హైదరాబాద్తో కూడిన తెలంగాణ: షిండే ప్రతిపాదన | Telangana with Hyderabad : Sushil Kumar Shinde Proposal | Sakshi
Sakshi News home page

హైదరాబాద్తో కూడిన తెలంగాణ: షిండే ప్రతిపాదన

Published Thu, Oct 3 2013 7:18 PM | Last Updated on Fri, Sep 1 2017 11:18 PM

హైదరాబాద్తో కూడిన తెలంగాణ: షిండే ప్రతిపాదన

హైదరాబాద్తో కూడిన తెలంగాణ: షిండే ప్రతిపాదన

న్యూఢిల్లీ: హైదరాబాద్తో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటును హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే  ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన తెలంగాణ నోట్ను కేంద్ర కేబినెట్ ముందు ఉంచారు. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశం దాదాపు గంటన్నరసేపు జరిగింది.  సమావేశానికి రాష్ట్రానికి చెందిన మంత్రులు జైపాల్ రెడ్డి, పల్లంరాజు, కావూరి సాంబశివరావు హాజరయ్యారు.

ప్రధాన మంత్రి అనుమతితో టేబుల్ ఐటమ్గా తెలంగాణ నోట్పై చర్చించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకొని 60 రోజులు గడిచిపోయింది.  నోట్పై హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే సంతకం చేసి ఈ సాయంత్రం  కేంద్ర మంత్రులకు అందజేసిన విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ రీఆర్గనైజేషన్ పేరుతో  20 పేజీల నోట్ రూపొందించారు. ఈ నోట్లో  రాజధాని, భౌగోళిక స్వరూపం, నదీజలాలు తదితర అంశాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్తో కూడిన తెలంగాణ   ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటును ఆ నోట్లో ప్రతిపాదించారు. అలాగే ఇంతకు ముందు చెప్పినట్లు పది సంవత్సరాలపాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఉండేటట్లు నోట్ రూపొందించారు.  కేంద్ర మంత్రులు పల్లంరాజు, కావూరి సాంబశివరాలు దీనిని వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. నోట్పై చర్చించిన తరువాత దీనిని మంత్రుల బృందం పరిశీలనకు పంపాలని నిర్ణయించినట్లు తెలిసింది. మంత్రుల బృందం పరిశీలించిన తరువాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మంత్రి మండలి సమావేశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.

సమావేశం ముగిసిన తరువాత కేంద్ర మంత్రి బేణీ ప్రసాద్ వర్మ బయటకు వచ్చారు. సమావేశంలో తెలంగాణ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు ధృవీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement