
మీరు చేస్తున్నదే ఉద్యమమా?: బొత్స
హైదరాబాద్ : సీమాంధ్ర మంత్రులకు సమైక్య సెగ తగిలింది. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం బయటకు వచ్చిన సీమాంధ్ర మంత్రులను .... ఆ ప్రాంత సచివాలయ ఉద్యోగుల ఫోరం ఆధ్వర్యంలో మంత్రులను అడ్డుకున్నారు. సమైక్య రాష్ట్రం కోసం మంత్రులు రాజీనామాలు చేసి తమతో కలిసి ఉద్యమించాలని కోరారు.
సీమాంధ్ర ప్రజలు రోడ్లమీదకు వచ్చి ఉద్యమిస్తున్నారని.... మంత్రులు కూడా తమతో కలవాలని ఉద్యోగులు కోరగా.... పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కొద్దిగా అసహనం ప్రదర్శించారు. మీరు చేస్తున్నదే ఉద్యమమా అని ప్రశ్నించారు. తాము కూడా సమైక్య రాష్ట్రం కోసం కృషి చేస్తున్నామని బొత్స తెలిపారు.