Telangana Note
-
మునిగిన నావకు కొత్త సారథెవరో?
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి గుంతకల్లు ఎమ్మెల్యే కొట్రికె మధుసూదన్ గుప్తా చేసిన రాజీనామాను పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ శుక్రవారం ఆమోదించారు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ నోట్‌ను కేంద్ర మంత్రిమండలి ఆమోదించిన తర్వాత గత ఏడాది అక్టోబర్ 8న డీసీసీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. ఇన్నాళ్లూ దాన్ని ఆమోదించని బొత్స.. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి కావడంతో ఆమోదముద్ర వేశారు. ఈ క్రమంలో కొత్త డీసీసీ అధ్యక్షుడిని ఎన్నిక చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. జిల్లాలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ప్రకటించగా.. మాజీ సీఎం కిరణ్ పార్టీ పెడితే అందులో మరో మాజీ మంత్రి శైలజానాథ్ చేరుతారన్న అభిప్రాయం ఉంది. కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్ అయిన జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డిలు ఆ పార్టీని వీడే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో కొత్త డీసీసీ అధ్యక్షని ఎంపిక విషయంలో రఘువీరారెడ్డి మాటే చెల్లుబాటవుతుందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్సీలు పాటిల్, వై.శివరామిరెడ్డి పేర్లను డీసీసీ అధ్యక్ష పదవి కోసం పరిశీలిస్తున్నారు. కానీ.. ఎన్నికల్లో పోటీచేసే నేతకు డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వకూడదని ఆ పార్టీ యువనేత రాహుల్‌గాంధీ నిబంధన పెట్టారు. డీసీసీ అధ్యక్ష పదవి కోసం పరిశీలిస్తోన్న ముగ్గురు నేతలు కూడా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. గుండుమల తిప్పేస్వామి హిందూపురం లోక్‌సభ స్థానాన్ని ఆశిస్తుండగా.. పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి రాయదుర్గం, వై.శివరామిరెడ్డి ఉరవకొండ శాసనసభ స్థానాల నుంచి పోటీచేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రాయదుర్గం నుంచి పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి కుటుంబంలో ఒకరి టికెట్ ఇచ్చి.. ఆయనను డీసీసీ అధ్యక్షునిగా నియమించాలని రఘువీరా ప్రతిపాదిస్తున్నట్లు ఆపార్టీ వర్గాలు వెల్లడించాయి. -
'ఏ మంత్రీ చదవకుండా తెలంగాణ నోట్‌ను ఎలా ఆమోదిస్తారు'
హైదరాబాద్ : కేంద్ర కేబినెట్లో ప్రభుత్వం ఇచ్చిన నోట్‌ను ఏ మంత్రీ పూర్తిగా చదవలేదని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. ఆయన శనివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ అంత పెద్ద నోట్‌ను ఏదో డిటెక్టివ్ కథలాగా వేగంగా అప్పటికప్పుడు చదవలేమని, అందుకు కొంత సమయం కావాలని కోరినట్లు చెప్పారు. కీలకమైన నోట్‌ను చదవకుండా రాష్ట్ర మంత్రివర్గం విభజనను ఎలా ఆమోదిస్తుందని కావూరి అన్నారు. తాను మాత్రం ఇప్పటికీ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన తథ్యమని జీవోఎం స్పష్టం చేసిందని కావూరి చెప్పారు. రాష్ట్ర విభజన విషయంలో సమస్య అంతా హైదరాబాద్ చుట్టే కేంద్రీకృతమై ఉందని జీవోఎంకు చెప్పామన్నారు. హైదరాబాద్‌ను పదేళ్లు కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే రెండోవైపు అభివృద్ధికి అవకాశం ఉంటుందని చెప్పామన్నారు. తాము ఎన్ని చెప్పినా... ఏం చేసినా... వారు ఒకే ప్రాంతానికే అన్నీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారన్నారు. రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకం అయినా, విభజన అనివార్యమైతే ధర్మబద్ధంగా నిర్ణయం తీసుకోవాలని కోరామన్నారు. తాము రాష్ట్ర విభజనను అడ్డుకోలేనందున తన మాటలను పరిగణనలోకి తీసుకోవాలని కోరినట్లు కావూరి చెప్పారు. పదేళ్లపాటు హైదరాబాద్ నగరాన్ని యూటీ చేస్తే సీమాంధ్ర ప్రజలకు నచ్చజెప్పే ఆలోచన ఉండేదన్నారు. ఇరుప్రాంతాలకు సమన్యాయం చేస్తే... మిత్రులుగా విడిపోయే అవకాశం ఉందని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. పోలవరం ముంపు ప్రాంతమైన భద్రాచలం డివిజన్‌ను కోస్తాంధ్రలో కలపాలని కోరినట్లు కావూరి చెప్పారు. గతంలో భద్రాచలం కోస్తాంధ్రలో ఉండేదని, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి భద్రాచలంపై నిర్ణయం అత్యవసరమన్నారు. భద్రాచలాన్ని తెలంగాణకు ఇస్తే శబరి నుంచి వచ్చే నీటిని అడ్డుకునే అవకాశం ఉందన్నారు. అందరం కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నట్లు కావూరి తెలిపారు. రాజీనామా చేస్తే విభజన ఆగిపోతుందనుకుంటే తాను ఎప్పుడో రాజీనామా చేసేవాడినని ఆయన అన్నారు. 47 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న తాను ప్రజల మధ్యకు వెళ్లేందుకు భయపడటం లేదన్నారు. ప్రజల శ్రేయస్సు కన్నా పార్టీ శ్రేయస్సు ముఖ్యమని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు. -
తెలంగాణ ఏర్పాటు పై మళ్ళీ అఖిలపక్షం
-
ఈ హైడ్రామా హైకమాండ్దా.. నేతలదా?
రాష్ట్ర విభజనపై ముసాయిదా నోట్‌ను కేంద్ర మంత్రిమండలి ఆమోదించి దానిపై జీవోఎంను కూడా ఏర్పాటు చేసి ముందుకు వెళుతున్న తరుణంలో సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టడానికి కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో హడావుడి చేయడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర సమైక్యత కోసం ప్రయత్నిస్తామని ఢిల్లీ వెళ్లిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు, విభజనను ఆపడమెలాగో తెలియక మళ్లీ మొదటికొచ్చి అసెంబ్లీకి తీర్మానం పంపాలని కొత్త బాణీ వినిపిస్తున్నారు. ఢిల్లీలో హైకమాండ్ నేతలతో కలసి సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు హైడ్రామా నడిపిస్తుండగా, రాష్ట్రాన్ని విభజించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించిన 87 రోజుల తర్వాత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీ తీర్మానం కోరండంటూ ప్రధానమంత్రికి లేఖ రాయడం గమనార్హం. జూలై 30న యూపీఏ భాగస్వామ్య పక్షాలు, ఆ వెంటనే సీడబ్ల్యూసీ తెలంగాణ ఏర్పాటును ఆమోదిస్తూ తీర్మానం చేసిన తర్వాత కేంద్ర హోం శాఖ రూపొందించిన ముసాయిదా నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ తీర్మానం కోరకుండానే ముందుకు వెళుతున్నట్టు స్పష్టమైంది. పైగా అసెంబ్లీ అభిప్రాయం మాత్రమే కోరుతామని, తెలంగాణ ఏర్పాటు కోసం తీర్మానం కోరడం లేదని కేంద్రం స్పష్టంగా తేల్చింది. మూడు నెలలుగా ఈ వ్యవహారమంతా సాగుతున్నప్పటికీ, అసెంబ్లీలో తీర్మానాన్ని అడ్డుకుంటామని ముఖ్యమంత్రితో పాటు సీమాంధ్ర నేతలు చాలాసార్లు ప్రకటించారు. కేంద్రం అసెంబ్లీ తీర్మానం కోరుతుందని, ఆ సమయంలో వ్యతిరేకిస్తామంటూ చెప్పారు. ఉద్యోగ సంఘాలతో సీఎం ఇదే చెప్పి ఆందోళన విరమింపజేశారు. ఇప్పుడు ఢిల్లీ వెళ్లిన నేతలు బిల్లు ముసాయిదాను అసెంబ్లీకి పంపాలని పార్టీ నేతలను,అక్కడే ఉన్న రాష్ట్ర గవర్నర్‌ను కలిసి విన్నవించడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఒకవైపు తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందని, వెనక్కి తగ్గేది లేదని చెబుతూనే,అసెంబ్లీ తీర్మానం,అభిప్రాయం రెండూ ఉంటాయని దిగ్విజయ్‌సింగ్ కొద్దిరోజులు అయోమయపరిచే వ్యాఖ్యలు చేశారు. తీరా హోం శాఖ రూపొందించిన ముసాయిదాతో పాటు ఆ శాఖ నుంచి అందిన వివరణతో తీర్మానం ఉండదనీ, కేవలం శాసనసభ అభిప్రాయం కోరుతూ బిల్లును అక్కడికి పంపిస్తారని తేలిపోయింది. అయినప్పటికీ సీమాంధ్ర నాయకులు కలిసిన సందర్భంగా ఈ అంశాన్ని పరిశీలిస్తామంటూ ప్రజలను గందరగోళపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదంతా పథకం ప్రకారమే హైకమాండ్ వ్యవహారాలను నడిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణపై మంత్రుల బృందాన్ని కూడా కేంద్రం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ బృందం అన్ని శాఖల అధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తోంది. మరోవైపు గవర్నర్ నరసింహన్‌ను హస్తినకు రప్పించి కేంద్ర పెద్దలు చర్చలు సాగిస్తున్నారు. గవర్నర్ 3 రోజులుగా విభజన ప్రక్రియపై సమాలోచనలు జరుపుతుండగా, మరోవైపు హోంశాఖ విభజనలో ఎదురయ్యే ఇబ్బందులపై ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులను సంప్రతిస్తుండగా ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాశారు. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ సాగిస్తున్న హైడ్రామాలో భాగమనే అభిప్రాయం ఆ పార్టీలోనే వినిపిస్తోంది. -
రాష్ట్ర విభజన నోట్ విడుదల
ఢిల్లీ: రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్ర హోంశాఖ మీడియాకు నోట్ విడుదల చేసింది. రాష్ట్ర విభజనకు సంబంధించి హోంశాఖ రూపొందించిన సమాచారాన్ని మంత్రుల బృందం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్-జీఓఎం) పరిశీలించింది. వచ్చిన ఈ మెయిల్ సమాచారాన్ని జీఓఎం చర్చించింది. ఈ మెయిల్లో వచ్చిన సమాచారంతో ఆయా శాఖలు తమ నివేదికలను మార్పు చేయాలని హొం శాఖ ఆదేశించింది. ఈ సమాచారాన్ని విశ్లేషించి ఆయా శాఖలు జీఓఎంకు నిర్దిష్ట సిఫార్సులు చేయాలని తెలిపింది. 11 శాఖలకు సంబంధించిన సమగ్ర సమాచారం కేంద్రానికి చేరింది. రాష్ట్ర విభజనపై సూచనలతో పెద్ద సంఖ్యలో ఈ మెయిల్స్ వచ్చాయి. సూచనలు స్వీకరించేందుకు కొంత సమయం ఇవ్వాలని జీఓఎం నిర్ణయించింది. రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు తమ సలహాలు, సూచనలు జీఎంఓకు పంపించవచ్చునని హొం శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా, ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రుల బృందం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్-జీఓఎం) సమావేశంలో రాష్ట్ర విభజన విధివిధానాలపై చర్చించినట్లు కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. గంటన్నరసేపు జరిగిన సమావేశం ముగిసిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయా శాఖల కార్యదర్శులు సమాచారాన్ని పంపారని తెలిపారు. ఇప్పటి వరకు 2000 ఇమెయిల్స్ వచ్చాయని చెప్పారు. వాటన్నిటినీ శాఖల వారీగా వర్గీకరించి ప్రభుత్వ కార్యదర్శులకు పంపుతామన్నారు. నవంబర్ 7 మరోసారి సమావేశమవుతామని చెప్పారు. సమావేశానికి ఆంటోనీ హాజరు కాలేదన్నారు. ఈ సమావేశానికి సుశీల్ కుమార్ షిండేతోపాటు కేంద్ర మంత్రులు గులామ్ నబీ ఆజాద్, వీరప్పమొయిలీ, జైరాం రమేష్, చిదంబరం, నారాయణస్వామి హాజరయ్యారు. -
టీ నోట్‌పై ఒక్క అడుగు ముందుకు వేసినా మెరుపు సమ్మె
కడప అర్బన్, న్యూస్‌లైన్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నోట్‌పై ఒక్క అడుగు ముందుకు వెళ్లే నిర్ణయం తీసుకున్నా ఇకపై మెరుపు సమ్మె చేస్తామని ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రీజినల్ కార్యదర్శి పీవీ శివారెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయన యూనియన్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈనెల 11వ తేదిన యూనియన్ సంఘాలతో రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్చల సారాంశంపై కడప రీజియన్‌లోని అన్ని డిపోల ఎన్ఎంయూ అధ్యక్ష, కార్యదర్శులతో యూనియన్ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశానికి ఎన్ఎంయూ సీమాంధ్ర కన్వీనర్ పీవీ రమణారెడ్డి విచ్చేయనున్నట్లు ఆయ న తెలిపారు. డిస్ ఎంగేజ్ అయిన కండక్టర్లు, డ్రైవర్లను తిరిగి తీసుకుంటామని రీజినల్ అధికారులు పిలిపిస్తున్నారన్నారు. జిల్లాలో ఈ సంవత్సరం 42 మంది మహిళా కండక్టర్లు శ్లాట్ పేరు మీద తొలగిం చారన్నారు. 114 మంది డ్రైవర్లను తీసి వేశారన్నారు. వీరిలో 91 మందిని తెలంగాణ ప్రాంతంలోని నల్లగొండలో అవసరమని పంపిం చాలనే నిర్ణయం ప్రస్తుత పరిస్థితుల్లో సరికాదన్నారు. జిల్లాలో 30 సర్వీసులను వెంటనే పునరుద్ధరిస్తే 78 మంది కండక్టర్లు, 78 మంది డ్రైవర్లు అవసరమవుతారన్నారు. ఆ మేరకు అధికారులు ఆలోచించాలన్నారు. కడప రీజినల్ జాయింట్ సెక్రటరీ పురుషోత్తం, డిపో సెక్రటరీ డీడీఎస్ మణిలు పాల్గొన్నారు. -
సమైక్య ఆందోళనలతో.. ప్రభుత్వాఫీసుల మూత
సీమాంధ్ర వ్యాప్తంగా మిన్నంటిన సమైక్య ఆందోళనలు సాక్షి నెట్వర్క్ : కేంద్రం టీ-నోట్‌ను ఆమోదించిన దరిమిలా ఉద్ధృతమైన సమైక్య ఉద్యమం తారస్థాయికి చేరింది. సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక, ఏపీఎన్జీవోల పిలుపు మేరకు మంగళవారం సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, పోస్టాఫీసులు, బ్యాంకులను సమైక్యవాదులు, ఆందోళనకారులు మూయించారు. వైద్య ఆరోగ్య శాఖ జేఏసీ పిలుపు మేరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు మినహా అన్ని సేవలనూ నిలిపివేశారు. ఇక సోమవారం కూడా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలతో కోస్తా, రాయలసీమ జిల్లాలు హోరెత్తాయి. పోలవరం పనులు అడ్డగింత రాష్ర్టం ముక్కలైతే పోలవరం ప్రాజెక్టుతో ఇక పనేమిటంటూ పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులను అడ్డగించారు. సోనియూగాంధీ, దిగ్విజయ్‌సింగ్ సహా విభజనవాదులందిరికీ సద్బుద్ధిని ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ ఏలూరులో జపం చేశారు. విశాఖలో దీక్షలు కొనసాగుతున్నాయి. అనకాపల్లిలో ఉద్యోగులు రోడ్లు ఊడ్చి నిరసన వ్యక్తంచేశారు. నర్సీపట్నంలో గాజువాక ఎంఎల్ఎ చింతలపూడి వెంకట్రామయ్య ఇంటిని ముట్టడించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం, వేమగిరిల్లో 250 లారీలతో భారీ ర్యాలీ చేపట్టారు. సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్ (జీసీఎస్) ముట్టడి రెండోరోజు కూడా కొనసాగుతోంది. అమలాపురం ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ముమ్మిడివరం, మామిడికుదురులలో ఆందోళనలు జరిగాయి. రాష్ట్రంలో రైల్వేను స్తంభింపజేస్తాం అనంతపురం జిల్లా గుంతకల్లులో రైల్వే ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. విభజన ఆపకపోతే రాష్ట్రంలో రైల్వే వ్యవస్థను స్తంభింపజేస్తామని గుంతకల్లు డివిజన్ రైల్వే జేఏసీ నేతలు హెచ్చరించారు. మడకశిరలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఇంటిని ముట్టడించారు. కర్నూలులో కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ వైద్యులు యూపీఏ ప్రభుత్వాన్ని సమాధి చేసినట్లు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పీలేరులో సీమాంధ్ర మంత్రులకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. విజయనగరం జిల్లా గుర్ల మండల కేంద్రంలో సమైక్యవాదులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేపట్టారు. శ్రీకాకుళంలో డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ముగ్గురు వైద్య ఉద్యోగులు ఆమరణ దీక్ష చేపట్టారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం ఈ నెల 11వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడలో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు విద్యాసంస్థల యాజ మాన్య కమిటీ ప్రకటించింది. కోఠి ఎస్బీఐని ముట్టడించిన ఏపీఎన్జీవోలు హైదరాబాద్: ఏపీఎన్జీవోల రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన పిలుపుపై మంగళవారం కోఠిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రధాన కార్యాలయాన్ని ఏపిఎన్జీవోలు ముట్టడించారు. తమ కార్యాలయం నుండి ర్యాలీగా వచ్చిఎస్బీఐ ప్రధాన గేట్ వద్దకు నినాదాలు చేస్తూ దూసుకొచ్చారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే ధర్నాకు దిగారు. పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఏపీఎన్జీవోల సంఘం నగర అధ్యక్షుడు పివీవీ సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ తమ దీక్షా శిబిరాన్ని త్వరలో ఢిల్లీకి మార్చుతామన్నారు. విద్యుత్ సబ్స్టేషన్ల దిగ్బంధం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లావ్యాప్తంగా విద్యుత్ సబ్స్టేషన్ల ఎదుట సమైక్యవాదులు ఆందోళనలు చేపట్టారు. ఒంగోలులో ఉద్యోగులు ఎంపీ మాగుంట ఇంటిని ముట్టడించారు. మార్కాపురంలో చంద్రబాబు తీరుపై నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్ జిల్లా ఆర్టీపీపీలో ఉద్యోగుల విధుల బహిష్కరతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. పులివెందులలో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. తుమ్మలపల్లి యురేనియం ప్రాజెక్టుకు విద్యుత్ నిలిపేశారు. సమైక్యాంధ్ర కోసం బలిదానం హైదరాబాద్ : సమైక్యాంధ్ర కోసం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పుంటించుకున్న వ్యక్తి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం రాత్రి 11.45 మృతి చెందాడు. అనంతపురం జిల్లా చెన్నంపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ మల్లికార్జున్నాయక్(35) ఈ నెల 6న కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. మరోవైపు, విభజన కలతతో సీమాంధ్రలో నలుగురు గుండె పోటుతో మృతిచెందారు. లగడపాటిపై ఫిర్యాదు ఎంపీ లగడపాటి రాజగోపాల్ కనబడటం లేదంటూ విద్యార్థి, పొలిటికల్ జేఏసీల నాయకులు విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరులో జరిగిన సమైక్య శంఖారావం కార్యక్రమానికి వేలాదిగా విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే, ఎమ్మెల్యే మల్లాది విష్ణును న్యాయవాదులు అడ్డుకున్నారు. పదవికి రాజీ నామా చేయాలంటూ బార్ అసోసియేషన్ నేతలు నిలదీయగా, అంతుచూస్తానంటూ విష్ణు బెదిరించడంతో న్యాయవాదులు తిరగబడ్డారు. -
నేడు భువనగిరిలో బీజేపీ యువగర్జన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రకటన వెలువడిన నేపథ్యంలో బీజేపీ పలు సదస్సులు నిర్వహించాలని తలపెట్టింది. తొలి సభను బుధవారం నల్లగొండ జిల్లా భువనగిరిలో నిర్వహిస్తోంది. తెలంగాణ కోసం తమ పార్టీ చేసిన కృషిని ఈ సదస్సులో వివరిస్తూ.. వచ్చే ఎన్నికల్లో తమను ఆదరించాలని కోరనుంది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే ఈ సదస్సుకు పార్టీ నేతలు కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి తదితరులు హాజరవుతున్నారు. -
సీఎం సరిగ్గా స్పందించలేదు: సీమాంధ్ర విద్యుత్ జేఏసీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను నిరసిస్తూ తాము చేపట్టిన నిరవధిక సమ్మెతో కేంద్ర ప్రభుత్వం తప్పక దిగి వస్తుందని సీమాంధ్ర విద్యుత్ జేఏసీ నేతలు స్పష్టం చేశారు. మంగళవారం సీఎం కిరణ్‌తో భేటీ అయ్యే ముందు విద్యుత్ జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ... నేర చరితుల ఆర్డినెన్స్‌ను కేంద్రం ఏలా వెనక్కి తీసుకుందో, టీ నోట్‌ను కూడా అలాగే వెనక్కి తీసుకుంటుందని తాము నమ్ముతున్నట్లు తెలిపారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామంటూ సీఎం కిరణ్ చెప్పిన తర్వాతే గత నెలలో తాము చేపట్టిన సమ్మెను విరమించామని వారు ఈ సందర్భంగా గర్తు చేశారు. గతంలో సీఎం ఇచ్చిన హామీ పట్ల సీఎం కానీ, మంత్రులు గాని సరిగ్గా స్పందించలేదని, దాంతో నిరవధిక సమ్మె చేస్తున్నట్లు సీమాంధ్ర విద్యుత్ జేఏసీ నేతలు చెప్పారు. -
బాబూ.. ఏ మొహం పెట్టుకుని దీక్ష చేస్తావ్?
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : ‘చంద్రబాబూ... ఏ మొహం పెట్టుకుని ఢిల్లీలో దీక్ష చేస్తున్నారు? దీనివల్ల ఏమి సాధిస్తారు? దీక్ష చేపట్టడానికి కాంగ్రెస్ అధిష్టానంతో ఎంత ప్యాకేజీకి డీల్ కుదిరింది? ప్రజలు అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల’ని వైఎస్సార్సీపీ అనంతపురం ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, జిల్లా కన్వీనర్ మాలగుండ్ల శంకరనారాయణ డిమాండ్ చేశారు. తెలంగాణ నోట్‌కు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పిలుపు మేరకు చేపట్టిన 72 గంటల బంద్‌లో భాగంగా మూడో రోజైన ఆదివారం వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నగరంలోనితపోవనం సర్కిల్ వద్ద 44వ జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై తెలుగుజాతిని ముక్కలు చేయడానికి పూనుకున్నాయని విమర్శించారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు సరికొత్త డ్రామాకు తెర తీశారని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలకు అన్నీ తెలిసినా ప్యాకేజీలు తీసుకుని నోరుమెదపడం లేదన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత మహానేత వైఎస్, ఎన్టీఆర్లకే దక్కుతుందన్నారు. అయితే... ఎన్టీఆర్ కుమార్తె అయిన కేంద్ర మంత్రి పురందేశ్వరి పదవులు పట్టుకుని వేలాడుతుండడం శోచనీయమన్నారు. రాష్ట్ర విభజన వల్ల కలిగే అనర్థాలు, అగచాట్లను దృష్టిలో పెట్టుకునే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి ఆమరణ దీక్ష చేపట్టారని గుర్తు చేశారు. ఈ దీక్షకు అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు సంఘీభావం ప్రకటించాలని పిలుపునిచ్చారు. శంకరనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు సహకారంతో కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర ప్రజల మధ్య రాగద్వేషాలు పెంచుతోందని విమర్శించారు. అవినీతి చక్రవర్తిగా పేరొందిన చంద్రబాబు తన బండారం బయటపడకుండా బహిరంగంగానే కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని విమర్శించారు. రాష్ట్ర విభజన విషయంలో స్పష్టమైన వైఖరి ప్రకటించకుండా ఎవరి కోసం, ఎందుకోసం ఢిల్లీలో దీక్ష చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ నేత బి.ఎర్రిస్వామిరెడ్డి మాట్లాడుతూ తెలుగుజాతి సంస్కృతీ సంప్రదాయాలు ఇటలీ వనిత సోనియాకు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు లింగాల శివశంకరరెడ్డి, మీసాల రంగన్న, ధనుంజయ యాదవ్, కసనూరు రఘునాథరెడ్డి, రంగంపేట గోపాల్‌రెడ్డి, హుస్సేన్‌పీరా, ఉషారాణి, శ్రీదేవి, మిద్దె కుళ్లాయప్ప, గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, మహానందిరెడ్డి, షెక్షావలీ, వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఓబుళపతి, నాయకులు అశోక్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. -
కారుచీకట్లు
విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో జిల్లాలో అంధకారం అలుముకుంది. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలు అల్లాడిపోయారు. కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలిపిన తర్వాత ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దిశగా సమైక్యవాదులు అడుగు ముందుకేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి నిరసన తెలపడంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం తప్పలేదు. తెలంగాణ అంశంపై కేంద్రం వైఖరిలో వచ్చిన మార్పును బట్టే ఉద్యమ స్వరూపం కూడా మారు సాక్షి, కడప: సమైక్య ఉద్యమం ఆదివారం జిల్లాను అంధకారంలోకి నెట్టింది. విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మెలోకి వెళ్లడంతో ఆదివారం ఉదయం 10.45 గంటల నుంచి జిల్లావ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పట్టణ ప్రాంతాలతో పాటు పల్లె జనాలు కూడా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఆర్టీపీపీలో పూర్తిగా నిలిచిపోయిన విద్యుదుత్పత్తి: ఆర్టీపీపీ(రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు)లోని ఉద్యోగులు, కార్మికులు మొత్తం కలిపి 2,700మంది సమ్మెలోకి వెళ్లడంతో 5 యూనిట్లలోని 1050 మెగావాట్ల విద్యుత్ నిలిచిపోయింది. దీంతో పాటు శ్రీశైలం నుంచి వచ్చే సరఫరాను కూడా గ్రిడ్‌కు అనుసంధానం చేయకపోవడంతో జిల్లాలో ఆదివారం ఉదయం 10.45 గంటలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో జిల్లా ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీసం చేతిపంపు నీటి కోసం తిరిగినా నగరంలో ఎక్కడా చేతిపంపులు కనిపించలేదు. కొంతమంది ఇరుగుపొరుగు ఇళ్లలోని నీటితో సర్దుకుంటే, మరికొందరు ఇంట్లో నిల్వచేసుకున్న కార్పొరేషన్ నీటినే సేవించాల్సి వచ్చింది. కనీస అవసరాలకు కూడా నీరు దొరక్క చాలామంది తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆదివారం రాత్రి 7 గంటలకు కరెంటు వస్తుందనే ప్రచారంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఒకదశలో పూర్తిగా రాదని తెలియడంతో తీవ్ర ఆందోళన చెందారు. రాత్రి వేళలో కరెంట్ లేక దోమల బెడదతో అల్లాడారు. ఫ్యాన్లు లేక చిన్నపిల్లలు, వృద్ధులు మరింత ఇబ్బంది పడ్డారు. ఇదే పరిస్థితి దాదాపు అన్ని పట్టణప్రాంతాల్లోనూ సంభవించింది. పల్లెల్లో కూడా కరెంటు సమస్యలు స్పష్టంగా కన్పించాయి. ఎట్టకేలకు రాత్రి 7.45 గంటల ప్రాంతంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. దసరాపై కరెంటు ప్రభావం దసరా ఉత్సవాలపై కరెంటుకోత ప్రభావం పడింది. శనివారం రాత్రి నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. ప్రొద్దుటూరు అమ్మవారిశాల, శివాలయంతో పాటు కడపలోని విజయదుర్గాదేవి, అమ్మవారిశాల,మైదుకూరు, రాజంపేట, రైల్వేకోడూరు, రాజంపేటలోని అమ్మవారి ఆలయాలు శనివారం విద్యుత్‌దీప కాంతులతో వెలుగులీనాయి. అయితే ఆదివారం కరెంటుకోతతో ఆలయాల్లో చిమ్మచీకట్లు కమ్మాయి. కొన్నిచోట్ల జనరేటర్లను ఉపయోగించి సమస్యను అధిగమించారు. అమ్మవారి దర్శనార్థం వచ్చిన భక్తులు కూడా కరెంటు సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరెంటు నిలిపేయడం సరికాదు: థామస్, ఇంజనీర్, కడప సమైక్య ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించారు. బంద్‌లతో పాటు అన్ని నిరసన కార్యక్రమాలకు సహకరించారు. చివరకు ప్రభుత్వ పాఠశాలలు మూసి ప్రైవేటు పాఠశాలలు తెరిచినా ఉద్యమం కోసం సహించారు. కానీ చివరకు కరెంటును తొలగించడం దారుణం. చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ ఇబ్బంది పడారు. వెంటనే కరెంటును సరఫరా చేయాలి. వెంటనే కరెంటు సరఫరా చేయాలి: ప్రసన్నకుమారి, విద్యార్థిని, కడప సమైక్య ఉద్యమం తప్పుదారి పడుతోంది. కరెంటు తీసేయడం దారుణం. పగలంటే సరే. రాత్రి పూట కరెంటు తీసేస్తే దొంగతనాలు జరిగే ప్రమాదముంది. తాగునీటితో పాటు రాత్రి పూట నిద్రపోవాలన్నా కష్టంగానే ఉంది. కరెంటు నిలిపేయడం సరైన చర్యకాదు. వెంటనే కరెంటు సరఫరా చేయాలి. -
కేంద్ర మంత్రులు, ఎంపీలు చవటలు: గురునాథరెడ్డి
సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు చవట దద్దమ్మలని, వారి చేతకానితనం వల్లనే తెలంగాణ నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ధ్వజమెత్తారు. వారు ముందే మూకుమ్మడిగా రాజీనామాలు చేసింటే ఈ దుస్థితి ఏర్పడేది కా దని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సా ర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు 72 గంటల బంద్‌లో భాగంగా నిరసన కార్యక్రమా లు చేపడుతున్నామన్నారు. రైల్ రోకో చేసి సీమాంధ్ర ప్రజల మనోభావాలను కేంద్రానికి తెలియజేశామన్నారు. సమైక్యాంధ్ర కోసం తమ పార్టీ అధినేత రెండోమారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని చెప్పారు. కుటిల రాజకీయాలతో రాష్ట్రాన్ని విభజించడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ఎక్కడ సీబీఐ ద్వారా కేసులు బనాయిస్తుందోనని వారి కాళ్లు పట్టుకుని విభజనకు మద్దతుగా లేఖ రాశారని దుయ్యబట్టారు. -
విద్యుత్ కోతలతో విలవిల
చౌటుప్పల్, న్యూస్‌లైన్: తెలంగాణ నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం పొందడంతో సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమ ప్రభావం విద్యుత్ రంగంపై పడింది. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమ్మెతో కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని ఎన్టీటీపీఎస్, రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్, లాంకో పవర్స్టేషన్లలో 3వేల మెగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి శుక్రవారం నుంచి నిలిచిపోయింది. దాని ప్రభావం తెలంగాణ జిల్లాలపై పడింది. శుక్రవారం రాత్రి నుంచే ప్రభావం ఎన్టీటీపీఎస్ నుంచి సూర్యాపేటలోని సబ్‌స్టేషన్ ద్వారా హైదరాబాద్‌కు, నార్కట్‌పల్లి సబ్‌స్టేషన్ ద్వారా నార్కట్‌పల్లి, చిట్యాల, చౌటుప్పల్, రామన్నపేట, సంస్థాన్ నారాయణపురం, మోత్కూరు, శాలిగౌరారం తదితర మండలాలకు విద్యుత్ సరఫరా చేస్తారు. విద్యుత్ ఉత్పాదన నిలిచిపోవడంతో శుక్రవారం రాత్రి నుంచే జిల్లాపై ప్రభావం పడింది. శుక్రవారం రాత్రి కేవలం 2గంటలు మాత్రమే వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేశారు. శనివారం వ్యవసాయానికి అసలు విద్యుత్ ఇవ్వలేదు. గృహ సముదాయాలకు ఇదే పరిస్థితి. శనివారం ఉదయం 8గంటలకు సరఫరా నిలిచిపోయింది. తిరిగి రాత్రి 7గంటలకు ప్రారంభమైంది. శుక్రవారం రాత్రి నుంచే సింగిల్ ఫేజ్ విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇది కూడా వచ్చిపోతోంది. హైదరాబాద్‌లోని స్టేట్‌లోడ్ డిస్పాచ్ సెంటర్ నుంచి సీమాంధ్రకు శనివారం 40మెగావాట్ల విద్యుత్‌ను నార్కట్‌పల్లి సబ్‌స్టేషన్ మీదుగా సరఫరా చేశారు. ప్రస్తుతం వరి పెరిగే దశలో ఉంది. ఇప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేస్తే నీరు లేక ఎండిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
జిల్లాకు సమ్మె షాక్
నెల్లూరు(దర్గామిట్ట), న్యూస్‌లైన్ : ఇక విద్యుత్ కష్టాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ నోట్‌కు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. రెండు రోజులుగా బంద్ జరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులు విధులకు దూరంగా ఉండటంతో సీమాంధ్రలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. వీటీపీఎస్‌లో 1260 మెగావాట్లు, ఆర్టీపీపీలో 840 మెగావాట్లు, సీలేరు థర్మల్ కేంద్రంలో 260 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. విద్యుత్ ఉద్యోగుల సమ్మె పిలుపుతో ఆదివారానికి మిగిలిన కేంద్రాల్లో కూడా ఉత్పత్తి నిలిచిపోతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. సమ్మె కారణంతా అత్యవసర సేవలకు కూడా హాజరుకాబోమని విద్యుత్ ఉద్యోగులు స్పష్టం చేశారు. దీంతో సీమాంధ్రులకు విద్యుత్ కష్టాలు తప్పని పరిస్థితి తలెత్తింది. జిల్లాలో 4000 మంది సమ్మెలోకి.. జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న దాదాపు 4000 మందికి పైగా ఉద్యోగులు నిరవధిక సమ్మెలో పాల్గొనున్నారు. జెన్కోలో 1100 మంది, ట్రాన్స్‌కో, డిస్కంలలో కలిపి 2000 మందితో పాటు దాదాపు 1000 మందికి పైగా కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేయనున్నారు. సరఫరాలో సమస్యలు తలెత్తితే ఎలాంటి మరమ్మతులు చేపట్టరు. దీంతో నేడో రేపో జిల్లాలో సరఫరా పూర్తిగా నిలచిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. అత్యవసర సేవలైన తాగునీరు, ఆస్పత్రులు తదితర వాటి మరమ్మతులకు కూడా సిబ్బంది హాజరుకారని చెబుతున్నారు. నిత్యావసరాల్లో విద్యుత్ ఒక భాగమైంది. ప్రతి పనికి విద్యుత్ సరఫరాపై ఆధారపడాల్సి వస్తుంది. చీకట్లో పలుప్రాంతాలు శనివారం సాయంత్రం నుంచే జిల్లాలోని పలు ప్రాంతాల్లో చీకట్లు అలుముకున్నాయి. ఆత్మకూరు నియోజకవర్గంలోని వంద గ్రామాలు, ఉదయగిరి ప్రాంతంలోని 50 గ్రామాలు, నవలాకులతోట, కోవూరు, సూళ్లూరుపేటలోని కొన్ని ప్రాంతాలతో పాటు నెల్లూరులోని వేదాయపాళెం, పొదలకూరు రోడ్డు, మూలాపేట, బారకాసు, తదితర ప్రాంతాల్లో కొంతసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
ఈ పరిస్థితికి చంద్రబాబే కారణం
నరసన్నపేట, న్యూస్‌లైన్: రాష్ట్రంలో ప్రస్తుతంనెలకొన్న అల్లకల్లోల పరిస్థితులకు ప్రధాన కారణం తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబేనని నరసన్నపేట ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా ఘోర అవమానానికి పాల్పడ్డారన్నారు. బాధ్యతగల ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజావసరాలు, ప్రజల మనోభావాలు గుర్తించకుండా విభనకు అనుకూలంగా లేఖ ఇచ్చారని, లేకపోతే పరిస్థితి మరో విధంగా ఉండేదన్నారు. 65 రోజుల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంటే కేంద్ర నాయకులు ప్రాధాన్యమివ్వకుండా, వారు చెప్పిన ఆంటోనీ నివేదిక తీసుకోకుండా ఏకపక్షంగా తెలంగాణా నోట్‌కు కేబినేట్ ఆమోదం తెలిపిందన్నారు. కాంగ్రెస్ వ్యతిరేకత కేవలం సీమాంధ్రకే పరిమితం అవుతుందని కాంగ్రెస్‌వాదులు అనుకోవడం వారి అవివేకమన్నారు. జీవితాలను పణంగా పెట్టి ఉద్యమించినా ఫలితం లేకపోవడంపై దేశవ్యాప్తంగా ఉద్యోగులు వివరిస్తారని, దీని ఫలితం దేశమంతటా కాంగ్రెస్ చూపుతుందన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ఈ పరిస్థితి ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ఎదుర్కొక తప్పదని ఆయన అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 72 గంటల బంద్‌ను పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని కోరారు. సమైక్యాంధ్రకు మద్దతుగా స్పందించిన పార్టీ వైఎస్సార్సీపీయేనని ప్రజలకు పార్టీ శ్రేణులు వివరించాలని కోరారు. తెలంగాణాను అడ్డుకునేందుకు మరికొన్ని అవకాశాలు ఉన్నాయని, కోర్టుతో పాటు రాష్ట్ర శాసన సభ, ఆమోదం, పార్లమెంట్ల్లో ఆమోదం వంటి దశలు ఉన్నాయన్నారు. టీ నోట్‌తో ప్రజలు నిరుత్సాహపడవద్దని కృష్ణదాస్ కోరారు. -
తెలంగాణ.. సంబురం
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణ నోట్‌కు కేంద్ర కేబినేట్ ఆమోదముద్ర వేయడంతో జిల్లావ్యాప్తంగా తెలంగాణవాదుల సంబరాలు అంబరాన్నంటారుు. హన్మకొండ అమరవీరుల స్థూపం తెలంగాణవాదుల సంబరాలకు కేంద్రంగా మారింది. ఉద్యోగులు, న్యాయవాదులు, బీసీ జేఏసీ, విద్యార్థులు, వివిధ సంఘాలు ఎవరికివారు ర్యాలీగా చేరుకుని స్థూపానికి క్షీరాభిషేకం చేశారు. కోర్టులో న్యాయవాదులు తెలంగాణ జెండాను ఆవిష్కరించారు. జై తెలంగాణ నినాదాలతో ఆ ప్రాంతం మర్మోగింది. అనంతరం ఏకశిల పార్కులోని తెలంగాణ జాతిపిత, ప్రొఫెసర్ జయశంకర్‌సార్ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. తెలంగాణ ఏర్పడే వరకూ అప్రమత్తంగా ఉండాలని బార్ అసోసియేషన్ నాయకులు పిలుపునిచ్చారు. హన్మకొండ డీసీసీ భవన్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య మాట్లాడుతూ సోనియాగాంధీకి తెలంగాణ ప్రజలు రుణపడి ఉన్నారని కొనియాడారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి, ట పాసులు కాల్చి నాయకులు, కార్యకర్తలతో ఆనందాన్ని పంచుకున్నారు. కరీమాబాద్, వరంగల్ చౌరస్తా, మట్టెవాడ, శివనగర్, ఖిలావరంగల్, కాశిబుగ్గ ప్రాంతాల్లో తెలంగాణవాదులు సంబరాలు చేసుకున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఆధ్వర్యంలో వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించారు. కాశిబుగ్గలో సోనియా, మన్మోహన్సింగ్, కేసీఆర్ ఫ్లెక్సీలకు పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అవరోధాలు కలగకుండా చూడాలని స్థానిక శివాలయంలో ప్రత్యేక హోమం చేశారు. ఎంజీఎం, కేఎంసీలలో మెడికల్ జేఏసీ ఆధ్వర్యంలో సంబరాలు జరిగారుు. జనగామలో టీఆర్ఎస్, బీజేపీ, ఏబీవీపీ ఆధ్వర్యంలో మిఠాయిలు పంపిణీ చేశారు. నర్సంపేట, పరకాలలోని అన్ని మండలాల్లో తెలంగాణవాదులు, టీజేఏసీ, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. వర్ధన్నపేటలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. టపాసులు కాల్చి ధూంధాం చేశారు. తొర్రూరులో న్యాయవాదులు, జేఏసీ, కాంగ్రెస్ వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారుు. స్టేషన్ ఘన్‌పూర్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు వేర్వేరుగా సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య టపాసులు కాల్చి.. పాట పాడి.. డ్యాన్స్ చేశారు. గూడూరు, జఫర్‌గఢ్, సంగెంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయూరు. మహబూబాబాద్‌లో సంబరాలు మిన్నంటాయి. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల ర్యాలీ చేపట్టారు. ఎల్‌హెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి మిఠాయిలు పంపిణీ చేశారు. బాణసంచా కాల్చి, తెలంగాణ అమరవీరులకు పిండ ప్రదానం చేసి నివాళులర్పించారు. అరుణోదయ కళాకారులు కళాజాతాతో ఆకట్టుకున్నారు. డోర్నకల్, మరిపెడ, నర్సింహులపేటలో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ నేతలు వేర్వేరుగా భారీ ర్యాలీలు నిర్వహించారు. ములుగు, భూపాలపల్లిల్లో టీఆర్ఎస్, సింగరేణి కార్మికులు ర్యాలీలు నిర్వహించి ఆనందాన్ని పంచుకున్నారు. తెలంగాణ జేఏసీ జిల్లా చైర్మన్, ప్రొఫెసర్ పాపిరెడ్డి, బీసీ జేఏసీ చైర్మన్ శేషు, కోలా జనార్దన్, తెలంగాణ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు జనార్ధన్, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ పరిటాల సుబ్బారావు, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు కోలా రాజేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి రత్నవీరాచారి, టీజీఓ నాయకుడు జగన్మోహన్రావు, టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జ్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, వరంగల్ పశ్చిమ, పరకాల ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, మొలుగూరి బిక్షపతి, డాక్టర్ రాజయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అంబరీష, గుడిమల్ల రవికుమార్, సహోదర్‌రెడ్డి, రాజేంద్రకుమార్, కేయూ జేఏసీ నాయకులు సాధు రాజేష్, జోరిక రమేష్, సారయ్య, వీరేందర్, డాక్టర్ నాగేంద్రబాబు, అశోక్‌రెడ్డి, బీజేపీ నాయకులు ఎడ్ల అశోక్‌రెడ్డి, బైరబోయిన దామోదర్, మరుపల్ల రవి, చాగంటి రమేష్, బక్కనాగరాజు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. -
జయహో తెలంగాణ...
ఖమ్మం, న్యూస్‌లైన్: తెలంగాణ నోట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో జిల్లావ్యాప్తంగా శుక్రవారం సంబురాలు ఘనంగా జరిగాయి. తెలంగాణవాదులు మిఠాయిలు పంచుకున్నారు. బాణసంచా పేల్చి వేడుకలు జరుపుకున్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీజేఏసీ నాయకులు కూరపాటి రంగరాజు, వెంకటపతిరాజు, టీజీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు షేక్ ఖాజామియా, తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోడి లింగయ్య, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బుర్రి వినోద్ కుమార్, నాయకులు వెంక టేష్, కృష్ణ, వీరయ్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి రాంరెడ్డి క్యాంప్ కార్యాలయంలో: ఖమ్మంలో రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తలు స్వీట్లు పంచిపెట్టారు. బాణసంచా కాల్చి వేడుకలు జరుపుకున్నారు. పార్టీ కార్యకర్తలకు మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శీలంశెట్టి వీరభద్రం, నగర కాంగ్రెస్ కన్వీనర్ రాపర్తి రంగారావు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో: నగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలో ఉద్యోగులు సంబురాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచుకుని పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. కార్యాలయం గేటు ముందు బాణసంచా కాల్చారు. కార్యక్రమంలో జిల్లా మున్సిపల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కందూకూరి రాము, కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు కె.శ్రీనివాస్, శ్రీనివాసరావు, లాల్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ట్రెజరీ కార్యాలయంలో: ఖమ్మంలోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో సంబురాలు ఘనంగా జరిగాయి. ఉద్యోగులు స్వీట్లు పంచుకున్నారు. కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ ఖాజామియా, తెలంగాణ ట్రెజరీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణారావు, వేలాద్రి, నాయకులు వెంకటేశ్వరరావు, సాగర్, వై.వెంకటేశ్వర్లు, డిప్యూటీ డెరైక్టర్ కె.నీలిమ, మహిళ నాయకులు శైలజ, సౌజన్య, మంజుల, నాగేంద్ర కుమారి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో: జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలోని రోగులకు టీఎన్జీఓస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు తదితరులు పండ్లు పంచిపెట్టారు. జిల్లా గృహనిర్మాణ శాఖ కార్యాలయంలో ఖమ్మంలోని జిల్లా గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో తెలంగాణ సహాయక ఇంజనీర్లు, వర్క్ ఇన్స్పెక్టర్ల సంఘం ఆధ్వర్యంలో సంబురాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ భాస్కర్, సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకయ్య, కోశాధికారి జెఎస్ఎన్.మూర్తి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎల్.కృష్ణారెడ్డి, ఔట్ సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పి.నరేంద్ర నాథ్, హౌసింగ్ మెనేజర్ బిసిహెచ్.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. జల సౌధలో: ఖమ్మంలోగల జల సౌధ భవనంలోని ఐబీ ఈఈ కార్యాలయంలో ఉద్యోగులు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో ఇరి గేషన్ ఈఈ అంకవీడు ప్రసాద్, ఉద్యోగ జేఏసీ చైర్మన్ కూరపాటి రంగరాజు, నాయకులువెల్పుల శ్రీను, రంగారావు, కృష్టమూర్తి, యాదగి రి, వల్లోజి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. డీసీసీ కార్యాలయంలో: ఖమ్మంలోని జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యాలయంలో తెలంగాణ సంబురాలు ఘనంగా జరిగాయి. కార్యాలయ ఆవరణలో కార్యకర్తలు, నాయకులు టపాసులు పేల్చారు. స్వీట్లు పంచుకున్నారు. కార్యక్రమంలో నాయకులు పులిపాటి వెంకయ్య, కోట గురుమూర్తి, ఎండి.జహీర్ అలీ, నాగండ్ల దీపక్ చౌదరి, మందడపు బ్రహ్మా రెడ్డి, కొత్తా సీతారాములు, వివి.అప్పారావు, వడ్డెబోయిన శంకర్, ఆర్వీయస్ ప్రసాద్, కొరివి వెంకటరత్నం, కేసా బిక్షపతి, జింజిరాల రాజేష్, మాదిరాజు వెంకటేశ్వరరావు, ఎండి.గౌస్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పోరిక లక్ష్మీబాయి, నాయకులు మందపల్లి నాగమణి, జొన్నలగడ్డ అరుణ, నారాయణమ్మ, నగర అధ్యక్షురాలు కొల్లు పద్మ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మంలోని మయూరి సెంటర్లో కాంగ్రెస్ నాయకులు రామిశెట్టి మనోహర్ నాయుడు, కట్ల రంగారావు తదితరులు బాణసంచా కాల్చారు. ఇల్లెందులో: తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో జేఏసీ నాయకులు శుక్రవారం సాయంత్రం ఇల్లెందులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, జేఏసీ డివిజన్ చైర్మన్ పేరూరి అప్పారావు, నాయకులు జానీపాషా, ఎర్రబెల్లి కిష్టయ్య, సిలివేరు సత్యనారాయణ, కంభంపాటి కోటేశ్వరరావు, రామచందర్‌నాయక్, కొత్తిమీర శ్రీను, పోషం, బావ్‌సింగ్, ఖాజా, మడత వెంకటగౌడ్, సురేష్ లాహోటీ పాల్గొన్నారు. కొత్తగూడెంలో: తెలంగాణ మహిళ జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో సంబురాలు జరిగాయి. కన్వీనర్ తేజావత్ కమల కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సుమభాను, మాధవి, నాగకుమారి, పిట్టల కమల, జ్యోతిరాణి, రుక్మిణి, కళాశ్రీ, స్వప్న, శాంత, జాను తదితరులు పాల్గొన్నారు. టీవీవీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో జిల్లా అధ్యక్షుడు చార్వాక, నాయకులు పి.వేణు, పి.శ్రీహరి, రాము, అచ్యుత్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పలుచోట్ల: జిల్లాలో పలుచోట్ల సంబురాలు జరిగాయి. చండ్రుగొండలో అఖిలపక్షం ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ జరిగింది. అశ్వారావుపేట నియోజకవర్గవ్యాప్తంగా వివిధ పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీలు జరిగాయి. భద్రాచలం, వాజేడు, వెంకటాపురం, కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ పార్టీల కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. బోనకల్‌లోని తెలంగాణ-ఆంధ్ర సరిహద్దులో ఇటీవల నిర్మించిన అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణవాదులు నివాళులర్పించారు. మణుగూరులో జరిగిన వేడుకల్లో పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పాల్గొన్నారు. సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, అశ్వాపురం, బూర్గంపాడు, వైరా, జూలూరుపాడు మండలాల్లో సంబురాలు జరిగాయి. -
కాంగ్రెస్ ఖాళీ!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : కేంద్ర క్యాబినెట్ తెలంగాణ నోట్‌పై ఆమోదముద్ర వేయడం ఆ పార్టీలో కల్లోలం రేపింది. ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో తీసుకున్న నిర్ణయం ‘అనంత’ ప్రజానీకాన్ని ఆగ్రహానికి గురిచేసింది. అనంతపురంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై శుక్రవారం సమైక్యవాదులు దాడి చేశారు. కాంగ్రెస్ జెండాలను.. సోనియాగాంధీ దిష్టిబొమ్మలను ఎక్కడికక్కడ దహనం చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని పూర్తిగా దెబ్బ తీసింది. పజల మనోభిప్రాయాలను గౌరవించని కాంగ్రెస్ అధిష్టానంపై ఆ పార్టీ శ్రేణులు తిరుగుబాటు బావుటా ఎగురవేశాయి. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. అనంతపురం లోక్‌సభ సభ్యుడు అనంత వెంకటరామిరెడ్డి ఇప్పటికే ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ నోట్‌పై కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసిందన్న వార్త వెలువడగానే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఎంపీ అనంత రాజీనామా చేశారు. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని ఆయన తెంచుకున్నారు. కేంద్ర మంత్రి మండలి తెలంగాణ నోట్‌ను ఆమోదించాక రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి అ/ా్ఞతంలోకి వెళ్లారు. జిల్లాలో సమైక్యాంధ్ర సెంటిమెంటు బలీయంగా వేళ్లూనుకుపోయిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించలేననే నిర్ణయానికి వచ్చిన మంత్రి రఘువీరారెడ్డి కర్ణాటకకు వలసబాట పట్టారు. వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలోని తుమకూరు లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రఘువీరా సన్నద్ధమవుతున్నారు. రఘువీరా వైఖరితో విసిగిన కళ్యాణదుర్గం కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం మూకుమ్మడిగా ఆ పార్టీకి రాజీనామా చేశాయి. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కళ్యాణదుర్గం మండల కన్వీనర్ తలారి వెంటకటేశులు, పట్టణ కన్వీనర్ జయరాం పూజారి, శెట్టూరు, బ్రహ్మసముద్రం, కంబదూరు, కుందుర్పి మండలాల కన్వీనర్లు మంజునాథరెడ్డి, ప్రసాదరెడ్డి, గోవిందరెడ్డి, రాజగోపాల్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో.. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయినట్లు అయింది. కళ్యాణదుర్గం మార్కెట్‌యార్డు చైర్మన్ రఘునాథరెడ్డి కూడా పదవికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పాథమిక విద్యాశాఖ మంత్రి సాకే శైలజానాథ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న శింగనమల నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ శ్రేణులు రాజీనామా బాట పట్టాయి. మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ నార్పల సత్యనారాయణరెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. యల్లనూరు, పుట్లూరు మండలాల్లోని 14 మంది సర్పంచులతో కలిసి కేతిరెడ్డి పెద్దారెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, శింగనమల మండలాల నేతలూ అదే బాట పట్టడంతో ఆ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని ఆ పార్టీ శ్రేణులే స్పష్టీకరిస్తున్నాయి. ఉరవకొండ, రాయదుర్గం, గుంతకల్లు నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ నేతలు కూడా రాజీనామా బాట పట్టారు. రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి సొంత నియోజకవర్గమైన మడకశిరలో కాంగ్రెస్ నేతలు శనివారం సమావేశం ఏర్పాటుచేసుకుని.. భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసుకుంటామని ప్రకటించారు. ఇప్పటికే పుట్టపర్తి, కదిరి, రాప్తాడు, ధర్మవరం, పెనుకొండ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిన విషయం విదితమే. ప్రజల ఛీత్కారానికి గురైన కాంగ్రెస్ పార్టీ జెండా ఇక జిల్లాలో ఎగరడం అసాధ్యమని రాజకీయ పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. -
వైఎస్సార్ సీపీ నేతృత్వంలో.. సకలం బంద్
సాక్షి, కడప : తెలంగాణ నోట్‌ను కేంద్ర కేబినేట్ ఆమోదించినందుకు నిరసనగా జిల్లాలో వైఎస్సార్సీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన 72 గంటల పిలుపు మేరకు తొలిరోజైన శుక్రవారం జిల్లా వ్యాప్తంగా బంద్‌ను పాటించారు. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నేతలు ఉదయం 6 గంటల నుంచే బంద్‌ను పర్యవేక్షించారు. రోడ్లపై టైర్లు, మొద్దులు కాలుస్తూ వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించడంతో దుకాణాలు, వాణిజ్య సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. జన జీవనం పూర్తిగా స్తంభించింది. పట్టణాల్లోని వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ర్యాలీలు, మానవహారాలతోపాటు రిలే దీక్షలతో వైఎస్సార్సీపీ శ్రేణులు తమ నిరసనలు తెలియజేశాయి. కడపలో పార్టీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త ఎస్బి అంజాద్బాష బంద్‌ను పర్యవేక్షించారు. నగర వీధుల్లో కలియతిరుగుతూ వాహనాలను అడ్డుకున్నారు. ప్రజలుకూడా స్వచ్ఛందంగా తరలివచ్చి బంద్‌కు సహకారం అందించారు. వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పత్తి రాజేశ్వరి నేతృత్వంలో 20 మంది మహిళలు దీక్షలు చేపట్టారు. జమ్మలమడుగులో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. షిండే, దిగ్విజయ్‌సింగ్, కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. బంద్‌ను పూర్తి స్థాయిలో పర్యవేక్షించారు. బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల పట్టణంలో వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డీసీ గోవిందరెడ్డి నేతృత్వంలో ‘సేవ్ఆంధ్రప్రదేశ్’ ఆకారంలో మానవహారం నిర్మించి నిరసన వ్యక్తం చేశారు. బి.కోడూరు మండలంలో వైఎస్సార్సీపీ నేతలు చౌదరి రామకృష్ణారెడ్డి, ఒ.ప్రభాకర్‌రెడ్డి నేతృత్వంలో పెద్దుళ్లపల్లె, మాధవరాయునిపల్లె గ్రామాలకు చెందిన 20 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి నేతృత్వంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి బంద్‌ను పర్యవేక్షించారు. మాజీ సర్పంచ్ భూమన్ శివశంకర్‌రెడ్డి నేతృత్వంలో 80 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ప్రొద్దుటూరులో నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో 20 మంది మూడవ రోజు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నేతృత్వంలో కృష్ణచైతన్యరెడ్డి, వంశీధర్‌రెడ్డి, దేవిప్రసాద్‌రెడ్డి పట్టణంలో కలియతిరుగుతూ బంద్‌ను పర్యవేక్షించారు. కమలాపురంలో ఉత్తమారెడ్డి నేతృత్వంలో గ్రామ చావిడి నుంచి క్రాస్‌రోడ్డు వరకు రోడ్డుపైనే బైఠాయించారు. అనంతరం బంద్‌ను పర్యవేక్షించారు. యల్లారెడ్డిపల్లె సర్పంచ్ రవిశంకర్‌రెడ్డి, కొండాయపల్లె మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో 50 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. రాయచోటిలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి నేతృత్వంలో 12, 13, 14 వార్డులకు చెందిన వైఎస్సార్సీపీ నేతలు దశరథరామిరెడ్డి, సాబ్జాన్ ఆధ్వర్యంలో 40 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. మాజీ జెడ్పీ వైస్‌చైర్మన్ దేవనాథరెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి, జాఫర్ తదితర నేతల ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులు బంద్‌ను పర్యవేక్షించాయి. మైదుకూరులో మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి తనయుడు నాగిరెడ్డి నేతృత్వంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బంద్‌ను పర్యవేక్షించారు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, డీసీసీబీ మాజీ చైర్మన్ కొల్లం బ్రహ్మనందరెడ్డి ఉదయం 11.15 నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు రెండు గంటలపాటు రైల్‌రోకో కార్యక్రమాన్ని చేపట్టారు. గూడ్స్‌తోపాటు అర్కొణం, ముంబయి-చెన్నై, కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోయాయి. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. పులివెందులలో నియోజకవర్గ సమన్వయకర్త వైఎస్ అవినాష్‌రెడ్డి నేతృత్వంలో ఆర్టీసీ బస్టాండు నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బోనాల, సిద్దారెడ్డిపల్లె గ్రామాలకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు 50 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. -
కన్నెర్ర
సాక్షి, కడప : జిల్లాలో సమైక్యవాదులు చేపట్టిన బంద్ విజయవంతమైంది. శాంతియుతంగా 65 రోజులుగా కొనసాగుతున్న సమైక్య ఆందోళనలు ఒక్కసారిగా జిల్లాలో ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. తెలంగాణ నోట్‌ను కేంద్ర కేబినేట్ ఆమోదించిందన్న వార్త జిల్లాలో ప్రకంపనలను సృష్టించింది. ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలపై ఆగ్రహం క ట్టలు తెంచుకునేలా చేసింది. వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు ఎవరికి వారు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చారు. కేంద్రంతో అమీ తుమీ తేల్చుకుంటామన్నారు. ఎక్కడికక్కడ రోడ్లపై టైర్లు, మొద్దులు కాలుస్తూ వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేశారు. బంద్‌తో జిల్లా వ్యాప్తంగా జనజీవనం పూర్తి స్థాయిలో స్తంభించిపోయింది. మునుపెన్నడూ లేని విధంగా ఓపీ వైద్య సేవలతోపాటు కూరగాయల అంగళ్లు లేకపోవడం, ఆటోలు కూడా ఎక్కడా తిరగకపోవడం బంద్ తీవ్రతను తెలియజేస్తోంది. కడప నగరంలో సమైక్యవాదులు ఉదయం 6 గంటల నుంచే బంద్‌ను పర్యవేక్షించారు. విష్ణుప్రియ, మయూర హోటళ్లపై దాడి చేశారు. రైల్వే రిజర్వేషన్ కౌంటర్లోని కంప్యూటర్, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో రిజర్వేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. డీసీసీ కార్యాలయంపై వైవీయూ విద్యార్థులు రాళ్లతో దాడి చేశారు. పోలీసులు లాఠీఛార్జి చేసి కొంతమంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆగ్రహించిన సమైక్యవాదులు డీఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించి అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల అరెస్టును నిరసిస్తూ వైవీయూ విద్యార్థులు ఆకాశవాణి కేంద్రాన్ని ముట్టడించారు. డీఎస్పీ రాజేశ్వర్‌రెడ్డి వ్యవహరించిన తీరుపై నిప్పులు చెరిగారు. ఎన్జీఓలు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, అధికారులతోపాటు వైఎస్సార్ సీపీ శ్రేణులు బంద్‌ను పర్యవేక్షించాయి. కడప నగరంలో సాయంత్రం అంబేద్కర్ సర్కిల్ నుంచి కోటిరెడ్డి సర్కిల్ వరకు ఉపాధ్యాయులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాయచోటిలో సమైక్యవాదులు బంద్‌ను పర్యవేక్షించారు. దళిత ఉపాధ్యాయులు, న్యాయవాదులు, మహిళా కండక్టర్లు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. పట్టణంలో బంద్ ప్రశాంతంగా సాగింది. మైదుకూరు పట్టణంలోని నాలుగు వైపుల జాతీయ రహదారులను దిగ్బంధనం చేశారు. ఉద్యోగ జేఏసీ బంద్‌ను పర్యవేక్షించింది. న్యాయవాదులు, ఉపాధ్యాయులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. రైల్వేకోడూరులో జేఏసీ నేతృత్వంలో ఉపాధ్యాయులు రోడ్లపై నిలబడి నిరసన తెలిపారు. ముస్లింలు సోనియా, కేసీఆర్‌తోపాటు కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలకు పాడె కట్టి సాయంత్రం ఐదు గంటల వరకు వైఎస్సార్ సర్కిల్లో ఉంచి నిరసన తెలుపుతూ దహన సంస్కారాలు చేపట్టారు. ఉపాధ్యాయులు దీక్షలు చేపట్టారు. ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు సంఘీభావం తెలిపారు. జమ్మలమడుగులో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రోడ్లపై టైర్లు, మొద్దులు కాలుస్తూ వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. జేఏసీ నేతలు దొరబాబు, రవిబాబు నేతృత్వంలో బంద్‌ను పర్యవేక్షించారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి సంఘీభావం తెలిపారు. బద్వేలులో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పూర్తి స్థాయిలో బంద్ కొనసాగింది. మిద్దెలవారిపల్లె, కోటవీధికి చెందిన యువకులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. పోరుమామిళ్లలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతోపాటు ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఎన్నడూ లేని రీతిలో బంద్ నిర్వహించారు. ద్విచక్ర వాహనాలను సైతం తిరగనీయలేదు. ప్రయాణీకులకు ఇబ్బందిలేకుండా వంటా వార్పు చేపట్టి అన్నదానం చేశారు. రాజంపేటలో ఎన్జీఓల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో వందలాది వాహనాలు ఆగిపోయాయి. టీడీపీ ర్యాలీని ఎన్జీఓలు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. జెండాలు తీసేసి ఉద్యమంలోకి రావాలని ఎన్జీఓలు నినదించారు. పోలీసులు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. బంద్ విజయవంతంగా కొనసాగింది. ప్రొద్దుటూరు పట్టణంలో ఎన్జీఓలు, మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణ నేతృత్వంలో పూర్తి స్థాయిలో బంద్ జరిగింది. ఎన్జీఓ నాయకుడు పాపిరెడ్డిపై దాడికి నిరసనగా బంగారు దుకాణాల వద్ద ైబైఠాయించి నిరసన తెలిపారు. పూర్తి స్థాయిలో వాహనాలను తిరగనీయలేదు. కమలాపురం పట్టణంలో జేఏసీ నేతలు రామ్మోహన్, జాఫర్ సాదిక్, ఎస్.వెంకట రమణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. టైర్లు, మొద్దులు తగులబెట్టి ఆటోలను సైతం తిరగనీయలేదు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. పులివెందులలో ఉద్యోగ జేఏసీ, జేఎన్టీయూ విద్యార్థుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పూల అంగళ్ల కూడలిలో కర్రసాము విన్యాసాలు చేపట్టారు. సోనియా, బొత్స, కేసీఆర్, దిగ్విజయ్‌సింగ్ ఫ్లెక్సీలను చెప్పులతో కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. -
సమైక్య ఘోష.. బతుకమ్మ ఆట
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు సమైక్యవాదుల నిరసనలు... మరోవైపు తెలంగాణవాదుల బతుకమ్మ ఆటపాటలతో రాష్ట్ర పరిపాలనా కేంద్రం శుక్రవారం మార్మోగింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో సచివాలయం అట్టుడికింది. గజానికో పోలీసును కాపలా పెట్టినా ఉద్యమకారులను నిలువరించలేకపోయారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ 31 రోజులుగా విధులకు దూరంగా ఉంటున్న సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు ఆందోళనను మరింత తీవ్రం చేశారు. రాష్ట్రంలో 60 శాతం మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి 60 రోజులుగా ఉద్యమిస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఏకపక్షంగా కేబినెట్లో తెలంగాణ నోట్ ఆమోదించటంపై రగిలిపోయారు. దొంగచాటుగా నోట్ పెట్టి తమ పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారంటూ ఉదయం నుంచే సచివాలయం మెయిన్ గేట్ వద్ద బైఠాయించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ ఆధ్వర్యంలో సచివాలయం ముందు రెండు గంటల సేపు ధర్నా చేపట్టారు. ‘సోనియా... క్విట్ ఇండియా’ రాహుల్ డౌన్‌డౌన్’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. సచివాలయం మెయిన్‌గేట్ వద్ద ధర్నాకు దిగిన దాదాపు 82 మంది ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసి గాంధీనగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం మహిళా ఉద్యోగులు ప్రదర్శనగా వెళ్లి సమత బ్లాక్ వద్ద బైఠాయించారు.‘ కేంద్ర హోం మంత్రి షిండే డౌన్‌డౌన్’ ‘సీమాంధ్ర మంత్రులు డౌన్‌డౌన్’ అని నినదించారు. అరెస్టులతో సమైక్య ఉద్యమాన్ని ఆపలేరని, రాష్ట్ర విభజనను సహించేది లేదని హెచ్చరించారు. అరెస్టు చేసిన ఉద్యోగులను పోలీసులు తిరిగి మధ్యాహ్నం మూడు గంటలకు తిరిగి అక్కడే విడిచిపెట్టటంతో ఉద్రిక్తత నెలకొంది. సమత బ్లాక్ వద్ద ఉన్న ఉద్యమకారులతో జత కలిసి నినాదాలు చేశారు. ఆర్డినెన్స్‌నే చించారు.. కేబినెట్ నోట్‌ను చించలేరా? ‘రాహుల్‌గాంధీ కోసం... రాష్ట్రపతి వద్దకు వెళ్లి వచ్చిన ఆర్డినెన్స్‌నే యూపీఏ ప్రభుత్వం చించివేసింది. ఇంతమంది ప్రజల కోసం తెలంగాణపై కేబినెట్ నోట్‌ను చించలేరా? 60 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న మా ప్రాంత ప్రజల మనోభావాలను పట్టించుకోనప్పుడు ఈ దేశంలో మేము ఎందుకు ఉండాలి? మాకు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ దేశం కావాలంటే ఇస్తారా? ప్రజా సమస్యలను పట్టించుకోని సీమాంధ్ర మంత్రులకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పాలి’ అని సమైక్యాంధ్ర ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడ్డారు. బతుకమ్మ ఆడిన రాజనర్సింహ సతీమణి: తెలంగాణపై నోట్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించటంపై సచివాలయ తెలంగాణ ఉద్యోగులు బతుకమ్మ ఆడి సంబురాలు జరుపుకున్నారు. పెత్రమాస గౌరమ్మకు తొలిరోజు వేసే ఎంగిలి పూల బతుకమ్మను పేర్చి ఘనంగా వేడుక చేసుకున్నారు. కే బ్లాక్‌లోని టీఎన్జీవోస్ కార్యాలయం నుంచి మహిళా ఉద్యోగులు బతుకమ్మలను ఎత్తుకొని ప్రదర్శనగా బయలుదేరారు. నల్లపోచమ్మ గుడివద్ద బతుకమ్మను పెట్టి పూజలు నిర్వహించారు. కొద్దిసేపు ఆడిపాడారు. అక్కడి నుంచి ఫైర్‌స్టేషన్ సమీపంలో బతుకమ్మలను పెట్టి ఆడారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ భార్య పద్మిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా ఉద్యోగులతో కలిసి ఆమె బతుకమ్మ ఆడారు. మహిళా ఉద్యోగులకు తోడుగా పురుష ఉద్యోగులు ర్యాలీగా వెళ్లారు. ‘60 ఏళ్ల ఆకాంక్ష’ ‘వెయ్యికి పైగా అమరుల బలిదానాల ఫలితం’ై‘జె తెలంగాణ’ అంటూ నినదించారు. తెలంగాణ ఉద్యమ గీతాలను ఆలపించారు. అమరుల త్యాగాల్ని గుర్తుచేసుకున్నా రు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేయడంతో కార్యక్రమం ముగిసింది. -
‘టీ’ జోష్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలంగాణ నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడంతో జిల్లాలో రెండో రోజూ ఆనందోత్సాహాలు మిన్నంటాయి. పెత్రామాస రోజే పెద్ద పండుగ వచ్చిందంటూ శుక్రవారం తెలంగాణవాదులు సంబురాలు చేసుకున్నారు. ఆదిలాబాద్, మంచి ర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, ఉట్నూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని అన్ని మండలాలు, గ్రామాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యా యి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ, టీడీపీ, సీపీఐ, న్యూడెమోక్రసీతోపాటు రాజకీయ జేఏసీ, విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, న్యాయవాదుల జేఏసీలు, వృత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చుతూ మిఠాయిలు పంచుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి, తెలంగాణ అమరులకు నివాళులర్పించారు. పెత్రమాస సందర్భంగా తెలంగాణ కోసం అమరులైన వారికి బియ్యం ఇచ్చి స్మరించుకున్నారు. తెలంగాణ ఏర్పాటుపై తక్షణమే పార్లమెంట్లో బిల్లు పెట్టాలని పలువురు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటును కోరుతూ ఆదిలాబాద్ ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ ఎదుట చేపట్టిన రిలే నిరాహారదీక్షలు 1370వ రోజుకు చేరాయి. పల్లెపల్లెన ర్యాలీలు, సంబరాలు ఆదిలాబాద్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయ, న్యాయవాదులు జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. ఎమ్మెల్యే జోగు రామన్న, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద అమరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, బీ జేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రాజేశ్వర్, జనగాం సంతోష్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. బెల్లంపల్లిలో సీపీఐ, కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వేర్వేరుగా ప్రదర్శనలు జరిగాయి. సీపీఐ కార్యాలయం నుంచి కాంటా చౌరస్తా వరకు ఎర్ర జెండాలతో కమ్యూనిస్టులు ప్రదర్శన చేశారు. సీపీఐ శాసనసభా పక్షనేత, ఎమ్మెల్యే గుండా మల్లేశ్ కార్యక్రమంలో పాల్గొని పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టి ఆమోదించే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి స్వీట్లు పంచిపెట్టా రు. నిర్మల్‌లో మాజీ ఎంపీ అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఎల్ఎఫ్ కన్వీనర్‌గా 41 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీలోని సోనియాగాంధీ తదితర నాయకులకు వినతిపత్రం అందజేయడంతోపాటు అప్పటి నుంచి తెలంగాణ కోసం పోరాటం చేసినందుకు కార్యకర్తలు ఆయనను పూలమాలలతో సత్కరించారు. అన్ని నియోజకవర్గాల్లో సంబరాలు మిన్నంటాయి. మంచిర్యాల ఐబీ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ అమరులకు నివాళులు అర్పిస్తూ తెలంగాణ ఏర్పాటుపై సంబరాలు జరుపుతూ మిఠాయిలు పంచుకున్నారు. ముస్లిం సోదరులు బస్టాండ్ సమీపంలో మిఠాయిలు పంపిణీ చేశారు. పెత్రామాస సందర్భంగా మంచిర్యాలలో పెద్దలకు బియ్యం ఇచ్చే క్రమంలో తెలంగాణ అమరులకు బియ్యం తెలంగాణవాదుల ఆధ్వర్యంలో ఇచ్చారు. సీమాంధ్రులు ఎన్నికుట్రలు చేసినా తెలంగాణ నోట్ ఆమోదం పొందిందని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు విలేకరుల సమావేశంలో తెలిపారు. మంచిర్యా ల, మందమర్రి, శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్లో సింగరేణి కార్మికులుతెలంగాణ నోట్ వెలువడిన నేపథ్యంలో సంబురాలు నిర్వహించారు. తెలంగాణ నోట్ ఆమోదంపై గనుల్లో కార్మికులు సంబరాలు జరుపుకున్నారు. శ్రీరాంపూర్‌లో కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి టపాసులు పేల్చుతూ మిఠాయిలు పంపిణీ చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో దండేపల్లి మండల కేంద్రంలో టపాసులు పేల్చి తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. ఉట్నూర్ మండలంలో ఎంపీ రాథోడ్ రమేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంటులో తెలంగాణ బిల్లును కాంగ్రెస్ వెంటనే ప్రవేశపెట్టాలని, తెలంగాణ ఏర్పాటుకు మొ ట్టమొదటి ఓటు తానే వేస్తానన్నారు. జేఏసీ కోకన్వీనర్ షెడ్మకె సీతారాం, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి హరినాయక్ ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. ఆయా మండలాల్లో టపాసులు కాల్చుతూ స్వీట్లు పంచిపెట్టడం, తెలంగాణ విగ్రహాల కు పాలాభిషేకం చేయడం లాంటి కార్యక్రమాలను నిర్వహిం చారు. కడెం మండలంలో జేఏసీ కన్వీనర్ వెంకటరమణ, కాం గ్రెస్ మండల అధ్యక్షుడు మైసయ్య ఆధ్వర్యంలో జన్నారం మండలంలో టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు సత్యం, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి హరినాయక్, జేఏసీ కన్వీనర్ వీరాచారి ఆధ్వర్యంలో ఖానాపూర్ మండలంలో కాంగ్రెస్ మం డల అధ్యక్షుడు గంగారాం, ఇంద్రవెల్లి మండలంలో కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆరె వెంకటేష్ పాల్గొన్నారు. నిర్మల్‌లో జేఏసీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, పంచాయతీ రాజ్ ఇంజినీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వ హించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అమరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. ఆసిఫాబాద్‌లో ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ సంబరాలు నిర్వహించారు. ర్యాలీలు నిర్వహించి, టపాసులు పేల్చారు. మిఠాయీలూ పంచారు. కాసిపేట గనిపై ఐఎన్టీయూసీ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో గేట్మీటింగ్ జరిగింది. తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం కేబినెట్ ఆమోదం తెలుపడంతో చెన్నూర్‌లో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కృష్ణ, యూత్ కాంగ్రెస్ తనుగుల రవి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. మందమర్రిలో బ్లాక్ కాంగ్రెస్ ఉపేందర్ ఆధ్వర్యంలో మిఠాయిలు పంపిణీ చేయగా, బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాంవేణు అధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జైపూర్ మండలం భీమారం గ్రామంలో సీఎస్ఆర్ యువసేన ఆధ్వర్యంలో పొడేటి రవి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. బోథ్ నియోజకవర్గంలో తెలంగాణ నోట్ ఆమోదంపై టీఆర్ఎస్, జేఏసీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. టీఆర్ఎస్ నాయకుడు రాథోడ్ బాపూరావు ఆధ్వర్యంలో టపాసులు పేల్చారు. సొనాలలో టీఆర్ఎస్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. బజార్హత్నూర్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బాణాసంచా పేల్చారు. తలమడుగు మండలం రుయ్యాడిలో టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షులు లోక భూమారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. సిర్పూర్ నియోజకవర్గం కాగజ్‌నగర్, దహెగాంలో సంబురాలు నిర్వహించారు. కాగజ్‌నగర్‌లో టీఆర్ఎస్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు జబ్బార్‌ఖాన్ ఆధ్వర్యంలో, దహెగాంలో యువకులు సంబరాలను జరుపుకున్నారు. టపాకాయలు పేల్చి స్వీట్లు పంచుకున్నారు. -
కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు: కోట్ల
న్యూఢిల్లీ: సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండానే తెలంగాణ నోట్‌ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయానికి నిరసనగానే తాను మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. మిగిలిన వారి గురించి తనకు తెలియదన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్టున్నట్టు తెలిపారు. ఈ సాయంత్రం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసి తన రాజీనామా లేఖ ఇచ్చారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు పల్లంరాజు, చిరంజీవి కూడా అంతకుముందు తమ పదవులకు రాజీనామాలు చేశారు. -
సీమాంధ్రకు 25 కంపెనీల పారా మిలటరీ బలగాలు
హైదరాబాద్: తెలంగాణ నోట్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమయింది. శాంతి భద్రతలు అదుపుతప్పకుండా చూసేందుకు అదనపు భద్రతా బలగాలను రంగంలోకి దించుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో 45 కంపెనీల పారామిలటరీ బలగాలు ఉన్నాయి. అదనంగా 25 కంపెనీల పారా మిలటరీ బలగాలు కావాలని కేంద్రాన్ని కోరింది. కోయంబత్తూరు నుంచి 15, కోల్‌కతా నుంచి 10 పారామిలటరీ బలగాలు రాష్ట్రానికి రానున్నాయి. కేంద్ర కార్యాలయాలు, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం అదనపు బలగాలు కోరినట్టు సమాచారం. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని ఇన్చార్జి డీజీపీ ప్రసాదరావు తెలిపారు. సీమాంధ్ర నాయకులకు అవసరమయితే భద్రత పెంచుతామన్నారు. సమైక్య ఉద్యమకారులు కేంద్ర కార్యాలయాలు టార్గెట్ చేస్తున్నట్టు సమాచారం ఉందని తెలిపారు. ఈ మధ్యాహ్నం శాంతి భద్రతలపై సీఎం కిరణ్ సమీక్ష నిర్వహించారు. ఉద్యమకారులపై ఒక్క రబ్బర్ బుల్లెట్ కూడా ప్రయోగించడానికి వీల్లేదని ఆదేశాలిచ్చారు. -
ఉత్తరాంధ్ర జిల్లాల్లో సమైక్య పోరు
కేంద్ర మంత్రిమండలి ఆమోదించిన తెలంగాణ నోట్ పై సమైక్యవాదులు మండిపడుతున్నారు.కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ సమైక్యవాదులు విశాఖ, విజయనగరం శ్రీకాకుళం, పశ్చిమ,తూర్పు గోదావరి జిల్లాలో కదం తొక్కారు. -
ఎగిసిన సమైక్య జ్వాల
తెలంగాణ నోట్ ను కేంద్రం అమోదించిన అనంతరం సమైక్యాంధ్ర జిల్లాలో సమైక్యహోరు పోటెత్తింది. కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ సమైక్యవాదులు కృష్ణ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు జిల్లాలో కదం తొక్కారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకపోతే తీవ్ర పరిణామాలుంటాయన హెచ్చరిస్తున్నారు. తెలంగాణ నోట్, telangana note, సమైక్యాంధ్ర, samaikyandhra, సీమాంధ్ర, seemandhra -
సీమ జిల్లాల్లో సమైక్య హోరు
తెలంగాణ నోట్ ను కేంద్రం అమోదించిన అనంతరం రాయలసీమ జిల్లాలో సమైక్యహోరు పోటెత్తింది. కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ సమైక్యవాదులు చిత్తూరు, కడప, కర్నూల్, అనంతరపురంలో కదం తొక్కారు. -
సీమాంధ్ర నేతల ముందు మూడు ప్రతిపాదనలు!
హైదరాబాద్ : తెలంగాణ ఏర్పాటు నోటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో... భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. భవిష్యత్ కార్యాచరణపై నాయకులు మల్లాగుల్లాలు పడుతున్నారు. విభజనపై ముఖ్యమంత్రి కిరణ్ చేతులెత్తేయడంతో సీమాంధ్ర నేతలు ఆందోళన చెందుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటే మంచిదనే ఆలోచన చాలా మంది చేస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద రెండు, మూడు ప్రతిపాదనలు సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. మూకుమ్మడి రాజీనామాలు చేయడం ఒక ప్రతిపాదనైతే.. పదవుల్లో కొనసాగుతూ అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం ఓడించడం మరో ప్రతిపాదన. ఇవేవి కాకపోతే... విభనజకు సహకరించడం ఉత్తమమనే ప్రతిపాదన కూడా సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల పరిశీలనలో ఉంది. -
రగిలిపోతున్న సమైక్యవాదులు, కొనసాగుతున్న బంద్
హైదరాబాద్ : రాష్ట్ర విభజనకు కేంద్రం ఆమోదించడంపై సమైక్యవాదులు రగిలిపోతున్నారు. వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చిన 72 గంటల బంద్‌కు సంపూర్ణమద్దతు తెలిపారు. విద్యా, వ్యాపార సంస్థలు స్వచ్చందంగా మూసివేశారు. ప్రెట్రోల్ బంక్‌లు కూడా మూతపడ్డాయి. అర్ధరాత్రి నుంచి తమిళనాడు, కర్ణాటక సరిహద్దు రహదారులను ఆందోళనకారులు మూసివేశారు. శ్రీకాకుళంలోని కాంగ్రెస్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. మంత్రి శత్రుచర్ల కార్యాలయానికి సమైక్యవాదులు తాళాలు వేశారు. ఆంధ్రా ఒడిశా జాతీయ రహదారిపై సమైక్యవాదులు బైఠాయించడంతో భారీగా నిలిచిపోయాయి. విశాఖలోని కేజీహెచ్ హాస్పటల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. అనంతపురం గుంతకల్లులోని GBC కార్యాలయానికి నిప్పుపెట్టారు. తిరుమలకు వెళ్ళే ప్రైవేటు వాహనాలను సమైక్యవాదులు అడ్డుకుంటున్నారు. రోడ్లపై టైర్లుకాల్చి నిరసన తెలుపుతున్నారు. విజయనగరం బొత్స ఇంటిని ముట్టడించారు. ఆయనకు చెందిన కళాశాలపై దాడిచేశారు. మొత్తం సీమాంధ్రలోని 13 జిల్లాలో బంద్ సంపూర్ణంగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినేట్ ఆమోదించడంతో - సీమాంధ్రలో ఉద్యమం ఉగ్రరూపం దాల్చుతోంది. విభజన ప్రక్రియకు నిరసనగా - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి - 72గంటల బంద్ కు పిలుపునివ్వడంతో - తిరుపతిలో ఆ పార్టీ నేతలు బంద్ ను నిర్వహిస్తున్నారు. కేంద్రప్రభుత్వం తీసుకున్న నిరంకుశ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలు నగరంలో నిరసన జ్యాలలు రగులుతూనే ఉన్నాయి. తెలంగాణ నోట్ ను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 72 గంటల బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది. ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసి నేతలు ఇచ్చిన 72 గంటల బంద్ కూడా నిర్విరామంగా కొనసాగుతుంది. వ్యాపారస్థులు, దుకాణాలను స్వచ్చందంగా మూసివేశారు. ఉదయం నుంచి రోడ్లు అన్నీ నిర్మానుష్యంగా మారాయి. తెలంగాణా నోట్ పై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నోట్ ను నిరసిస్తూ అనంతపురంలో జేఎసి పిలుపు నిచ్చిన 48 గంటల బంద్ కొనసాగుతోంది. బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు సహకరిస్తున్నారు. స్వచ్చందంగా షాపులు మూసివేసి ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. బంద్ ప్రభావంతో అనంతపురం నిర్మానుషుంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఉద్యమం కారణాంగా పరిపాలన పూర్తిగా స్తంభించిపోయింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 72 గంటల చిత్తూరు జిల్లాలో బంద్ కొసాగుతోంది. ఈక్రమంలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన తిరుపతిలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తులు ప్రజలు ఎక్కడిక్కడ రహదారులను దిగ్బంధించి తమ నిరసనను తెలుపుతున్నారు. తిరుమలకు వాహనాల రాక పోకలను నిలిపివేశారు. రోడ్డుకు అడ్డంగా టైర్లు వేసి మంటపెట్టారు. దాంతో ఎక్కడిక్కడ ట్రాపిక్ స్తంభించిపోయింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ప్రకాశంజిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి..వైయస్ ఆర్ సిపి ఆధ్వర్యంలో జిల్లాలో బంద్ జరుగుతోంది...వ్యాపార వాణిజ్య సంస్థలతో పాటు విద్యాసంస్థలు మూతబడ్డాయి. హైవేపై ఎన్జీఓలు రాస్తారోకో చేశారు. దాదాపు రెండు గంటల సేపు హైవేని దిగ్బంధించారు. సీమాంద్ర ఆందోళనలను కాంగ్రెస్ అధిష్టానం పట్టింకోకపోవడంపై సమైక్యవాదులు మండిపడుతున్నారు. -
రగులుతున్న సీమాంధ్ర జిల్లాలు
హైదరాబాద్ : కేంద్ర కేబినెట్ నోట్‌కు వ్యతిరేకంగా సీమాంధ్రలో బంద్ కొనసాగుతోంది. రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర మంత్రిమండలి తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన 72 గంటల బంద్ సీమాంధ్రలో జరుగుతోంది. కేంద్ర మంత్రివర్గ నిర్ణయం వెలువడిన కొద్దిసేపటికే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా 72 గంటల బంద్ పాటించాలని నిర్ణయించినట్టు వెల్లడించిన విషయం తెలిసిందే. సీమాంధ్రలోని 1౩ జిల్లాల్లో ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తాయి. ఎక్కడికక్కడ సమైక్యవాదులు ఆందోళనలు ఉధృతం చేశారు. ఉదయం నుంచే వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, సమైక్యవాదులు రోడ్లపైకి వచ్చి తమ నిరసనలు తెలియచేస్తున్నారు. -
పులివెందులలో 72 గంటల పాటు బంద్
పులివెందుల : తెలంగాణ నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై సీమాంధ్రలో ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్నాయి. సమైక్యాంధ్రులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 72 గంటల బంద్ కొనసాగుతోంది. పులివెందులలో 72 గంటలు, ప్రొద్దుటూరులో రెండు రోజుల పాటు బంద్ జరగనుంది. మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి, సమన్వయకర్త మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో కమలాపురంలో బంద్ కొనసాగుతోంది. ఇక ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రాజంపేటలో బంద్ జరుగుతోంది. కాగా విద్యాసంస్థలను బంద్ చేస్తున్నట్టు కళాశాలల జేఏసీ ప్రకటించగా... సీమాంధ్ర జేఏసీ పిలుపుతో ఏపీఎన్జీవోలు, ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు, విద్యార్థి జేఏసీ, న్యాయవాద జేఏసీలు సంయుక్తంగా 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చాయి. -
తెలంగాణ నేతల హర్షం
తెలంగాణ ప్రక్రియ వేగవంతం చేయాలి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసి పార్లమెంటులో వె ంటనే బిల్లు పెట్టాలి. బిల్లును పార్లమెంట్లో పెట్టేవరకూ తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ చరిత్రాత్మక నిర్ణయం తెలంగాణ నోట్‌ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించడం చరిత్రాత్మక నిర్ణయం. తెలంగాణ ప్రజల 56 ఏళ్ల ఆకాంక్షలను సాఫల్యం చేస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. రాజకీయ ప్రక్రియ పూర్తయి, రాజ్యాంగ ప్రక్రియ మొదలైంది. ఇక తెలంగాణ ఏర్పాటుకావడం ఖాయం. విభజన వద్దని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు, ప్రతిపక్ష నేత చంద్రబాబు, వైఎస్.జగన్మోహన్రెడ్డిలు ఇప్పటికీ మాట్లాడటం శోచనీయం. వైషమ్యాల్లేకుండా పరస్పర సహకారంతో విభƒ జనకు సహకరించాలి -కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్ని పార్టీలు ప్రజలకు నచ్చజెప్పాలి అన్ని పార్టీలతోపాటు కాంగ్రెస్‌లోనూ విస్తృత సంప్రదింపుల తరువాతే నిర్ణయం జరిగింది. సీమాంధ్ర నేతలు ఇందుకు సహకరించాలి. విడిపోవడం బాధాకరమే అయినప్పటికీ సంయమనంతో వ్యవహరించాలి. విగహ్రాల ధ్వంసం వద్దు. విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసుందాం. అన్ని పార్టీలు ప్రజలకు నచ్చజెప్పాలి - కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి దొరలు, పెట్టుబడిదారులకు రాజ్యాధికారం దక్కరాదు హైదరాబాద్‌కు యూటీ గండం తప్పింది. తెలంగాణలో రాజ్యాధికారం దొరల చేతికి, సీమాంధ్రలో పెట్టుబడిదారుల చేతికి వెళ్లకుండా అణగారిన కులాలను అప్రమత్తం చేయాలి. తెలంగాణ, సీమాంధ్ర పునర్నిర్మాణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు భాగస్వాములు కావాలి. తెలంగాణ బిల్లును పార్లమెంటులో త్వరగా ప్రవేశపెట్టి ఆమోదింపచేయాలి. -ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ బిల్లు ఆమోదం పొందితేనే సంబరాలు తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందితేనే ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. కేబినెట్ నోట్‌తో సంతోషపడేది లేదు. తెలంగాణ ప్రకటన తర్వాతి పరిణామాలతో కాంగ్రెస్‌ను ప్రజలు విశ్వసించడం లేదు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణను ఏర్పాటు చేస్తూ వెంటనే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలి. ఇదే మా డిమాండ్. -టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పునర్నిర్మాణం పై దృష్టిపెడదాం కేబినెట్ నోట్‌కు ఆమోదం లభించిన నేపథ్యంలో తెలంగాణ పునర్నిర్మాణంపై దృష్టిపెడదాం. తెలంగాణవాదులెవరూ అనవసర వివాదాలకు వెళ్ల వద్దు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటవుతున్న తరుణంలో అన్ని వర్గాలకు సముచిత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే విధంగా ప్రణాళికను రూపొం దించుకుందాం. - టీఆర్ఎల్డీ నేత దిలీప్‌కుమార్ అడ్డుకునేవారుంటారు... జాగ్రత్త జీవితంలో ఏనాడూ లేనంత ఆనందం ఇప్పుడు కలిగింది. కేబినెట్ ఆమోదంతోనే అంతా అయిపోయిందని అనుకోవద్దు, ఈ సమయంలోనూ అడ్డుకునేవారు ఉంటారు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణ సాధన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. తెలుగుజాతిలో చిచ్చుపెట్టారని అంటున్న చంద్రబాబుకు తెలంగాణ వారిది తెలుగుజాతి అని తెలియదా? రాష్ర్టంలోని 42 శాతం మంది తెలంగాణవారు, సీమాంధ్రలో జైఆంధ్రా అంటున్న 10-15 శాతం మంది కూడా విభజనను కోరుతున్న విషయాన్ని గమనించాలి. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలు చిన్నపిల్లల చర్యల్లాంటివి. -టీఆర్ఎస్ సీనియర్ నేత కె.కేశవరావు తెలంగాణ ఏర్పాటు వరకు పోరాటం తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర మంత్రివర్గ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందే వరకు అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు పోరాటం కొనసాగిస్తాం. - తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్ -
ఎక్కడికక్కడి ముట్టడి
సాక్షి, నెట్వర్క్: కేంద్రకేబినెట్ ముందు తెలంగాణ నోట్ ప్రవేశపెడుతున్నారనే వార్త గురువారం సీమాం ధ్రను వేడెక్కించింది. భగ్గుమన్న సమైక్యవాదులు ప్రజాప్రతినిధులే లక్ష్యంగా ఉద్యమాన్ని ఉధృతం చేశారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే ల ఇళ్లు, కార్యాలయాలను ముట్టడించారు. హోరున వర్షం కురుస్తున్నా ఉద్యోగులు ఇళ్ల ముట్టడి కార్యక్రమం కొనసాగించారు. అక్కడ వంటావార్పు చేయడంతోపాటు, దీక్షలకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కేంద్రమంత్రి పళ్లంరాజు, రాజమండ్రిలో ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఇళ్ల ఎదుట ఉద్యోగులు 48 గంటల దీక్ష చేపట్టారు. నెల్లూరులోని కేంద్రమంత్రి పనబాకలకిష్మ ఇంటిని ముట్టడించేం దుకు యత్నించిన సమైక్యవాదులను పోలీసులు అడ్డుకున్నారు. విశాఖలోని కేంద్రమంత్రి పురందేశ్వరి ఇంటిని, ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కార్యాలయాన్ని, అనంతపురం, గోరంట్లలో ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, నిమ్మల కిష్టప్ప ఇళ్లతో పాటు కళ్యాణదుర్గంలో మంత్రి రఘువీరారెడ్డి ఇళ్లను ముట్టడించారు. అనంతపురంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు పార్థసారధి, ఎమ్మెల్యే పరిటాల సునీతను జేఏసీ నేతలు నిలదీశారు. కర్నూలులో కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి, ఆత్మకూరులో న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి ఇళ్లను ముట్టడించారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం అయిభీమవరంలో ఎంపీ, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు ఇంటి ఎదుట వంటావార్పు నిర్వహిం చారు. నరసాపురం బస్టాండ్ సెంటర్లో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ శిబిరం వద్ద మంత్రి పితాని సత్యనారాయణను సమైక్యవాదులు అడ్డుకున్నారు. విజయనగరంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నివాసం, గరివిడిలోని ఆయన క్యాంప్ కార్యాలయం వద్ద, గజపతినగరంలో ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య క్యాంప్‌క కార్యాలయం వద్ద విద్యార్థులు ఆందోళన చేశారు. కురుపాంలోని కిశోర్‌చంద్రసూర్యనారాయణ దేవ్ ఇంటి ఎదుట వంటావార్పు చేపట్టారు. భారీవర్షం కురుస్తున్నా వెనకడుగు వేయలేదు. ఓ సమయంలో కోటలోకి దూసుకునేందుకు యత్నించగా, మంత్రి తల్లి మృతి చెందారన్న వార్త తెలియడంతో సమైక్యవాదులు మౌనం పాటించి సంతాపం ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కేంద్రమంత్రి కిల్లి కృపారాణి, ఆమదాలవలసలో ఎమ్మెల్యేలు బొడ్డేపల్లి సత్యవతి, పాలకొండలో నిమ్మక సుగ్రీవుల ఇళ్లను, రాజాంలో మంత్రి కోండ్రు మురళి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. తిరుపతిలో ఎంపీలు చింతామోహన్, శివప్రసాద్ ఇళ్లను సమైక్యవాదులు ముట్టడించారు. -
భగ్గుమన్న సీమాంధ్ర
న్యూస్‌లైన్ నెట్వర్క్ : తెలంగాణ నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై గురువారం సీమాంధ్రలో ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. సమైక్యాంధ్రులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 72 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. విద్యా సంస్థలను బంద్ చేస్తున్నట్టు కళాశాలల జేఏసీ ప్రకటించగా.. సీమాంధ్ర జేఏసీ పిలుపు మేరకు ఏపీఎన్జీఓలు, ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు, విద్యార్థి జేఏసీ, న్యాయవాద జేఏసీలు సంయుక్తంగా 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆర్టీసీ, న్యాయవాద, ఉద్యోగ, విద్యార్థి జేఏసీల నేతలు కొవ్వొత్తుల చేతపట్టుకుని మానవహారంగా ఏర్పడ్డారు. అమలాపురంలో మెరుపు బంద్‌కు దిగి దుకాణాలు బంద్ చేయించారు. టీ నోట్‌గా పేర్కొన్న ప్రత్రాలను తగులబెట్టారు. కొత్తపేటలో కాంగ్రెస్‌పార్టీ కార్యాలయం బోర్డులను ధ్వంసం చేశారు. 16వ నెంబరు జాతీయ రహదారిపై ఎరవ్రరం, ప్రత్తిపాడుల వద్ద జాతీయ రహదారులు దిగ్భంధం చేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులు రాత్రి తొమ్మిది గంటల సమయంలో విశాఖలోని ఆయన ఇంటిని ముట్టడించారు. ఆంధ్ర యూనివర్శిటీ విద్యార్థులు రోడ్డెక్కి కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా నినాదాలు చేశారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళన నిర్వహించారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాములు కూడలి వద్ద టీవీలు పగులకొట్టి, టైర్లు కాల్చి నిరసన తెలిపారు. విజయవాడ బెంజి సర్కిల్లో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఏపీ ఎన్జీవోలు కొవ్వొత్తులు వెలిగించి నిరసన ప్రదర్శన నిర్వహించి, క్యాబినెట్ దిష్టిబొమ్మను దహనం చేశారు. జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు అనంతపురంలో భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్మించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే, వైస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేత శోభా నాగిరెడ్డి ఆధ్వర్యంలో రాత్రి 10గంటల సమయంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఎమ్మిగనూరులో కాంగ్రెస్, టీడీపీ దీక్షా శిబిరాలను ధ్వంసం చేశారు. డోన్‌లో రైల్యే పట్టాలపై టైర్లకు నిప్పుపెట్టారు. వెల్దుర్తి వద్ద సమైక్యవాదులు జాతీయరహదారిపై ధర్నా చేపట్టడంతో రాకపోకలు స్తంభించాయి. కర్నూలు కలెక్టరేట్ కూడలిలో ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి నాయకులు రాస్తారోకో నిర్వహించి టైర్లకు నిప్పంటించారు. గుంటూరు జిల్లా తెనాలిలోని సమైక్యవాదులు, ఎన్జీవో సంఘ నాయకులు గాంధీచౌక్‌లో కేంద్ర మంత్రుల ఫ్లెక్సీలను దహనం చేశారు. బోసురోడ్డు, టెలిఫోన్ ఎక్సే్ఛంజ్, మారీసుపేట, చెంచుపేటల్లోని బార్ అండ్ రెస్టారెంట్లపై దాడులు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, కొత్తపేటల్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై గురువారం రాత్రి సమైక్యవాదులు దాడి చేశారు. రాజమండ్రి కార్యాలయంలో ఇన్వర్టర్పై కిరోసిన్ పోసి నిప్పంటించడానికి ప్రయత్నించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి కోర్టు జంక్షన్లో గురువారం సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది గంటల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఆర్వీ సుజయకృష్ణ రంగారావు ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు రాస్తారోకో చేశారు. రోడ్డుకు అడ్డంగా టైర్లు కాల్చి నిరసన తెలిపారు. తిరుపతిలో సెల్ టవర్, పోస్టాఫీసులకు నిప్పు తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి ఎదురుగా రైల్వే ట్రాక్ వద్దనున్న సెల్ టవర్ జనరేటర్‌ను గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. ఎస్వీ యూనివర్శిటీలోని పోస్టాఫీసుకు నిప్పుపెట్టారు. పోస్టాఫీసు లోపల పడుకొని వున్న సిబ్బంది అప్రమత్తమై వంటలు అర్పారు. ఎన్జీవోలు తిరుపతి-తిరుమల బైపాస్ రోడ్డును దిగ్బంధించారు. లీలా మహల్ సర్కిల్లో మంటలు వేసి వాహనాలను రాకపోకలను అడ్డుకున్నారు. టీ నోట్ ఆమోదం మనస్తాపంతో నలుగురు మృతి తెలంగాణ నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో మనస్తాపం చెంది నలుగురు సమైక్యవాదులు గుండె ఆగిపోయి మృతిచెందారు. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన ఎంఎంపీ గౌస్(77), విజయనగరం జిల్లా పార్వతీపురంలోని అగ్రహారం వీధికి చెందిన తిరుమరెడ్డి ఈశ్వర్రావు(47), తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లికి చెందిన రాయవరపు నరసింహారావు (85), వాడపర్రుకు చెందిన తొరం బులి సత్యనారాయణ(65) మరణించారు. తిరుమలకు వాహనాల రాకపోకలు నిలిపివేత తెలంగాణ నోట్‌ను క్యాబినెట్ ఆమోదించడంతో తిరుపతి ఏపీ ఎన్జీవోలు, ఆర్టీసీ జేఏసీ నాయకులు శుక్రవారం తిరుపతి బంద్‌కు పిలుపునిచ్చారు. తిరుమలకు వెళ్లే వాహనాలకు కూడా మినహాయింపు లేదన్నారు. తిరుపతిని పూర్తిగా దిగ్బంధం చేస్తామని, ఏ వాహనాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానుండగా శుక్రవారం బంద్‌కు పిలుపునివ్వడంతో టీటీడీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. విభజన ప్రక్రియ ప్రారంభించిన తర్వాత తిరుమలకు వాహనాలను నిలిపివేయడం ఇది మూడోసారి. ఎస్వీయూ విద్యార్థి జేఏసీ నాయకులు సీమాంధ్ర బంద్‌కు పిలుపునిచ్చారు. విద్యాసంస్థలు కూడా బంద్‌లో పాల్గొంటాయని తె లిపారు. టీనోట్‌పై గురువారం అనంతపురం జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. టీ నోట్ విషయం తెలియగానే ఎస్కేయూలో విద్యార్థులు రగిలి పోయారు. 205 జాతీయ రహదారిపై యూపీఏ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి.. రెండు గంటల పాటు వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. -
కేంద్ర నిర్ణయం దుర్మార్గపు చర్య: కాసు
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నోట్‌ను ఆమోదించడం దుర్మార్గమైన, అన్యాయమైన, అక్రమమైన చర్య అని రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి మండిపడ్డారు. గురువారం రాత్రి సాక్షితో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మొట్టమొదటగా రాజీనామాలేఖను సీఎంకు తానే అందించానని, శుక్రవారం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి ఆ లేఖను గవర్నర్‌కు పంపి ఆమోదింప చేయాలని కోరతానని చెప్పారు. తన నియోజకవర్గానికి వచ్చి కార్యకర్తలతో సమావేశమయ్యాక తుది నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. -
టీ-నోట్ ఆమోదంపై ఆగ్రహ జ్వాలలు
సాక్షి,నెల్లూరు: తెలంగాణా నోట్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో సింహపురి ప్రజలు ఒక్కసారి గా భగ్గుమన్నారు. జూలై 30న సీడబ్ల్యూసీ చేసిన తీర్మానం మేరకే రాష్ట్ర విభజనకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిందన్న వార్తలను టీవీల్లో చూసిన జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఆగ్రహావేశాలతో వీధుల్లోకి వచ్చారు. జిల్లా వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించారు. కాంగ్రెస్ అధిష్టానంపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర విభజనకు కారణమైన తెలుగుదేశం పార్టీపై మరింత ఆగ్రహం చెందారు. ముఖ్యంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రత్యక్ష ఆందోళనకు దిగాయి. నెల్లూరురూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు స్థానిక ఆర్టీసీ బస్టాండువద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు తాటి వెంకటేశ్వర్లు, నరసింహయ్యముదిరాజ్, మందా బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ సిటీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్ నేతృత్వంలో స్థానిక గాంధీబొమ్మసెంటర్‌లో తొలుత దీపపు బెలూన్లను వదిలి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు టైర్లను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముక్కాల ద్వారకానాధ్, లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, రూప్‌కుమార్‌యాదవ్, సంక్రాంతి కల్యాణ్, బార్ల వెంకటేశ్వర్లు, ముప్పసాని శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కావలిలో పార్టీ శ్రేణులు వీధుల్లోకి వచ్చిన సోనియా దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఉదయగిరిలో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు సీమాంధ్ర మంత్రుల చిత్రపటాలను దగ్దం చేశారు. దుత్తలూరులో పార్టీ శ్రేణులు సోనియా దిష్టిబొమ్మను దగ్దం చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో వైఎస్సార్సీపీ శ్రేణులతోపాటు సమైక్యవాదులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి సోనియా దిష్టిబొమ్మలను దగ్దం చేశారు. నగరంలోని వేదాయపాళెం రైల్వే స్టేషన్, కల్లూరుపల్లి సిగ్నల్‌పాయింట్ నడుమ రాత్రి గూడ్స్ రైళ్లను ఆందోళనకారులు అడ్డుకున్నారు. చెన్నై వైపు వెళ్తున్న రైలుకు గుర్తు తెలియని వ్యక్తులు ఎర్రజెండా చూపించి రైలును నిలిపివేశారు. చెన్నై నుంచి వస్తున్న మరో గూడ్స్ రైలును ఆందోళనకారులు నిలిపివేశారు. రైళ్లు నిలిచిన విషయం ఆలస్యంగా తెలుసుకున్న రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సిగ్నల్ ఇచ్చి రాకపోకలను పునరుద్దరించారు. ఎర్రజెండా ఊపి రైళ్లను నిలిపిన ఆందోళన కారులు మాత్రం రైల్వేపోలీసులు, అధికారులు వచ్చి అడ్డుకున్నారు. జై సమైక్యాంధ్ర నినాదాలతో సమైక్యవాదులు హోరెత్తించారు. నిరసన దీక్షలు ఆపి ఉద్యమంలో పాల్గొనండి - శ్రేణులకు వైఎస్సార్సీపీ అధిష్టానం పిలుపు రాష్ట్ర విభజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో తక్షణం బుధవారం నుంచి జరుగుతున్న ఆమరణ నిరాహారదీక్షలను విరమించుకొని శుక్రవారం జరగబోయే 72గంటల బంద్‌లో పాల్గొనాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధిష్టానం సూచించడంతో రెండు రోజులుగా నిరాహారదీక్షల్లో ఉన్న పార్టీ సమన్వయకర్తలు గురువారం అర్థరాత్రి 11 గంటల ప్రాం తంలో ఆమరణ నిరాహారదీక్షలను విరమించారు. అయితే నిరాహారదీక్షల స్థానంలో పార్టీ కార్యకర్తలు రిలేనిరాహారదీక్షలు కొనసాగిస్తారని పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీ గురువారం రాత్రికి సాక్షికి తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ సమైక్యాంధ్రకోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్న నేపథ్యంలో 72గంటల బంద్‌ను విజయవంతం చేయడంకోసం సమన్వయకర్తలతోపాటు పార్టీ శ్రేణులు కృషి చేస్తాయని ఆయన తెలిపారు. అధిష్టానం పిలుపుతో నెల్లూరు రూరల్ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, సిటీ నియోజకవర్గ సమన్వయకర్త అనిల్‌కుమార్‌యాదవ్ దీక్షను విరమించారు. కోటంరెడ్డికి పార్టీ కన్వీనర్ మేరిగ మురళీధర్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అలాగే పార్టీ సమన్వయకర్త సీఈసీ సభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డితోపాటు అన్ని నియోజకవర్గాలకు చెందిన ముఖ్యనేతలు దీక్షను విరమించారు. -
టీ నోట్‌ను ఎందుకు చించరు: వాసిరెడ్డి పద్మ
సాక్షి, హైదరాబాద్: నేరచరిత నేతలకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను చించేసినపుడు తెలంగాణ నోట్‌ను ఎందుకు చించేయరని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన నోట్‌ను కేంద్ర మంత్రివర్గంలో ప్రవేశ పెట్టడం అంటే యావత్ సీమాంధ్ర ప్రజలను తీవ్రంగా అవమానించడమేనని, ఆ ప్రాంతంలో జరుగబోయే పరిణామాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు. ఆమె గురువారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, 65 రోజులుగా సీమాంధ్ర ఉద్యమంతో అట్టుడుకుతోంటే కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ నోట్‌పై చర్చ జరుగుతున్నా ఆపడానికి ఏ మాత్రం ప్రయత్నం చేయకుండా ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ఇంకా డ్రామాలాడుతున్నారని ఆమె విమర్శించారు. తన లేఖను వెనక్కి తీసుకోకుండా చంద్రబాబు రాష్ట్రానికే కాదు, యావత్ తెలుగు ప్రజలందరికీ ద్రోహం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. -
65వ రోజు ఉవ్వెత్తున ఎగిసిన నిరసన
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: సమైక్య రాష్ట్రం కోసం జిల్లా వాసులు చేస్తున్న ఉద్యమం కట్టలు తెచ్చుకుంది. 65 రోజులుగా విధులు బహిష్కరించి, జీతాలు లేకుండా శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న వివిధ వర్గాలకు చెందిన నిరసనకారులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో తెలంగాణ నోట్ తయారైందన్న వార్తను విన్న నిరసనకారులు ఒక్కసారిగా తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు. ప్రత్యేకంగా ప్రజాప్రతినిధులు అలసత్వం వల్లనే రాష్ట్రానికి ఇటువంటి పరిస్థితి దాపురించిందంటూ వారి ఇళ్లను ముట్టడించటంతో పాటు వారి తీరును తూర్పారబట్టారు. రాత్రి వరకు తమ పట్టును వీడకుండా నిరసనకారులు ఆందోళన కొనసాగించారు. ప్రధానంగా జిల్లాలో కుటుంబ పాలన సాగిస్తున్న బొత్స సోదరులకు జీవిత కాలం రాజకీయ నిషేధం విధించటంతో పాటు, జిల్లా నుంచి వారిని బహిష్కరించాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ విషయంలో జిల్లా ప్రజలంతా సమిష్టిగా ఉండాలని విజ్ఞప్తిచేశారు. విశాలాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునివ్వటంతో పాటు మంత్రి బొత్స ఇంటి ముట్టడికి తరలిరావాలని పిలుపునిచ్చారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు జిల్లాలో ఎంపీ ఇళ్ల ముందు చేపటి ్టన 48 గంటల వంటా వార్పు విజయనగరంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. వివిద ఉద్యోగ సంఘాల నేతృత్వంలో ఉదయం 8 గంటలకే మంత్రి బొత్స ఇంటి వద్దకు చేరుకున్న ఉద్యమకారులు 11 గంటల సమయంలో తెలంగాణ నోట్ తయారైందన్న వార్త తెలుసుకుని నిరసనను ఉధృతం చేశారు. మంత్రి ఇంటిని ముట్టడించేందుకు యత్నించగా అప్పటికే మోహరించిన పోలీసు బలగాలు అడ్డుకున్నాయి. అయినా వెనక్కి తగ్గని ఉద్యమకారులు 12 గంటల సమయంలో ఒక్కసారిగా బారీకేడ్లను, పోలీసులను తోసుకుని మంత్రి ఇంటి వద్దకు చేరుకుని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ ఘటనలో పోలీసులు, నిరసకారులు మధ్య జరిగిన తోపులాటలో మొత్తం ఐదుగురు ఉద్యమకారులకు స్వల్ప గాయాలయ్యాయి. గరివిడిలో బొత్స క్యాంపు కార్యాలయాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు ముట్టడించారు. గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య క్యాంప్ కార్యాలయ ముట్టడి యత్నించిన ఉద్యోగులు, విద్యార్థులపై పోలీసులు దౌర్జన్యానికి దిగటంతో ప్రతిఘటించిన నిరసనకారులు క్యాంప్ కార్యాలయంపై రాళ్లు రువ్వారు. అంతేకాకుండా కురుపాంలో కేంద్రమంత్రి కిషోర్‌చంద్రదేవ్ ఇంటిని వేల మంది సమైక్యవాదులు ముట్టడించి జేఏసీ పిలుపు మేరకు వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. జోరు వానలోను ఉద్యమస్ఫూర్తితో ముందుకు కదిలారు. ఈ నేపథ్యంలో మంత్రి ఇంట్లోకి నిరసనకారులు వెళ్లేందుకు యత్నించగా కొద్దిపాటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 65వ రోజు మిన్నంటిన నిరసనలు విజయగనరంలో ఏపీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, పాఠశాలల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పట్టణంలో కళాజాత నిర్వహించా రు. ఇందులో భాగంగా గంగిరెద్దులు, తప్పెటగుళ్లు, బుఱ్ఱకథ కళాకారులచే పట్టణంలోని అన్ని ప్రధాన జంక్షన్లలో ప్రదర్శనలు నిర్వహించి విభజన వలనే కలిగే నష్టాలను ప్రజలకు వివరించారు. విశాలాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో కేంద్రం రూపొందిం చిన తెలంగాణ నోట్‌ను వ్యతిరేకిస్తూ మంత్రి బొత్స ఇంటి ముందు సోనియా, దిగ్విజయ్, షిండే , బొత్స, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మున్సిపల్ ఉద్యోగులు గంటస్తంభం వద్ద నిరసన చేయగా... వైద్య ఉద్యోగులు మొక్కలు నాటుతూ నిరసన వ్యక్తం చేశారు. చీపురుపల్లిలోని మూడురోడ్ల జంక్షన్లో పట్టణంలోని కళాశాలలకు చెందిన విద్యార్థులు, ఎన్జీఓ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు భారీ ఎత్తున ధర్నా నిర్వహించి విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. నెల్లిమర్ల మండల కేంద్రం లో నాయీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించింది. నగర పంచాయితీ పరిధిలోని ప్రధాన కూడళల్లో బ్యాండు పార్టీలతో ప్రదర్శన నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సమైక్యవాదులపై పోలీసుల దాడికి నిరసనగా జేఏసీ నేతలు తీవ్రంగా స్పందించారు. విజయనగరం-పాలకొండ రహదారిపై గంటసేపు రాస్తారోకో చేపట్టారు. భోగాపురం మండల కేంద్రంలో కూడా ఉపాధ్యాయ జేఏసీ, ఏపీఎన్జీఓలు వేర్వేరుగా రాస్తారోకోలు చేపట్టారు.వీరికి మండల కల్లుగీత కార్మిక సంఘం సంఘీబావం తెలిపింది. పూసపాటిరేగ ప్రధాన రహదారిపై విద్యార్థులు మాక్ డ్రిల్ నిర్వహించారు. అలాగే యోగాసనాలు వేసి నిరసనలు చేపట్టారు. డెంకాడ మండలాల్లో కూడా సమైక్యవాదులు ఆందోళనలు చేపట్టారు. ఎస్.కోటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీల ఆధ్వర్యంలో వేర్వేరుగా సోనియా, బొత్స దిష్టి బొమ్మలను దహనం చేశారు. సాలూరులో జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్భందించి నిరసన చేయగా.. మున్సిపల్ ఉద్యోగులు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. బొబ్బిలిలో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు రాస్తారోకో చేయగా... బాడంగి మండలంలో ఉపాధ్యాయ, ఉద్యోగుల జేఏసీ అధ్వర్యంలో చెవిలో పువ్వులు పెట్టుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. జోరు వర్షంలో గొడుగులతో నిలబడి సమైక్య నిరసనలు తెలిపారు. రామభద్రపురంలో ఉపాధ్యాయుల రాస్తారోకో చేశారు. బెలగాంలో మహిళలు చేతిపై సమైక్యాంధ్ర ఆకారంలో గోరింటాకు పెట్టుకుని నిరసన చేయగా.. న్యాయవాదులు, కోఆపరేటివ్ సొసైటీ ఉద్యోగులు నిరాహారదీక్ష చేశారు. -
టీ-నోట్ ఆమోదంపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : కేంద్ర మంత్రివర్గం తెలంగాణ నోట్‌ను ఆమోదించడంతో గురువారం జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టెక్కలిలో కేంద్ర మంత్రి కృపారాణి ఇంటిని ముట్టడించారు. ఆమె లేకపోవడంతో అక్కడే వంటావార్పు.. భోజనాలు చేసి.. ధర్నా నిర్వహించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా కేంద్రం నుంచి ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు హాజరయ్యారు. మంత్రి పదవిపై మోజు తప్ప కృపారాణికి ప్రజా ప్రయోజనాలు పట్టడం లేదని వారు విమర్శించారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే కళ్లున్న కబోదుల్లా వ్యవహరించటమేమిటని ప్రశ్నించారు. ఇప్పటికే పలుమార్లు మంత్రిని కలిసి విన్నవించినా ఎలాంటి ప్రయోజనం దక్కలేదని వాపోయారు. రాజాంలో సమైక్యవాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని పీకివేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. అక్కడినుంచి నేరుగా మంత్రి కోండ్రు మురళీమోహన్ క్యాంపు కార్యాలయం వద్దకు వెళ్లి బైఠాయించారు. మంత్రి పదవికి రాజీనామా చేసి వెంటనే సమైక్య ఉద్యమంలోకి రాకుంటే రాజకీయ జీవితమే లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాతపట్నంలో అటవీశాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు క్యాంపు కార్యాలయాన్ని సమైక్యవాదులు ముట్టడించారు. ఆయన తీరుపై మండిపడ్డారు. వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీ నోట్‌పై కేంద్ర మంత్రివర్గం చర్చిస్తోందని తెలిసినా చీమకుట్టినట్లు కూడా లేకుండా పోయిందని నిరసించారు. పాతపట్నంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. మెళియాపుట్టిలో బంద్ పాటించారు. ఆమదాలవలసలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సమైక్యవాదులు కలిసి బంద్‌కు పిలుపునివ్వటంతో వ్యాపారులు దుకాణాలను మూసివేశారు. శ్రీకాకుళంలోని వైఎస్ఆర్ కూడలిలోని వైఎస్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు బంద్‌కు పిలుపునివ్వడంతో వ్యాపారులు షాపులు మూసివేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని విమర్శించారు. పాలకొండలో వైఎస్ఆర్సీపీ నాయకులు రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలం వద్ద సమైక్యవాదులు జాతీయ రహదారిని రెండు గంటలపాటు దిగ్బంధించారు. శ్రీకాకుళంలో గురువారం రాత్రి వైఎస్ఆర్సీపీ నాయకత్వాన పలువురు నాయకులు వైఎస్ఆర్ కూడలిలో యూపీఏ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మూడు రోజుల పాటు ప్రజలు బంద్ పాటించాలని కోరారు. ఇచ్చాపురంలో వైఎస్ఆర్సీపీ నేతృత్వంలో బస్టాండ్ సెంటర్ వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన తెలిపారు. పలాసలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో దీక్ష శిబిరం వద్ద టీ నోట్‌ను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా చైర్మన్ హనుమంతు సాయిరామ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో టీవీలు బద్దలు కొట్టి, టైర్లు కాల్చి నిరసన తెలిపారు. రెండురోజుల బంద్ పాటించాల్సిందిగా జేఏసీ నేతలు పిలుపు నిచ్చారు. నరసన్నపేటలో జాతీయ రహదారిపై జేఏసీ నేతలు బైఠాయించారు. -
మూడు వారాల ముందే తెలంగాణ నోట్ సిద్ధం!
