తెలంగాణ అంశంపై కేంద్ర కేబినెట్ మరోసారి దృష్టి సారించనుంది. సీమాంధ్రలో సమైక్య ఉద్యమం హోరెత్తుతున్న వేళ తెలంగాణ నోట్‌ను పెండింగ్‌లో పెట్టిన కేంద్ర మంత్రివర్గం.... ఇప్పుడు పూర్తి స్థాయిలో పరిశీలించనుందనే వార్తలు జాతీయ మీడియాలో హోరెత్తుతున్నాయి. ఈ మేరకు ఇవాళ సాయంత్రం అయిదున్నరకు కేంద్ర కేబినెట్ సమావేశమవుతుందని నేషనల్ మీడియా పేర్కొంటోంది. టేబుల్ ఎజెండా రూపంలో తెలంగాణ నోట్... కేబినెట్ సమావేశంలో చర్చకు రానున్నట్లు సమాచారం. తెలంగాణపై హోంశాఖ రూపొందించిన ముసాయిదా నోట్ ఈ సమావేశానికి వస్తుందని, ఇందుకు సంబంధించి కేంద్రంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయని తెలిపింది. కేబినెట్‌లో ఆమోదించిన తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపిస్తారని, ఆ తర్వాత వారం, పది రోజుల్లో అసెంబ్లీకి పంపించే దిశగా కసరత్తు సాగుతోందని నేషనల్ ఛానెల్లు పేర్కొంటున్నాయి. సీమాంధ్రలో వెల్లువెత్తుతున్న ఆందోళనలు, సీఎం కిరణ్ వ్యవహారశైలి తదితర అంశాలను కూడా కేంద్రం, కాంగ్రెస్ అధిష్ఠానం నిశితంగా పరిశీలిస్తున్నాయని ఆ ఛానెళ్లు వెల్లడిస్తున్నాయి. తెలంగాణ అంశానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రధాని మన్మోహన్‌సింగ్ చేసిన వ్యాఖ్యలు జాతీయ మీడియా కథనాలకు బలం చేకూరుస్తున్నాయి.
Published Thu, Oct 3 2013 9:20 AM | Last Updated on Thu, Mar 21 2024 9:10 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement