వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ :
తెలంగాణ నోట్‌కు కేంద్ర కేబినేట్ ఆమోదముద్ర వేయడంతో జిల్లావ్యాప్తంగా తెలంగాణవాదుల సంబరాలు అంబరాన్నంటారుు. హన్మకొండ అమరవీరుల స్థూపం తెలంగాణవాదుల సంబరాలకు కేంద్రంగా మారింది. ఉద్యోగులు, న్యాయవాదులు, బీసీ జేఏసీ, విద్యార్థులు, వివిధ సంఘాలు ఎవరికివారు ర్యాలీగా చేరుకుని స్థూపానికి క్షీరాభిషేకం చేశారు. కోర్టులో న్యాయవాదులు తెలంగాణ జెండాను ఆవిష్కరించారు. జై తెలంగాణ నినాదాలతో ఆ ప్రాంతం మర్మోగింది. అనంతరం ఏకశిల పార్కులోని తెలంగాణ జాతిపిత, ప్రొఫెసర్ జయశంకర్‌సార్ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. తెలంగాణ ఏర్పడే వరకూ అప్రమత్తంగా ఉండాలని బార్ అసోసియేషన్ నాయకులు పిలుపునిచ్చారు. హన్మకొండ డీసీసీ భవన్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య మాట్లాడుతూ సోనియాగాంధీకి తెలంగాణ ప్రజలు రుణపడి ఉన్నారని కొనియాడారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి, ట పాసులు కాల్చి నాయకులు, కార్యకర్తలతో ఆనందాన్ని పంచుకున్నారు. కరీమాబాద్, వరంగల్ చౌరస్తా, మట్టెవాడ, శివనగర్, ఖిలావరంగల్, కాశిబుగ్గ ప్రాంతాల్లో తెలంగాణవాదులు సంబరాలు చేసుకున్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఆధ్వర్యంలో వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించారు. కాశిబుగ్గలో సోనియా, మన్మోహన్‌సింగ్, కేసీఆర్ ఫ్లెక్సీలకు పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అవరోధాలు కలగకుండా చూడాలని స్థానిక శివాలయంలో ప్రత్యేక హోమం చేశారు. ఎంజీఎం, కేఎంసీలలో మెడికల్ జేఏసీ ఆధ్వర్యంలో సంబరాలు జరిగారుు. జనగామలో టీఆర్‌ఎస్, బీజేపీ, ఏబీవీపీ ఆధ్వర్యంలో మిఠాయిలు పంపిణీ చేశారు. నర్సంపేట, పరకాలలోని అన్ని మండలాల్లో తెలంగాణవాదులు, టీజేఏసీ, టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. వర్ధన్నపేటలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. టపాసులు కాల్చి ధూంధాం చేశారు. తొర్రూరులో న్యాయవాదులు, జేఏసీ, కాంగ్రెస్ వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారుు.
స్టేషన్ ఘన్‌పూర్‌లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు వేర్వేరుగా సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య టపాసులు కాల్చి.. పాట పాడి.. డ్యాన్స్ చేశారు. గూడూరు, జఫర్‌గఢ్, సంగెంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయూరు. మహబూబాబాద్‌లో సంబరాలు మిన్నంటాయి. టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల ర్యాలీ చేపట్టారు. ఎల్‌హెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి మిఠాయిలు పంపిణీ చేశారు. బాణసంచా కాల్చి, తెలంగాణ అమరవీరులకు పిండ ప్రదానం చేసి నివాళులర్పించారు. అరుణోదయ కళాకారులు కళాజాతాతో ఆకట్టుకున్నారు. డోర్నకల్, మరిపెడ, నర్సింహులపేటలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు వేర్వేరుగా భారీ ర్యాలీలు నిర్వహించారు. ములుగు, భూపాలపల్లిల్లో టీఆర్‌ఎస్, సింగరేణి కార్మికులు ర్యాలీలు నిర్వహించి ఆనందాన్ని పంచుకున్నారు.
తెలంగాణ జేఏసీ జిల్లా చైర్మన్, ప్రొఫెసర్ పాపిరెడ్డి, బీసీ జేఏసీ చైర్మన్ శేషు, కోలా జనార్దన్, తెలంగాణ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు జనార్ధన్, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ పరిటాల సుబ్బారావు, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు కోలా రాజేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి రత్నవీరాచారి, టీజీఓ నాయకుడు జగన్మోహన్‌రావు, టీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జ్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, వరంగల్ పశ్చిమ, పరకాల ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, మొలుగూరి బిక్షపతి, డాక్టర్ రాజయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అంబరీష, గుడిమల్ల రవికుమార్, సహోదర్‌రెడ్డి, రాజేంద్రకుమార్, కేయూ జేఏసీ నాయకులు సాధు రాజేష్, జోరిక రమేష్, సారయ్య, వీరేందర్, డాక్టర్ నాగేంద్రబాబు, అశోక్‌రెడ్డి, బీజేపీ నాయకులు ఎడ్ల అశోక్‌రెడ్డి, బైరబోయిన దామోదర్, మరుపల్ల రవి, చాగంటి రమేష్, బక్కనాగరాజు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ.. సంబురం
Published Sat, Oct 5 2013 6:17 AM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM
Advertisement
Advertisement