'అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై హైకమాండ్ కసరత్తు' | congress high command works hard to select assembly candidates | Sakshi
Sakshi News home page

'అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై హైకమాండ్ కసరత్తు'

Published Mon, Jan 6 2014 2:53 PM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM

'అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై హైకమాండ్ కసరత్తు' - Sakshi

'అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై హైకమాండ్ కసరత్తు'

హైదరాబాద్:కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్దుల ఎంపికపై హైకమాండ్‌ కసరత్తు ప్రారంభించిందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు కొందరు ఏఐసీసీ ప్రతినిధులు రాష్ట్రానికి వచ్చారని తెలిపారు. ఒక్కో లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన అభ్యర్ధిని వారు గుర్తిస్తారన్నారు. దీనికి సంబంధించి 42 మంది ఏఐసీసీ ప్రతినిధులు అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తారని బొత్స తెలిపారు. తొలి విడత అభ్యర్థుల ఎంపిక ఈనెల 15 వరకూ పరిశీలన జరుగుతుందన్నారు. మలి విడత కసరత్తు మాత్రం ఏఐసీసీ సమావేశం తర్వాత ఉంటుందని బొత్స తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రానికి వచ్చిన ఏడుగురు ఏఐసీసీ ప్రతినిధులు లోక్ సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ముగించారన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement