జీ 24 గంటల జర్నలిస్టులు విడుదల | Zee 24 Gantalu channel journalists Released from Chanchalguda Jail | Sakshi
Sakshi News home page

జీ 24 గంటల జర్నలిస్టులు విడుదల

Published Wed, Sep 18 2013 12:29 PM | Last Updated on Fri, Sep 1 2017 10:50 PM

Zee 24 Gantalu channel  journalists Released from Chanchalguda Jail

హైదరాబాద్ : డీజీపీ దినేష్‌రెడ్డిపై అసత్య కథనాలు ప్రసారం చేసిన కేసులో 'జీ 24 గంటలు’ చానల్‌ జర్నలిస్టులు రవి, అక్తర్ బుధవారం ఉదయం చంచల్గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. చానల్‌లో తప్పుడు కథనాలు ప్రసారం చేసినట్టుగా వచ్చిన ఆరోపణలపై  చానల్ విలేకర్లు రవికుమార్, అక్తర్‌లను అరెస్ట్ చేసి హుస్సేనీఆలం పోలీసులు  రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.

 డీజీపీ  గురువారం హైదరాబాద్ పాతబస్తీలోని ఫతేదర్వాజాలో ప్రముఖ ముస్లిం మత గురువు హజ్రత్ హబీబ్ ముజ్తబా అల్ హైద్రూస్‌ను కలవడంపై అవాస్తవాలు ప్రసారం చేశారంటూ ‘జీ 24 గంటలు’ చానల్‌పై  రెండు కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. డీజీపీ వెళ్లి హైద్రూస్‌ను కలవడంపై ‘జీ 24 గంటలు’ చానల్‌లో ‘స్పెషల్ స్టోరీ’ ప్రసారం చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement