
రాష్ట్ర కాంగ్రెస్ ప్రక్షాళన ప్రారంభించిన బొత్స
హైదరాబాద్: కాంగ్రెస్ అధిష్టానంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న నేతలపై చర్యలు తీసుకునే దిశగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పావులు కదుపుతున్నారు. అధిష్టానానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవని గతంలో హెచ్చరించిన బొత్స ఈ మేరకు జాబితాను సిద్ధం చేశారు. వారి పేర్లను కాంగ్రెస్ పెద్దలకు అందజేసిన బొత్స అధిష్టానం నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. ప్రజల అభిప్రాయాన్ని చెప్పడంలో భాగంగా కొంతమంది నేతలు అధిష్టాన నిర్ణయాన్ని ఖండిస్తూ వచ్చారు.
బొత్స సిద్ధం చేసిన జాబితాలో 26 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కూడిన జాబితాను బొత్స సిద్దం చేశారు. అధిష్టానంపై పూర్తి వ్యతిరేక వైఖరి కనబరుస్తున్న వారిని కాంగ్రెస్ నుంచి సాగనంపే ప్రక్రియలో భాగంగానే ఈ నివేదికను అధిష్టానంకు అందజేసినట్లు తెలుస్తోంది.