హైదరాబాద్ సీమాంధ్రులదే: భూమన | Hyderabad Belongs to Seemandhra People: Bhumaha Karunakar Reddy | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ సీమాంధ్రులదే: భూమన

Aug 19 2013 11:18 PM | Updated on Sep 1 2017 9:55 PM

హైదరాబాద్ సీమాంధ్రులదే: భూమన

హైదరాబాద్ సీమాంధ్రులదే: భూమన

సీమాంధ్రుల రెక్కల కష్టంతో వచ్చిన నగరమే భాగ్యనగరమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పేర్కొన్నారు.

సాక్షి, తిరుపతి : సీమాంధ్రుల రెక్కల కష్టంతో వచ్చిన నగరమే భాగ్యనగరమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పేర్కొన్నారు. విభజన ప్రకటనకు వ్యతిరేకంగా తిరుపతి అన్నమయ్య సర్కిల్ వద్ద సోమవారం వేలాది మందితో నిరసన సభ జరిగింది. ఈ సభలో కరుణాకరరెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర నుంచి వచ్చిన కప్పాల ద్వారా నాటి నిజాం నవాబులు హైదరాబాద్ నిర్మించారనే విషయం చరిత్ర చెబుతోందన్నారు.

హైదరాబాద్ నిర్మాణంలో పాలు పంచుకున్న కూలీలు కూడా సీమాంధ్రులేనని తెలిపారు. కాగా, ఎన్నో కష్టాలను దిగమింగుకొని పట్టు విడవని ఝాన్సీ లక్ష్మీబాయిలా విజయమ్మ దీక్ష చేపట్టారని భూమన అన్నారు. ఆమెకు ఏడుకోట్ల మంది ప్రజలు అండగా ఉన్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement