ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు మరికాసేపట్లో ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభంకానున్నాయి. ఆ వేడుకలకు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాష్ట్ర విజభన నేపథ్యంలో అంధ్రప్రదేశ్ ఆవతరణ వేడుకలను తెలంగాణవాదులు అడ్డుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. అందులోభాగంగా ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. అయితే రాష్ట్ర సచివాలయం నుంచి ఇందిరా పార్క్ వైపు వచ్చే తెలుగు తల్లి ఫ్లై ఓవర్ను భద్రత చర్యల్లో భాగంగా మూసివేశారు. రాష్ట్ర మంత్రులతోపాటు పలువురు ఉన్నతాధికారులు ఈ వేడుకలలో పాల్గొనున్నారు.