కేంద్ర కేబినెట్ ముందుకు వచ్చిన తెలంగాణ నోట్ రూపకల్పన వెనక దాదాపుగా మూడు వారాల కసరత్తు దాగుందని సమాచారం. కాకపోతే సెప్టెంబర్ 25 నాటికి అది తమకు చేరని కారణంగా దాన్ని గురువారం నాటి కేబినెట్ భేటీ అజెండాలో చేర్చలేకపోయినట్టు కేబినెట్ సచివాలయంలోని అత్యున్నత వర్గాలు తెలిపాయి. కేబినెట్ ఎజెండా వారం రోజుల ముందే ఖరారవుతుందని, ఒక రోజు ముందు దాన్ని విడుదల చేస్తామని గుర్తు చేశాయి. నిజానికి దాన్ని ప్రధాని కార్యాలయంతో పాటు కేబినెట్ సచివాలయానికి కూడా రెండు వారాల ముందే కేంద్ర హోం శాఖ పంపినట్టు తెలుస్తోంది. కానీ ప్రధాని కార్యాలయ అభిప్రాయాల కోసం అది వారం పాటు పీఎంఓలోనే ఉండిపోయిందని సమాచారం. అంటే, విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న ఉద్యమాన్ని ఏ మాత్రమూ ఖాతరు చేయకుండా మూడు వారాలుగా తెలంగాణ నోట్ తయారీలో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ సర్కారు తలమునకలైందన్నమాట! -
తెలంగాణ నోట్ ఆమోదంతో నోళ్లన్నీ తీపి
సిద్దిపేట అర్బన్, న్యూస్‌లైన్: తెలంగాణ నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో తెలంగాణవాదులు గురువారం రాత్రి సిద్దిపేటలో సంబరాలు జరుపుకున్నారు. పలువురు మిఠాయిలు పంచుతూ నోళ్లు తీపి చేశారు. అంబేద్కర్ సర్కిల్లో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. టీఆర్ఎస్ నాయకుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు ఆధ్వర్యంలో టీఆర్ఎస్, టీఆర్ఎస్వీ, ఉపాధ్యాయ జేఏసీ నేతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆపస్, బీజేపీ నాయకులు వేర్వేరు గా పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అమరుల త్యాగాల ఫలితమే ఈ విజయమని, వారికే అంకితమ ని వారు స్పష్టం చేశారు. ప్రజా ఉద్యమాలతో సాధించలేనిది ఏదీ లేదని తెలంగాణ ఉద్యమం నిరూపించిందన్నారు. అణచివేత, దోపిడీ, పీడన నుంచి తెలంగాణకు విముక్తి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సుభి క్షమైన తెలంగాణను నిర్మించుకుందామని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు మచ్చ వేణు, మోహన్‌లాల్, నయ్యర్ పటేల్, నందు, కాముని నగేశ్, బర్ల మల్లికార్జున్, కలకుంట్ల మల్లికార్జున్, తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల సం ఘం సిద్దిపేట నాయకులు వెంకటగోపాల్, కృష్ణ, కనకయ్య, నయీమొద్దీన్, శ్రీకాంత్, కిష్టయ్య, శ్రీనివాస్, బాల కృష్ణ, ఆపస్ నేతలు శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మీనర్స య్య, శ్రీనాకర్‌రెడ్డి, కిష్టారెడ్డి, దేవదాస్, మొలంకల శ్రీనివా స్, వెంకటనారాయణ, మన్మోహన్, రాంరెడ్డి, రవీందర్ రెడ్డి, అశోక్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కె.బుచ్చిరెడ్డి, నేతలు వంగ రామచంద్రారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ఉమేశ్‌గౌడ్, భానుచందర్, ఏపీటీఎఫ్, పీఆర్టీయూ, టీటీఎఫ్, టీడీటీఎఫ్ సంఘాల నేతలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో... పటాన్చెరు టౌన్: టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పట్టణంలో గురువారం రాత్రి సంబరాలు అంబరాన్ని అంటాయి. టీఆర్ఎస్ కార్యాలయం వద్ద ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు టపాసులు పేల్చి మిఠాయిలు పంపి ణీ చేశారు. తెలంగాణ నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడంపై టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి గాలి అనిల్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియతో మరో అడుగు ముందుకు పడిందన్నారు. ఆత్మబలిదానం చేసుకున్న వారి త్యాగాలు వృధా పోలేదన్నారు. తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ సహకారాన్ని మరువరని ఆయన తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణవాదులు విజయ్, బసవేశ్వర్, చంద్రశేఖర్, ఓం ప్రకాశ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
'తెలంగాణకు కేంద్ర కేబినెట్ ఆమోదం చారిత్రాత్మకం'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అభిప్రాయపడ్డారు. టీ.నోట్ పై కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే సంతకం చేసిన అనంతరం కేబినెట్ కు పంపిన అనంతరం దామోదర మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. తెలంగాణపై కేంద్రం కేబినెట్ ఆమోదం తెలపడంతో ఆయన ధన్యవాదాలు తెలిపారు. మరోమంత్రి డీకే అరుణ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదించిందించిన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందిన మంత్రులు జైపాల్ రెడ్డి, పల్లంరాజు, కావూరి సాంబశివరావు పాల్గొన్నారు. రాష్ట్ర విభజనను పల్లంరాజు, కావూరి సాంబశివరావులు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. సమావేశం ముగిసిన తరువాత కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. -
తెలంగాణ నోట్ ను ఆమోదించిన కేంద్ర మంత్రి మండలి
-
హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ: షిండే ప్రతిపాదన
న్యూఢిల్లీ: హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటును హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన తెలంగాణ నోట్‌ను కేంద్ర కేబినెట్ ముందు ఉంచారు. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశం దాదాపు గంటన్నరసేపు జరిగింది. సమావేశానికి రాష్ట్రానికి చెందిన మంత్రులు జైపాల్ రెడ్డి, పల్లంరాజు, కావూరి సాంబశివరావు హాజరయ్యారు. ప్రధాన మంత్రి అనుమతితో టేబుల్ ఐటమ్‌గా తెలంగాణ నోట్‌పై చర్చించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకొని 60 రోజులు గడిచిపోయింది. నోట్‌పై హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే సంతకం చేసి ఈ సాయంత్రం కేంద్ర మంత్రులకు అందజేసిన విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ రీఆర్గనైజేషన్ పేరుతో 20 పేజీల నోట్ రూపొందించారు. ఈ నోట్లో రాజధాని, భౌగోళిక స్వరూపం, నదీజలాలు తదితర అంశాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటును ఆ నోట్లో ప్రతిపాదించారు. అలాగే ఇంతకు ముందు చెప్పినట్లు పది సంవత్సరాలపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉండేటట్లు నోట్ రూపొందించారు. కేంద్ర మంత్రులు పల్లంరాజు, కావూరి సాంబశివరాలు దీనిని వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. నోట్‌పై చర్చించిన తరువాత దీనిని మంత్రుల బృందం పరిశీలనకు పంపాలని నిర్ణయించినట్లు తెలిసింది. మంత్రుల బృందం పరిశీలించిన తరువాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మంత్రి మండలి సమావేశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. సమావేశం ముగిసిన తరువాత కేంద్ర మంత్రి బేణీ ప్రసాద్ వర్మ బయటకు వచ్చారు. సమావేశంలో తెలంగాణ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు ధృవీకరించారు. -
తెలంగాణ నోట్ సిద్ధం: పోలీస్ శాఖ అప్రమత్తం
హైదరాబాద్: తెలంగాణ నోట్ సిద్ధమైన నేపధ్యంలో కేంద్ర హొం శాఖ రాష్ట్రంలో పోలీస్ శాఖను అప్రమత్తం చేసింది. డిజిపి ప్రసాదరావు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద భద్రత పెంచాలని జిల్లా ఎస్పిలను ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రత పెంచాలని చెప్పారు. రబ్బర్ బుల్లెట్లు వాడవద్దని ఆదేశించారు. రాష్ట్ర విభజనకు సీమాంధ్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. సీమాంధ్రలో 60 రోజుల నుంచి ఉధృతస్థాయిలో ఉద్యమం కొనసాగుతోంది. ఈ పరిస్థితులలో తెలంగాణ నోట్ సిద్ధమైంది. కేంద్ర మంత్రి మండలి సమావేశం ముందుకు నోట్ వెళ్లింది. దీనిపై మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకుంటే ఏమైనా అవాంఛనీయ పరిస్థితులు తలెత్తుతాయోమోనని పోలీస్ శాఖ అప్రమత్తమయింది. -
కేంద్ర కేబినెట్ ముందు తెలంగాణ నోట్
న్యూఢిల్లీ: తెలంగాణ నోట్‌ను కేంద్ర కేబినెట్ ముందు ఉంచారు. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో కేంద్ర మంత్రి మండలి సమావేశమైంది. ఈ సమావేశానికి రాష్ట్రానికి చెందిన మంత్రులు జైపాల్ రెడ్డి, పల్లంరాజు, కావూరి సాంబశివరావు హాజరయ్యారు. ప్రధాన మంత్రి అనుమతితో టేబుల్ ఐటమ్‌గా తెలంగాణ నోట్‌పై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకొని 60 రోజులు గడిచిపోయింది. నోట్‌పై హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే సంతకం చేసి ఈ సాయంత్రం కేంద్ర మంత్రులకు అందజేసిన విషయం తెలిసిందే. ఈ నెల 9న ప్రధాని విదేశీ పర్యటను వెళ్లనున్నారు. ఈ లోపలే తెంగాణ అంశంపై మంత్రి మండలి ఆమోదం పొందే ప్రయత్నాలలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. కేబినెట్ గనక ఆమోదిస్తే కొద్ది రోజుల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించిన తీర్మానం రాష్ట్ర శాసనసభకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర విభజనకు సీమాంధ్రులు అంగీకరించడంలేదు. తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తున్నారు. విభన విషయంలో హైదరాబాద్ కీలకంగా మారింది. కొందరు హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కోరుతున్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు కూడా హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కోరుతున్నారు. సమావేశంలో సాంబశివరావు ఈ విషయం ప్రస్తావించే అవకాశం ఉంది. నోట్ సిద్ధమవడం సీమాంధ్ర ప్రజాప్రతినిధులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. -
ప్రధాని నివాసం ముట్టడికి సీమాంధ్ర విద్యార్థుల యత్నం
-
టీ.నోట్ కు వ్యతిరేకంగా నిరసన జ్వాలలు
వైఎస్సార్ జిల్లా: తెలంగాణ నోట్ కు వ్యతిరేకంగా సమైక్య ఆందోళన కారులు నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. సీమాంధ్రలో తీవ్ర స్థాయిలో ఉద్యమం జరుగుతున్నా.. కేంద్రం వాటిని పట్టించుకోకుండా తెలంగాణ నోట్ ను రూపొందిస్తూ ముందుకు పోతున్న తరుణంలో సమైక్య వాదలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో నేటి అర్ధరాత్రి నుంచి 72 గంటల పాటు బంద్ పాటించడానికి మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి, వైఎస్సార్ సీపీ సమన్వయకర్త మల్లికార్జున రెడ్డిలు పిలుపునిచ్చారు. కాగా, కమలాపురం, రాజంపేటలలో శుక్రవారం నుంచి బంద్ పాటించనున్నారు. ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రాజంపేటలో బంద్ కు సమైక్య వాదులు సిద్ధమవుతున్నారు. తెలంగాణ నోట్ పై కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ సంతకం చేసిన వెంటనే చిత్తూరు జిల్లా తిరుపతి రహదారిపై రాస్తారోకో నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో రవాణా వ్యవస్ధకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. టీనోట్‌కు వ్యతిరేకంగా కడప ఏడు రోడ్ల సర్కిల్, కోటిరెడ్డి సర్కిల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మానవహారం నిర్వహించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం చేశారు. టీనోట్‌కు వ్యతిరేకంగా శ్రీకాకుళం రణస్థలం వద్ద జాతీయరహదారిని దిగ్బంధించారు. పలాసలో సమైక్యవాదుల ఆందోళనలు చేపట్టి ఆ నోట్ ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో మంత్రి పితాని సత్యనారాయణ కారును సమైక్యవాదులు అడ్డుకుని రాజీ నామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన నోట్‌పై కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే చేశారు. ఆ తరువాత ఆ ప్రతులను కేంద్ర మంత్రులను పంపారు. దీంతో నోట్‌పై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఈ సాయంత్రం 5.30 గంటలకు ప్రధాని నివాసంలో జరిగే సమావేశంలో ఈ నోట్‌పై చర్చిస్తారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఏర్పాటు చేసేవిధంగా నోట్ తయారయినట్లు తెలుస్తోంది. -
ప్రధాని నివాసం ముట్టడికి సీమాంధ్ర విద్యార్థుల యత్నం
న్యూఢిల్లీ: తెలంగాణ నోట్ కేబినెట్ ముందుకు వస్తుందన్న సమాచారంతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన విద్యార్థులు భగ్గుమన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసాన్ని ముట్టడించేందుకు గురువారం సాయంత్రం ప్రయత్నించారు. ప్రధాని నివాసంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఊహించని పరిణామంతో వెంటనే తేరుకున్న భద్రత సిబ్బంది.. ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగానే ఉంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ప్రధాని నివాసం భద్రత పెంచారు. -
48 గంటలకు బంద్ కు అశోక్ బాబు పిలుపు
హైదరాబాద్: తెలంగాణ నోట్‌పై సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు స్పందించాలని ఏపీఎన్జీవో నేత అశోక్‌బాబు డిమాండ్ చేశారు. నోట్ ఇవాళ వస్తుందని తెలిసినా నిమ్మకు నీరెత్తి ఉన్నారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని రెండు నెలలుగా ఉద్యోగులు కడుపులు మాడ్చుకుని ఉద్యమం చేస్తుంటే.. రాజకీయ నాయకులు మాత్రం పదవులు కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. సీమాంధ్ర రగులుతున్నా పట్టించుకోవడంలేదన్నారు.ఈ సందర్భంగా ఆయన 48 గంటల బంద్ కు పిలుపునిచ్చారు. రాజకీయ నాయకులంటే అసహ్యం వేస్తోందని అశోక్‌బాబు అన్నారు. వీరిని చూసి ప్రజలు సిగ్గు పడుతున్నారన్నారు. విభజనను సమర్థించే ఏ రాజకీయ నాయకుడిని అంగీకరించబోమన్నారు. రాజీనామా చేయని నాయకుల రాజకీయ జీవితానికి శుభం కార్డు వేస్తామన్నారు. ఇలాంటి నాయకులను ఎన్నుకోవడం తమ దౌర్భగ్యం అన్నారు. వీరిని భరించేందుకు భూమాత కూడా ఒప్పుకోదన్నారు. పార్టీలకు అతీతంగా సీమాంధ్ర ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ఎంపీలు రాజీనామా చేయకుంటే యుద్ధం ప్రకటించేందుకు ఏడు కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. శాంతియుతంగానే ఆందోళన కొనసాగిస్తామన్నారు. రాహుల్ గాంధీ మాట కోసం కేబినెట్ నిర్ణయాన్నే చెత్త బుట్టలో వేశారని అన్నారు. -
'నోట్' రావడం దుర్మార్గమైన చర్య: ఎంపీ అనంత
హైదరాబాద్: తెలంగాణా నోట్ కేబినెట్‌కు రావడాన్ని అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి తప్పుబట్టారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఆంటోనీ కమిటీ రాష్ట్రంలో పర్యటించి నివేదిక ఇచ్చిన తరువాతే ప్రక్రియ మొదలవుతుందని చెప్పిన వారు ఈరోజు మాట తప్పి తెలంగాణా నోట్‌ను తయారు చేయడం మంచిపద్దతి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం తుది నిర్ణయం అనడానికి మనమేమి రాజుల పాలనలో లేమని, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఇక్కడ ప్రజాభిప్రాయమే శిరోధార్యమని ఎంపీ తెలిపారు. నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ గడ్డుకాలం ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. సీమాంధ్ర ఎంపీలంతా హైదరాబాద్‌లో సమావేశమై భవిష్యత్తు ప్రణాళిక గురించి చర్చించి, డీల్లీకి వెళ్లనున్నట్లు ఎంపి మీడియాకు వివరించారు. -
తెలంగాణ నోట్‌పై సంతకం చేసిన షిండే
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన నోట్‌పై కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే సంతకం చేశారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో షిండే సంతకం చేశారు. ఆ తరువాత ఆ ప్రతులను కేంద్ర మంత్రులను పంపారు. దీంతో నోట్‌పై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఈ సాయంత్రం 5.30 గంటలకు ప్రధాని నివాసంలో జరిగే సమావేశంలో ఈ నోట్‌పై చర్చిస్తారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఏర్పాటు చేసేవిధంగా నోట్ తయారయినట్లు తెలుస్తోంది. -
తెలంగాణ నోట్‌పై సంతకం చేయలేదు: షిండే
ఢిల్లీ: కేబినెట్ నోట్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈరోజు సాయంత్రం జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణపై కేబినెట్ నోట్ చర్చకు రానున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మాత్రం మీడియాలో వస్తున్న కథనాలు ఊహాగానాలేనన్నారు. తెలంగాణ నోట్‌పై తానింకా సంతకం చేయలేదని తెలిపారు. సోనియా గాంధీ అనుమతి కోసం వేచి చూస్తున్నామని షిండే పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ మాత్రం తెలంగాణపై వెనక్కి తగ్గేది లేదని మరోసారి స్పష్టం చేయటం.... నోట్‌పై తాను సంతకం చేయలేదనటంతో.... సాయంత్రం జరిగే కేబినెట్ సమావేశంలో తెలంగాణ నోట్‌పై చర్చ జరుగుతుందా....లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. -
'తెలంగాణ నోట్'పై భగ్గుమన్న సీమాంధ్ర
-
తెలంగాణ నోట్ రెడీ.
-
తెలంగాణపై కేబినెట్ నోట్‌ను చించలేరా?
హైదరాబాద్ : జైలు శిక్ష పడిన చట్టసభ సభ్యుల సభ్యత్వాలను కాపాడేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌నే చించేశారని.... అలాంటిది తెలంగాణపై కేబినెట్ నోట్‌ను చించలేరా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆమె గురువారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కనీసం నోట్‌ను ఆపలేకపోయారన్నారు. తెలంగాణపై కేబినెట్ సిద్ధం చేయటం అంటే సీమాంధ్ర ప్రజలను అవమాననించినట్లేనని వాసిరెడ్డి పద్మ అన్నారు. 65 రోజులుగా సీమాంధ్ర ఉద్యమం జరుగుతున్నా.... కేంద్రం పట్టించుకోవటం లేదని ఆమె మండిపడ్డారు. సీమాంధ్ర ప్రజల ఆవేదన కనిపించటం లేదా అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. చివరి బంది వరకు పోరాడతామన్న ముఖ్యమంత్రి.... ఇప్పుడు తల పగిలేలా ఉన్నా పట్టించుకోవటం లేదన్నారు. కేబినెట్ ఎదుట తెలంగాణ నోట్ పెడితే.....పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. -
నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేది లేదు: దిగ్విజయ్
-
'తెలంగాణ నోట్'పై భగ్గుమన్న సీమాంధ్ర
తెలంగాణ నోట్ కథనాలపై సీమాంధ్ర భగ్గుమంది. దాంతో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల నివాసాలపై సమైక్యవాదులు దాడులు చేయవచ్చనే అనుమానాలతో వారి నివాసాల వద్ద భద్రత పెంచారు. తెలంగాణపై కేబినెట్ నోట్ సిద్ధం అయిందన్న వార్తల నేపథ్యంలో సమైక్యవాదులు నిరసనలు, ఆందోళనలు ఉధృతం చేశారు. ఈరోజు ఉదయం గుంటూరు, విశాఖలో విగ్రహాలను ధ్వంసం చేశారు. అనంతపురం, కడప, ఉభయ గోదావరి జిల్లాలో దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. మంత్రులు, కేంద్రమంత్రులు తక్షణమే పదవులకు రాజీనామాలు చేసి సమైక్య ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి ముట్టడి ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసులకు, సమైక్యవాదులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగటంతో పలువురు గాయపడ్డారు. ఈ ఘటనతో విజయనగరం జిల్లా బంద్‌కు పిలుపు నిచ్చారు. ఇక కేంద్ర మంత్రులు కిల్లి కృపారాణి, పురందేశ్వరి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఎంపీ లగడపాటి రాజగోపాల్, బొత్స ఝాన్సీ నివాసాలను సమైక్యవాదులు ముట్టడించారు. ఇక అనంతపురం జిల్లాలో పలుచోట్ల ఆకస్మిక బంద్‌కు పిలుపు నిచ్చారు. ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి నివాసాన్ని విద్యార్థులు, సమైక్యవాదులు ముట్టడించారు. -
వేడెక్కిన హస్తిన, నేతల భేటీలు
న్యూఢిల్లీ : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలతో హస్తిన మరోసారి వేడెక్కింది. సాయంత్రం జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణపై కేబినెట్ నోట్ చర్చకు రానున్నదనే ఊహాగానాల నేపథ్యంలో దేశ రాజధానిలో నేతల భేటీలు జోరందుకున్నాయి. యూపీఏ అధినేత్రి సోనియాగాంధీతో గులాం నబీ ఆజాద్ భేటీ కాగా..... కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే....సోనియాతో సమావేశం కానున్నారు. ఇక కేంద్రమంత్రి వీరప్ప మొయిలీతో ,...కావూరి సాంబశివరావు భేటీ అయ్యారు. ఇటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కేంద్రమంత్రి కిల్లి కృపారాణి సమావేశం అయ్యారు. తెలంగాణపై కేబినెట్ నోట్ సిద్ధమైందన్న వార్తల నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరపనున్నారు. ఈనేపథ్యంలో సీమాంధ్ర నేతలు మినిస్టర్స్ క్వార్టర్స్‌లో భేటీ అవుతున్నారు. -
సాయంత్రం అయిదు గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం
-
తెలంగాణ నోట్‌పై కేంద్ర కేబినెట్ దృష్టి?
-
తెలంగాణ నోట్‌పై కేంద్ర కేబినెట్ దృష్టి?
న్యూఢిల్లీ : తెలంగాణ అంశంపై కేంద్ర కేబినెట్ మరోసారి దృష్టి సారించనుంది. సీమాంధ్రలో సమైక్య ఉద్యమం హోరెత్తుతున్న వేళ తెలంగాణ నోట్‌ను పెండింగ్‌లో పెట్టిన కేంద్ర మంత్రివర్గం.... ఇప్పుడు పూర్తి స్థాయిలో పరిశీలించనుందనే వార్తలు జాతీయ మీడియాలో హోరెత్తుతున్నాయి. ఈ మేరకు ఇవాళ సాయంత్రం అయిదున్నరకు కేంద్ర కేబినెట్ సమావేశమవుతుందని నేషనల్ మీడియా పేర్కొంటోంది. టేబుల్ ఎజెండా రూపంలో తెలంగాణ నోట్... కేబినెట్ సమావేశంలో చర్చకు రానున్నట్లు సమాచారం. తెలంగాణపై హోంశాఖ రూపొందించిన ముసాయిదా నోట్ ఈ సమావేశానికి వస్తుందని, ఇందుకు సంబంధించి కేంద్రంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయని తెలిపింది. కేబినెట్లో ఆమోదించిన తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపిస్తారని, ఆ తర్వాత వారం, పది రోజుల్లో అసెంబ్లీకి పంపించే దిశగా కసరత్తు సాగుతోందని నేషనల్ ఛానెల్‌లు పేర్కొంటున్నాయి. సీమాంధ్రలో వెల్లువెత్తుతున్న ఆందోళనలు, సీఎం కిరణ్ వ్యవహారశైలి తదితర అంశాలను కూడా కేంద్రం, కాంగ్రెస్ అధిష్ఠానం నిశితంగా పరిశీలిస్తున్నాయని ఆ ఛానెళ్లు వెల్లడిస్తున్నాయి. తెలంగాణ అంశానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రధాని మన్మోహన్సింగ్ చేసిన వ్యాఖ్యలు జాతీయ మీడియా కథనాలకు బలం చేకూరుస్తున్నాయి. -
నేటి కేబినెట్ భేటీలో ‘టీ’ లేదు - రేపటి సమావేశంలోనూ రాదు!
విభజన నిర్ణయంతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన కాంగ్రెస్ అధిష్టానం రాజకీయ లబ్ధికోసం తమ నాటకాన్ని రక్తికట్టిస్తోంది. కాంగ్రెస్ దిగ్గజాలే రోజుకో మాట మాట్లాడుతూ.. కేబినెట్ నోట్ ఇదిగో అదిగో అంటూ కావాలనే గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నట్టు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తంమీద రాజకీయ వాతావరణం తమకు అనుకూలంగా మారేంతవరకు రాష్ట్రాన్ని ఇదే విధంగా అయోమయంలో కొనసాగించడమే ఎజెండాగా ముందుకు కదులుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ అంశంపై కేంద్ర హోంశాఖ రూపొందించే కేబినెట్ నోట్ కేంద్ర మంత్రిమండలి ముందుకు రాబోతోందంటూ గత కొద్ది రోజులుగా హైడ్రామా నడుపుతున్నారు. ఇంతగా ప్రచారం చేస్తూవచ్చినప్పటికీ బుధ, గురువారాల్లో జరిగే మంత్రివర్గ సమావేశంలోనూ తెలంగాణ నోట్ అనేది అసలు ఎజెండాలో చేర్చలేదు. ప్రధానమంత్రి మన్మో„హన్‌సింగ్ విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి రాగానే అక్టోబర్ మొదటి వారంలో కేంద్ర మంత్రివర్గం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎజెండాగా మంత్రిమండలి సమావేశం ఉంటుందని ప్రచారం చేశారు. తీరా మంత్రివర్గం సమావేశం కాబోతోందన్న కొద్ది గంటల ముందు.. ‘ఇప్పుడే అలాంటి నోట్ అంటూ ఏమీ లేద’ని కేంద్ర హోంశాఖ తేల్చేసింది. కేంద్ర హోంశాఖ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ ఇచ్చిన కథనం మేరకు బుధ, గురువారాల్లో జరిగే కేబినెట్ సమావేశంలో టీ-నోట్ ప్రస్తావన ఉండదని తేలిపోయింది. అసలు నోటే సిద్ధంకానప్పుడు కేబినెట్ ముందుకు ఎలా వస్తుందని కొత్త వాదన తెరమీదకు తెచ్చారు. కొద్ది రోజుల కిందటే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కేబినెట్ నోట్ ముసాయిదా సిద్ధమైందని స్వయంగా కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే ప్రకటన చేశారు. దాన్ని తానింకా పరిశీలించలేదని, త్వరలోనే పరిశీలిస్తానని కూడా తెలిపారు. గతంలో దిగ్విజయ్‌సింగ్ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు రాష్ట్రానికి చెందిన ముగ్గురు నేతలను రోడ్‌మ్యాప్‌లు తయారు చేయమనడం, అంతే వేగంగా కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం, ఆ తర్వాత కొద్ది రోజులకు యూపీఏ భాగస్వామ్య పక్షాల భేటీ, వెను వెంటనే సీడబ్ల్యూసీ తీర్మానం.. ఇలా ఒకదాని తర్వాత ఒకటన్నట్టు కాంగ్రెస్ త్వరత్వరగా నిర్ణయాలు చేసింది. అప్పుడు ఎంతో వేగంగా వ్యవహారాలు నడిపించి రాష్ట్రాన్ని అయోమయంలో పడేసిన కాంగ్రెస్ నాయకత్వం తాజా పరిస్థితుల్లోనూ రాష్ట్రంలోని ప్రతిష్టంభనను తొలగించడానికి గానీ అనిశ్చితికి తెరదించేందుకు గానీ ఏమాత్రం ప్రయత్నాలు చేయకపోగా.. పరిస్థితిని మరింత గందరగోళంలోకి నెడుతోందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కేబినెట్ ఎజెండాలో టీ-నోట్ లేదు... కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర నేతల అభ్యంతరాల నేపథ్యంలో ఆంటోనీ కమిటీని తెరమీదకు తెచ్చి ఆ కమిటీ సిఫారసుల కోసమంటూ కొత్త వాదన ముందుపెట్టి పరిష్కారం చూపకుండా సాగదీస్తోంది. అయితే.. ఆంటోనీ కమిటీకి కేంద్ర హోంశాఖ రూపొందించి నివేదించే కేబినెట్ నోట్‌కు అసలు సంబంధమే లేదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ దిగ్విజయ్‌సింగ్ రెండు రోజుల కిందటే చాలా స్పష్టంగా చెప్పారు. దాంతో ఈసారి జరిగే మంత్రివర్గ సమావేశంలో కేబినేట్ నోట్ రావడం ఖాయమని భావించారు. మంత్రిమండలి సమావేశం కావడానికి సరిగ్గా 24 గంటల సమయం కూడా లేకముందు మంత్రిమండలి ఎజెండాలో నోట్ ముసాయిదా ప్రస్తావన లేదని కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులను ఉటంకిస్తూ లీకులు బయటకొచ్చాయి. ఏమంటే కేబినెట్ నోట్ ముసాయిదాలో అనేక మార్పుచేర్పులు చేయాల్సిన అవసరం ఉందని, అవి పూర్తయిన తర్వాత మళ్లీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మో„హన్ సింగ్‌ల పరిశీలనకు పంపిస్తారని, ఆ తర్వాత కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలనకు వెళుతుందని, ఆ తర్వాతే మంత్రిమండలి ముందుకొస్తుందని ఇప్పుడు తాజాగా ప్రచారంలో పెట్టిన కథ. బుధవారం సాయంత్రం జరుగనున్న కేంద్ర మంత్రివర్గ ప్రత్యేక సమావేశం ఎజెండాలో.. కేవలం శిక్షపడిన ప్రజాప్రతినిధుల చట్టసభల సభ్యత్వం తక్షణం రద్దు కాకుండా అడ్డుకొనేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స పునఃపరిశీలన మినహా మరే ఇతర అంశాలను పొందుపరచలేదని.. గురువారం నాటి మంత్రివర్గ సమావేశం ఎజెండాలో కూడా తెలంగాణ అంశాన్ని చేర్చలేదని తెలియవచ్చింది. పొంతనలేని షిండే, దిగ్విజయ్ వ్యాఖ్యలు... నోట్‌పై షిండే, దిగ్విజయ్‌లు ఇప్పటివరకూ తమ నోటితోనే చెప్పిన విషయాలకూ.. తాజా పరిణామాలకు ఏమాత్రం పొంతన లేకపోవటం గమనార్హం. ఇదంతా నాటకంలో భాగమేనని అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి విశ్వసనీయ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. కేబినెట్ నోట్ దాదాపు సిద్ధమైందని, దాన్ని త్వరలోనే కేబినెట్ భేటీలో చర్చకు పెట్టి ఆమోదిస్తారని దిగ్విజయ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆంటోనీ కమిటీ ఇచ్చే సిఫారసులను తెలంగాణ బిల్లులోనే చేరుస్తారు తప్పించి కేబినెట్ నోట్లో కాదని కూడా ఆయన మొన్నటికి మొన్న స్పష్టంచేశారు. నోట్ ముసాయిదా సిద్ధమైందని స్వయంగా హోంమంత్రి షిండే కనీసం రెండు సందర్భాల్లో వెల్లడించారు. కానీ.. ఇప్పుడు నోట్ అసలు సిద్ధం కాలేదని, ఆంటోనీ కమిటీ సిఫారసుల కోసం నిరీక్షిస్తున్నామని, అవి వచ్చాక ముసాయిదా నోట్లో మార్పులు చేయాలని, దానికి తొలుత రాజకీయ ఆమోదం, తర్వాత న్యాయశాఖ ఆమోదం కావాలని తాజాగా షిండే నేతృత్వంలోని హోంశాఖ అధికార వర్గాల పేరుతో లీకులు రావటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదంతా కాంగ్రెస్ హైకమాండ్ నాటకంలో భాగమేనని విశ్వసనీయ వర్గాల కథనం. అంతా ఆ నాటకంలోని అంకాలే... సీమాంధ్రలో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని నేతలు ఏకరువు పెట్టడంతో రాజకీయంగా లబ్ధి పొందడానికి ఒకవైపు సీఎం కిరణ్ ద్వారా సొంత పార్టీపైనా తిరుగుబాటు చేస్తున్నట్లుగా తీవ్ర వ్యాఖ్యలు చేయించడం.. మరోవైపు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నివాసంలో సమావేశాలను నిర్వహింపచేయడం, పీసీసీ అధ్యక్షుడు బొత్సతో రాజీనామాకు సిద్ధమంటూ లీకులు ఇప్పించడం.. ఇవన్నీ అధిష్టానం రచించిన డ్రామాలోని అంకాలేనని ఆ వర్గాలంటున్నాయి. అధిష్టానాన్ని ధిక్కరిస్తూ సీఎం బాహాటంగా తీవ్ర వ్యాఖ్యలు చేసినా పార్టీ పెద్దలెవరూ దీనిపై గట్టిగా స్పందించకపోవడాన్ని, దిగ్విజయ్ తాజాగా దీనిపై స్పందనకు నిరాకరించడాన్ని బట్టి ఇదంతా హైకమాండ్‌కు తెలిసే జరుగుతోందన్న అభిప్రాయం పార్టీలో బలంగా వినిపిస్తోంది. కాగా, నవంబర్‌లోగానీ తెలంగాణ అంశం ఒక కొలిక్కి రాదంటూ ఏఐసీసీ వర్గాలు కొత్త లీకును ప్రచారంలోకి తెస్తుండటం మరో విశేషం. -
తెలంగాణ నోట్ ఆలస్యం!
-
తెలంగాణ నోట్ ఆలస్యం!
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కేబినెట్ నోట్ వారం, పదిరోజులు ఆలస్యమయ్యే అవకాశముంది. తెలంగాణకు సంబంధించి కేబినెట్ ముందుంచాల్సిన నోట్‌ను కేంద్ర హోంశాఖ ఇంకా ఖరారు చేయలేదని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. నోట్ ముసాయిదాకు హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఇంకా ఆమోదం తెలపలేదని విశ్వసనీయ వర్గాలు చెప్పాయని వెల్లడించింది. ఏకే ఆంటోనీ కమిటీ నివేదిక కోసం షిండే వేచిచూస్తున్నారని పేర్కొంది. అలాగే ముసాయిదాను తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ ముందుంచి వారి ఆమోదం పొందాలనుకుంటున్నట్టు తెలిపింది. ముసాయిదా ఖరారయ్యాక న్యాయమంత్రిత్వ శాఖకు పంపుతారు. అక్కడి నుంచి కేబినెట్ ముందుకు వస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎల్లుండి జరిగే మంత్రివర్గ సమావేశం ముందుకు తెలంగాణ నోట్ వచ్చే పరిస్థితి లేదు. మరోవైపు రాష్ట్ర విభజనపై కేబినెట్ నోట్ ఇంకా సిధ్దం కాలేదని, తుదిమెరుగులు దిద్దుకోలేదని కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి నిన్న ఢిల్లీలో చెప్పారు. తెలంగాణ నోట్ అక్టోబర్ మొదటివారంలో కేంద్ర మంత్రివర్గం ముందుకు వస్తుందన్న అంశంపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. విభజన నేపథ్యంలో సీమాంధ్రుల అభ్యంతరాలపై ఆంటోనీ కమిటీ రూపొందించే సిఫార్సులను కేబినెట్ నోట్లో చేర్చాలన్నది తమ డిమాండ్ అనీ, అయినా, అన్ని అంశాలను నోట్లో చేర్చలేరని, కేబినెట్ ముందుంచే నోట్ సంక్షిప్తంగా ఉంటుందని ఆమె అన్నారు. -
టీ నోట్‌ను అసెంబ్లీలో తిరస్కరిస్తాం
బుట్టాయగూడెం, న్యూస్‌లైన్ : తెలంగాణ నోటు అసెంబ్లీలో ఆమోదానికి వస్తే దానిని తిరస్కరిస్తామని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్పష్టం చేశారు. శుక్రవారం బుట్టాయగూడెంలో నాన్‌పొలిటికల్, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు బాలరాజును కలిశారు. విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఉపసంహరించుకోవాలని, తద్వారా విభజన నోటు అసెంబ్లీలో తీర్మానానికి వస్తే దానిని తిరస్కరించాలని కోరుతూ వారు బాలరాజుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ దీక్షలు చేశారన్నారు. జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల సీమాంధ్రలోని 13 జిల్లాల్లో సమైక్య శంఖారావ బస్సు యాత్ర నిర్వహించారన్నారు. అంతేకాకుండా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ విజయమ్మ లేఖ కూడా రాశారని గుర్తు చేశారు. విభజన ముందే తమ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి ఉద్యమాల్లో పాల్గొంటూ సమైక్య నినాదాలతో యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం జరిగిందన్నారు. గత 58 రోజులుగా సీమాంధ్రలో ఎంతో శాంతియుతంగా హింసకు తావులేకుండా ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమాన్ని నడిపిస్తుండడాన్ని అభినందించారు. సమైక్యాంధ్ర ఉద్యమం చూస్తుంటే నాడు గాంధీ చేపట్టిన స్వాతంత్య్ర పోరాటం గుర్తుకు వస్తోందన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్థి, కార్మికులు ఉద్యమాన్ని భుజాన వేసుకుని అలుపెరుగకుండా యూపీఏ సర్కారు మెడలు వంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. నాడు ఇందిరా గాంధీ, నెహ్రూలు విభజన వల్ల వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర సమైఖ్యతకు కృషి చేశారన్నారు. నేడు ఇటలీ నుంచి వచ్చిన సోనియా గాంధీ తన స్వార్థ ప్రయోజనాల కోసం సమైక్యంగా ఉన్న రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు పూనుకుందని విమర్శించారు. రాష్ట్ర విభజన ప్రకటన ఆగేవరకూ ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి జైలు నుంచి బయటకు రావడంతో సమైక్యాంధ్ర ఉద్యమానికి కొత్త ఊపు వచ్చిందన్నారు. త్వరలోనే జగన్మోహన్రెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపించే నాయకుడు అవుతారని అన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో జేఏసీ నాయకులు కొండేపాటి రామకృష్ణ, ఆరేటి సత్యనారాయణ, కలగర రాము, రేపాకుల చంద్రం, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు మొడియం గంగరాజు, పాయం పోసియ్య, కుంజా పోసియ్య తదితరులు పాల్గొన్నారు. -
బిల్లు పెట్టే వరకూ కాంగ్రెస్‌ను నమ్మలేం: కేటీఆర్
సిరిసిల్ల, న్యూస్‌లైన్: పార్లమెంట్లో బిల్లు పెట్టే వరకూ కాంగ్రెస్ పార్టీని నమ్మలేమని సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు అన్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చి తీరాల్సిన అనివార్యత కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని, తెలంగాణ ప్రకటించి 56 రోజులైనా ఒక్క అడుగు ముందుకు పడకపోవడం ఆ పార్టీ వైఖరిని తెలియజేస్తోందన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల నోట్లకట్టలకు తెలంగాణ నోట్ ఆగిపోతుందేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు అబద్ధాలు మాట్లాడుతున్నారని, వాస్తవాలను వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పడితే నలభైవేల మంది ఉద్యోగులు ఇంటికి వెళ్లాల్సి వస్తుందని, కృష్ణా, గోదావరి నీళ్లు రావని చెబుతున్న అశోక్ ఇన్నాళ్లూ తెలంగాణకు జరిగిన అన్యాయం ఏమిటో గుర్తించాలని కేటీఆర్ కోరారు. పదమూడేళ్లుగా నీళ్లు, నిధుల వివక్షపై టీఆర్ఎస్ చెబుతున్నవన్నీ అక్షర సత్యాలని సీమాంధ్ర నేతలే ఇప్పుడు చెబుతున్నారని వివరించారు. అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోల్లో తెలంగాణకు అనుకూలంగా స్పష్టం చేశాయని, ఇప్పుడు ఆ మేనిఫెస్టోలనే పట్టించుకోకుండా సీమాం ధ్రబాట పట్టాయని ధ్వజమెత్తారు. అదేవిధంగా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు తెలంగాణ, సీమాంధ్ర పార్టీ శాఖలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆ పార్టీల చిత్తశుద్ధిని ప్రజలే ఎండగడతారన్నారు. 29న సకలజనుల భేరి ద్వారా తెలంగాణ సత్తా చాటాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. -
ఆంటోని కమిటీకి, తెలంగాణ నోట్‌కు సంబంధం లేదు: దిగ్విజయ్
రాష్ట్ర విభజనపై చర్చల కోసం కేంద్ర మంత్రి ఆంటోని నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులకు.. తెలంగాణ నోట్‌కు సంబంధంలేదు అని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్‌సింగ్ అన్నారు. అక్టోబర్ మొదటి వారంలో తెలంగాణ నోట్ కేబినెట్ ముందుకు వచ్చే అవకాశం ఉంది అని ఆయన అన్నారు. రాష్ట్రవిభజనపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటి నిర్ణయం తీసుకుందని.. నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రెండు ప్రాంతాలకు ఒకే విధంగా వ్యవహరించాలి దిగ్విజయ్ అన్నారు. రాజ్యసభ టీవీకి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన ఇంటర్య్వూ నేను చూడలేదు అని అన్నారు. ఇంటర్య్యూ ఇవ్వడం మంచిదేనని అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన అంశంపై ఆయన ఏం మాట్లాడారో తెలీదు అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
ప్రత్యేక తెలంగాణ నోట్ తయారవుతుంది:దిగ్విజయ్
-
తెలంగాణ నోట్ సిద్ధం అవుతోంది: దిగ్విజయ్
-
తెలంగాణ నోట్ సిద్ధం అవుతోంది: దిగ్విజయ్
న్యూఢిల్లీ : తెలంగాణ నోట్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిద్ధం చేస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. అది పూర్తయిన వెంటనే కేబినెట్ పరిశీలకు వస్తుందని ఆయన తెలిపారు. అయితే ఈ ప్రక్రియ పూర్తి కావటానికి ఎంత సమయం పడుతుందనేది తాను చెప్పలేనని అన్నారు. ఆ విషయాన్ని హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేనే అడిగితే బాగుంటుందని దిగ్విజయ్ అన్నారు. సీమాంధ్రలో సమ్మె వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.... చేతులు జోడించి అడుగుతున్నానని... ఏపీ ఎన్జీవోలు తక్షణమే సమ్మె విరమించాలని దిగ్విజయ్ విజ్ఞప్తి చేశారు. ప్రయివేట్ దుకాణాలు, రవాణా వ్యవస్థ, కార్యాలయాలు నడుస్తుంటే.... ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉంచటం ఎంతవరకూ సబబు అని ప్రశ్నించారు. ఉద్యోగులకు ఎదురయ్యే అన్ని సమస్యల్ని పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని దిగ్విజయ్ స్పష్టం చేశారు. అన్ని పార్టీలు తెలంగాణకు అంగీకరించాయని దిగ్విజయ్ సింగ్ బుధవారమిక్కడ తెలిపారు. జగన్ బెయిల్ రావటంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ ....జగన్.... కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయితే... బీజేపీ ....టీడీపీతో కుమ్మక్కు అయ్యిందా అని ప్రశ్నించారు. దిగ్విజయ్ సింగ్... ఈరోజు ఉదయం పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. -
‘టీ నోట్’ ముసాయిదా మాత్రమే సిద్ధమైంది: షిండే
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు సంబంధించి కేబినెట్ ముందుంచాల్సిన నోట్‌ను ఇంకా ఖరారు చేయలేదని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే పేర్కొన్నారు. దాని తాలూకు ముసాయిదా మాత్రమే సిద్ధమైందని సోమవారం వెల్లడించారు. మంగళవారం సాయంత్రం జరగనున్న మంత్రివర్గ సమావేశం ఎజెండాలో తెలంగాణ అంశం చోటుచేసుకోలేదన్నారు. దాంతో ఈ భేటీలో నోట్ ప్రస్తావన గానీ, దానిపై చర్చ గానీ ఉండబోవని కాంగ్రెస్‌లోని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని మన్మోహన్సింగ్ విదేశీ పర్యటన తర్వాత అక్టోబర్‌లో మాత్రమే తెలంగాణపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుందంటున్నారు. సాధారణంగా కేంద్ర కేబినెట్ ప్రతి గురువారం సమావేశమవుతుంది. అయితే ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని బుధవారం న్యూయార్క్ బయల్దేరుతున్నందున దాన్ని ముందుగానే నిర్వహిస్తున్నారు. మరోవైపు... ఎజెండాలో లేకపోయినా తెలంగాణ నోట్ ముసాయిదాను మంగళవారం నాటి భేటీలోనే మంత్రులందరికీ పంచుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. దానిపై చర్చ కూడా జరుగుతుందని కాంగ్రెస్ నేతల్లో మరికొందరు అంటున్నారు. ఇప్పటికే తయారైన 6, 7 పేజీల ముసాయిదాను వీలైనంతగా సంక్షిప్తీకరించి కేబినెట్ ముందు పెడతారని వారు చెబుతున్నారు. ఈ ముసాయిదానే కేంద్ర హోం మంత్రి సంతకంతో తుది నోట్ రూపంలో బహుశా అక్టోబర్ 3న జరిగే మంత్రివర్గ సమావేశం ముందుంచుతారన్నది వారు చెబుతున్న మాట. ‘‘రాష్ట్ర విభజనపై సీమాంధ్రలో ఎంతటి వ్యతిరేకత, ఆందోళనలు వ్యక్తమవుతున్నా ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకే కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతున్నట్టు కన్పిస్తోంది. నోట్ కేబినెట్ ముందుకు వెళ్తే తక్షణం రాజీనామా చేసేందుకు కనీసం అరడజను మంది సీమాంధ్ర ఎంపీలతో పాటు ఆ ప్రాంతాలకు చెందిన పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో... అలాంటి పరిణామానికి కూడా అధిష్టానం సిద్ధంగానే ఉంది’’ అని ఏఐసీసీ వర్గాలను ఉటంకిస్తూ సదరు నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టీ మంగళవారం సాయంత్రం జరిగే కేంద్ర కేబినెట్ భేటీపైనే నెలకొంది. -
తెలంగాణ నోట్ ఇంకా రెడీ కాలేదు: హోం మంత్రి షిండే
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అంశానికి సంబంధించి నోట్ ఇంకా సిద్ధం కాలేదని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యానించారు. టీ.నోట్ సిద్దమైందని ఇక కేబినెట్ కు రేపో మాపో పంపుతామని రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించిన షిండే మాట మార్చారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో షిండే సోమవారం మీడియాతో మాట్లాడారు.తెలంగాణపై నోట్ ఇంకా రెడీ కాలేదని, కేవలం డ్రాఫ్ట్ మాత్రమే వచ్చిందన్నారు. తుది నోట్ ఇంకా సిద్ధం కాలేదన్నారు. తెలంగాణ నోట్ తన దగ్గరకు సంతకం కోసం రాగానే ఆ విషయాన్నిమీడియాకు చెబుతానాని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర కేబినెట్‌కు హోంశాఖ సమర్పించాల్సిన ముసాయిదా నోట్ సిద్ధమైందని గతంలో హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ముసాయిదా ప్రతిని తాను ఇంకా పరిశీలించలేదని చెప్పారు. ‘‘అధికారులు నోట్ సిద్ధం చేశారు. అయితే నేను ఇంకా చూడలేదని తెలిపారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీలు బుధవారం ఆంటోనీ కమిటీ సభ్యులైన వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్‌లతో చర్చలు జరిపిన అనంతరం రాష్ట్ర విభజనకు సంబంధించి కీలకాంశాలన్నింటిపై ఏకాభిప్రాయం వచ్చే వరకు ప్రభుత్వపరంగా తెలంగాణ ప్రక్రియ ముందుకెళ్లడం సాధ్యపడకపోవచ్చని వారు కూడా అభిప్రాయపడ్డారు. ఆ మరుసటి రోజే ముసాయిదా నోట్ సిద్ధమైందని హోంమంత్రి ప్రకటించి సీమాంధ్ర నేతల్లో అలజడి రేపారు. దీంతో హస్తిన బాట పట్టిన నేతలు తెలంగాణ నోట్ అంశాన్ని పదే పదే ప్రస్తావించడంతో షిండే పెదవి విప్పారు. టీ.నోట్ ఇంకా సిద్ధం కాలేదని సీమాంధ్ర నేతలకు కాస్త ఊరట కల్గించారు. -
ఎజెండాలోలేని తెలంగాణ అంశం
-
సమైక్యాంధ్ర తప్ప ఎలాంటి ప్రతిపాదనను అంగీకరించేది లేదు: లగడపాటి
తెలంగాణపై ముందుకెళ్లితే సీమాంధ్ర ఎంపీలందరం సామూహిక రాజీనామాలు సమర్పిస్తామని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన లగడపాటి మీడియాతో మాట్లాడుతూ.. అంటోని కమిటీ ముందుకు వెళ్లకుండా తెలంగాణపై ఎలా నిర్ణయం తీసుకుంటారు అని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర తప్ప యూటీ సహా ఎలాంటి ప్రతిపాదనను అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. సమైక్యతను కాపాడేందుకు దేనికైనా సిద్ధమే చేస్తామన్నారు. రాష్ట్రంలో 80 శాతం మంది సమైక్యవాదానికే మద్దతు తెలుపుతున్నారని లగడపాటి అన్నారు. సీమాంధ్ర ఎంపీలకు తెలియకుండా తెరవెనుక చర్యలను అంగీకరించం అని ఆయన స్సష్టం చేశారు. సెప్టెంబర్ 24 తేదిన స్పీకర్ మీరా కుమార్ తో భేటి అవుతామని.. రాజీనామాలను అంగీకరింప చేసుకునేందుకు ప్రయత్నిస్తామని ఎంపీలు తెలిపారు. సీమాంధ్ర ప్రాంత ఎంపీల వాదనలు పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదని ఎంపీల ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే డ్రాఫ్ట్ కు సీమాంధ్ర ఎంపీలు సవాల్ విసిరారు. ద్రాఫ్ట్ రూపొందిస్తే రాజీనామాలేనని హెచ్చరించారు. జాగో బాగో, వెళ్లిపోవాలంటూ చేస్తూ అంటూ తెలుగు జాతిని సర్వనాశనం చేసింది ఆయనే అని కేసీఆర్ తీరు ను విమర్శించారు. అంతిమ విజయం సమైక్య వాదానిదే అని లగడపాటి ధీమా వ్యక్తం చేశారు. -
తెలంగాణపై కేబినెట్ నోట్ రెడీ: షిండే
-
తెలంగాణపై కేబినెట్ నోట్ రెడీ: షిండే
ఢిల్లీ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై కేంద్ర మంత్రి మండలి నోట్ సిద్ధమైందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. ఆ నోట్‌ను ఈ రోజు పరిశీలిస్తామన్నారు. హైదరాబాద్ గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని షిండే చెప్పారు. ఈ రోజు సాయంత్రం జరగవలసిన కేంద్ర మంత్రి మండలి సమావేశం రేపటికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ముఖ్యమైన కేంద్ర మంత్రులు కొందరు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ సమావేశం రేపటికి వాయిదాపడింది. మంత్రి మండలి సమావేశం ఎజెండాలో తెలంగాణ అంశం లేదని తెలుస్తోంది. ఈ నోట్‌ను రేపు జరిగే మంత్రి మండలి సమావేశంలో పరిశీలనకు వస్తుందో, రాదో స్పష్టంగా తెలియడంలేదు. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన తరువాత ప్రధానంగా హైదరాబాద్‌పైనే చర్చ జరుగుతోంది. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా ఒక్క హైదరాబాద్ విషయంలోనే పీటముడి పడింది. ఆరు దశాబ్దాలుగా రాజధానిగా ఉన్న హైదరాబాద్‌పై హక్కులు ఎవరివనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. ఈ నేపధ్యంలో హైదరాబాద్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని షిండే చెబుతున్నారు. హైదరాబాద్ విషయం తేలకుండా విభజన అంశం తేలడం కష్టం. -
హోంశాఖ అధికారులతో సీమాంధ్ర నేతల భేటీ
కేంద్ర హోంశాఖ అధికారులను సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఎస్. శైలజానాథ్, రుద్రరాజు పద్మరాజు, పాలడుగు వెంకట్రావు కలిశారు. దాదాపు గంటన్నరసేపు చర్చలు జరిపారు. కేంద్ర మంత్రివర్గం ముందుకు తేనున్న తెలంగాణ నోట్‌పై నాయకులు ఆరా తీసినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ను విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్రహోంశాఖ కేబినెట్ నోట్ సిద్ధమయిందని హోంశాఖ అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హోంశాఖ అధికారులను సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు కలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే హోంశాఖలోని తమ మిత్రులమని కలవడానికి వెళ్లామని మీడియాతో శైలజానాథ్, రుద్రరాజు చెప్పారు. దేశ పౌరుడిగా ఎవరినైనా కలిసే హక్కు తమకుందని తెలిపారు. ఈ సమయంలో హోంశాఖకు ఎందుకు వస్తాం.. మీకు తెలియదా అంటూ ముక్తాయించారు. -
హైదరాబాద్ తేలాకే!
* కోర్‌కమిటీలో నిర్ణయం తీసుకున్నాకే ‘టీ నోట్’ * ‘విభజన’ సమస్యలపై చర్చ * యూటీపై నిర్ణయాధికారం సోనియాకే? * రేపు సోనియా సారథ్యంలో కోర్ కమిటీ భేటీ సాక్షి, న్యూఢిల్లీ: పెను సమస్యగా మారిన రాష్ట్ర విభజన అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ కోర్ కమిటీ శుక్రవారం మరోసారి సమావేశం కానుంది. బుధవారం అమెరికా నుంచి తిరిగి వచ్చిన అధ్యక్షురాలు సోనియాగాంధీ సమక్షంలో జరిగే ఈ భేటీలో ‘విభజన’ సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన ప్రతిపాదనలను పరిశీలించనున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిఫార్సు చేస్తూ కేంద్ర కేబినెట్ ముందు ఉంచాల్సిన నోట్‌ను ఆ తర్వాతే హోంశాఖ సిద్ధం చేస్తుందని సమాచారం. ఒకవేళ భేటీలో ఏ నిర్ణయమూ తీసుకోని పక్షంలో నోట్ తయారీ కూడా కోర్ కమిటీ తదుపరి భేటీ దాకా వాయిదా పడవచ్చని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. ‘కోర్ కమిటీలో ఏదో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే హోం శాఖ నోట్ తుది రూపు దిద్దుకుంటుంది. ఆ తర్వాత అది కేంద్ర న్యాయ శాఖకు వెళ్తుంది. అక్కడి నుంచి కేబినెట్ ముందుకు వెళ్తుంది’ అని ఆ వర్గాలు గుర్తు చేశాయి. విభజన ప్రక్రియపై ముందుకెళ్లడంలో ‘హైదరాబాదే’ ప్రధాన అవరోధంగా మారిందని చెప్పుకొచ్చాయి. వెనకా ముందూ ఆలోచించకుండా, కేవలం స్వీయ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా తీసుకున్న విభజన నిర్ణయం క్రమంగా కాంగ్రెస్ పాలిట పెను సమస్యగా పరిణమిస్తోందని ఆ పార్టీ నేతలే వాపోతున్నారు. ఎలాంటి కసరత్తూ చేయకుండానే రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ హడావుడిగా ప్రకటించడం, అప్పటినుంచీ సీమాంధ్ర అగ్గి మీద గుగ్గిలమై రగులుతుండటం తెలిసిందే. నిజానికి కోర్ కమిటీలో చర్చించిన మీదటే విభజన నిర్ణయాన్ని సీడబ్ల్యూసీ ప్రకటించింది. కానీ సీమాంధ్ర ప్రజల సందేహాలు, ఆందోళన నివృత్తి కోసమంటూ పార్టీపరంగా వేసిన ఆంటోనీ కమిటీతో లాభం లేదని తేలిపోవడంతో విభజన అంశం కాస్తా ఇప్పుడు మళ్లీ కోర్ కమిటీ కోర్టుకే చేరినట్టయింది! దాంతో సమస్యను ఎలా పరిష్కరించాలో ఎటూ పాలుపోక కాంగ్రెస్ అధిష్టానం కిందమీదులవుతోంది. ఏదేమైనా సోనియా సమక్షంలో కోర్ కమిటీ క్షుణ్నంగా పరిశీలించాకే దీనిపై ముందడుగు సాధ్యమని ఏఐసీసీ వర్గాలన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ విషయంలో ఏం చేయాలన్న దానిపై కూడా ఆలోపే స్పష్టత రావాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాయి. ‘సీడబ్ల్యూసీ సిఫార్సు చేసినట్టుగా పదేళ్ల పాటు రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైద్రాబాద్‌ను పరిమిత కాలానికి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలా? లేక శాశ్వత ఉమ్మడి రాజధానిగా హైద్రాబాద్ మెట్రోపాలిటన్ అభివద్ధి సంస్థ పరిధిలోకి వచ్చే మొత్తం ప్రాంతాన్నీ నగర రాష్ట్రంగా ప్రకటించాలా? అదీ కాదంటే ఢిల్లీ తరహాలో కేవలం శాంతిభద్రతలు, పట్టణాభివృద్ధి, రెవెన్యూ మాత్రం కేంద్ర హోం శాఖ అధీనంలోకి తీసుకుంటే సరిపోతుందా? ఇలాంటి పలు ప్రత్యామ్నాయాలను లోతుగా చర్చించాకే కోర్‌కమిటీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు’ అని ఏఐసీసీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. హైదరాబాద్ విషయంలో రెండు, మూడు ప్రత్యామ్నాయాలున్నాయని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, కేబినెట్ నోట్ తయారీని నెలాఖరులోగా పూర్తి చేయాలన్న అధిష్టానం ఆకాంక్షలు నెరవేరే పరిస్థితి లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కత్తిమీద సామే రెండు రాష్ట్రాలకు శాశ్వత రాజధానిగా ఉండేలా హైద్రాబాద్‌ను నగర రాష్ట్రంగా ప్రకటించాలన్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతల డిమాండ్‌కు తెలంగాణ నేతలు ససేమిరా అంటుండటంతో ఈ చిక్కుముడిని విప్పే ఫార్ములాపై ఆంటోనీ కమిటీ కసరత్తు చేస్తోందని ఏఐసీసీ వర్గాలన్నాయి. అయితే అంతిమంగా ఈ విషయంలో కూడా నిర్ణయాన్ని సోనియాకే వదిలేసే అవకాశం లేకపోలేదని అవి వివరించాయి. నగరాన్ని పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని చేయాలన్నా ముందు దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించక తప్పదని, అందుకు రాజ్యాంగ సవరణ అవసరమౌతుందన్న వాదన కూడా ఉంది. ఈ నేపధ్యంలో సీమాంధ్ర ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చి, అన్ని ప్రాంతాల ప్రజలకూ ఆమోదయోగ్యమైన మధ్యే మార్గ పరిష్కారాన్ని కనుగొనడం అధిష్టానానికి కత్తిమీద సాములా తయారైందని కాంగ్రెస్ నేతలంటున్నారు. రాజధానితో పాటు నదీజలాల పంపిణీపై ట్రిబ్యునల్‌కు బదులుగా ఒక చట్టబద్ధ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ నేతలు అంగీకరిస్తారా అన్న సంశయం కూడా ఉందని వారు చెబుతున్నారు. -
తెలంగాణ నోట్ ఇప్పట్లో రాదు: కావూరి సాంబశివరావు
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనకు సంబంధించి తెలంగాణ నోట్ ఇప్పట్లో కేబినెట్ ముందుకు వచ్చే ప్రసక్తే లేదని, అందుకు మరింత సమయం పడుతుందని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ విదేశాల నుంచి తిరిగొచ్చిన అనంతరమే దీనిపై కదలిక వచ్చే అవకాశం ఉందన్నారు. సీమాంధ్రలో ఉధృతంగా జరుగుతున్న ఉద్యమాన్ని కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని, తాము చేసిన నిర్ణయంపై పునరాలోచనలో పడిందని పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం జరిగేవరకు విభజనపై కాంగ్రెస్ ముందుకు పోదనే భావిస్తున్నానని ఆయన శుక్రవారం తన కార్యాలయంలో మీడియాకు తెలిపారు. ైహైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని తానెన్నడూ కోరలేదని, దాన్ని మూడో రాష్ట్రంగా చేయాలని కోరుతూ వచ్చానని అన్నారు.