జయహో తెలంగాణ... | Telangana people celebrations on telangana note | Sakshi
Sakshi News home page

జయహో తెలంగాణ...

Published Sat, Oct 5 2013 5:32 AM | Last Updated on Tue, Aug 28 2018 5:36 PM

Telangana people celebrations on telangana note

 ఖమ్మం, న్యూస్‌లైన్: తెలంగాణ నోట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో జిల్లావ్యాప్తంగా శుక్రవారం సంబురాలు ఘనంగా జరిగాయి. తెలంగాణవాదులు మిఠాయిలు పంచుకున్నారు. బాణసంచా పేల్చి వేడుకలు జరుపుకున్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీజేఏసీ నాయకులు కూరపాటి రంగరాజు, వెంకటపతిరాజు, టీజీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు షేక్ ఖాజామియా, తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోడి లింగయ్య, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బుర్రి వినోద్ కుమార్, నాయకులు వెంక టేష్, కృష్ణ, వీరయ్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
 
 మంత్రి రాంరెడ్డి క్యాంప్ కార్యాలయంలో: ఖమ్మంలో రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తలు స్వీట్లు పంచిపెట్టారు. బాణసంచా కాల్చి వేడుకలు జరుపుకున్నారు. పార్టీ కార్యకర్తలకు మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శీలంశెట్టి వీరభద్రం, నగర కాంగ్రెస్ కన్వీనర్ రాపర్తి రంగారావు తదితరులు పాల్గొన్నారు.
 
 కార్పొరేషన్ కార్యాలయంలో: నగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలో ఉద్యోగులు సంబురాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచుకుని పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. కార్యాలయం గేటు ముందు బాణసంచా కాల్చారు. కార్యక్రమంలో జిల్లా మున్సిపల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కందూకూరి రాము, కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు కె.శ్రీనివాస్, శ్రీనివాసరావు, లాల్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
 
 జిల్లా ట్రెజరీ కార్యాలయంలో: ఖమ్మంలోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో సంబురాలు ఘనంగా జరిగాయి. ఉద్యోగులు స్వీట్లు పంచుకున్నారు. కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ ఖాజామియా, తెలంగాణ ట్రెజరీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణారావు, వేలాద్రి, నాయకులు వెంకటేశ్వరరావు, సాగర్, వై.వెంకటేశ్వర్లు, డిప్యూటీ డెరైక్టర్ కె.నీలిమ, మహిళ నాయకులు శైలజ, సౌజన్య, మంజుల, నాగేంద్ర కుమారి తదితరులు పాల్గొన్నారు.
 
 జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో: జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలోని రోగులకు టీఎన్‌జీఓస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు తదితరులు పండ్లు పంచిపెట్టారు.
 
 జిల్లా గృహనిర్మాణ శాఖ కార్యాలయంలో
 ఖమ్మంలోని జిల్లా గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో తెలంగాణ సహాయక ఇంజనీర్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్ల సంఘం ఆధ్వర్యంలో సంబురాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ భాస్కర్, సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకయ్య, కోశాధికారి జెఎస్‌ఎన్.మూర్తి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎల్.కృష్ణారెడ్డి, ఔట్ సోర్సింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పి.నరేంద్ర నాథ్, హౌసింగ్ మెనేజర్ బిసిహెచ్.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
 
 జల సౌధలో: ఖమ్మంలోగల జల సౌధ భవనంలోని ఐబీ ఈఈ కార్యాలయంలో ఉద్యోగులు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో ఇరి గేషన్ ఈఈ అంకవీడు ప్రసాద్, ఉద్యోగ జేఏసీ చైర్మన్ కూరపాటి రంగరాజు, నాయకులువెల్పుల శ్రీను, రంగారావు, కృష్టమూర్తి, యాదగి రి, వల్లోజి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
 
 డీసీసీ కార్యాలయంలో: ఖమ్మంలోని జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యాలయంలో తెలంగాణ సంబురాలు ఘనంగా జరిగాయి. కార్యాలయ ఆవరణలో కార్యకర్తలు, నాయకులు టపాసులు పేల్చారు. స్వీట్లు పంచుకున్నారు. కార్యక్రమంలో నాయకులు పులిపాటి వెంకయ్య, కోట గురుమూర్తి, ఎండి.జహీర్ అలీ, నాగండ్ల దీపక్ చౌదరి, మందడపు బ్రహ్మా రెడ్డి, కొత్తా సీతారాములు, వివి.అప్పారావు, వడ్డెబోయిన శంకర్, ఆర్వీయస్ ప్రసాద్, కొరివి వెంకటరత్నం, కేసా బిక్షపతి, జింజిరాల రాజేష్, మాదిరాజు వెంకటేశ్వరరావు, ఎండి.గౌస్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పోరిక లక్ష్మీబాయి, నాయకులు మందపల్లి నాగమణి, జొన్నలగడ్డ అరుణ, నారాయణమ్మ, నగర అధ్యక్షురాలు కొల్లు పద్మ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మంలోని మయూరి సెంటర్‌లో కాంగ్రెస్ నాయకులు రామిశెట్టి మనోహర్ నాయుడు, కట్ల రంగారావు తదితరులు  బాణసంచా కాల్చారు.
 
 ఇల్లెందులో:
 తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో జేఏసీ నాయకులు శుక్రవారం సాయంత్రం ఇల్లెందులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, జేఏసీ డివిజన్ చైర్మన్ పేరూరి అప్పారావు, నాయకులు జానీపాషా, ఎర్రబెల్లి కిష్టయ్య, సిలివేరు సత్యనారాయణ, కంభంపాటి కోటేశ్వరరావు, రామచందర్‌నాయక్, కొత్తిమీర శ్రీను, పోషం, బావ్‌సింగ్, ఖాజా, మడత వెంకటగౌడ్, సురేష్ లాహోటీ పాల్గొన్నారు.
 
 కొత్తగూడెంలో:
 తెలంగాణ మహిళ జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో సంబురాలు జరిగాయి. కన్వీనర్ తేజావత్ కమల కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సుమభాను, మాధవి, నాగకుమారి, పిట్టల కమల, జ్యోతిరాణి, రుక్మిణి, కళాశ్రీ, స్వప్న, శాంత, జాను తదితరులు పాల్గొన్నారు. టీవీవీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో జిల్లా అధ్యక్షుడు చార్వాక, నాయకులు పి.వేణు, పి.శ్రీహరి, రాము, అచ్యుత్ తదితరులు పాల్గొన్నారు.
 
 జిల్లాలో పలుచోట్ల:
 జిల్లాలో పలుచోట్ల సంబురాలు జరిగాయి. చండ్రుగొండలో అఖిలపక్షం ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ జరిగింది. అశ్వారావుపేట నియోజకవర్గవ్యాప్తంగా వివిధ పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీలు జరిగాయి. భద్రాచలం, వాజేడు, వెంకటాపురం, కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ పార్టీల కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. బోనకల్‌లోని తెలంగాణ-ఆంధ్ర సరిహద్దులో ఇటీవల నిర్మించిన అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణవాదులు నివాళులర్పించారు. మణుగూరులో జరిగిన వేడుకల్లో పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పాల్గొన్నారు. సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, అశ్వాపురం, బూర్గంపాడు, వైరా, జూలూరుపాడు మండలాల్లో సంబురాలు జరిగాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement