- ఆందోళనకు గురైన జిల్లా ప్రజలు
- లగడపాటి తీరుపై ప్రజల ఆగ్రహం
మహబూబాబాద్, న్యూస్‌లైన్ : కేంద్ర హోంశాఖ మంత్రి షిండే గురువారం పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడుతుండగా విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ టి బిలు ్లను వ్యతిరేకిస్తూ పెప్పర్ స్ప్రేను ప్రయోగించారు. దీంతో పార్లమెంట్‌లో గం దరగోళ పరిస్థితి నెలకొంది. ఈ గ్యాస్ మూలంగా మానుకోట పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మంత్రి బలరాం నాయక్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.
ఆయన ఆరోగ్య పరిస్థితిపై మానుకోట పట్టణ ప్రజలు ఆందోళనకు గురయ్యూరు. లగడపాటిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఎన్నికల్లో అనర్హత వేటు వేయాల ని వారు డిమాండ్ చే శారు. మంత్రి త్వరగా కోలుకోవాలని ప్రజలు ప్రార్థించారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు త్వరగా ఆమోదం పొందాలని ఆకాంక్షిస్తున్నారు.