తెలంగాణ ప్రక్రియ వేగవంతం చేయాలి
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసి పార్లమెంటులో వె ంటనే బిల్లు పెట్టాలి. బిల్లును పార్లమెంట్‌లో పెట్టేవరకూ తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ చరిత్రాత్మక నిర్ణయం
తెలంగాణ నోట్‌ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించడం చరిత్రాత్మక నిర్ణయం. తెలంగాణ ప్రజల 56 ఏళ్ల ఆకాంక్షలను సాఫల్యం చేస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. రాజకీయ ప్రక్రియ పూర్తయి, రాజ్యాంగ ప్రక్రియ మొదలైంది. ఇక తెలంగాణ ఏర్పాటుకావడం ఖాయం. విభజన వద్దని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు, ప్రతిపక్ష నేత చంద్రబాబు, వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిలు ఇప్పటికీ మాట్లాడటం శోచనీయం. వైషమ్యాల్లేకుండా పరస్పర సహకారంతో విభƒ జనకు సహకరించాలి -కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్
అన్ని పార్టీలు ప్రజలకు నచ్చజెప్పాలి అన్ని పార్టీలతోపాటు కాంగ్రెస్‌లోనూ విస్తృత సంప్రదింపుల తరువాతే నిర్ణయం జరిగింది. సీమాంధ్ర నేతలు ఇందుకు సహకరించాలి. విడిపోవడం బాధాకరమే అయినప్పటికీ సంయమనంతో వ్యవహరించాలి. విగహ్రాల ధ్వంసం వద్దు. విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసుందాం. అన్ని పార్టీలు ప్రజలకు నచ్చజెప్పాలి - కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి
దొరలు, పెట్టుబడిదారులకు రాజ్యాధికారం దక్కరాదు హైదరాబాద్‌కు యూటీ గండం తప్పింది. తెలంగాణలో రాజ్యాధికారం దొరల చేతికి, సీమాంధ్రలో పెట్టుబడిదారుల చేతికి వెళ్లకుండా అణగారిన కులాలను అప్రమత్తం చేయాలి. తెలంగాణ, సీమాంధ్ర పునర్నిర్మాణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు భాగస్వాములు కావాలి. తెలంగాణ బిల్లును పార్లమెంటులో త్వరగా ప్రవేశపెట్టి ఆమోదింపచేయాలి. -ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ బిల్లు ఆమోదం పొందితేనే సంబరాలు
తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితేనే ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. కేబినెట్ నోట్‌తో సంతోషపడేది లేదు. తెలంగాణ ప్రకటన తర్వాతి పరిణామాలతో కాంగ్రెస్‌ను ప్రజలు విశ్వసించడం లేదు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణను ఏర్పాటు చేస్తూ వెంటనే పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలి. ఇదే మా డిమాండ్.
-టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పునర్నిర్మాణం పై దృష్టిపెడదాం
కేబినెట్ నోట్‌కు ఆమోదం లభించిన నేపథ్యంలో తెలంగాణ పునర్నిర్మాణంపై దృష్టిపెడదాం. తెలంగాణవాదులెవరూ అనవసర వివాదాలకు వెళ్ల వద్దు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటవుతున్న తరుణంలో అన్ని వర్గాలకు సముచిత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే విధంగా ప్రణాళికను రూపొం దించుకుందాం.
- టీఆర్‌ఎల్డీ నేత దిలీప్‌కుమార్
అడ్డుకునేవారుంటారు... జాగ్రత్త
జీవితంలో ఏనాడూ లేనంత ఆనందం ఇప్పుడు కలిగింది. కేబినెట్ ఆమోదంతోనే అంతా అయిపోయిందని అనుకోవద్దు, ఈ సమయంలోనూ అడ్డుకునేవారు ఉంటారు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణ సాధన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. తెలుగుజాతిలో చిచ్చుపెట్టారని అంటున్న చంద్రబాబుకు తెలంగాణ వారిది తెలుగుజాతి అని తెలియదా? రాష్ర్టంలోని 42 శాతం మంది తెలంగాణవారు, సీమాంధ్రలో జైఆంధ్రా అంటున్న 10-15 శాతం మంది కూడా విభజనను కోరుతున్న విషయాన్ని గమనించాలి. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలు చిన్నపిల్లల చర్యల్లాంటివి.
-టీఆర్‌ఎస్ సీనియర్ నేత కె.కేశవరావు
తెలంగాణ ఏర్పాటు వరకు పోరాటం
తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర మంత్రివర్గ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందే వరకు అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు పోరాటం కొనసాగిస్తాం.
- తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్
తెలంగాణ నేతల హర్షం
Published Fri, Oct 4 2013 5:56 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement