వేడెక్కిన హస్తిన, నేతల భేటీలు | Kavuri meets Veerappa Moily, Killi Kruparani meets CM, Shinde to meet Sonia now, Azad meets Sonia gandhi | Sakshi
Sakshi News home page

వేడెక్కిన హస్తిన, నేతల భేటీలు

Published Thu, Oct 3 2013 11:17 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

Kavuri meets Veerappa Moily, Killi Kruparani meets CM, Shinde to meet Sonia now, Azad meets Sonia gandhi

న్యూఢిల్లీ : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలతో హస్తిన మరోసారి వేడెక్కింది. సాయంత్రం జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణపై కేబినెట్ నోట్ చర్చకు రానున్నదనే ఊహాగానాల నేపథ్యంలో దేశ రాజధానిలో నేతల భేటీలు జోరందుకున్నాయి.  యూపీఏ అధినేత్రి సోనియాగాంధీతో గులాం నబీ ఆజాద్ భేటీ కాగా..... కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే....సోనియాతో సమావేశం కానున్నారు.

ఇక కేంద్రమంత్రి వీరప్ప మొయిలీతో ,...కావూరి సాంబశివరావు భేటీ అయ్యారు. ఇటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కేంద్రమంత్రి కిల్లి కృపారాణి సమావేశం అయ్యారు. తెలంగాణపై కేబినెట్ నోట్ సిద్ధమైందన్న వార్తల నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరపనున్నారు. ఈనేపథ్యంలో సీమాంధ్ర నేతలు మినిస్టర్స్ క్వార్టర్స్లో భేటీ అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement