ముఖ్యమంత్రి కిరణ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి: పాల్వాయి
ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డిని పీడీ యాక్ట్ కింద వెంటనే అరెస్ట్ చేయాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల అభిమానాన్ని చూరగొనే వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించాలని పాల్వాయి సూచించారు. శాంతి భద్రతలు పరిరక్షించడంలో విఫలమైన, అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని వెంటనే డిస్మిస్ చేయాలి అని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రదేశ్ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర విభజనపై మళ్లీ అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలని పీసీసీ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడం ఆయన వ్యక్తిగతం అని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. మాజీ డీజీపీ దినేష్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో పలు పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.