సమైక్యాంధ్ర తప్ప ఎలాంటి ప్రతిపాదనను అంగీకరించేది లేదు: లగడపాటి
సమైక్యాంధ్ర తప్ప ఎలాంటి ప్రతిపాదనను అంగీకరించేది లేదు: లగడపాటి
Published Thu, Sep 19 2013 7:28 PM | Last Updated on Fri, Sep 1 2017 10:51 PM
తెలంగాణపై ముందుకెళ్లితే సీమాంధ్ర ఎంపీలందరం సామూహిక రాజీనామాలు సమర్పిస్తామని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన లగడపాటి మీడియాతో మాట్లాడుతూ.. అంటోని కమిటీ ముందుకు వెళ్లకుండా తెలంగాణపై ఎలా నిర్ణయం తీసుకుంటారు అని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర తప్ప యూటీ సహా ఎలాంటి ప్రతిపాదనను అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. సమైక్యతను కాపాడేందుకు దేనికైనా సిద్ధమే చేస్తామన్నారు. రాష్ట్రంలో 80 శాతం మంది సమైక్యవాదానికే మద్దతు తెలుపుతున్నారని లగడపాటి అన్నారు. సీమాంధ్ర ఎంపీలకు తెలియకుండా తెరవెనుక చర్యలను అంగీకరించం అని ఆయన స్సష్టం చేశారు.
సెప్టెంబర్ 24 తేదిన స్పీకర్ మీరా కుమార్ తో భేటి అవుతామని.. రాజీనామాలను అంగీకరింప చేసుకునేందుకు ప్రయత్నిస్తామని ఎంపీలు తెలిపారు. సీమాంధ్ర ప్రాంత ఎంపీల వాదనలు పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదని ఎంపీల ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే డ్రాఫ్ట్ కు సీమాంధ్ర ఎంపీలు సవాల్ విసిరారు. ద్రాఫ్ట్ రూపొందిస్తే రాజీనామాలేనని హెచ్చరించారు. జాగో బాగో, వెళ్లిపోవాలంటూ చేస్తూ అంటూ తెలుగు జాతిని సర్వనాశనం చేసింది ఆయనే అని కేసీఆర్ తీరు ను విమర్శించారు. అంతిమ విజయం సమైక్య వాదానిదే అని లగడపాటి ధీమా వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement