మూడు వారాల ముందే తెలంగాణ నోట్ సిద్ధం!
మూడు వారాల ముందే తెలంగాణ నోట్ సిద్ధం!
Published Fri, Oct 4 2013 2:02 AM | Last Updated on Fri, Sep 1 2017 11:18 PM
కేంద్ర కేబినెట్ ముందుకు వచ్చిన తెలంగాణ నోట్ రూపకల్పన వెనక దాదాపుగా మూడు వారాల కసరత్తు దాగుందని సమాచారం. కాకపోతే సెప్టెంబర్ 25 నాటికి అది తమకు చేరని కారణంగా దాన్ని గురువారం నాటి కేబినెట్ భేటీ అజెండాలో చేర్చలేకపోయినట్టు కేబినెట్ సచివాలయంలోని అత్యున్నత వర్గాలు తెలిపాయి.
కేబినెట్ ఎజెండా వారం రోజుల ముందే ఖరారవుతుందని, ఒక రోజు ముందు దాన్ని విడుదల చేస్తామని గుర్తు చేశాయి. నిజానికి దాన్ని ప్రధాని కార్యాలయంతో పాటు కేబినెట్ సచివాలయానికి కూడా రెండు వారాల ముందే కేంద్ర హోం శాఖ పంపినట్టు తెలుస్తోంది. కానీ ప్రధాని కార్యాలయ అభిప్రాయాల కోసం అది వారం పాటు పీఎంఓలోనే ఉండిపోయిందని సమాచారం.
అంటే, విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న ఉద్యమాన్ని ఏ మాత్రమూ ఖాతరు చేయకుండా మూడు వారాలుగా తెలంగాణ నోట్ తయారీలో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ సర్కారు తలమునకలైందన్నమాట!
Advertisement