Bhagyanagar
-
హైదరాబాద్ శిల్పారామంలో జానపద జాతర.. ప్రజలందరికీ ఉచిత ప్రవేశం
భారతీయ సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేందుకు వేడుక సిద్ధమైంది. ‘లోక్ మంథన్’ పేరుతో నవంబర్ 21 నుంచి 24 వరకు మహోత్తరమైన ‘జానపద జాతర‘ హైదరాబాద్ శిల్పారామంలో కనుల విందు చేయనున్నది. ‘ప్రజ్ఞా ప్రవాహ్’ సంస్థ 2016 నుంచి ప్రతి రెండేళ్లకోసారి దేశంలోని ఒక్కో రాష్ట్రంలో లోక్ మంథన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. విదేశాల నుంచి సైతం ఒక్కో తెగ, ఒక్కో జాతికి సంబంధించిన ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే కళాకారులు దాదాపు 1500 మంది ఈ ‘జానపద జాతర’లో తమ కళలను ప్రదర్శిస్తారు. భిన్నత్వంలో ఏకత్వం చాటే ఈ మేళా ప్రారంభోత్సవానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరవుతారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అగ్ర నేత మోహన్ భాగవత్‌తో పాటూ అనేకమంది కేంద్రమంత్రులూ వస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లోక్‌మంథన్ ఆహ్వాన కమిటీ గౌరవ అధ్యక్షులుగా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.భారతీయ జానపద కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా ఈ దేశమంతా ఒకటేననే ఏకత్వాన్ని నిరూపించడమే లోక్ మంథన్ ప్రధాన లక్ష్యం. ‘జాతీయ గిరిజన గౌరవ దివస్’ పేరుతో భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి పురస్కరించుకొని నిర్వహించే ఈ వేడుక మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. సదస్సులు, సమావేశాల ఆధారంగా ప్రపంచంలోని వనవాసి, గిరివాసి సమస్యలను చర్చించి, వాటి పరిష్కారానికి మార్గాన్ని కూడా అన్వేషిస్తారు. సంప్రదాయ సాంస్కృతిక వాయిద్యాలు, పనిముట్లు ప్రదర్శిస్తారు. ఈ జాతరలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సాంస్కృతిక వారసత్వానికి చెందినవారు కూడా వచ్చి ప్రదర్శనలిస్తారు.ఇండోనేషియా కళాకారులు రామాయణం ఆధారంగా ప్రదర్శించే ‘కేచక్’ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంటుంది. ప్రపంచంలో అబ్రహామిక్ మతాలకు పూర్వమున్న మతాలు, సంస్కృతుల వారు సైతం లోక్‌మంథన్‌కు హాజరవుతున్నారు. వీరిలో సిరియాలోని రోమోలు, ఆర్మేనియాలోని యజిదీలు (సూర్యపుత్రులు), లిథువేనియా వాసులు సైతం ఉన్నారు. అబ్రహామిక్ మతాల రాకకు పూర్వం ఆయా దేశాలలో అచరించిన, నేటికీ ఆచరిస్తున్న సూర్యారాధన, యజ్ఞం (అగ్నిని పూజించడం) నిర్వహణ విధానాలను వీరు హైదరాబాద్ లోక్‌మంథన్‌లో చేసి చూపిస్తారు. చదవండి: మణిపుర్ ఘర్షణలకు ముగింపెప్పుడు?ఈ సందర్భంగా జరిగే ఎగ్జిబిషన్లో తెలంగాణ, త్రిపుర, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌తో సహా 10 రాష్ట్రాలకు చెందిన విభిన్న కళలు, సంప్రదాయ ఆహారం, సంప్రదాయ గ్రామీణ క్రీడలు, సాహిత్యం, ఇతర సాంస్కృతిక అంశాలౖపై చర్చలు ఉంటాయి. భారతీయ ప్రజలు ఏ ప్రాంతంలో నివసిస్తున్నా... వారి అందరి సాంస్కృతిక పునాదులు జానపదంలోనే ఉన్నాయి. మన మూలాలను ఒకసారి అందరికీ చాటిచెప్పే లక్ష్యంతో జరుగుతున్న ఈ జాతరకు అందరూ ఆహ్వానితులే. ఉత్సవాలు జరిగే నాలుగు రోజులూ శిల్పారామంలోకి ప్రజలందరికీ ఉచిత ప్రవేశం ఉంటుంది.– పగుడాకుల బాలస్వామి; ప్రచార ప్రసార ప్రముఖ్, వీహెచ్‌పీ, తెలంగాణ రాష్ట్రం(నేటి నుంచి ‘లోక్ మంథన్’ ప్రారంభం) -
1500 కళాకారులు.. 350 ఎగ్జిబిట్స్, 100 స్పీకర్స్, 12 దేశాలు
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లకోసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘లోక్ మంథన్’ వేడుకలకు సర్వం సిద్ధమైంది. భారతీయ జానపద సాంస్కృతిక ఉత్సవాలను ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి ప్రముఖులు, సుమారు 2 వేల మందికి పైగా జానపద కళాకారులు తరలి రానున్నారు. ఇప్పటికే ప్రీ లోక్ మంథన్ పేరిట అవగాహన సదస్సులను, ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. దేశంలో విశిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థ అమలులో ఉండేదని, విదేశీయుల దండయాత్రల కారణంగా గ్రామీణ ప్రజలకంటే పట్టణవాసులు ఉన్నతులుగా భావించే వివక్ష ఏర్పడిందని, ఈ నేపథ్యంలో గ్రామీణ విజ్ఞానం నిర్లక్ష్యానికి గురైందని లోక్ మంథన్ నిర్వాహకులు భావిస్తారు. అందుకే ప్రకృతి జానపదుల గొప్పతనాన్ని లోకానికి చాటిచెప్పే లక్ష్యంతోనే ‘లోక్ మంథన్’ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జానపదుల విశ్వాసాలు, జీవన విధానం, దృక్పథం, వేల ఏళ్లుగా సమాజాన్ని ఏలిన వ్యవస్థల వివరాలను వెలికి తీసుకురావాలనేదే లోక్‌మంథన్ ఉద్దేశం. ప్రజ్ఞా భారతి ఆధ్వర్యంలో ఈ లోక్‌మంథన్ వేడుకలు ఇప్పటి వరకు రాంచీ, భోపాల్, గువాహటి, తదితర నగరాల్లో ఘనంగా జరిగాయి. భాగ్యనగరం వేదికగా.. ఈ బృహత్తర కార్యక్రమానికి హైదరాబాద్ నగరం వేదిక కానుంది. సంగీతం, నృత్యం, కళలు, క్రీడలు, ఆహారం, ఆరోగ్యం, ఆధ్యాత్మికత తదితర అంశాలపై సమాలోచనల సమాహారమే లోక్‌మంథన్. అర్మేనియా, లూథియానా వంటి దేశాల మూల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పలు కళా ప్రదర్శనలు, సమాలోచనలు చేసేందుకు వేలాది మంది తరలిరానున్నారు. బాలి నుంచి పద్మశ్రీ గ్రహీత వాయన్ దిబియా తన బృందంతో కలిసి రామాయణ ఇతిహాసం ప్రదర్శించనున్నారు.చదవండి: ఒత్తయిన జుట్టు.. ఒత్తిడితో ఫట్టునగరీకరణ కారణంగా అస్తిత్వాన్ని మరిచిపోతున్న నేటి తరానికి భారతీయ సామాజిక జీవిత మూలాలను తెలియజేసే ప్రయత్నమే లోక్ మంథన్. మన వ్యవస్థలో మొదటి నుంచి అడవి బిడ్డల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రముఖ స్థానం ఉండేది. కానీ కాలక్రమేణా ఆ సంస్కృతి మరుగునపడింది. దీంతో అసలైన భారతీయతను నగర ప్రజలకు తెలియజేసేందుకు దేశంలోని వివిధ నగరాల్లో లోక్ మంథన్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగే ఈ లోక్‌మంథన్‌కు దేశ విదేశాలకు చెందిన వందలాది మంది కళాకారులు, మేధావులు, పరిశోధకులు హాజరుకానున్నారు.మనది అడవి బిడ్డల సంస్కృతి నగర ప్రజలు కెరీర్ వైపు, ఆధునికత వైపు విస్తారంగా పరుగులు తీస్తున్నారు. సమాజాన్ని ప్రభావితం చేస్తున్న ఈ సమూహానికి.. మన సమాజం మూలాలను గుర్తు చేసే ప్రయత్నమే లోకమంథన్. మన భారతీయల వ్యవస్థలో మొదటి నుంచీ అడవి బిడ్డల సంస్కృతి, సంప్రదాయాలకు ముఖ్యమైన స్థానం ఉండేది. కానీ కాలక్రమేణా అది మరుగున పడిపోయింది. అందుచేత అసలైన భారతీయతను నగర ప్రజలకు తెలియచెప్పేందుకు దేశంలోని వివిధ నగరాలలో లోక మంథన్ నిర్వహిస్తున్నాం. – నందకుమార్, ప్రజ్ఞా ప్రవాహ్ అఖిల భారతీయ కన్వీనర్ -
హైదరాబాద్ వర్సెస్ భాగ్యనగర్.. సారీ చెప్పిన ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ
హైదరాబాద్ నగరం పేరును భాగ్యనగర్ మార్చాలంటూ వస్తున్న డిమాండ్లు ఇప్పటికే వివాస్పదం కాగా ఇందులో వేలు పెట్టిన ఓ ట్రావెల్ ఏజెన్సీ సంస్థ చిక్కుల్లో పడింది. ఇష్టారీతిగ నగర పేర్లు మార్చేందుకు మీరెవరు అంటూ నెటిజన్లు దండెత్తడంతో సారీ చెప్పింది. స్టార్టప్‌గా మొదలై యూనికార్న్ దిశగా పరుగులు పెడుతోంది ట్రావెల్ యాప్ ఇక్సిగో. బస్సులు, రైళ్లు, విమాన టిక్కెట్లు ఈ యాప్‌లో బుక్ చేసుకోవచ్చు. నాలుగేళ్ల కిందట వచ్చిన ఈ యాప్ అనేక మంది యూజర్ల అభిమానాన్ని సంపాదించుకుంది. తాజాగా హైదరాబాద్‌కి చెందిన ఓ నెటిజన్ ఇక్సిగో వెబ్సైట్లో భాగ్యనగర్ అని టైప్ చేయగా రాజీవ్‌గాంధీ ఇంటర్నెషన్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ అంటూ స్క్రీన్‌పై ప్రత్యక్షం అయ్యింది. హైదరాబాద్ నగరం పేరును భాగ్యనగర్ మార్చాలంటూ వస్తున్న డిమాండ్లు ఇప్పటికే వివాస్పదం కాగా ఇందులో వేలు పెట్టిన ఓ ట్రావెల్ ఏజెన్సీ సంస్థ చిక్కుల్లో పడింది. ఇష్టారీతిగ నగర పేర్లు మార్చేందుకు మీరెవరు అంటూ నెటిజన్లు దండెత్తడంతో సారీ చెప్పింది. Hey @ixigo who the hell gave you the right to change Hyderabad's name to Bhagyanagar? I type in Bhagyanagar and it shows RGIA.What the hell? Absolutely not okay. Ridiculous. So tomorrow if someone calls a city Fart Nagar will you do that too? Hyderabadis should #boycottixigo pic.twitter.com/Nfvi2BrPqt — Yunus Lasania (@lasaniayunus) January 14, 2022 భాగ్యనగర్ అని టైప్ చేస్తే హైదరాబాద్ ఎయిర్‌పోర్టును చూపించడంపై నెటిజన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ సదరు స్క్రీన్‌షాట్‌ని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. రేపు ఎవరో వచ్చి ఇంకేదో పేరు పెట్టాలంటూ డిమాండ్ చేస్తే ఇలాగే చేస్తారా అంటూ ప్రశ్నించారు. క్షణాల్లో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ఇక్సిగో చేసిన పనిపై నెటిజన్లు మండిపడ్డారు. బాయ్‌కాట్ ఇక్సిగో అంటూ ట్రెండ్ చేశారు. నెటిజన్ల ఆగ్రహంతో ఇక్సిగో వివరణ ఇచ్చింది. భాగ్యనగర్ అని టైప్ చేస్తే హైదరాబాద్ అని చూపించడం ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని, టెక్నికల్ ఎర్రర్స్ వల్ల అలా జరిగిందని తెలిపింది. జరిగిన పొరపాటుకు క్షమాపణ చెప్పింది. Hey @ixigo who the hell gave you the right to change Hyderabad's name to Bhagyanagar? I type in Bhagyanagar and it shows RGIA.What the hell? Absolutely not okay. Ridiculous. So tomorrow if someone calls a city Fart Nagar will you do that too? Hyderabadis should #boycottixigo pic.twitter.com/Nfvi2BrPqt — Yunus Lasania (@lasaniayunus) January 14, 2022 -
భాగ్యనగరంలో బతుకమ్మ సంబరాలు
-
పేరుకే భాగ్యనగర్! అన్నీ అసౌకర్యాలే
► కంపుకొడుతున్న డ్రెయినేజీలు ► గతుకులమయమైన రోడ్డు ► ఫాగింగ్‌పై పట్టింపు కరువు కరీంనగర్‌కల్చరల్: పేరు గొప్ప..ఊరు దిబ్బ అన్నట్టుగా ఉందీ ఆ ప్రాంత పరిస్థితి. స్మార్ట్‌సిటీలో భాగమైన 42వ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్‌లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. ఆ ప్రాంతంలో రోజురోజుకు విషజ్వరాలు ప్రబలుతున్న పట్టించుకునే వారు కరువయ్యారు. డ్రెయినేజీలు లేక రోడ్డుపైనే మురుగునీరు పారుతున్న ఆ ప్రాంతం వైపు చూసేందుకు అధికారులు తీరడం లేదు. పారిశుధ్య నిర్వహణకే లక్షలు వెచ్చిస్తున్నామని గొప్పగా చెప్పుకునే కార్పొరేషన్ అధికారులకు భాగ్యనగర్‌ను చూస్తే వారి పనితీరు తెలిసిపోతుంది. అధ్వానం 42వ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్‌లో డ్రెయినేజీలు కనిపించవు. మురుగునీరు రోడ్డుపైనే ప్రవహించాల్సిందే. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ కాలనీవాసుల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. దోమలు పెరిగి ఇప్పటికే పలువురు విషజ్వరాల బారిన పడ్డారు. పత్తా లేని ఫాగింగ్ దోమల నివారణకు చేసే ఫాగింగ్ గురించి అధికారులు పట్టించుకోవడం లేదు. కాలనీలో చాలా ఖాళీ ప్లాట్లు ఉండడంతో విపరీతంగా చెట్లు పెరిగి దోమలు విజృంబిస్తున్నాయి. దోమల నివారణకు ఉపయోగపడే ఫాగింగ్ ఆరు నెలలుగా చేసిన దాఖలాలు లేవు. కనీసం దుర్వాసన వెదజల్లుతున్న ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం లేదు. ఇప్పటికైనా పారిశుధ్య నిర్వహణపై శ్రద్ధ తీసుకోవాలని భాగ్యనగర్ వాసులు కోరుతున్నారు. భరించలేకపోతున్నం తలుపు తెరిచిపెడితే మోరీల కంపు భరించలేకపోతున్నం. సాయంత్రం అయితే దోమలు. మోరీల నిండా పందులు. అధికారులకు ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకునే వారు కరువయ్యారు. ఇక్కడి కంటే ఊల్లె ఉండడమే మేలు. డ్రెయినేజీలు లేవు, రోడ్లు సరిగా లేవు. దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. – కాసనగొట్టు శ్రీధర్ దోమలతో వేగలేం దోమలతో వేగలేకపోతున్నాం. వర్షాకాలం ప్రారంభమైందంటే చాలు భయమేస్తుంటుంది. చిన్నచిన్న గుంతల్లో వర్షపునీరు నిలిచి దోమలు పెరుగుతున్నాయి. పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి. రాత్రి నిద్రపోలేకపోతున్నాం. వెంటనే దోమల నివారణ చర్యలు చేపట్టాలి. పరిసరాలు కంపు వాసన వస్తున్నాయి. – రామకృష్ణ కంపుకొడుతున్నాయి పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది. ఎక్కడికక్కడ మురికినీరు నిలిచి పరిసరాలు కంపుకొడుతున్నాయి. చాలా చోట్ల డ్రెయినేజీలు లేకపోవడంతో రోడ్డుపైనే మురుగునీరు ప్రవహిస్తుంది. నివాసాల మధ్యే మురుగునీరు చేరి దుర్వాసన వస్తుంది. ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. –జి.సబిత -
బాబోయ్! భాగ్యనగర్
గ్యాస్ పైపులైను నుంచి లీకైన గ్యాస్ భయాందోళనతో పరుగులు తీసిన ప్రజలు కాకినాడ రూరల్ : సూర్యారావుపేట లైట్‌హౌస్ ప్రాంతంలోని ఎ¯ŒSసీఎస్ ఆయిల్ ఫ్యాక్టరీ సమీపాన భాగ్యనగర్ గ్యాస్ పైపులైన్ నుంచి లీకవడంతో అక్కడి ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. సుమారు రెండు గంటలపాటు అటుగా వెళ్లేందుకు ప్రజలు, కార్మికులు హడలెత్తారు. లీకేజీ సమాచారం అందుకున్న భాగ్యనగర్ గ్యాస్ సంస్థ సిబ్బంది, ఎన్ఎఫ్సీఎల్, కోరమండల్ ఫెర్టిలైజర్స్‌కు చెందిన అగ్నిమాపక శకటాలు హుటాహుటిన సంఘటన స్థలానికి తరలి వచ్చాయి. అప్పటికే ఉధృతంగా ఎగజిమ్ముతున్న గ్యాస్‌ను అదుపు చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. అరగంట అనంతరం లీకేజీని అరికట్టారు. ప్రమాదకరం కాదు ప్రొక్లెయిన్‌తో మొక్కలను తొలగిస్తూ్తండగా దాని బకెట్ పైపులైనకు తగిలి రంధ్రం పడి ఉంటుందని ‘భాగ్యనగర్’ డిప్యూటీ మేనేజర్ డీవీ అనిల్‌కుమార్ చెప్పారు. ఈ గ్యాస్ అంత ప్రమాదకరం కాదని, ప్రతి 50 మీటర్లకు హెచ్చరిక బోర్డు ఉంటుందని, పైపులైనును నిత్యం నలుగురు పెట్రోలింగ్ చేస్తూంటారని వివరించారు. ఎక్కడైనా గ్యాస్ లీకవుతున్నట్లు తెలిస్తే తక్షణం సరఫరాను ఆపేందుకు వీలుగా ప్రతి కిలోమీటరుకు కంట్రోల్ వాల్వ్ ఉంటుందన్నారు. కాగా, ఆ ప్రాంతంలో ఎటువంటి పొక్లెయిన్ కనిపించలేదని, నాసిరకమైన పైపులు వాడడంతో తరచూ ఏదో ఒకచోట గ్యాస్ లీకవుతూనే ఉందని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలి : కురసాల కన్నబాబు పగటివేళ జరిగింది కాబట్టి ఎటువంటి ప్రమాదమూ జరగలేదని, అదే అర్ధరాత్రి లీకైతే పరిస్థితేమిటని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు భాగ్యనగర్ గ్యాస్ సంస్థ అధికారులను నిలదీశారు. తాగునీటి పైపులనే దాదాపు పదడుగుల లోతులో వేస్తారని, అత్యంత ప్రమాదకరమైన గ్యాస్ పైపులైనును అడుగు లోతు కూడా లేకుండా వేసుకుపోయారంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అరమవుతోందని విమర్శించారు. గ్యాస్ పైపులైనుకు రెండడుగుల దూరంలో ఆయిల్ కంపెనీకి క్రూడాయిల్ సరఫరా చేసే పైపులైన్లు ఉన్నాయని, 50 మీటర్ల దూరంలో పెద్ద ఆయిల్ ఫ్యాక్టరీలు, నాఫ్తలి¯ŒS ఆయిల్ ఫ్యాక్టరీలు ఉన్నాయని గుర్తు చేశారు. గ్యాస్ లీకేజీని ఎవ్వరూ గమనించకుండా ఉంటే వాటి పరిస్థితి, సమీపంలో ఉన్న మత్స్యకారులు పరిస్థితి ఏమిటని అధికారులను ప్రశ్నించారు. పైపులైన్లు విషయంలో భాగ్యనగర్ సంస్థ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ప్రస్తుతం వేసిన పైపులు నాసిరకంగా ఉండడం, భూమికి పైపైనే పైపులైను ఉండడంతో ఇటువంటి ప్రమాదకర పరిస్థితులను ప్రజలు నిత్యం ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు. దీనిపై భాగ్యనగర్ గ్యాస్ సంస్థ యాజమాన్యంతో మాట్లాడనున్నట్లు కన్నబాబు వివరించారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ కోమలి సత్యనారాయణ, బొమ్మిడి శ్రీనివాస్, పార్టీ నాయకులు శెట్టి బాబూరావు, గొల్లపల్లి ప్రసాద్, కర్రి చక్రధర్, జంగా గగారి¯ŒS తదితరులు ఉన్నారు. -
భాగ్యనగర్ వినాయకుడి లడ్డూ రూ.1.51 లక్షలు
వినాయకచవితి వేడుకల్లో భాగంగా భాగ్యనగర్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంలో 28వ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ మాల రంగన్న రూ.1.51 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. మహా కలశాన్ని రూ.43 వేలకు ట్యాంకర్ ఓనర్ శివశంకర్ దక్కించుకున్నారు. స్వామివారి పూజకు ఉంచిన రూ. 10 నాణేన్ని పెయింటర్ సత్య అనే వ్యక్తి రూ.23 వేలకు పాడి సొంతం చేసుకున్నారు. కౌన్సిలర్ రంగన్న, నిర్వాహకులు లస్కర్ శీనా, రామాంజనేయులు, సూరి, రంగా తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ సీమాంధ్రులదే: భూమన
సాక్షి, తిరుపతి : సీమాంధ్రుల రెక్కల కష్టంతో వచ్చిన నగరమే భాగ్యనగరమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పేర్కొన్నారు. విభజన ప్రకటనకు వ్యతిరేకంగా తిరుపతి అన్నమయ్య సర్కిల్ వద్ద సోమవారం వేలాది మందితో నిరసన సభ జరిగింది. ఈ సభలో కరుణాకరరెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర నుంచి వచ్చిన కప్పాల ద్వారా నాటి నిజాం నవాబులు హైదరాబాద్ నిర్మించారనే విషయం చరిత్ర చెబుతోందన్నారు. హైదరాబాద్ నిర్మాణంలో పాలు పంచుకున్న కూలీలు కూడా సీమాంధ్రులేనని తెలిపారు. కాగా, ఎన్నో కష్టాలను దిగమింగుకొని పట్టు విడవని ఝాన్సీ లక్ష్మీబాయిలా విజయమ్మ దీక్ష చేపట్టారని భూమన అన్నారు. ఆమెకు ఏడుకోట్ల మంది ప్రజలు అండగా ఉన్నారన్నారు. -
భాగ్యనగరిలో బోనాల సందడి
