తెలంగాణ నోట్ ను ఆమోదించిన కేంద్ర మంత్రి మండలి | Cabinet clears Telangana formation | Sakshi
Sakshi News home page

Oct 3 2013 7:54 PM | Updated on Mar 21 2024 9:10 AM

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశం ముగిసింది. సమావేశం రెండు గంటలసేపు జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందిన మంత్రులు జైపాల్ రెడ్డి, పల్లంరాజు, కావూరి సాంబశివరావు పాల్గొన్నారు. రాష్ట్ర విభజనను పల్లంరాజు, కావూరి సాంబశివరావులు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. సమావేశం ముగిసిన తరువాత కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్రం ముఖ్య అంశాలు: *తెలంగాణ నోట్ను కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది *29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం * సిడబ్ల్యూసీ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి మండలి యథాతథంగా ఆమోదించింది. *నిర్ణీత కాల వ్యవధిలో రాష్ట్రం ఏర్పాటు *హైదరాబాద్తోపాటు పది జిల్లాలతో కూడిన తెలంగాణ *తెలంగాణకు 17, ఆంధ్ర ప్రదేశ్కు 25 లోక్సభ స్థానాలు తెలంగాణకు 8, ఆంధ్ర ప్రదేశ్కు 10 రాజ్యసభ స్థానాలు *పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ *ఆస్తులు, అప్పులపై బ్లూప్రింట్లో ప్రస్తావన * విభజన సమస్యల పరిష్కరానికి మంత్రుల బృందం ఏర్పాటు *త్వరలో మంత్రుల బృందం ఏర్పాటు కేంద్ర మంత్రి మండలి తీర్మానాన్ని హొం శాఖ రాష్ట్రపతికి పంపుతుంది. ఆ తరువాత అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement