ప్రభుత్వ ఏర్పాటుపై బొత్స చర్చలు! | Botsa Sathyanarayana goes to Newdelhi | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఏర్పాటుపై బొత్స చర్చలు!

Published Sun, Feb 23 2014 4:54 PM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM

ప్రభుత్వ ఏర్పాటుపై బొత్స చర్చలు! - Sakshi

ప్రభుత్వ ఏర్పాటుపై బొత్స చర్చలు!

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారా లేక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అనే విషయంపై ఇంకా సందిగ్ధత వీడలేదు. రాష్ట్రపతి పాలనకే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వచ్చినా సీఎం పీఠం కన్నేసిన ఆ పార్టీ నాయకులు పైరవీలు కొనసాగిస్తున్నారు.

పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆదివారం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ప్రభుత్వ ఏర్పాటు అంశంపై హైకమాండ్ పెద్దలతో ఆయన చర్చించనున్నట్టు సమాచారం. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన పలువురు నాయకులు సీఎం రేసులో ఉన్నారు. కాగా కాంగ్రెస్లో చాలామంది రాజీనామాల బాటపడుతుండటంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
..............

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement