పార్టీకి మారే ఆలోచనతోనే కొంతమంది సమైక్య నినాదం:బొత్స | few leaders to change party, says botsa satyanarayana | Sakshi
Sakshi News home page

పార్టీకి మారే ఆలోచనతోనే కొంతమంది సమైక్య నినాదం:బొత్స

Published Sat, Nov 30 2013 3:41 PM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM

పార్టీకి మారే ఆలోచనతోనే కొంతమంది సమైక్య నినాదం:బొత్స - Sakshi

పార్టీకి మారే ఆలోచనతోనే కొంతమంది సమైక్య నినాదం:బొత్స

హైదరాబాద్: ఇతర పార్టీల్లోకి వెళ్లాలనే ఆలోచనలతోనే కొంతమంది నేతలు సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకున్నారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. సమైక్యాంధ్ర నినాదం ఎత్తుగడతో పార్టీ మారే ఆలోచనలో ఉన్న నేతలెవరో తనకు తెలసన్నారు. కాంగ్రెస్ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపిస్తున్న నేతల జాబితాను తయారు చేసినట్లు వార్తలు రావడంతో బొత్స స్పందించారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్న నేతల జాబితాను ఇంకా తయారు చేయలేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర అన్నంత మాత్రాన..పార్టీ గీత దాటినట్టు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చినపుడు కాంగ్రెస్ నేతలకు వారి అభిప్రాయాన్ని తెలిపే స్వేచ్ఛ ఉందన్నారు.

 

బొత్స సిద్ధం చేసిన జాబితాలో 26 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అధిష్టానంపై పూర్తి వ్యతిరేక వైఖరి కనబరుస్తున్న వారిని కాంగ్రెస్ నుంచి సాగనంపే ప్రక్రియలో భాగంగానే ఈ నివేదికను సిద్ధం చేసి అధిష్టానంకు పంపారని ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ అంశంపై మాట్లాడిన బొత్స.. నేతల జాబితాను ఇంకా తయారు చేయలేదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement