న్యూఢిల్లీ: తెలంగాణ నోట్ను కేంద్ర కేబినెట్ ముందు ఉంచారు. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో కేంద్ర మంత్రి మండలి సమావేశమైంది. ఈ సమావేశానికి రాష్ట్రానికి చెందిన మంత్రులు జైపాల్ రెడ్డి, పల్లంరాజు, కావూరి సాంబశివరావు హాజరయ్యారు.
ప్రధాన మంత్రి అనుమతితో టేబుల్ ఐటమ్గా తెలంగాణ నోట్పై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకొని 60 రోజులు గడిచిపోయింది. నోట్పై హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే సంతకం చేసి ఈ సాయంత్రం కేంద్ర మంత్రులకు అందజేసిన విషయం తెలిసిందే.
ఈ నెల 9న ప్రధాని విదేశీ పర్యటను వెళ్లనున్నారు. ఈ లోపలే తెంగాణ అంశంపై మంత్రి మండలి ఆమోదం పొందే ప్రయత్నాలలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. కేబినెట్ గనక ఆమోదిస్తే కొద్ది రోజుల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించిన తీర్మానం రాష్ట్ర శాసనసభకు వచ్చే అవకాశం ఉంది.
రాష్ట్ర విభజనకు సీమాంధ్రులు అంగీకరించడంలేదు. తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తున్నారు. విభన విషయంలో హైదరాబాద్ కీలకంగా మారింది. కొందరు హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కోరుతున్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు కూడా హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కోరుతున్నారు. సమావేశంలో సాంబశివరావు ఈ విషయం ప్రస్తావించే అవకాశం ఉంది. నోట్ సిద్ధమవడం సీమాంధ్ర ప్రజాప్రతినిధులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది.
కేంద్ర కేబినెట్ ముందు తెలంగాణ నోట్
Published Thu, Oct 3 2013 6:23 PM | Last Updated on Mon, Aug 20 2018 9:26 PM
Advertisement
Advertisement