చారిత్రక నగరిలో ఆధ్యాత్మికత వెల్లివెరిసింది. బోనాల జాతరతో భాగ్యనగరం పండుగ కళ సంతరించుకుంది. పాతబస్తీతో పాటు నగర వ్యాప్తంగా ఉన్న ఆలయాలకు భక్తజనం పోటెత్తింది. డప్పు వాయిద్యాలు, యువకుల కేరింతలు, పోతురాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలతో బోనాల వేడుక అంబరాన్నంటింది. ఫలహారపు బండ్లు, తొట్టెల ఊరేగింపుతో పాత నగరం ఆదివారం మార్మోగింది. పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిణి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన బోనాన్ని సమర్పించారు. అలాగే, అక్కన్నమాదన్న లయం, బేలా ముత్యాలమ్మ ఆలయం, హరిబౌలి బంగారు మైసమ్మ దేవాలయం, సుల్తాన్ షాహి శీతల్‌మాత జగదాంబ మహంకాళి ఆలయం, రాంబక్షి బండ అమ్మవారి ఆలయం తోపాటు మీరాలం మండి, ఉప్పుగూడ, గౌలిపురా, మురాద్ మహాల్లలోని శ్రీమహంకాళి ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. కార్వాన్‌లోని దర్బార్ మైసమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అంబారీపై అమ్మవారి చిత్రపటాన్ని ఉంచి ఊరేగించారు. లోయర్ ట్యాంక్‌బండ్ శ్రీకనకాల కట్టమైసమ్మ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనపుట్టు వెంట్రుకలు ఇక్కడే అమ్మవారికి సమర్పించానని, తాను ఇక్కడి సమీపంలోని నల్లగుట్టలోనే పుట్టానన్నారు. మంత్రి గీతారెడ్డి కూడా కూతురు మనుమరాలితో కలిసి వచ్చి మీరంమండి అమ్మవారిని దర్శించుకున్నారు. -
భాగ్యనగరిలో బోనాల సందడి
చారిత్రక నగరిలో ఆధ్యాత్మికత వెల్లివెరిసింది. బోనాల జాతరతో భాగ్యనగరం పండుగ కళ సంతరించుకుంది. పాతబస్తీతో పాటు నగర వ్యాప్తంగా ఉన్న ఆలయాలకు భక్తజనం పోటెత్తింది. డప్పు వాయిద్యాలు, యువకుల కేరింతలు, పోతురాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలతో బోనాల వేడుక అంబరాన్నంటింది. ఫలహారపు బండ్లు, తొట్టెల ఊరేగింపుతో పాత నగరం ఆదివారం మార్మోగింది. పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిణి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన బోనాన్ని సమర్పించారు. అలాగే, అక్కన్నమాదన్న లయం, బేలా ముత్యాలమ్మ ఆలయం, హరిబౌలి బంగారు మైసమ్మ దేవాలయం, సుల్తాన్ షాహి శీతల్‌మాత జగదాంబ మహంకాళి ఆలయం, రాంబక్షి బండ అమ్మవారి ఆలయం తోపాటు మీరాలం మండి, ఉప్పుగూడ, గౌలిపురా, మురాద్ మహాల్లలోని శ్రీమహంకాళి ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. కార్వాన్‌లోని దర్బార్ మైసమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అంబారీపై అమ్మవారి చిత్రపటాన్ని ఉంచి ఊరేగించారు. లోయర్ ట్యాంక్‌బండ్ శ్రీకనకాల కట్టమైసమ్మ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనపుట్టు వెంట్రుకలు ఇక్కడే అమ్మవారికి సమర్పించానని, తాను ఇక్కడి సమీపంలోని నల్లగుట్టలోనే పుట్టానన్నారు. మంత్రి గీతారెడ్డి కూడా కూతురు మనుమరాలితో కలిసి వచ్చి మీరంమండి అమ్మవారిని దర్శించుకున్నారు.