తెలంగాణ నోట్ ఇప్పట్లో రాదు: కావూరి
తెలంగాణ నోట్ క్యాబినెట్‌కు ఇప్పట్లో రాదని కేంద్ర కావూరి సాంబశిరావు అన్నారు. సోనియాగాంధీ విదేశాల నుంచి వచ్చిన తర్వాతే ఈ ప్రక్రియలో కదలిక ఉంటుందని చెప్పారు. సీమాంధ్ర ఉద్యమంతో కేంద్రం పునరాలోచనలో పడిందన్నారు. హైదరాబాద్‌ను సీమాంధ్రులు వదులుకోవడానికి సిద్ధంగా లేరని చెప్పారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను మరో 20 రోజుల్లోగా కేంద్ర మంత్రివర్గ పరిశీలనకు సమర్పించబోతున్నట్టు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రివర్గ తీర్మానం కోసం హోం శాఖ సమర్పించాల్సిన నివేదికను సిద్ధం ఆయన స్పష్టం చేశారు. మంత్రివర్గ ఆమోదం కోసం నోట్ తయారవుతోందని, సిద్ధమయ్యాక దాన్ని కేంద్ర న్యాయ శాఖ ఆమోదానికి పంపిస్తామన్నారు. న్యాయ శాఖ ఆమోదించాక 20 రోజుల్లోగా కేంద్ర మంత్రివర్గ పరిశీలనకు సమర్పిస్తాం అని తెలియజేశారు.