రాంతాల్లో అనిశ్చిత పరిస్థితికి కాంగ్రెస్ కారణమైందని మండిపడ్డారు. సమావేశంలో పార్టీ గ్రేటర్ కార్యదర్శి కన్నె రమేశ్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు బండారి సంతోశ్ కుమార్, కె.నర్సింగ్ యాదవ్, సల్లా నరేందర్, సుభాశ్ పటేల్, బి.భీమ్రాజ్, సూలం రవియాదవ్, ఓంప్రకాశ్, మల్లికార్జున్, ప్రతిభ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
మీరు చేస్తున్నదే ఉద్యమమా?: బొత్స
హైదరాబాద్ : సీమాంధ్ర మంత్రులకు సమైక్య సెగ తగిలింది. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం బయటకు వచ్చిన సీమాంధ్ర మంత్రులను .... ఆ ప్రాంత సచివాలయ ఉద్యోగుల ఫోరం ఆధ్వర్యంలో మంత్రులను అడ్డుకున్నారు. సమైక్య రాష్ట్రం కోసం మంత్రులు రాజీనామాలు చేసి తమతో కలిసి ఉద్యమించాలని కోరారు. సీమాంధ్ర ప్రజలు రోడ్లమీదకు వచ్చి ఉద్యమిస్తున్నారని.... మంత్రులు కూడా తమతో కలవాలని ఉద్యోగులు కోరగా.... పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కొద్దిగా అసహనం ప్రదర్శించారు. మీరు చేస్తున్నదే ఉద్యమమా అని ప్రశ్నించారు. తాము కూడా సమైక్య రాష్ట్రం కోసం కృషి చేస్తున్నామని బొత్స తెలిపారు. -
విద్యుత్‌సౌధలో పోటాపోటీ ప్రదర్శనలు
-
ఉద్యమానికి సీఎం కన్వీనర్, డీజీపీ కో కన్వీనర్
కరీంనగర్ : కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ మరోసారి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కన్వీనర్‌గా, డీజీపీ దినేష్ రెడ్డి కో కన్వీనర్‌గా సీమాంధ్ర ఉద్యమాన్ని నడిపిస్తున్నారని ఆయన గురువారమిక్కడ ఆరోపించారు. సుప్రీంకోర్టులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీజీపీ దినేష్ రెడ్డి పదవిలో కొనసాగటం అనైతికమని పొన్నం వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనపై నిర్ణయం జరిగిపోయిందని, ఎన్ని ఉద్యమాలు, ఆందోళనలు చేసినా ఉపయోగముండదని ఆయన అన్నారు. సీమాంధ్ర ఉద్యమాలపై ముఖ్యమంత్రి పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్నారని పొన్నం విమర్శించారు. -
కాంగ్రెస్ అధిష్టానానికి కిశోర్‌చంద్రదేవ్ లేఖలు
తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఉద్యమం చేపట్టిన ఏపీ ఎన్జీవోలు, ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరపాలని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ బుధవారం లేఖలు రాశారు. రాష్ట్ర విభజనతో నష్టపోతామని వారంతా ఆందోళన చెందుతున్నారని తెలిపారు. సీమాంధ్ర ఉద్యమంతో ఒకటిన్నర మాసాలుగా ప్రభుత్వం, పాలనా యంత్రాంగం పూర్తిగా స్థంభించిపోయాయని వివరించారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభను లేఖలో ప్రస్థావించారు. ఈ మేరకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, రక్షణ మంత్రి ఆంటోనీ, హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌లకు మంత్రి విడివిడిగా లేఖలు రాశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో ఎన్జీవో సంఘం నేతలు ఎలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలూ చేయలేదని, హుందాగా వ్యవహరించారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో అంతర్భాగమైన ఎన్జీవోల సభ విజయవంతం కావడం మొత్తం ఆంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలకు, విభజనపై వారిలో వ్యక్తమవుతున్న భయాందోళనలకు అద్దం పట్టిందని వివరించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏపీ ఎన్జీవోలు, ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరపాలని అధిష్టానం పెద్దలకు విజ్ఞప్తి చేశారు. -
హైదరాబాద్ యూటీ చిరంజీవి వ్యక్తిగతం: ఎంపీ అనంత
తామందరం సమైక్యరాష్ట్రానికే కట్టుబడి ఉన్నామని అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనేది చిరంజీవి వ్యక్తిగత అభిప్రాయని చెప్పారు. మూడు ప్రాంతాల ప్రజలు కలిసి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లును అడ్డుకుంటామని ఆయన చెప్పారు. సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనపై రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన ప్రకటనను వెనక్కు తీసుకుంటున్నట్లు ‘కేంద్ర ప్రభుత్వం’ స్పష్టమైన హామీ ఇచ్చేవరకు పార్లమెంటులో నిరసనలు ఆపబోమని అంతకుముందు అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. సీమాంధ్రలో ఉద్యమం తీవ్రంగా ఉందని ఆయన తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో అన్నివర్గాల వారు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. సీమాంధ్రలో కొనసాగుతున్న ప్రజా ఉద్యమాన్ని జాతీయ పార్టీలు గుర్తించాయన్నారు. -
అందరూ అంగీకరించాకే విభజన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకొనే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షునితో సహా రాష్ట్రంలోని రెండు ప్రాంతాలకు చెందిన కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులంతా అంగీకరించారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ స్పష్టంచేశారు. మంగళవారం రాత్రి ఇక్కడ ఆంటోనీ కమిటీతో తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యుల సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. గత రెండేళ్లుగా సాగించిన విస్తృతస్థాయి సంప్రదింపులు, అన్ని రాజకీయ పార్టీల అంగీకారం తర్వాతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయం తీసుకుందని పునరుద్ఘాటించారు. అయితే, తొలుత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థించిన టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు మాటపై నిలబడకుండా వెనక్కు తగ్గుతున్నాయని ఆయన ఆరోపించారు. తమను సంప్రదించకుండా కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా, హడావుడిగా నిర్ణయం తీసుకొన్నదని బీజేపీ సీనియర్ నేత అద్వానీ వ్యాఖ్యానించినట్లు మీడియాలో చూశానన్న దిగ్విజయ్... ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీ రాసిన లేఖను అద్వానీ ఎందుకు పరిగణనలోకి తీసుకోరని ప్రశ్నించారు. విభజన నిర్ణయాన్ని సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం... తాను గతంలో చేసిన సూచనలను పట్టించుకోకుండా, తమను సంప్రదించకుండానే అధిష్టానం నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ విమర్శించడాన్ని ప్రస్తావించగా... రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నేతలూ అధిష్టానం నిర్ణయానికి బద్ధులమై ఉంటామని వాగ్దానం చేశారని గుర్తు చేశారు. ఆంటోనీ కమిటీతో గురువారం కొన్ని రాజకీయేతర సంఘాల ప్రతినిధులు, ఇతరులు సమావేశం కావాల్సి ఉన్నప్పటికీ శ్రీకృష్ణ జన్మాష్టమి కావడంతో వాయిదా పడినట్లు చెప్పారు. వచ్చే నెల మూడోతేదీన తిరిగి సమావేశం కానున్న కమిటీ ఆ రోజున రావాల్సిందిగా వారిని ఆహ్వానించిందని ఆయన తెలిపారు. -
జననేత దీక్షకు మద్దతుగా 'అనంత' ఆందోళన
జైల్లో వైఎస్ జగన్ చేస్తున్న నిరవధిక నిరాహారదీక్షకు మద్దతుగా అనంతపురం జిల్లాలో దీక్షలు కొనసాగుతున్నాయి. కళ్యాణ దుర్గంలో గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ ఎల్ఎమ్ మోహన్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష 3వ రోజుకు చేరింది. కదిరిలో మాజీ మంత్రి షాకీర్, సుధాకర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. తాడిపత్రిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త విఆర్ రాంరెడ్డి ఆమరణ దీక్ష రెండో రోజుకు చేరింది. జిల్లా వ్యాప్తంగా 34 మంది జగన్ అభిమానుల దీక్షలు కొనసాగిస్తున్నారు. ధర్మవరం, గుంతకల్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ల ఆమరణ దీక్షలు కొనసాగుతున్నాయి. జగన్ దీక్షకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రహదారుల దిగ్బంధం చేపట్టారు. -
ఒకే జాతి.. ఒక్కటే రాష్ట్రం
ఒకే జాతి.. ఒక్కటే రాష్ట్రం అనే నినాదంతో వెల్లువెత్తిన సమైక్యాంధ్ర పరిరక్షణ పోరాటం ఇసుమంతైనా సడలకుండా జోరుగా సాగుతోంది. 24రోజుల కిందట సీమాంధ్రలో ఎగసిన సమైక్యఉద్యమం రోజురోజుకూ బలపడుతూ తీవ్రతరమవుతోంది. సకలజనుల సమ్మెతో జీవనం స్తంభిస్తున్నా ప్రజలు ఏమాత్రం లెక్కచేయక సమైక్యమే లక్ష్యంగా ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. రాజకీయపార్టీలు, కులాలు, వర్గాలకతీతంగా జనం స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి వినూత్నరీతిల్లో సమైక్యభావనను ప్రకటిస్తున్నారు. - సాక్షి నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్‌ను యథాతథంగా ఉండాలనే డిమాండ్‌తో రోజూ మాదిరిగానే శుక్రవారం కూడా కోస్తా, రాయలసీమ జిల్లాలు ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరసన ప్రదర్శనలతో దద్దరిల్లాయి. సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించటానికి ఈ నెల 27న సీమాంధ్రలోని 13 జిల్లాల విద్యార్థి జేఏసీ నేతలు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోసమావే శం కానున్నారు. తాడేపల్లిగూడెంలో 72 గంటల బంద్‌లో భాగంగా రెండో రోజు శుక్రవారం బంద్ సంపూర్ణంగా సాగింది. విద్యుత్ ఉద్యోగులు బైక్ ర్యాలీ చేసి ఆశ్రం ఆస్పత్రి సమీపంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. టీడీపీ నేత, మాజీ మంత్రి మాగంటి బాబు భీమవరంలో వైఎస్సార్ సీపీ దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో జరిగిన రాజీవ్ విద్యామిషన్ వీడియో కాన్ఫరెన్స్‌ను జేఏసీ నేతలు అడ్డుకున్నారు. కలిగిరిలో జరుగుతున్న రిలే దీక్షలలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. రోడ్లు ఊడ్చిన న్యాయవాదులు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రాష్ట్ర విభజనను నిరసిస్తూ న్యాయవాదులు పుష్కరాల రేవు వద్ద రోడ్లు ఊడ్చారు. కాకినాడలో న్యాయశాఖ ఉద్యోగులు కోర్టు వద్ద వినూత్నంగా గంజి వార్పు కార్యక్రమం చేపట్టి గంజి తాగారు. రాష్ట్ర విభజన చేపడితే తమకు గంజే గతి అంటూ నిరసన తెలిపారు. జిల్లావ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ మండల గోదాముల్లో పనిచేసే హమాలీలు శుక్రవారం నుంచి ఈ నెల 26 వరకూ విధులు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. యూటీఎఫ్ సమైక్యాంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదంటూ ఏలేశ్వరంలో 16మంది ఉపాధ్యాయులు ఆ సంఘానికి రాజీనామా చేశారు. ఐదు కిలోమీటర్ల పొడవున వాహనాల ర్యాలీ కోనసీమ ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్ల జేఏసీ అమలాపురంలో ఆటోలు, మినీ వ్యాన్లు, లారీలు, ట్యాక్సీలు, ఆర్టీసీ అద్దెబస్సులు, ఇతర వాహనాలతో భారీ ర్యాలీ చేపట్టింది. సుమారు ఐదు కిలోమీటర్ల పొడవున వాహనాలు సాగాయి. పిఠాపురంలో జేఏసీ ఆధ్వర్యంలో రహదారులు దిగ్బంధం చేసి బంద్ పాటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ వరుపుల సుబ్బారావు ఏలేశ్వరం బాలాజీ సెంటర్లో అర్ధనగ్నంగా నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. రాజానగరంలో సమైక్యవాదులు మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను ఉద్యమంవైపు నడిపిస్తున్న అధికారులు వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో అధికారులు స్వయంగా రంగంలోకి దిగి గ్రామాల్లో పర్యటిస్తూ సమైక్య ఉద్యమంలో పాల్గొనేలా ప్రజలను చైతన్య పరుస్తున్నారు. శుక్రవారం సాయంత్రం జమ్మలమడుగు మండల పరిధిలోని మోరగుడి, ఎస్.ఉప్పలపాడు గ్రామాల్లో తహశీల్దార్ శివరామయ్య, ఎంపీడీఓ మల్లయ్య, ఎంఈఓ గంగిరెడ్డి, వ్యవసాయాశాఖాధికారి రాంమోహన్‌రెడ్డి పర్యటించి రాష్ట్ర విభజన వల్ల జరిగే పరిణామాలు, నష్టాల గురించి ప్రజలకు వివరించారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఇటువంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. నల్లదుస్తులతో వైద్యుల నిరసన విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రి వైద్యులు నల్ల దుస్తులు వేసుకొని నిరసన వ్యక్తం చేశారు. ఎన్జీఓ జేఏసీ ఆధ్వర్యంలో కోట జంక్షన్ వద్ద 10 వేల మంది ఉద్యోగులు,విద్యార్థులు సమైక్య నినాదాలతో హోరెత్తించారు. గెజిటెడ్ ఉద్యోగులు కలెక్టరేట్ జంక్షన్లో ఒంటికాలిపై నిలుచొని నిరసన తెలిపారు. ముస్లింల శాంతి యాత్ర కర్నూలు నగరంలో ముస్లిం ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలో శాంతి యాత్ర చేపట్టారు. నగరంలోని వివిధ కాలనీల నుంచి భారీగా తరలివచ్చిన ముస్లిం యువకులు.. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ అసెంబ్లీ ఆహూతులను ఆకట్టుకుంది. ఉద్యోగానికి రాజీనామా చేసిన వాణిజ్యపన్నుల శాఖ డీసీ వాణిజ్యపన్నుల శాఖ డీసీ వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం.లింగారెడ్డి ఉద్యోగానికి రాజీనామా చేసి సమైక్యాందోళనలో పాల్గొన్నారు. నందికొట్కూరు నియోజకవర్గం అల్లూరు గ్రామానికి చెందిన లింగారెడ్డి.. హైదరాబాద్‌లోని వాణిజ్య పన్నుల శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. మరో మూడేళ్ల పాటు సర్వీసు ఉన్నప్పటికీ రాష్ట్ర విభజన నిర్ణయంతో మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో విద్యుత్ ఉద్యోగులు రోడ్డుకు అడ్డంగా పడుకొని వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. వేలాదిమంది విద్యార్ధులు బెజవాడ బెంజిసర్కిల్ వద్ద మానవహారం చేపట్టడంతో ట్రాఫిక్ స్తంభించింది. పర్యాటక హోటళ్లు మూత విశాఖ జిల్లా అరకులో గిరిజన మ్యూజియం, గిరిజన గార్డెన్ మూసివేశారు. ఎక్కడికక్కడ పర్యాటక హోటళ్లు మూతపడ్డాయి. దీంతో అరకులో పర్యాటకం పూర్తిగా పడకేసింది. పాడేరు పట్టణంలో ఎన్జీవోలు బిక్షాటన చేశారు. విశాఖలో ఆరు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడును కేజీహెచ్‌కు తరలించారు. చిత్తూరు ఎమ్మెల్యే సీకేబాబు మహాపాదయాత్ర శుక్రవారం తిరుపతికి చేరుకుంది. ఏడుగంటలపాటు హైవేపై వాహనాల అడ్డగింత చంద్రగిరిలో 36 గంటలపాటు బంద్ కొనసాగింది. జాతీయ రహదారిలో 7 గంటలపాటు రాకపోకలను అడ్డుకున్నారు. అనంతపురంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థులకు రోడ్లపైనే చదువులు చెప్పి..నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆర్టీసీ కార్మికులు బైక్‌ర్యాలీ చేయగా, వినుకొండలో ఏపీఎన్జీవోస్ సమైక్య జేఏసీ కాగడాల ప్రదర్శన నిర్వహించింది. తెనాలిలో మున్సిపల్ కమిషనర్ల సమావేశం జరగ్గా.. తాము కూడా ఉద్యోగుల సమ్మెకు సంఘీభావంగా విధులు బహిష్కరించాలని తీర్మానించారు. ప్రకాశం జిల్లా ఒంగోలుకలెక్టరేట్ వద్ద అన్ని ప్రభుత్వవిభాగాల ఉద్యోగులు ధర్నా చేపట్టారు. విభజన కలతతో మరో 9మంది మృత్యువాత తూ.గో.జిల్లాలో ఉరేసుకుని యువకుడి బలవన్మరణం సాక్షి నెట్వర్క్: రాష్ర్టం ముక్కలవుతుందనే భయంతో ప్రాణాలొదిలేస్తున్న వారి సంఖ్య ఇంకా తగ్గడం లేదు. శుక్రవారం ఒక్కరోజే సీమాంధ్ర జిల్లాల్లో గుండెపోటుతో ఎనిమిదిమంది మృత్యువాతపడగా, తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం కూనవరం గ్రామానికి చెందిన లంకే సత్తిబాబు (27) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆటో డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషిస్తున్న సత్తిబాబుకు తల్లిదండ్రులు, భార్య, ఏడాదిన్నర పాప ఉన్నారు. భార్య ప్రస్తుతం గర్భిణిగా ఉంది. రాష్ట్ర విభజనను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటానంటూ చెప్పిన సత్తిబాబు చివరికి అన్నంత పనీ చేశాడని స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా అమడగూరులో గుండం హరి(37), కనగానపల్లె మండలం పర్వతదేవరపల్లెకు చెందిన నారాయణప్ప (50) రాష్ట్ర విభజనను తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందారు. సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్న ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఉద్యోగి డీవీ ఇంద్రశేఖర్ (54) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. నరసాపురం మండలం ఎల్బీ చర్ల గ్రామానికి చెందిన అడ్డాల రామలక్ష్మి (51) విభజన వార్తలు చూస్తూ గుండె ఆగి మరణించింది. ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన కల్లూరి శ్రీనివాసరావు (33) రాష్ట్రం విడిపోతే పిల్లల భవిష్యత్ దెబ్బతింటుందన్న బెంగతో గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచాడు. వైఎస్సార్ జిల్లా చక్రాయపేట మండలం కొండప్పగారిపల్లెకు చెందిన సమైక్యవాది లేబాకు వెంకటేశు(35) శుక్రవారం టీవీ చూస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. వెంకటేశు మృతితో శనివారం జరగాల్సిన అతని చెల్లెలు దామోదరమ్మ వివాహం ఆగిపోయింది. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం వనదుర్గాపురం గ్రామానికి చెందిన రమణ య్య(33) శుక్రవారం ఇంట్లో టీవీలో సమైక్యఉద్యమం.. విభజన నేపథ్యం వార్తలు ఉద్వేగానికి లోనై అక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఆత్మకూరు డిపో గ్యారేజ్ ఇన్చార్జ్ వెంకటేశ్వర్లు(54) శుక్రవారం రాత్రి కర్నూలు జిల్లా ఆదోనిలో గుండె పోటుతో మృతి చెందారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో తీవ్ర వేదనకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ నేతలపై జనాగ్రహం సాక్షి నెట్వర్క్: వేర్పాటు ప్రకటన వచ్చిన దరిమిలా కాంగ్రెస్, టీడీపీ నేతలపై వ్యక్తమవుతున్న జనాగ్రహం ఇప్పట్లో చల్లారేలా లేదు. శుక్రవారం సీమాంధ్రలోని పలు జిల్లాల్లో కాంగ్రెస్, టీడీపీ నేతలను సమైక్యవాదులు అడ్డుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో టీడీపీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావును అడ్డుకుని ఇంకా రాజీనామా చేయనందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలో సోనియా, దిగ్విజయ్, కేసీఆర్, బొత్స, కిల్లికృపారాణి, పళ్లంరాజు, రాహుల్, చిరంజీవి మాస్కులు ధరించిన వారిని కర్రలతో కొడుతూ, కాళ్లతో తంతూ సమైక్యవాదులు నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో న్యాయవాదులు సోనియా చిత్రపటాన్ని కొరడాతో కొట్టి నిరసన తెలిపారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ దిష్టి బొమ్మకు శవ యాత్ర నిర్వహించి దహనం చేశారు. శ్రీకాకుళం రిమ్స్ వైద్యాధికారులు, ఉద్యోగులు పట్టణంలోని డేఅండ్‌నైట్ కూడలి వద్ద సోనియా, కేసీఆర్ వేషధారణలతో ఉన్న వ్యక్తులను స్ట్రెచర్‌పై తీసుకొచ్చి మెదడు, మోకాలు శస్త్ర చికిత్సలు చేస్తున్నట్టు ప్రదర్శన నిర్వహించారు. ఆంటోనీ కమిటీ అనుకూలంగా లేకుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: కావూరి శుక్రవారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి వచ్చిన కేంద్రమంత్రి కావూరి సాంబశివరావును సమైక్యవాదులు అడ్డుకుని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు కావూరి స్పందిస్తూ తాను ఎప్పుడూ సమైక్యవాదినేనని, ఆంటోని కమిటీ సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం వెలువరించకుంటే వెంటనే రాజీనామా చేస్తానని చెప్పడంతో నిరసనకారులు శాంతించారు. తొలుత ఆయన తిరుమలలో విలేకరులతో మాట్లాడుతూ ఎన్జీవోల సమ్మెను తాను సమర్థిస్తున్నానన్నారు. విభజన దుష్పరిణామాలను వివరించడంవల్ల కేంద్రం పునరాలోచనలో పడిందన్నారు. ఉద్యమకారులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అనుచరుల దాడి సమైక్యాంధ్ర ఉద్యమకారులపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు అనుచరులు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరులో ధర్నా చేపట్టిన ఉపాధ్యాయులకు సంఘీభావం పలికేందుకు ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు రాగా, రాజీనామా చేసిన తర్వాతే ఉద్యమంలో పాల్గొనాలని ఆయనకు సమైక్యవాదులు సూచించారు. దీంతో రెచ్చిపోయిన బత్యాల అనుచరులు శ్రీనివాసరాజు అనే సమైక్యవాదిపై పిడిగుద్దులతో చితకబాదారు. ఇదంతా చూస్తున్నా ఎమ్మెల్సీ వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. కాగా, ఈ దాడిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి నుంచి వెళ్లే ప్రైవేటు బస్సులు బంద్ సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతి నుంచి వివిధ పట్టణాలకు వెళ్లే ప్రైవేటు బస్సులనూ శనివారం నుంచి రద్దు చేసినట్లు శ్రీవెంకటేశ్వర ట్రావెల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బీ.మునిరాజా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం సమైక్యాంధ్ర ఉద్యమ జేఏసీ నేతలు శ్రీకాంత్‌రెడ్డి, అవుల ప్రభాకర్, చల్లా చంద్రయ్య ట్రావెల్స్ అసోసియేషన్ నాయకులతో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి నుంచి బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై వెళ్లే ప్రైవేటు బస్సుల టికెట్లు రిజర్వేషన్ చేయకుండా నిలుపుదల చేసినట్లు వెల్లడించారు. ఎవరైనా ముందస్తుగా ఆయా నగరాలకు టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకుని ఉంటే వెంటనే రద్దు చేసుకోవాలని కోరారు. -
సమ్మె విరమణకు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నో
సీమాంధ్ర ప్రాంతంలో సమ్మె విరమణకు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నిరాకరించింది. సమ్మె విరమించాలంటూ రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన విన్నపాన్ని తిరస్కరించింది. మంత్రి బొత్స శుక్రవారం రాత్రి యూనియన్ ప్రతినిధి బృందంతో తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్, ఈడీ వెంకటేశ్వరరావు, యూనియన్ ప్రతినిధులు పద్మాకర్, సోమరాజు, దామోదరరావు, ప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో ప్రజల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని సమ్మెను విరమించాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. దీనికి తాము సమ్మతించలేదని యూనియన్ ప్రధాన కార్యదర్శి పద్మాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీ నష్టాలు, అప్పులు రూ. 5 వేల కోట్లకు చేరిన దృష్ట్యా వాటిని ప్రభుత్వమే భరించి రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను ఆదుకోవాలని మంత్రిని కోరినట్టు వెల్లడించారు. సీమాంధ్ర సమ్మె వల్ల ఆర్టీసీకి రూ. 200 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని ఎండీ ఏకే ఖాన్ వెల్లడించారు. రోజూ రూ. 13 కోట్లకుపైగా ఆర్టీసీకి నష్టం వస్తోందని తెలిపారు. దీంతో ఉద్యోగులు, కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని క్లిష్ట పరిస్థితుల్లో ఆర్టీసీ ఉందని చెప్పారు. -
