జైల్లో వైఎస్ జగన్ చేస్తున్న నిరవధిక నిరాహారదీక్షకు మద్దతుగా అనంతపురం జిల్లాలో దీక్షలు కొనసాగుతున్నాయి.
జైల్లో వైఎస్ జగన్ చేస్తున్న నిరవధిక నిరాహారదీక్షకు మద్దతుగా అనంతపురం జిల్లాలో దీక్షలు కొనసాగుతున్నాయి. కళ్యాణ దుర్గంలో గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ ఎల్ఎమ్ మోహన్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష 3వ రోజుకు చేరింది. కదిరిలో మాజీ మంత్రి షాకీర్, సుధాకర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు.
తాడిపత్రిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త విఆర్ రాంరెడ్డి ఆమరణ దీక్ష రెండో రోజుకు చేరింది. జిల్లా వ్యాప్తంగా 34 మంది జగన్ అభిమానుల దీక్షలు కొనసాగిస్తున్నారు. ధర్మవరం, గుంతకల్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ల ఆమరణ దీక్షలు కొనసాగుతున్నాయి. జగన్ దీక్షకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రహదారుల దిగ్బంధం చేపట్టారు.