తెలంగాణ నోట్ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిద్ధం చేస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. అది పూర్తయిన వెంటనే కేబినెట్ పరిశీలకు వస్తుందని ఆయన తెలిపారు. అయితే ఈ ప్రక్రియ పూర్తి కావటానికి ఎంత సమయం పడుతుందనేది తాను చెప్పలేనని అన్నారు. ఆ విషయాన్ని హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేనే అడిగితే బాగుంటుందని దిగ్విజయ్ అన్నారు. సీమాంధ్రలో సమ్మె వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.... చేతులు జోడించి అడుగుతున్నానని... ఏపీ ఎన్జీవోలు తక్షణమే సమ్మె విరమించాలని దిగ్విజయ్ విజ్ఞప్తి చేశారు. ప్రయివేట్ దుకాణాలు, రవాణా వ్యవస్థ, కార్యాలయాలు నడుస్తుంటే.... ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉంచటం ఎంతవరకూ సబబు అని ప్రశ్నించారు. ఉద్యోగులకు ఎదురయ్యే అన్ని సమస్యల్ని పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని దిగ్విజయ్ స్పష్టం చేశారు. అన్ని పార్టీలు తెలంగాణకు అంగీకరించాయని దిగ్విజయ్ సింగ్ బుధవారమిక్కడ తెలిపారు. జగన్ బెయిల్ రావటంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ ....జగన్.... కాంగ్రెస్తో కుమ్మక్కు అయితే... బీజేపీ ....టీడీపీతో కుమ్మక్కు అయ్యిందా అని ప్రశ్నించారు. దిగ్విజయ్ సింగ్... ఈరోజు ఉదయం పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు
Published Wed, Sep 25 2013 3:08 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement