సమైక్య తీర్మానంపై సీఎం స్పందించలేదు: బొత్స | Kiran kumar reddy has right to reshuffle Sridhar Babu's portfolio, says botsa satyanarayana | Sakshi
Sakshi News home page

సమైక్య తీర్మానంపై సీఎం స్పందించలేదు: బొత్స

Published Fri, Jan 3 2014 1:26 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

సమైక్య తీర్మానంపై సీఎం స్పందించలేదు: బొత్స - Sakshi

సమైక్య తీర్మానంపై సీఎం స్పందించలేదు: బొత్స

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తనకున్న అధికారాల మేరకే శ్రీధర్ బాబు శాఖ మార్పు చేయటం జరిగిందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. రాజీనామా చేయొద్దని శ్రీధర్ బాబుకు తాను సూచించినట్లు ఆయన శుక్రవారమిక్కడ తెలిపారు. శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఎవరున్నా తెలంగాణ, సీమాంధ్ర అంశాలతో సంబంధం లేదన్నారు. సమైక్య తీర్మానంపై అసెంబ్లీలో ఎప్పుడో తీర్మానం చేయాల్సిందని.... అయితే ఇప్పుడు చేసినా నష్టం లేదన్నారు.

 గత ఏడాది ఆగస్ట్లో సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలోనే సమైక్య తీర్మానం చేయాలని సూచించినా ముఖ్యమంత్రి స్పందించలేదని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్రభుత్వం తరపున సమైక్య తీర్మానం పెట్టలేమని ఆయన అన్నారు. సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాలని పార్టీలు అడుగుతున్నాయని బొత్స పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement