సుప్రీంకోర్టులో దినేష్ రెడ్డికి చుక్కెదురు
న్యూఢిల్లీ : మాజీ డీజీపీ దినేష్ రెడ్డికి న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురు అయ్యింది. తన పదవీ కాలాన్ని పొడిగించాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. 2014 డిసెంబర్ వరకూ తనను డీజీపీగా కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దినేష్‌రెడ్డి.... సుప్రీంకోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే.
అంతకు ముందు ఆయన తన పదవీ కాలాన్ని పొడిగించాలని హైకోర్టును కూడా ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే దినేష్ రెడ్డికి అక్కడ కూడా నిరాశే ఎదురైంది. దినేష్‌రెడ్డి పదవీ కాలం పూర్తయినందున డీజీపీగా ఆయనను కొనసాగించలేమంటూ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. నిబంధనల ప్రకారం మరోసారి దినేష్‌రెడ్డి పదవీ కాలం పొడిగింపు సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన డీజీపీగా ప్రసాదరావును నియమించింది.