సీఎం సరిగ్గా స్పందించలేదు: సీమాంధ్ర విద్యుత్ జేఏసీ | CM Kiran kumar reddy not properly respond on state bifurcation issue, says Seemandhra electricity employees JAC | Sakshi
Sakshi News home page

సీఎం సరిగ్గా స్పందించలేదు: సీమాంధ్ర విద్యుత్ జేఏసీ

Published Tue, Oct 8 2013 1:52 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

CM Kiran kumar reddy not properly respond on state bifurcation issue, says Seemandhra electricity employees JAC

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను నిరసిస్తూ తాము చేపట్టిన నిరవధిక సమ్మెతో కేంద్ర ప్రభుత్వం తప్పక దిగి వస్తుందని సీమాంధ్ర విద్యుత్ జేఏసీ నేతలు స్పష్టం చేశారు. మంగళవారం సీఎం కిరణ్తో భేటీ అయ్యే ముందు విద్యుత్ జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ... నేర చరితుల ఆర్డినెన్స్ను కేంద్రం ఏలా వెనక్కి తీసుకుందో, టీ నోట్ను కూడా అలాగే వెనక్కి తీసుకుంటుందని తాము నమ్ముతున్నట్లు తెలిపారు.

 

సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామంటూ సీఎం కిరణ్ చెప్పిన తర్వాతే గత నెలలో తాము చేపట్టిన సమ్మెను విరమించామని వారు ఈ సందర్భంగా గర్తు చేశారు. గతంలో సీఎం ఇచ్చిన హామీ పట్ల సీఎం కానీ, మంత్రులు గాని సరిగ్గా స్పందించలేదని, దాంతో నిరవధిక సమ్మె చేస్తున్నట్లు సీమాంధ్ర విద్యుత్ జేఏసీ నేతలు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement