n kiran kumar reddy
-
ఆ కమిటీల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) ఆఫీస్ బేరర్స్, డీసీసీ అధ్యక్షులను ఏఐసీసీ శుక్రవారం ప్రకటించింది. 11 మంది ఉపాధ్యక్షులు, 18 మంది ప్రధాన కార్యదర్శుల పేర్లను ఖరారు చేసింది. 29 మందితో కోఆర్డినేషన్ కమిటీ, 12 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేసింది. 18 మందిని డీసీసీ అధ్యక్షులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి రాజకీయ వ్యవహారాలు, సమన్వయ కమిటీల్లో స్థానం కల్పించారు. రాజకీయ వ్యవహారాల కమిటీకి చైర్మన్‌గా పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ వ్యవహరిస్తారు. సమన్వయ కమిటీకి ఊమెన్ చాందీ చైర్మన్‌గా ఉంటారు. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, మహిళా కాంగ్రెస్, సేవాదళ్ చైర్మన్లు ఎక్స్అఫిషియో సభ్యులుగా వ్యవహరించనున్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డికి కూడా ఈ రెండు కమిటీల్లో స్థానం దక్కింది. మొత్తంగా చూస్తే మహిళలకు తగిన ప్రాధాన్యం లభించలేదు. (చదవండి: వచ్చే నెలలో రాయపాటి ఆస్తుల వేలం) డిసీసీ అధ్యక్షులు వీరే 1. శ్రీకాకుళం: బొడ్డెపల్లి సత్యవతి 2. విజయనగరం: సారగడ్డ రమేశ్‌కుమార్ 3. అనకాపల్లి: శ్రీరామమూర్తి 4. కాకినాడ(రూరల్): డాక్టర్ పాండురంగారావు 5. అమలాపురం: కొట్టూరి శ్రీనివాస్ 6. రాజమండ్రి(రూరల్): ఎన్వీ శ్రీనివాస్ 7. నరసాపురం: మారినేడి శేఖర్ (బాబ్జి) 8. ఏలూరు (రూరల్): జెట్టి గురునాథం 9. మచిలీపట్నం: లామ్ తానియా కుమారి 10. విజయవాడ(రూరల్): కిరణ్ బొర్రా 11. నర్సరావుపేట: జి. అలెగ్జాండర్ సుధాకర్ 12. ఒంగోలు (రూరల్): ఈదా సుధాకరరెడ్డి 13. నంద్యాల: లక్ష్మీనరసింహరెడ్డి 14. కర్నూలు(రూరల్): అహ్మద్ అలీఖాన్ 15. అనంతపురం(రూరల్): ఎస్. ప్రతాపరెడ్డి 16. హిందూపురం: కె. సుధాకర్ (మాజీ ఎమ్మెల్యే) 17. నెల్లూరు (రూరల్): దేవకుమార్‌రెడ్డి 18. చిత్తూరు: డాక్టర్ సురేశ్‌బాబు -
సైన్స్ సిటీకి వీడని గ్రహణం
ఇంకా కేంద్రం వద్ద పెండింగ్ రెండున్నరేళ్లుగా కొలిక్కిరాని రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేపట్టనున్న ప్రతిష్టాత్మక సైన్స్ సిటీ ప్రాజెక్టు ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉండిపోయింది. కార్యరూపం ధరించడంలో తీవ్ర జాప్యం నెలకొంది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.140 కోట్లు కాగా, అందులో కేంద్రం వాటా రూ.66 కోట్లు, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) రూ.40 కోట్లు, ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యంలో మిగిలిన డబ్బును సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. 2013లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపారు. తెలంగాణ ఏర్పడ్డాక ఈ సైన్ససిటీ సాధనకు టీఆర్ఎస్ ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను కూడా కేంద్రానికి సమర్పించింది. ఈ ప్రతిపాదన కేంద్రం వద్ద పెండింగ్‌లో పడిపోవడంతో శాస్త్రసాంకేతిక అంశాలకు సంబంధించిన ఆయా ప్రణాళికలు ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాజెక్టు సాధన కోసం తాజాగా మళ్లీ ఢిల్లీస్థారుులో పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర విభజనకు పూర్వం 2014లో రంగారెడ్డి జిల్లా బుద్వేల్‌లో ఈ ప్రాజెక్టు స్థాపన కోసం 80 ఎకరాల స్థలాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి మళ్లీ ప్రతిపాదనలు పంపింది. మిగతా ప్రాజెక్టులకు తలమానికంగా ఉండేలా... ఈ ప్రాజెక్టు దేశంలోని మిగతా సైన్ససిటీలకు తలమానికంగా ఉండేలా ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పిల్లల్లో సైన్సపట్ల అవగాహన కల్పించేందుకు ఉపకరించే అనేక అంశాలను దానిలో అంతర్భాగం చేయాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. భౌతిక, రసాయన, జీవ శాస్త్రాలు, అంతరిక్ష పరిశోధన, అధునాతర రాకెట్ మోడల్స్, పవన శక్తి, భూగోళం తదితర శాస్త్ర, సాంకేతిక అంశాలతో దీనిని రూపొందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనిలో ఆయా శాస్త్ర, సాంకేతిక అంశాలకు సంబంధించిన పెవిలియన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇండోర్, ఔట్‌డోర్ ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేసి స్కూలు విద్యార్థులు, సైన్స, పరిశోధనపట్ల అభిరుచి ఉన్నవారిని ప్రోత్సహించేవిధంగా ఏర్పాట్లు చేయాలని ప్రతిపాదించారు. మరిన్ని ప్రాజెక్టుల పరిస్థితి అంతే హైదరాబాద్ పరిసరాల్లో సైన్ససిటీ ప్రాజెక్టుతోపాటు, 5-డీ థియేటర్ల ఏర్పాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సైన్స సెంటర్ల ఏర్పాటు, ప్రజోపాయో గమైన పరిశోధన, సైంటిస్ట్‌లు, అధ్యాప కులు, రీసెర్చ్ స్కాలర్లు, విద్యార్థులకు వివిధ శాస్త్ర,సాంకేతిక అంశాల్లో అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నా అవి కూడా ముందుకు సాగడం లేదు. -
దాటవేతకు వెతుకులాట
► సదావర్తి సత్రం భూముల అమ్మకంపై తలోమాట ► రూ.వెయ్యి కోట్ల లూటీపై నేతల్లో ఆందోళన ► ఆత్మరక్షణలో అధికార పార్టీ సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: అమరలింగేశ్వరునికీ శఠగోపం పెట్టిన తీరుపై అధికార పార్టీలో అంతర్మధనం మొదలైంది. గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రానికి చెందిన చెన్నై నగర సమీపంలోని 83.11 ఎకరాల విక్రయంలోని లోపభూయిష్ట విధానాలను, దేవాదాయ శాఖలో సంబంధిత ఫైలు కదిలిని వైనాన్ని ‘సాక్షి’ సాక్ష్యాలతో సహా వెలుగులోకి తేవడంతో టీడీపీ ముఖ్య నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆ పార్టీ ఎదురుదాడికి ప్రయత్నిస్తోంది. చివరకు ముఖ్యమంత్రి ఆ ఫైళ్లలోని సమాచారం ఎలా బయటకు పొక్కిందని దేవాదాయ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఎవరికి వారు తమ తప్పులను కప్పిపుచ్చుకునే క్రమంలో భాగంగా పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ టీడీపీ అమరావతి మండల అధ్యక్షుడు కె.కోటేశ్వరరావు పోలీసుస్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ కుమారుడు నిరంజన్ కూడా విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి సదావర్తి భూముల కొనుగోలులో తమ పెద్దల ప్రమేయం లేదని వివరణ ఇచ్చుకున్నారు. చలమలశెట్టి రామానుజయ మరో అడుగు ముందుకేసి ‘ఏం, కాపులు వ్యాపారం చేసుకోకూడదా’? అని ప్రశ్నించడం విడ్డూరం. భూముల వేలంలో అక్రమాలను ‘సాక్షి’ వెలుగులోకి తెస్తే వర్గం వ్యాపారం గురించి చలమలశెట్టి వింత, వితండ వాదాన్ని తీసుకు రావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదావర్తి సత్రం కోసం తమ పూర్వీకులు దానంగా ఇచ్చిన భూమిని అత్యంత తక్కువ ధరకు విక్రయించడం ఏ మాత్రం సరికాదని ఆ సత్రం చైర్మన్, రాజా వంశీయుడైన రాజా వాసిరెడ్డి సుధాస్వరూప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్‌కూ లేఖ రాయనున్నట్లు ‘సాక్షి’కి తెలిపారు. గత సీఎంలను కోరినా.... సదావర్తి సత్రం భూములను విక్రయించాలని గతంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన కె.రోశయ్య, ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డిలను కోరినట్లు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ గతంలోనే ప్రకటించారు. అప్పటి సీఎంలు స్పందించ లేదని, తమ ముఖ్యమంత్రి సహకరించారని తెలిపారు. ఇందుకు అభినందిచాల్సింది పోయి తప్పు పట్టడమేమిటని ప్రశ్నించారు. అప్పటి ముఖ్యమంత్రులకు ఆ భూములపై బహుశా కన్ను పడలేదేమో అన్న వ్యాఖ్యకు ఎమ్మెల్యే కొమ్మాలపాటి నుంచి జవాబు రాలేదు. అమరలింగేశ్వరునికి మోసం చేయడానికి తన వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధపడనని మరోమాటగా కూడా కొమ్మాలపాటి చెప్పారు. చలమలశెట్టి రామానుజయ మాట్లాడుతూ సదావర్తి సత్రం భూముల వ్యవహారంలో ఇంత లోతు అంశాలు దాగి ఉన్నాయనేది తనకు తెలియదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు రుజువైతే కాపు కార్పొరేషన్ పదవికి రాజీనామా చేయడానికి వెనుకాడబోనని రామానుజయ ఇది వరకే స్పష్టం చేశారు. భూముల వేలం ప్రక్రియ లోపభూయిష్టమని అంతటా కోడై కూస్తున్నా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండటం గమనార్హం. ఎలా తప్పించుకోవాలి ? సదావర్తి సత్రం భూములను విక్రయించాలని పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ప్రతిపాదించడం, దీనిపై ముఖ్యమంత్రి పేషీ ఆఘమేఘాలపై అనుకూలత వ్యక్తం చేసి దేవాదాయ, దర్మాదాయ శాఖకు సూచనలు చేయడం, ఆ శాఖ ఉన్నతాధికారులు వేలం నిర్వహించడం అన్నీ పక్కా ప్రణాళికతో జరిగినట్లు సుస్పష్టమవుతోంది. ఈ అంశంపై ఇటీవల తిరుపతిలో జరిగిన మహానాడులో అన్ని ప్రాంతాల ముఖ్య నాయకుల మధ్య తీవ్ర చర్చ జరగడం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వచ్చింది. రాజధాని ప్రాంతంలో ‘భూదందా’కు పెదబాబు, చినబాబుతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య అనుయాయులు కారకులుగా సాక్ష్యాలతో సహా ‘సాక్షి’ ఇది వరకే వెలుగులోకి తెచ్చిన నేపథ్యంలో సదావర్తి సత్రం భూముల విక్రయంలోనూ అధిష్టానం ఇంతకు తెగపడుతుందా అనేది పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య చర్చనీయాంశంగా మారింది. ఆ దృష్ట్యానే మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘సాక్షి’పై, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై లెక్కకుమిక్కిలి అక్కసు వెళ్లగక్కడం గమనార్హం. ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ‘అభినందన’ పేరిట భారీ వ్యాపారాన్ని పలు ప్రాంతాల్లో విస్తరించారు. ఆ వ్యాపార రహస్యాలన్నీ తెలిసినందునే చెన్నై నగర సమీపంలోని విలువైన సదావర్తి సత్రం భూముల విక్రయంపై దృష్టి సారించి తమ అధినేత చెవిన వేశారని టీడీపీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. రాజధాని అమరావతి ప్రాంతంలో ఎమ్మెల్యేకి చెందిన పలు వెంచర్లకు సంబంధించి లేఅవుట్ అప్రూవల్స్ ఉన్నాయి. తమ వెంచర్లను భూసమీకరణ నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి, ఆయన తనయుడు లోకేష్, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరుల వద్ద పలుసార్లు ప్రాధేయపడినట్లు సమాచారం. తమ వర్గానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల ‘ఆవేదన’ను సీఎం, మంత్రుల దృష్టికి ఎమ్మెల్యేతో సహా పలువురు తీసుకెళ్లారు. పలు వెంచర్లకు పరిష్కారాలు లభించాయి. వీటన్నింటి నేపథ్యంలోనే సదావర్తి సత్రం భూములు కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ కుటుంబ సభ్యులు ముగ్గురికి, వీరితో పాటు మరో ఐదుగురికి తక్కువ ధరకు వేలంలో దక్కాయని తెలుస్తోంది. -
ఈ నాయకులంతా ఏమయ్యారు
హైదరాబాద్: రెండేళ్ల కిందట ఈ నాయకులు చేసిన హడావిడి ఇంతా అంతా కాదు. విభజనకు ముందు రాష్ట్ర రాజకీయాల్లో నానా హడావిడి చేసిన కొందరు నాయకులు ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. రాజకీయాల నుంచి దాదాపుగా కనుమరుగయ్యారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే అయినప్పటికీ అప్పట్లో హడావిడి చేసిన నేతలెవరూ ఇప్పుడు బయట కనిపించడం లేదు. ఒకవైపు విభజన ఉద్యమం మరోవైపు సమైక్య ఉద్యమం నడుస్తున్న కాలంలో రాష్ట్రం ఎట్టిపరిస్థితుల్లోనూ విడిపోదని చెబుతూ తెగ హడావిడి చేసిన నేతలు చేసేదేమీ లేక గడిచిన రెండేళ్లుగా తమ ఇళ్లకే పరిమితమయ్యారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, మాజీ మంత్రి టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాపరెడ్డి.. ఇలా ఒక్కొక్కరుగా ఎంతో మంది నేతలు రాష్ట్ర విభజనకు ముందు ఎంతో హడావిడి చేశారు. విభజన జరగదని ఆనాడు గంటాపథంగా చెప్పారు. సాధారణ ఎన్నికలకు ముందే రాష్ట్ర విభజన చట్టం చేయడం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వేర్వేరు రాష్ట్రాలుగా ఏర్పాటు కావడం జరిగిపోయాయి. ఈ నాయకులు కూడా సైలెంట్ అయిపోయారు. రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోదని చెబుతూ వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గత ఎన్నికల సమయంలో జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి ఆ పార్టీని ఎన్నికల రంగంలో నిలిపారు. జర్మనీ నుంచి ఆయన మిత్రుడొకరు తెచ్చిన రాయిని చూపించి విడిపోయినా మళ్లీ రెండు రాష్ట్రాలు కలుస్తాయని కూడా చెప్పుకొచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత అంతే... ఆయనెక్కడా కనిపించలేదు. తన సన్నిహితులకు చెందిన ఒకరిద్దరు నిర్వహించిన శుభకార్యాలకు హాజరు కావడం మినహాయిస్తే రాజకీయంగా ఆయన పూర్తిగా తెరమరుగైపోయారు. ఆయన బీజేపీలో చేరనున్నారని ఆ మధ్యన వార్తలొచ్చాయి. కానీ అదీ జరగలేదు. ఆయన నియోజకవర్గానికి కూడా వెళ్లిన దాఖలాలు లేవు. తానూ హైదరబాదీనే అని చెప్పుకున్న కిరణ్ ఈ రెండేళ్లు దాదాపుగా హైదరబాద్ ఇంటికే పరిమితమయ్యారు. పాత మిత్రులతో పిచ్చాపాటి మాట్లాడుకోవడం తప్ప ఇప్పుడు రాజకీయాలపై ఆయన మక్కువ చూపడం లేదని సన్నిహితులు చెబుతున్నారు. ఇకపోతే, లగడపాటి రాజగోపాల్... సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో నాటకీయ ఫక్కీలో నిమ్స్ ఆస్పత్రిలో చేరి హడావుడి చేసిన ఆయన రాష్ట్రం విడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాలు చేశారు. అన్నట్టుగానే ఆయన గత ఎన్నికల్లో పోటీ చేయకపోగా, గడిచిన రెండేళ్లుగా ఏ వేదికపైనా కూడా ఆయన కనిపించలేదు. ఆయనతో పాటు విశాఖ మాజీ ఎంపీ సబ్బం హరి, మరో మాజీ ఎంపీ కిల్లి కృపారాణి, మాజీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజులు కూడా ఏ వేదికలపైనా కనిపించడం లేదు. విభజన జరిగితే తమకు రాయల తెలంగాణ కావాలని నినదించిన మాజీ మంత్రులు టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాపరెడ్డి తదితరుల హడావిడి కూడా లేదు. పేరుకు టీడీపీలో చేరినప్పటికీ ఆ పార్టీలో వారికి పెద్దగా పనిలేకుండా పోయింది. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కొనసాగిన శైలజానాథ్ ఆ తర్వాత కిరణ్ ఏర్పాటు చేసిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరి, ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ లో చేరారు. మధ్యలో టీడీపీలో చేరడానికి ప్రయత్నాలు కూడా సాగినప్పటికీ ఫలించలేదు. తాజాగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆయన అప్పడుప్పుడు మీడియా సమావేశాల్లో కనిపిస్తున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ ఆ రోజుల్లో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన నందమూరి హరికృష్ణ ఆ తర్వాత తెరపైన పెద్దగా కనిపించడం లేదు. టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో అసంతృప్తితోనే ఉన్నట్టు చెబుతున్నారు. ఈ రాజకీయ నాయకుల పరిస్థితి ఇలా ఉంటే, సమైక్య ఉద్యమంలో ఉద్యోగ సంఘాల నేతగా ఒక వెలుగు వెలిగిన ఎన్టీవో నేత అశోక్ బాబు రాష్ట్ర విభజన తర్వాత కాలంలో క్రియాశీలంగా లేకపోవడం గమనార్హం. -
అసంపూర్తిగా శిల్పారామం పనులు
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: పట్టణ శివారులోని మహబూబ్‌సాగర్ చెరువుకట్ట సమీపంలో మూడు ఎకరాల విస్తీర్ణం లో నిర్మాణం జరుగుతున్న శిల్పారామం పనులు అసంపూర్తిగా నిలిచాయి. దీంతో పట్టణ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. శిల్పారామం పనులు పూర్తి కాకపోయి నా ఫిబ్రవరి 19న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రారంభోత్సవం చేశా రు. 2013న నాటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడు ఎకరాల విస్తీర్ణంలో ఆర్ట్స్, క్రాఫ్ట్, కల్చరర్ సొసైటీ ఆధ్వర్యంలో రూ.9 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కల్యాణమండపం, స్మిమ్మిం గ్‌ఫూల్, డ్యాన్సింగ్ అకాడమీ పనుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎన్నికల కోడ్ సమీపిస్తుందన్న భావనతో పను లు పూర్తికాకుండానే విప్ హోదా లో జగ్గారెడ్డి అసంపూర్తిగా ఉన్న వాటినే ప్రారంభించారు. విచిత్రం ఏమిటంటే ప్రారంభించిన మరుసటి రోజు నుంచి ఇప్పటివరకు పనులు జరుగలేదు. దీంతో శిల్పారామం పరిధిలోని కల్యాణ మండపాల షెడ్ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. మండపాల ఆవరణలో రోడ్లు, మూత్రశాలలు, వధూవరుల గదులు తదితర పనులు నేటికీ పూర్తి కాలేకపోయాయి. నిర్మాణం పూర్తై షెడ్లలో సైతం విద్యుత్ సరఫరా, ఇతర సౌకర్యాలను కల్పిం చలేకపోయారు. దీంతో పట్టణ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
అంతన్నారింతన్నారు!
మన్యంలో అట్టహాసంగా శంకుస్థాపనలు నెరవేరని ‘నల్లారి’ వారి హామీలు పూర్తికాని అభివృద్ధి పనులు గిరిజనుల అవస్థలు గూడెంకొత్తవీధి,న్యూస్‌లైన్: అది 2013 మార్చి 17.. అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మంత్రులు జయరాం రమేష్, కిశోర్‌చంద్రదేవ్, రాష్ట్ర మంత్రులు జానారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, గంటా శ్రీనివాసరావు, పసుపులేటి బాలరాజు జీకేవీధిలో పర్యటించారు. విశాఖ మన్యాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపేస్తామని చెప్పారు. హామీలు గుప్పించారు. అట్టహాసంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పీఎంజీవై పథకం ద్వారా రూ.525 కోట్లతో 965 కిలో మీటర్ల వరకూ రహదారులు నిర్మిస్తామని తెలిపారు. ఈ మేరకు శంకుస్థాపన చేశారు. అదే సమయంలో సభా ప్రాంగణంలో ఉన్న రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి జానారెడ్డి సమక్షంలో ఈ రహదారులు 2014 మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు ఒక్క రోడ్డు కూడా పూర్తి చేయలేదు. మాజీ మంత్రి బాలరాజు సొంత మండలంలో రూ.57 కోట్లతో 14 రహదారులు నిర్మించాల్సి ఉంది. కేవలం 4 రోడ్లకే అటవీశాఖ నుంచి అనుమతులు లభించడంతో మిగిలిన 10 రహదారులు ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. అనుమతులు లభించిన 4 రోడ్లు నేరెళ్లబంద, జడలకొత్తూరు, రింతాడ, తీముల బంద ప్రారంభమైనప్పటికీ ఏ ఒక్క రోడ్డునూ పూర్తి చేయలేదు. కలగానే 100 పడకల ఆస్పత్రి గిరిజనులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు విశాఖ మన్యం చింతపల్లిలోని ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా మారుస్తామని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, మాజీ మంత్రి బాలరాజు హామీ ఇచ్చారు. ఈ మేరకు రూ.5.73 కోట్లు నిధులు మంజూరు చేసి శిలాఫలకాలు ఆవిష్కరించారు. ఏడాది అవుతున్నా ఇంతవరకు పనులు మాత్రం ప్రారంభించలేదు. కేవలం 5 ఎకరాల స్థలాన్ని సేకరించి చేతులు దులుపుకున్నారు. అన్నీ ‘కోతలే’ ఏళ్ల తరబడి గిరిజనులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను పరిష్కరిస్తామని మాజీ సీఎం, మాజీ మంత్రి హామీలిచ్చారు. రూ.25 కోట్లతో చింతపల్లి 133 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మించి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు. పనులు మాత్రం ప్రారంభించలేదు. దీంతో చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాల్లో సమస్య అలాగే ఉంది. నిత్యం విద్యుత్ సరఫరాలో అంతరాయంతో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. -
నేతలకు ప్రాణ హితం!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/సిద్దిపేట, న్యూస్‌లైన్: ఎన్నికల వేళ మన నేతలకు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ప్రాణమైంది. వైఎస్సార్ మరణం అనంతరం పనులు ఆగిపోయినా నోరు విప్పని ఏ ఒక్క నాయకుడూ.. ఇప్పుడు మాత్రం జాతీయ హోదా తెస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు. ఓట్లు రాల్చుకునేందుకు కొంగజపం చేస్తున్నారు. జిల్లాలో తాగు, సాగు నీటి అవసరాల తీర్చగల ప్రాణహిత ప్రాజెక్టుకు అన్ని పార్టీలు ఇప్పుడు తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెద్దపీట వేశాయి. జాతీయ హోదా కోసం కేంద్రం మీద ఒత్తిడి తెస్తామని టీఆర్ఎస్ పార్టీ పేర్కొనగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లూ నానబెట్టి మళ్లీ అదే అంశాన్ని తెరమీదకు తెచ్చింది. వైఎస్సార్ చలువే.. 2007లో జిల్లాలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రాణహితకు శంకుస్థాపన చేశారు. 2008లో ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. 2014-15 వరకు ప్రాణహిత ప్రాజెక్టును జిల్లాలో పూర్తి చేయాలని గడువు నిర్దేశించారు.సిద్దిపేట డివిజన్ పరిధిలో 10 నుంచి 15వ ప్యాకేజి వరకు ప్రాజెక్టును రూపొందించారు. ఇందుకు అవరమైన 14.45 వేల ఎకరాల భూమి సేకరించాలని నిర్దేశిత లక్ష్యాన్ని ఎంచుకున్నారు. నీటిపారుదల శాఖ సిద్దిపేట డివిజన్ పరిధిలో 8,552 ఎకరాల అలైన్మెంట్ భూ సేకరణను గుర్తించింది. అప్పటి నుంచి 2014 వరకు ఆరు సంవత్సరాల కాలంలో కేవలం 859 ఎకరాలు మాత్రమే సేకరించారు. కరీంగనర్ జిల్లా మిడ్‌మానేరు నుంచి అంతగిరి రిజర్వాయర్ ద్వారా చిన్నకోడూరు మండలం చెలుకలపల్లి మదిర ఎల్లాయపల్లి వద్ద టన్నెల్ నిర్మాణంతో రిజర్వాయర్ పనులను చేపట్టేందుకు సంకల్పించారు. 2009లో చేపట్టిన టన్నెల్ పనులు నేటికీ కొనసాగుతుండటం సర్కారుకు ప్రాజెక్టు మీదున్న ప్రేమకు నిదర్శనం. జిల్లాలో 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపడుతున్న ప్రాణహిత ప్రాజెక్టు పనులు చిన్నకోడూరు, సిద్దిపేట, తొగుట, కొండపాక, గజ్వేల్, వర్గల్, ములుగు మండలాల్లో కొనసాగనున్నాయి. గజ్వేల్ మండలం దాతర్పల్లి, తొగుట మండలం వేములగట్లో కాల్వ పనులు రెండేళ్ల కిందట ప్రారంభమైనప్పటికీ నేటికీ నిర్దేశిత గమ్యాన్ని చేరుకోకపోవడం గమనార్హం. నిరాశాజనకంగా భూసేకరణ... జిల్లాలో దాదాపు 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రాణహిత చేపట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా డివిజన్లో సుమారు 15 వేల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. కాని నిరాశాజనకంగా సాగుతోంది. చిన్నకోడూరు మండలం అల్లీపూర్, మాచాపూర్, తొగుట మండలం వెములగాట్, ఎటిగడ్డకిష్టాపూర్, గజ్వేల్ మండలంలోని దాతార్‌పల్లి, జగదేవ్‌పూర్ మండలంలోని రాయవరం, అన్నసాగర్, తిగూల్, తిమ్మాపూర్, చిన్నకోడూర్ మండలంలోని అల్లీపూర్, చంద్లాపూర్, పెద్దకోడూర్, చిన్నకోడూర్, రామంచ, సిద్దిపేట మండలంలోని ఇమాంబాద్, తడ్కపల్లి, తొగుట మండలంలోని బండారుపల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో భూసేకరణ చేయాల్సి ఉంది. ప్రాజెక్టు కోసం భూమిని సేకరిస్తున్న అధికారులకు మొదట్లో నష్టపరిహార విషయంలో రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురయ్యాయి. ఎకరానికి 6 లక్షల చొప్పున రైతులు డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వ నిబంధనలను ప్రమాణికంగా చేసుకొని అధికారులు ఎకరాకు సగటున రూ. 3.80 లక్షలను చెల్లిస్తున్నారు. రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు పట్టించుకోలేదు.. వైఎస్సార్ మరణం తరువాత రెండేళ్ల వరకు ప్రాజెక్టును కాంగ్రెస్ నేతలు పట్టించుకోలేదు. 2010, 2011 వార్షిక బడ్జెట్లో ప్రాణహితకు రూపాయి కూడా కేటాయించలేదు. బడ్జెట్లో కేటాయింపులు నిరాశాజనకంగా ఉండడంతో భూసేకరణ, రిజర్వాయర్ల నిర్మాణం, కాల్వ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2009 వరకు ప్రాణహితకు బడ్జెట్లో కేటాయింపులు ఉన్నప్పటికీ రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు శీతకన్ను చూపాయన్న విమర్శలు ఉన్నాయి. పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రాణహిత ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి అవుతుందోనని రైతులు వాపోతున్నారు. -
