తెలంగాణ నోట్పై సంతకం చేయలేదు: షిండే | did not sign on Telangana Note: Sushil kumar Shinde | Sakshi
Sakshi News home page

తెలంగాణ నోట్పై సంతకం చేయలేదు: షిండే

Published Thu, Oct 3 2013 3:19 PM | Last Updated on Fri, Sep 1 2017 11:18 PM

తెలంగాణ నోట్పై సంతకం చేయలేదు: షిండే

తెలంగాణ నోట్పై సంతకం చేయలేదు: షిండే

ఢిల్లీ: కేబినెట్ నోట్పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈరోజు సాయంత్రం జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణపై కేబినెట్ నోట్ చర్చకు రానున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మాత్రం మీడియాలో వస్తున్న కథనాలు ఊహాగానాలేనన్నారు. తెలంగాణ నోట్పై తానింకా సంతకం చేయలేదని తెలిపారు. సోనియా గాంధీ అనుమతి కోసం వేచి చూస్తున్నామని షిండే పేర్కొన్నారు.

మరోవైపు రాష్ట్రా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ మాత్రం తెలంగాణపై వెనక్కి తగ్గేది లేదని మరోసారి స్పష్టం చేయటం.... నోట్పై తాను సంతకం చేయలేదనటంతో.... సాయంత్రం జరిగే కేబినెట్ సమావేశంలో తెలంగాణ నోట్పై చర్చ జరుగుతుందా....లేదా అనేది సస్పెన్స్గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement