మాజీ డీజీపీ దినేష్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణను ఆగస్ట్ 12వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
న్యూఢిల్లీ : మాజీ డీజీపీ దినేష్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణను ఆగస్ట్ 12వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి మధ్యంతర నివేదికను సీబీఐ కోర్టుకు సమర్పించింది. కాగా దినేష్ రెడ్డి ఆస్తులపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. దినేష్‌డ్డితో సహా ఆయన సతీమణి కమలా రెడ్డికి చెందిన అన్ని ఆస్తుల లావాదేవీలపై పూర్తి విచారణకు ఆదేశించాలంటూ ఐపీఎస్ అధికారి ఉమేష్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.