20, 21 తేదీల్లో కిరణ్ జిల్లా పర్యటన
చిత్తూరు(కలెక్టరేట్),న్యూస్‌లైన్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 20, 21 తేదీల్లో ఆయన జిల్లాలో పర్యటించనున్నట్టు గురువారం కలెక్టర్ కార్యాలయూనికి సమాచారం అందింది. పలు అభివృద్ధి పనులు, పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. జిల్లేళ్లమంద, వి.కోటల్లో నిర్వహించే రచ్చబండ సభల్లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటన వివరాలు ఇలా ఉన్నారుు. 20వ తేదీ ఉదయం ఆరుగంటలకు సీఎం హైదరాబాదు నుంచి బయలుదేరి 7.20 గంటలకు చెన్నై విమానాశ్రయూనికి చేరుకుంటారు. 7.40 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి వరదయ్యపాళెంకు చేరుకుంటారు. శ్రీసిటీ సెజ్‌కు చేరుకుని అధికారులతో సమావేశమవుతారు. అల్పాహారనంతరం 9 గంటలకు క్యాడ్బరీ, డెన్సీలీ ఫ్యాక్టరీలకు శంకుస్థాపన చేస్తారు. 11.10 గంటలకు శ్రీసిటీ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11.50 గంటలకు తిరుపతిలోని ఎన్టీఆర్ స్టేడియం చేరుకుంటారు. తిరుపతిలో అధికార, అనధికారులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి చిత్తూరు-తిరుపతి బైపాస్‌లో ఏర్పాటు చేయనున్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 12.30 గంటలకు స్విమ్స్ చేరుకుని శ్రీపద్మావతి వైద్య కళాశాల, చిత్తూరు తాగునీటి పథకం, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. 12.50 గంటలకు తిరుపతి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 1.30 గంటలకు కేవీపల్లె మండలం జిల్లేళ్ల మందకు చేరుకుని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4.10 గంటలకు అదే మండలంలోని తూపల్లెకు చేరుకుని ఝరికోన తాగునీటి పథకానికి ప్రారంభోత్సవం చేస్తారు. 4.20 గంటలకు బయలుదేరి కలకడ మండల కేంద్రానికి చేరుకుని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు కలికిరి మండలం నరిగిపల్లెలోని ఆయన స్వగృహానికి చేరుకుని రాత్రికి అక్కడ బసచేస్తారు. 21వ తేదీ ఉదయం 10.40 గంటలకు కలికిరి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటలకు వి.కోట చేరుకుని అధికార, అనధికారులతో సమావేశమవుతారు. 11.20 గంటలకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.50 గంటలకు వి.కోట నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వైఎస్సార్ కడప జిల్లాకు వెళ్లనున్నారు. -
చంద్రబాబు చొక్కాపట్టుకుని నిలదీయాలి: రోజా
-
ఎన్టీఆర్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవతరణ వేడుకలు
-
ఎన్టీఆర్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, రఘువీరారెడ్డి, టీజీ వెంకటేష్, శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి, ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు తదితరులు పాల్గొన్నారు. కాగా రాష్ట్ర విజభన నేపథ్యంలో అంధ్రప్రదేశ్ ఆవతరణ వేడుకలను తెలంగాణవాదులు అడ్డుకునే అవకాశం ఉందనే అనుమానంతో పోలీసు ఉన్నతాధికారులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. అందులోభాగంగా ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. రాష్ట్ర సచివాలయం నుంచి ఇందిరా పార్క్ వైపు వచ్చే తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌ను భద్రత చర్యల్లో భాగంగా మూసివేశారు. రాష్ట్ర మంత్రులతోపాటు పలువురు ఉన్నతాధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే తెలంగాణ మంత్రులు మాత్రం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు దూరంగా ఉన్నారు. -
రాజకీయ అవిభక్త కవలలు నారా... నల్లారి
-
'నేను పదవిలో ఉన్నంతకాలం విభజన జరగదు' - ఉద్యోగులతో సీఎం కిరణ్
ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డితో బుధవారం మధ్యాహ్నం ఉద్యోగ సంఘాల నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సమ్మె విరమించడానికి ఉద్యోగ సంఘాలు నిరాకరించారు. సమైక్య రాష్ట్రంపై ప్రభుత్వం హామీ ఇస్తే తప్ప సమ్మె విరమించేది లేదు అని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. పదవిలో ఉన్నంత కాలం రాష్ట్ర విభజన జరగదని ముఖ్యమంత్రి కిరణ్ తెలిపారని ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో అన్నారు. అన్ని ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపిన తర్వాతనే సమ్మె విరమణపై ఓ నిర్ణయం తీసుకుంటామని జేఏసీ నేతలు వెల్లడించారు. త్వరలోనే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. రాష్ట్రానికి తుఫాన్ ముప్పు ఉన్నందున్న ప్రభుత్వానికి సహకరించి..సమ్మెను విరమించాలని ముఖ్యమంత్రి కోరినట్టు సమాచారం. ముఖ్యమంత్రితో మూడు గంటలపాటు జరిగిన చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రితో చర్చలు అనంతరం జేఏసీ నేత అశోక్ బాబు మాట్లాడుతూ.. తుఫాన్ వస్తే అత్యవసర సేవల్లో పాల్గొంటాం. సమ్మె యధావిధిగా కొనసాగుతుంది. ఈ నెల 11, 12 తేదిన అన్ని ఉద్యోగ సంఘాల నేతలతో చర్చిస్తాం అని అన్నారు. -
ముఖ్యమంత్రి కిరణ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి: పాల్వాయి
ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డిని పీడీ యాక్ట్ కింద వెంటనే అరెస్ట్ చేయాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల అభిమానాన్ని చూరగొనే వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించాలని పాల్వాయి సూచించారు. శాంతి భద్రతలు పరిరక్షించడంలో విఫలమైన, అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని వెంటనే డిస్మిస్ చేయాలి అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రదేశ్ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర విభజనపై మళ్లీ అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలని పీసీసీ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడం ఆయన వ్యక్తిగతం అని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. మాజీ డీజీపీ దినేష్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో పలు పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. -
కాంగ్రెస్‌ను వీడను: సీఎం కిరణ్
* పార్టీ లేకుంటే నాకు భవిష్యత్తే లేదు * ఎవరూ రాజీనామా చేయొద్దు * విభజన సమస్యలు తీరేవి కావు * వీటి పరిష్కారానికి రెండో ఎస్సార్సీ వేయాలి * విభజిస్తే నీటి యుద్ధాలేనని కోర్ కమిటీకే చెప్పా * అయినా రాజకీయ నిర్ణయం తీసుకున్నారు సాక్షి, హైదరాబాద్: రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయని, వాటిని పరిష్కరించడం కూడా సాధ్యం కాదని అన్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసం రెండో ఎస్సార్సీ వేయాలని ఆయన కోరారు. రాష్ట్ర భవిష్యత్ కోసం సీఎం పదవిని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానే తప్ప కాంగ్రెస్‌ను మాత్రం వదులుకోనని తెలిపారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ ఏర్పాటుపై నిర్ణయం ప్రకటించిన అనంతరం తొమ్మిది రోజులకు దానిపై నోరు విప్పిన కిరణ్... మళ్లీ దాదాపు 50 రోజుల తర్వాత శుక్రవారం రెండోసారి తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సుదీర్ఘంగా మాట్లాడారు. తన భవిష్యత్తంతా కాంగ్రెస్‌తోనే ముడిపడి ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని వదులుకునే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్ల, సోనియాగాంధీ వల్లే తాను సీఎం అయ్యానని చెప్పారు. విభజన పేరుతో కాంగ్రెస్ పార్టీ పొరపాటు నిర్ణయం తీసుకుందన్నారు. ఇందులో తన భాగస్వామ్యం లేదని చెప్పారు. తాను సీఎంగా ఉండగా విభజన జరగకూడదనే ఉద్దేశంతోనే హైకమాండ్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నానన్నారు. విభజన వల్ల జరిగే నష్టంపై సీమాంధ్రతో పాటు తెలంగాణ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. తక్షణం సమ్మెను విరమించి విధుల్లో చేరాలని ఏపీ ఎన్జీవోలను కోరారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులెవరూ ఈ సమయంలో రాజీనామా చేయొద్దని కిరణ్ కోరారు. ‘‘రాజీనామా చేస్తే పార్లమెంటులో, శాసనసభలో అభిప్రాయం చెప్పే అవకాశం కోల్పోతారు. పదవుల్లో ఉంటూనే పోరాటం చేయాలి’’ అని సూచించారు. విభజన వల్ల జరిగే నష్టాలు, ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల్లో తలెత్తే వివాదాలు, సమైక్య రాష్ట్ర ఆవశ్యకత, దిగ్విజయ్‌సింగ్ ఇటీవలి వ్యాఖ్యలు, తదితరాలపై ఆయన గంటకు పైగా మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు... సమ్మె విరమించండి ‘‘58 రోజులుగా ఏపీ ఎన్జీవోలు సమ్మె చేస్తుండటంతో సీమాంధ్రలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల చదువులు ఆగిపోయాయి. కార్యాలయాలు మూతపడ్డాయి. ఉద్యోగులు జీతాల్లేక అల్లాడుతున్నారు. పని చేయకపోవడంతో ఉద్యోగులకు సంబంధించి రూ.1,000 కోట్ల జీతాలు ఆగిపోయాయి. మీ ఉద్యమంతో కేంద్రం దృష్టిని, రాష్ర్ట ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఇక చాలు. వెంటనే విధుల్లో చేరండి’’ కాంగ్రెస్‌ను వదులుకునే ప్రసక్తే లేదు ‘‘నేను కాంగ్రెస్‌లోనే పుట్టాను. కాంగ్రెస్‌లోనే పెరిగాను. కాంగ్రెస్ వల్లే సీఎం కాగలిగాను. కాంగ్రెస్ లేకుంటే నాకు భవిష్యత్తే లేదు. కాంగ్రెస్ పట్ల నాకు చిత్తశుద్ధి ఉంది. సోనియాగాంధీ, కాంగ్రెస్ లేకుంటే నేను సీఎం అయ్యేవాడినే కాదు. కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన కూడా నాకు లేదు. ఒకవేళ కాంగ్రెస్‌ను వీడి పార్టీ పెడితే మహా అయితే సీఎం అవుతానేమో! ఇప్పటికే ఆ పదవిలో కొనసాగుతున్నాను కదా! ప్రధాని పదవి తప్ప ఇంతకంటే పెద్ద పదవి లేదు కదా! ఇంకా కొత్త పార్టీ ఎందుకు? నాకు కాంగ్రెస్ పార్టీ కావాలి. నా తండ్రి కూడా జై ఆంధ్రా ఉద్యమంలోనూ సమైక్యవాదిగానే ఉన్నారు. సమైక్యం కోసం సీఎం పదవిని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానే తప్ప పార్టీని వదులుకోను. చంద్రబాబు మాదిరిగా పదవి కోసం గడ్డి కరిచే వ్యక్తిని కాదు. రోజుకో మాట మాట్లాడే మనిషినీ కాదు. అయితే సమైక్యం కావాలా, కాంగ్రెస్ కావాలా ఎంచుకొమ్మనే పరిస్థితి రాకూడదనే అనుకుంటున్నా’’ సమైక్యాంధ్ర సీఎంనే ‘‘నేను సీమాంధ్రకే కాదు రాష్టమ్రంతటికీ సీఎంనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ పదేపదే చెబుతున్నారు. అవును... నేను సమైక్యాంధ్రకే ముఖ్యమంత్రిని. దిగ్విజయ్ అలా అంటున్నప్పుడల్లా సమైక్యం కోసం ఇంకా గట్టిగా, కసిగా పోరాడాలన్పిస్తోంది. నా సీఎం పదవి శాశ్వతం కాదు. దిగ్విజయ్‌సింగ్ పదవీ శాశ్వతం కాదు. ‘అన్నీ మేం చూసుకుంటాం’ అని రాజకీయ ప్రకటన చేసినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావు. కేంద్రం దిగి రావాలి. 58 రోజులుగా జరుగుతు న్న సీమాంధ్ర ఉద్యమంలోకి రాజకీయ పార్టీల నేతలను రానీవడం లేదంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి’’ విభజన నిర్ణయమే పొరపాటు ‘‘హైకమాండ్ తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయమే పొరపాటు. అయినా వాళ్లు రాజకీయంగా నిర్ణయం తీసుకున్నారు. విభజన వల్ల తలె త్తే సమస్యలు ఎప్పటికీ పరిష్కరించలేనివి. ఒక సమస్యను పరిష్కరించబోయి మరిన్ని పెద్ద పెద్ద సమస్యలు సృష్టించాలనుకోవడం పరిష్కారమే కాదు. ఇందులో నా పొరపాటు లేదని చెప్పడానికి, ప్రజలను అప్రమత్తం చేయడానికే ఇదంతా చెబుతున్నా. పార్టీ రాజకీయ నిర్ణయమే తీసుకుంది. ఈ సమస్యలను పరిష్కరిస్తూ ఏ విధంగా ముందుకు వెళుతుందో చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది’’ నెహ్రూ, ఇందిర వేసిన బంధాలు శిలాశాసనాలు కావా?: ‘‘సీడబ్ల్యూసీ తీర్మానం శిలాశాసనమని మా పార్టీ వాళ్లు అంటున్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయం శిలాశాసనసమైతే ఆనాడు నెహ్రూ వేసిన బంధం నీటి మూటేనా? ఇందిరాగాంధీ వేసిన ముడులన్నీ ఉత్తుత్తివేనా? అయినా ఆంధ్రప్రదేశ్ ఒక్క రోజులో ఏర్పడిన రాష్ట్రం కాదు. ఎన్నో ఏళ్లు పోరాడితే ఏర్పడిన భాషాప్రయుక్త రాష్టమ్రిది’’ అవకాశాలు కోల్పోతారు ‘‘జిల్లా యూనిట్, జోనల్ వ్యవస్థ వల్ల 1.6 లక్షల మంది ఉద్యోగులు ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. విభజన జరిగితే బదిలీలు, ప్రమోషన్లలో వారికి నష్టం జరుగుతుంది. ఉద్యోగ విరమణ చేసిన వారంతా హైదరాబాద్‌లోనే నివసిస్తున్నారు. వారికి పెన్షన్లు ఎవరిస్తారు? హైదరాబాద్‌కు ఏటా 10.5 శాతం మంది వలస వస్తున్నారు. వీరిలో 15 శాతం ఉద్యోగాల కోసం, 57 శాతం వ్యాపారం, ఉపాధి కోసం, 24 శాతం చదువుల కోసం వస్తున్నారు. విద్యా, వైద్య సంస్థలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. విభజన జరిగితే సీమాంధ్ర యువత అవకాశాలు కోల్పోతుంది’’ విడిపోతే జల యుద్ధాలే ‘‘విభజన జరిగితే జల యుద్ధాలు తప్పవు. ఇరు ప్రాంతాల్లోనూ సాగునీటి రంగం దెబ్బతింటుంది. కోట్లాది మంది రైతులకు నష్టం వాటిల్లుతుంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడకపోయి ఉంటే కృష్ణా, గోదావరి నదులపై ఒక్క సాగునీటి ప్రాజెక్టు ఏర్పాటయ్యేది కాదు. తెలంగాణ, సీమాంధ్ర సరిహద్దులోనే శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను నిర్మించారు. విడిపోతే కొత్తగా ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేం. ఉన్నవాటిని పూర్తి కూడా చేయలేం. సమైక్య రాష్ట్రంలో అన్నీ ఆలోచించి ఇరు ప్రాంతాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు పోగలుగుతున్నాం. రాష్ట్రం విడిపోతే అది సాధ్యమవుతుందా? ఇదంతా గమనించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆనాడే ఆయా ప్రాజెక్టులకు సంబంధించి టెండర్లు పిలిచారు. అయితే పలు కారణాల వల్ల అవి పెండింగ్‌లో ఉండిపోయాయి (ఈ సందర్భంగా కిరణ్ పలుమార్లు మంచినీళ్లు తాగారు. ‘నీటి గురించే నీళ్లు తాగాల్సి వస్తోంది. భవిష్యత్తులో ఇబ్బంది రాకూడదనే ఇదంతా చెబుతున్నా, నీళ్లు తాగుతున్నా’ అంటూ చమత్కరించారు)’’" అందుకే వైఎస్ నాడు రోశయ్య కమిటీ వేశారు ‘‘విభజనవల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుగానే గ్రహించారు. వాటిని ఎలా పరిష్కరించాలనే దానిపై రోశయ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఆ సమస్యలను పరిష్కరించాకే విభజనపై ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతోనే కమిటీ వేశారు. విభజన వల్ల తలెత్తే సమస్యలు పరిష్కారం కావు. అందుకే రెండో ఎస్సార్సీ వేసి ముందుకు పోవాలని కోరుతున్నా. కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు హైకమాండ్ రాజకీయ నిర్ణయం తీసుకుంది. దీన్ని పునఃసమీక్షించాలని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతున్నా’’. -
నిజమైన కథనాలతో మీడియా విశ్వసనీయత కాపాడాలి
మీడియా నిజమైన కథనాలు మాత్రమే వెల్లడించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి శనివారం హైదరాబాద్‌లో అభిప్రాయపడ్డారు. దీని ద్వారా మీడియా విశ్వసనీయతను పరిరక్షించవచ్చని ఆయన పేర్కొన్నారు. శనివారం 'మెట్రో ఇండియా' ఆంగ్ల పత్రిక మొదటి సంచికను సీఎం కిరణ్ ఇక్కడ ఆవిష్కరించారు. ఆ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాజకీయాలు, బిజినెస్‌కు సంబంధించిన ఆసక్తికర కథనాలను సాధారణ వార్తలతో కలిపి వెల్లడించవద్దని భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా మీడియాకు హితవు పలికారు. 'మెట్రో ఇండియా' ఇంటెర్నెట్ ఎడిషన్‌ను ఆయన ప్రారంభించారు. 'మెట్రో ఇండియా' ఆంగ్ల పత్రికను న్యూఢిల్లీ, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, నగరాల నుంచి ప్రచురించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆ పత్రిక చైర్మన్ సీ.ఎల్.రాజం వెల్లడించారు. సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి డి.కే.అరుణ, సీపీఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు, ఎంఐఎం చీఫ్ అసద్దుదీన్ ఓవైసీ, లోక్‌సత్తా పార్టీ అధినేత ఎన్.జయప్రకాశ్ నారాయణ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు, టీడీపీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
సీఎం ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆరోపించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో గాంధీ భవనలో విలేకర్ల సమావేశంలో ప్రసంగించారు. రాష్ట్ర విభజన వల్ల ఏమైన సమస్యలు ఉంటే కాంగ్రెస్ అధిష్టానం ముందు చెప్పుకోవాలని ఆయన సీఎం కిరణ్‌కు సూచించారు. అంతేకాని ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. ఇటీవల కాంగ్రెస్ అధిష్టానానికి రోడ్డు మ్యాప్ సమర్పించినప్పుడు రాష్ట్ర విభజన వల్ల కలిగే అనర్థాలను వివరించలేదా ఆని విహెచ్ ఈ సందర్భంగా కిరణ్‌ను ప్రశ్నించారు. అన్ని విషయాలు తెలిసి, ఓ బాధ్యతయుతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణ ఇవ్వాలని గతంలోనే సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్న సంగతిని వీహెచ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను, సీఎం కిరణ్ వ్యవహారిస్తున్న తీరును కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తుందని వి.హనుమంతరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై ఎన్నిసార్లు క్షేత్రస్థాయిలో చర్చలు జరపాలని ప్రశ్నించారు. -
తెలంగాణ ప్రకటన తర్వాత కుంటుపడిన పరిపాలన
-
తెలంగాణ విభజన నిర్ణయం తర్వాత పూర్తిగా కుంటుపడిన పరిపాలన
తెలంగాణ విభజన నిర్ణయానంతర పరిణామాలు రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలనపై తీవ్ర ప్రభావం చూపించాయి. ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనకు కేంద్రమైన సచివాలయానికి రావడమే మానేశారు. విభజన నిర్ణయం వెలువడింది మొదలు బుధవారం వరకు ఆవైపే కన్నెత్తి చూడలేదు. ఇక సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన మంత్రులూ సచివాలయానికి రావడం లేదు. అనిశ్చితితో కూడిన పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ మంత్రుల్లోనూ ఒకరిద్దరు తప్ప మిగతావారు తమ కార్యాలయాలకు రావడం కానీ, రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొనడం కానీ చేయడం లేదు. దీంతో ప్రభుత్వపరమైన ఎలాంటి సమీక్షలు, విధానపర నిర్ణయాలు జరగడం లేదు. పలు శాఖల సమీక్ష పూర్తిగా నిలిచిపోయింది. వందలాది ఫైళ్లు పెండింగ్‌లో పడిపోయాయి. గోదావరి వరద బాధితులను పట్టించుకున్న నాథుడే లేడు. సీఎం కనీసం ఏరియల్ సర్వేకు కూడా పూనుకోకపోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు కేవలం కోర్టు కేసులు, అత్యవసరమైన ఫైళ్లు మాత్రమే చూస్తున్నారు. ఆందోళనలు జరుగుతున్న సీమాంధ్ర జిల్లాల నుంచి సచివాలయంలోని వివిధ శాఖలకు కావాల్సిన సమాచారం రావడం ఆగిపోయింది. అక్కడ ఉద్యోగులంతా వీధుల్లోకి రావడంతో ఆ పరిస్థితి తలెత్తింది. సచివాలయంలోని సీమాంధ్ర ఉద్యోగులు, అధికారులు సైతం ప్రతిరోజూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏదో ఒక ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటంతో సెక్రటేరియట్ ధర్నాచౌక్లా మారింది. రాష్ట్ర విభజనపై కొనసాగుతున్న చర్చలతో ఫైళ్లు, ప్రజా సమస్యలను పట్టించుకునేవారే కరువయ్యారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు ఇప్పుడా ఉద్యోగాల ఊసే ఎత్తడం లేదు. విభజన నిర్ణయం నేపథ్యంలో నోటిఫికేషన్లు జారీ చేయాలా..? లేదా..? అని పలు విభాగాలు అడుగుతుంటే వివరణ ఇచ్చేవారే కరువయ్యారు. ఆగస్టులో రచ్చబండ, ఇందిరమ్మ కలలు కార్యక్రమాల దన్నుగా మునిసిపల్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు వెళ్లాలని భావించిన సర్కారుకు విభజన నిర్ణయంతో ఎదురుదెబ్బ తగిలింది. కానరాని సంక్షేమం... ఆగిపోయిన సబ్సిడీ సచివాలయం పనితీరు మందగించిన కారణం గా సంక్షేమ శాఖలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా యి. జిల్లాల్లో, కమిషనరేట్ కార్యాలయాల్లో సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నందున సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలగకపోయినా, కీలకమైన కొన్ని నిర్ణయాలు మాత్రం జరగడం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగ, మహిళా వర్గాలకు ఆర్థిక సాయం చేసే కార్యక్రమం రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరగకపోవడంతో ఎంత మేర సబ్సిడీ, ఆర్థిక సాయం అందించాలన్న అంశం తేలలేదు. మొత్తం 6 లక్షల మందికి ఈ ఏడాది వివిధ ఆర్థిక సహాయ కార్యక్రమాల కింద లబ్ధి చేకూర్చాల్సి ఉంది. కానీ... సబ్సిడీ విషయం ఇంతవరకు తేలలేదు. చేనేత కార్మికులకు లక్ష రూపాయల వరకూ వడ్డీలేని రుణాలు అందిస్తామని సీఎం ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా చేనేతశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ముందుకు కదలడం లేదు. భారీగా తగ్గిన సందర్శకుల సంఖ్య సచివాలయానికి సీఎం, మంత్రులు రాకపోవడం తో సందర్శకుల సంఖ్యా గణనీయంగా తగ్గింది. సాధారణంగా రోజూ 2,500 నుంచి 3,000 మంది వరకు వస్తారు. విభజన నిర్ణయం నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులతో గత నెల 31న 273 మంది, ఈ నెల 1న 349 మంది, 2న 371 మంది, 5న 368 మంది, 6న 405 మంది, 7వ తేదీన 500 మంది మాత్రమే వివిధ పనుల నిమిత్తం సచివాలయాన్ని సందర్శించారు. నిలిచిన మునిసిపల్ ఎన్నికల ప్రక్రియ పురపాలక శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి రాజీనామా చేసి సచివాలయానికి రావడం లేదు. మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి వార్డులు/డివిజన్ల రిజర్వేషన్ల ఖరారు నోటిఫికేషన్లు రావాల్సి ఉన్నా.. సీమాంధ్ర ప్రాంతంలో అవేవీ జరగడంలేదు. గ్రామీణాభివృద్ధి శాఖలోనూ అదే పరిస్థితి. మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిలు కూడా సచివాలయంవైపు తొంగి చూడడం లేదు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి సచివాలయానికి వచ్చివెళ్తున్నా.. సమీక్షా కార్యక్రమాలు పెట్టుకోవడం లేదు. 2,677 గ్రామ కార్యదర్శుల పోస్టుల భర్తీ ఉంటుందా..? లేదా? అన్న అంశంపై సందిగ్ధత కొనసాగుతోంది. పింఛన్ల కోసం పేదల ఎదురుచూపులు విభజన ప్రభావం రచ్చబండ కార్యక్రమంపై పడింది. ఈ నెల 8 నుంచి 18 వరకు రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని గత నెల 24న మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. అర్హులైన 32.16 లక్షల మంది పేదలకు రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇంది రమ్మ ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలా వద్దా అనే అంశంపై సీఎం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పోస్టులేవీ: పంచాయతీ ఎన్నికలకు ముందు అన్ని రంగాల్లో 54 వేల పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సీఎం దీనిపైనా నిర్ణయం తీసుకోవడం లేదు. జిల్లా ఎంపిక కమిటీల ద్వారా 20,508 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఏపీపీఎస్సీ ద్వారా 12 వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. వివిధ రంగాల్లో మరో 22,000 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో పోస్టుల భర్తీని ఆపాలని, విభజన ప్రక్రియ తర్వాతే భర్తీ చేయాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరాయి. అయితే పోస్టుల భర్తీ చేయాలా వద్దా అనే విషయంపై స్పష్టత ఇవ్వాల్సిందిగా నియామక విభాగాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. దీనిపై ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ప్రకటించడం లేదు. ఏపీజెన్‌కోలో 1,105 ఖాళీల భర్తీకి అంగీకరించాలని ప్రతిపాదనలు పంపింది. ఒక్క పరిశ్రమా రావడం లేదు! కొత్త పరిశ్రమలకూ బ్రేక్ పడింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామంటూ ఒక్క పరిశ్రమ నుంచి కూడా ప్రతిపాదనలు రావట్లేదని పరిశ్రమలశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి గత నాలుగేళ్లుగా రాష్ట్రానికి పరిశ్రమల రాక బాగా తగ్గిపోయింది. అయితే ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో ఒక్క పారిశ్రామికవేత్త కూడా రాష్ట్రంవైపు తొంగి చూడటం లేదని ఈ వర్గాలు వివరించాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల కిలోమీటర్ల మేర ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి. వీటి శాశ్వత మరమ్మతులకు రూ.625 కోట్లు అవసరమని ఆర్అండ్బీ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. శాఖకు మంత్రి లేకపోవడం, పర్యవేక్షించాల్సిన ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడంతో.. ఒక్కపైసా కూడా నిధులు అందలేదు. 4 లక్షల మంది విద్యార్థుల ఎదురుతెన్నులు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి దాదాపు 1,20,000 మంది విద్యార్థులు అర్హత సాధించి వెబ్ కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. నోటిఫికేషన్ ప్రకారం ఈనెల 3 నుంచి ఈ ప్రక్రియ మొదలుకావాల్సి ఉండగా.. సీమాంధ్రలో ఆందోళనల ఫలితంగా ఈ ప్రక్రియను వాయిదావేశారు. ఇక దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఎదురుచూస్తున్నారు. కోర్టు కేసుల కారణంగా ఇంతవరకు కౌన్సెలింగ్ జరగకపోగా తాజాగా సమైక్యాంధ్ర ఆందోళనల నేపథ్యంలో ఇప్పటికే ఐసెట్ వెబ్ కౌన్సెలింగ్ వాయిదాపడిన నేపథ్యంలో ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ కూడా ప్రారంభమయ్యేలా లేదు.