హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగేలా అన్ని పార్టీలను సంప్రదిస్తున్నామని మంత్రులు రఘువీరా రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, గంటా శ్రీనివాసరావులు తెలిపారు. విభజిస్తే వచ్చే సమస్యలను త్వరలో రాష్ట్రపతికి వివరిస్తామని వారు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర విభజనకు పార్లమెంట్ ఒప్పుకోకపోవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీ చర్చ ద్వారా టి.బిల్లును అడ్డుకోగలమని వారు తెలపారు. టీ.బిల్లుపై రాష్ట్రపతి న్యాయ సలహా తీసుకునే అవకాశం ఉందన్నారు.