సమ్మెను విరమింపచేసేందుకు ముఖ్యమంత్రి ఒత్తిడి!
సమ్మెను విరమింపచేసేందుకు ముఖ్యమంత్రి ఒత్తిడి!
Published Tue, Oct 8 2013 11:18 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ గత 70 రోజులుగా సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నేతలు చేపట్టిన సమ్మెను విరమింప చేసేందుకు ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేపట్టినట్టు తెలుస్తోంది.
మంగళవారం ఉదయం సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సమ్మె విరమించాలని ఉద్యోగ సంఘాల నేతలపై ముఖ్యమంత్రి ఒత్తిడి తీసుకువచ్చినట్టు తెలిసింది.
సోమవారం నాడు జరిగిన రాష్ట్ర కేబినెట్ ఉప సంఘ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలకు, రాష్ట్ర మంత్రులకు మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే సమ్మె చేస్తున్న నేతలపై మంత్రి కొండ్రు మురళి చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు మండిపడ్డ సంగతి తెలిసిందే. కేబినెట్ ఉపసంఘం సమావేశం తర్వాత అశోక్ బాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లయితే తాము సమ్మె విరమణపై ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలో సమ్మె విరమణకు ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఆసక్తి అన్నివర్గాల్లో నెలకొంది.
Advertisement