హైదరాబాద్ సీమాంధ్రులదే: భూమన
సాక్షి, తిరుపతి : సీమాంధ్రుల రెక్కల కష్టంతో వచ్చిన నగరమే భాగ్యనగరమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పేర్కొన్నారు. విభజన ప్రకటనకు వ్యతిరేకంగా తిరుపతి అన్నమయ్య సర్కిల్ వద్ద సోమవారం వేలాది మందితో నిరసన సభ జరిగింది. ఈ సభలో కరుణాకరరెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర నుంచి వచ్చిన కప్పాల ద్వారా నాటి నిజాం నవాబులు హైదరాబాద్ నిర్మించారనే విషయం చరిత్ర చెబుతోందన్నారు. హైదరాబాద్ నిర్మాణంలో పాలు పంచుకున్న కూలీలు కూడా సీమాంధ్రులేనని తెలిపారు. కాగా, ఎన్నో కష్టాలను దిగమింగుకొని పట్టు విడవని ఝాన్సీ లక్ష్మీబాయిలా విజయమ్మ దీక్ష చేపట్టారని భూమన అన్నారు. ఆమెకు ఏడుకోట్ల మంది ప్రజలు అండగా ఉన్నారన్నారు. -
‘పోర్టుబంద్’తో స్తంభించిన విశాఖపట్నం పోర్టు
సమైకాంధ్ర మద్దతుగా పోర్టులోని వివిధ సంఘాలు చేపట్టిన ‘పోర్టుబంద్’ విజయవంతమైంది. పోర్టులో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. రవాణా, ఎగుమతి, దిగుమతుల్లో కీలకపాత్ర వహించే టిప్పర్లు, ట్రక్కులు, లారీలు, క్రేన్లు, బుల్డోజర్లు ఎక్కడవి అక్కడే నిలిచిపోయాయి. బంద్ కారణంగా పోర్టు యూజర్స్‌కు సుమారు రూ.15 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ‘జై సమైకాంధ్ర’ నినాదాలతో పోర్టు దద్దరిల్లిపోయింది. విశాఖపట్నం స్టీవ్ డోర్స్ అసోసియేషన్, స్టీవ్డోర్స్, కస్టమ్స్ హౌస్ ఏజెంట్స్, స్టీంషిప్ ఏజెంట్స్, పోర్టుయూజర్స్, టిప్పర్ ఆపరేటర్స్, ట్రైలర్ ఆపరేటర్స్, ట్రక్ ఆపరేటర్స్, వేర్‌హౌస్ ఆపరేటర్స్ తదితర ఎనిమిది సంఘాల ఆధ్వర్యంలో సోమవారం పోర్టు బంద్ జరిగింది. రవాణా వ్యవస్థతో పాటు పోర్టులోని అన్ని కార్యకలాపాలను స్తంభింపచేసి భారీ ఆందోళనలు, నిరసనలకు చేపట్టారు. సమైకాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. ఎంతటి త్యాగాలకైనా సిద్ధమని ప్రకటించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. -
ఆహా.. ఏం డ్రామాలు!
* కాంగ్రెస్, టీడీపీ నేతలపై వాసిరెడ్డి పద్మ ధ్వజం * అడ్డగోలు విభజన గురించి ముందే తెలిసినా నోరు తెరవలేదు * వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినప్పుడే * అందరూ చేస్తే రాష్ట్ర విభజన ఆగేది కాదా? * ప్రజా ఉద్యమాన్ని సొమ్ము చేసుకునేందుకు కాంగ్రెస్ నాటకాలు * సోనియా పర్యవేక్షణలో ఆ పార్టీ సూపర్ డైరెక్షన్ * కొత్త పార్టీ అంటూ ప్రజలను మభ్యపెట్టే యత్నం * చంద్రబాబు వైఖరే సీమాంధ్రకు ఉరితాడైంది సాక్షి, హైదరాబాద్: అడ్డగోలుగా రాష్ట్ర విభజన జరుగుతోందని ముందుగా తెలిసినా నోరువిప్పని కాంగ్రెస్, టీడీపీ నేతలు ఇప్పుడు సీమాంధ్రలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ప్రజా ఉద్యమాన్ని సొమ్ము చేసుకునేందుకు సరికొత్త డ్రామాలు ఆడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. అడ్డగోలు పద్ధతిలో విభజన జరగబోతోందని స్పష్టంగా తెలియగానే ముందుగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని, అదే బాటలో కాంగ్రెస్, టీడీపీ నేతలు కూడా పయనించి ఉంటే ఈ అడ్డగోలు విభజన ఆగిపోయి ఉండేది కాదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు సీమాంధ్రలో తీవ్రమైన ఉద్యమ సెగ తమ కుర్చీలను తాకేటప్పటికి సరికొత్త డ్రామాలకు తెర తీస్తున్నారని ఆమె విమర్శించారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పద్మ మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో సమావేశమై ఒక బ్రహ్మాండమైన రాజకీయ నాటకం ఆడారని పద్మ విమర్శించారు. ‘సమావేశంలో పాల్గొన్న కొందరేమో కాంగ్రెస్ అధిష్టానవర్గానికి మద్దతుగా మాట్లాడతారు.. ఇంకొందరేమో విమర్శిస్తూ మాట్లాడతారు.. మరికొందరు విమర్శించే వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తారు... ఆ..హహహా..! ఒకే పార్టీలో ఎన్ని గ్రూపులు, ఎందరు పాత్రధారులు.. ఎంతమంది నటీనటులు, ఇంతకంటే సూపర్ డెరైక్షన్ మరొకటి ఉంటుందా? ఇలాంటి డైరె క్షన్ ఒక్క కాంగ్రెస్ పార్టీనే ఇవ్వగలదు. ఈ డ్రామా అంతా సోనియాగాంధీ కనుసన్నల్లో జరగడం లేదా?’ అని ఆమె ప్రశ్నించారు. వీళ్లంతా రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడ్డానికి ముందు సోనియా మాటను తాము శిరసావహిస్తామని చెప్పినవారేనని అన్నారు. అప్పుడలా శిరసావహించే ఈ రోజు డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. అలాకాని పక్షంలో సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిన రోజునే ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేసి ఉండాలని పద్మ పేర్కొన్నారు. ఒక ముఖ్యమంత్రిగా తన అభిప్రాయానికి విలువ లేనప్పుడు ఆయనకు ఏ మాత్రం చీము, నెత్తురు ఉన్నా రాజీనామా లేఖ ఇచ్చి ఉండే వారని చెప్పారు. ఆరోజు సోనియా నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు కనుకనే ఆయన ఆ పని చేయలేదన్నారు. కానీ సీమాంధ్ర అగ్నిగుండం అవుతోందని గ్రహించాక, పదిరోజుల తర్వాత 10, జన్‌పథ్ ఆదేశాల మేరకు విలేకరుల సమావేశం నిర్వహించిన సీఎం సీమాంధ్ర ప్రజలపై ప్రేమను ఒలకబోశారని విమర్శించారు. మంత్రుల భార్యలకున్న చిత్తశుద్ధిని తాము స్వాగతిస్తున్నామని, మంత్రులు మాత్రం సోనియా మాటున దాక్కోవడాన్నే ప్రశ్నిస్తున్నామని పద్మ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే ప్రజలు ఓట్లు వేయరని, ఒక్క సీటు కూడా రాదనే భయంతో తాజాగా కొత్త పార్టీ అంటూ మరో డ్రామా మొదలుపెడుతున్నారని తెలిపారు. సీమాంధ్రులను ఢిల్లీలో తాకట్టు పెట్టి ఇక్కడ కొత్త పార్టీ పెడతామంటారా? అని ధ్వజమెత్తారు. ఇందిరాగాంధీ పేరు మీద పార్టీ పెడతామంటూ ప్రజలను మభ్య పెట్టే యోచన చేస్తున్నారని అన్నారు. ఉన్న పార్టీలో గంగిరెద్దులాగా తలూపి సీమాంధ్రులకు తీరని అన్యాయం చేసిన ఈ నేతలు కొత్త పార్టీ పెడతామంటే ప్రజలు మోసపోతారనుకుంటున్నారా? అని ఆమె ప్రశ్నించారు. గొడ్డలితో నరికేది మీరే...మళ్లీ ఆయింట్మెంట్ రాస్తున్నట్లుగా మాట్లాడేది మీరేనా...అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు, సీట్ల కోసం బాబు ఎత్తుగడలు కాంగ్రెస్‌కు వంత పాడుతూ డ్రామాలు ఆడుతున్న టీడీపీ నేతలను కూడా ప్రజలు క్షమించరని, చీపుర్లతో కాదు.. చెప్పులతో సన్మానిస్తారని పద్మ హెచ్చరించారు. విభజన నిర్ణయం వెలువడినప్పుడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కళ్లు రెండూ మూసుకుపోయినట్టుగా ఎందుకు వ్యవహరించారని నిలదీశారు. ప్రధానికి లేఖ రాస్తూ బాబు ఏకరువు పెట్టిన సమస్యలన్నిటినీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతకుముందే లేవనెత్తి భయాందోళనలు వ్యక్తం చేసిందని ఆమె గుర్తు చేశారు. విభజన నిర్ణయాన్ని స్వాగతించి నాలుగైదు లక్షల కోట్లు ఇస్తే కొత్త రాజధానిని నిర్మించుకుంటామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు సీమాంధ్రలో కొనసాగుతున్న ఉద్యమాన్ని చూశాక దీన్నుంచి ఎలా లబ్ధి పొందాలి, ఎలా ఓట్లు, సీట్లు సంపాదించాలనే ఎత్తుగడలు వేస్తున్నారని విమర్శించారు. విజయవాడలో దేవినేని ఉమామహేశ్వరరావుతో నిరాహారదీక్ష చేయించడం ఇందులో భాగమేనని ఆమె పేర్కొన్నారు. విజయమ్మ దీక్షకు కూర్చుంటున్నారన్న విషయం ఒకరోజు ముందే తెలుసుకున్న టీడీపీ నేతలు అప్పటికప్పుడు ఆయనతో అమరణదీక్ష చేయించాలనే నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ విషయం దేవినేని స్వయంగా వెల్లడించారని పద్మ చెప్పారు. విభజన నిర్ణయానికి ముందే టీడీపీ ఎమ్మెల్యేల చేత కూడా రాజీనామాలు చేయించి ఉంటే ఆ ప్రక్రియ ఆగిపోయేదని, ఢిల్లీలో ఎప్పుడో చక్రం తిప్పానని పదేపదే చెప్పుకునే బాబు ఎందుకు ఈ విషయంలో బొంగరం కూడా తిప్పలేకపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వైఖరే సీమాంధ్ర ప్రజల పాలిట ఉరితాడు అయిందని, కాంగ్రెస్, టీడీపీలు రెండూ కలిసి సీమాంధ్ర ప్రజలను బలిపీఠం ఎక్కించాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విభజన నిర్ణయం జరిగిన ఇన్ని రోజుల తరువాత డ్రామాలాడుతున్నవారికి విభజన జరిగితే సీమాంధ్ర ఎడారిగా మారుతుందనే జ్ఞానోదయం ఇప్పుడయ్యిందా? అడ్డగోలు విభజన నిర్ణయాన్ని ముందే గ్రహించి జూలై 25వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినప్పుడు కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు ముందుకు రాలేదు? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీయే ఎప్పటికప్పుడు గళ మెత్తింది.. సీమాంధ్రులకు జరుగుతున్న అన్యాయంపై ఎప్పటికప్పుడు గళం ఎత్తుతూ ముందున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని పద్మ తెలిపారు. అడ్డగోలుగా విభజన కసరత్తు జరుగుతోందని తెలిసి పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ సీమాంధ్ర ప్రజలకు జరిగే నష్టాలపై కేంద్ర హోంమంత్రి షిండేకు లేఖ రాశారన్నారు. ఆ తర్వాత పరిస్థితి చేజారుతున్నదని తెలిసి ఈ అన్యాయాన్ని ఆపేందుకు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని చెప్పారు. చివరకు పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, విజయమ్మలు కూడా తమ పదవులను త్యజించారని ఆమె వివరించారు. విజయమ్మ దీక్షతో ఉద్యమం మహోధృతం తెలుగు ప్రజలకు జరుగుతోన్న అన్యాయం చూస్తూంటే అన్నం కూడా సహించడం లేదనే బాధతో విజయమ్మ సోమవారం నుంచి గుంటూరులో చేపట్టనున్న ఆమరణ నిరాహారదీక్ష సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళుతుందని వాసిరెడ్డి పద్మ చెప్పారు. ‘‘కాంగ్రెస్ అధిష్టానం తెలుగు ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని వైఎస్సార్ సీపీ ముందుగానే పసిగట్టింది. షిండేకు విజయమ్మ లేఖ రాశారు. రాష్ట్రంలో ఏ పార్టీ కూడా మాట్లాడక ముందే, అడ్డగోలు విభజనను ఏదో ఒక రకంగా అడ్డుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. కానీ రాష్ట్రానికి అన్యాయం జరిగిపోయింది. రేపో, మాపో కేంద్రం నిర్ణయం తీసుకుని పార్లమెంటులో దూకుడుగా బిల్లు పెట్టబోతోంది. తెలుగు ప్రజలకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని చూస్తూ అన్నం తినడం మానవత్వం అనిపించుకోదనే ఉద్దేశంతో ప్రజల నేతగా, ప్రజల కోసం పనిచేసిన కుటుంబం నుంచి వచ్చిన నాయకురాలిగా విజయమ్మ ప్రాణాలను పణంగా పెడుతూ ఆమరణ నిరాహారదీక్షకు సిద్ధమయ్యారు. ఈ నెల 19 నుంచి జరిగే దీక్షను అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తొలుత విజయవాడలో దీక్ష చేయాలనుకుంటే ఎన్నికల నియమావళి ఉందని పోలీసులు అభ్యంతరం తెలిపారు. అవనిగడ్డ ఉప ఎన్నికల్లో పోటీ చేయని వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఎన్నికల నియమావళి ఎలా వర్తిస్తుందో ప్రభుత్వం చెప్పడం లేదు. అయినప్పటికీ ఉద్రిక్తతలు సృష్టించడం ఇష్టం లేక తెలుగు ప్రజల పట్ల గల బాధ్యతతో దీక్షా వేదికను విజయమ్మ గుంటూరుకు మార్చుకున్నారు. ఇప్పటికీ ప్రభుత్వం అడ్డుకుంటుందనే అనుమానాలున్నాయి. రాష్ట్ర విభజనలో జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడంలో తొలినుంచీ వైఎస్సార్ కాంగ్రెస్సే ముందుంది. ఇప్పుడు కూడా ముందంజలోనే ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. -
సీమాంధ్ర ప్రజలది స్వార్థ రాజకీయ ఉద్యమం కాదు
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో ప్రస్తుతం వెల్లువెత్తుతున్న ఆందోళన స్వార్థ రాజకీయ ఉద్యమం కాదని సీపీఐ పేర్కొంది. రాష్ట్ర విభజనతో తమకు అన్యాయం జరుగుతుందన్న భయాందోళనలతో విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ఉద్యోగులు రోడ్డెక్కారని అభిప్రాయపడింది. అయితే అందులో పాల్గొంటున్న రాజకీయ పార్టీల నేతలు మాత్రం ప్రజల్లో తమ పట్టు నిలుపుకునేందుకే ఉద్యమంలో చేరారని తెలిపింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ఆదివారమిక్కడ ఒక ప్రకటన విడుదల చేశారు. అఖిలపక్ష సమావేశంలో ఆయా పార్టీలు చెప్పిన అభిప్రాయాలకు వ్యతిరేకంగా విధానాన్ని మార్చుకుని అవకాశవాదాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాట మార్చకపోయినా ఆ పార్టీకి చెందిన కింది స్థాయి నాయకులు ఊగిసలాటలో పడ్డారని, వైఎస్సార్సీపీ కూడా మాట మార్చిందని అన్నారు. కాంగ్రెస్ నాయకులు పైకి ఎంత చెప్పినా.. అసలు ప్యాకేజీ ఏమిటో చెప్పడంలో విఫలమయ్యారని ఆరోపించారు. రాయలసీమకు నీటి సమస్య ప్రధానమైందని, శ్రీశైలం నుంచి నీరు రాకపోతే రాయలసీమ ప్రాంతానికి గడ్డు పరిస్థితి తప్పదని నారాయణ వివరించారు. నిరుద్యోగుల భయాందోళనలను పోగొట్టాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. అలాగే హైదరాబాద్‌లోని సీమాంధ్రుల భద్రతకు చట్టబద్ధ హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.