NTR Stadium
-
హైదరాబాద్ : 37 వ జాతీయ బుక్‌ఫెయిర్ ప్రారంభం ..భారీ సంఖ్యలో సందర్శకులు (ఫొటోలు)
-
మంచినీళ్ల కుండ
‘చదువని వాడజ్ఞుండగు! చదివిన సదసద్వివేక చతురత గలుగున్ !’ అంటాడు పోతన తన ఆంధ్ర మహా భాగవతంలో. చదవకపోతే ఏమీ తెలీదు, చదువుకుంటేనే మంచీ చెడుల వివేకం కలుగుతుంది; అందుకే, ‘చదువంగ వలయు జనులకు! చదివించెద నార్యులొద్ద, చదువుము తండ్రీ!’ అని ప్రహ్లాదుడికి తండ్రి హిరణ్యకశ్యపుడితో చెప్పిస్తాడు. నిజంగానే ఆ గురువుల దగ్గరి చదువేదో పూర్తికాగానే, ‘చదివించిరి నను గురువులు! చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు! నే/ జదివినవి గలవు పెక్కులు! చదువులలో మర్మ మెల్ల జదివితి తండ్రీ!’ అని జవాబిస్తాడు ప్రహ్లాదుడు. కొడుకుకు కలిగిన వివేకం తండ్రి కోరుకున్నదేనా అన్నది పక్కనపెడితే, చదువనేది భిన్న ద్వారాలు తెరుస్తుందన్నది నిజం. ప్రహ్లాదుడు పుట్టు వివేకి కాబట్టి, తనకు కావాల్సిన సారాన్ని గ్రహించగలిగాడు. అందరికీ అలాంటి గుణం ఉంటుందా? అందుకే, ‘చదువులన్ని చదివి చాలవివేకియౌ/ కపటికెన్న నెట్లు కలుగు ముక్తి/ దాలిగుంటగుక్క తలచిన చందము’ అన్నాడు వేమన. ‘చదువులెల్ల చదివి సర్వజ్ఞుడై యుండి’నప్పుడు కూడా ఉండే బలహీనతలను ఎత్తిపొడిచాడు. ఆత్మసారం తెలుసుకోవడమే ముఖ్యమన్నాడు.అతడు ‘బాగా చదువుకున్నవాడు’ అంటే లోకాన్ని బాగా అర్థం చేసుకున్నవాడు, పరిణత స్వభావం ఉన్నవాడు, గౌరవనీయుడు, ఒక్క మాటలో వివేకి అని! వివేకం అనేది ఎన్నో గుణాలను మేళవించుకొన్న పెనుగుణమే కావొచ్చు. అయినా అదొక్కటే చాలా? ‘చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా/ చదువు నిరర్థకమ్ము’ అన్నాడు భాస్కర శతకకర్త మారవి వెంకయ్య. ‘బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం/పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!’ అని ప్రశ్నించాడు. కూరకు రుచి తెచ్చే ఉప్పులాగే జీవితంలో ‘యించుక’ రసజ్ఞత ఉండాలి. చాలామందిలో ఆ సున్నితం, ఆ సరస హదయం లోపించడం వల్లే సంబంధాలు బండబారుతున్నాయి. అందుకే వివేకం, రసజ్ఞతలను పెంచే చదువు ముఖ్యం. ఈ చదువు తరగతి చదువు కాదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరగతి గదిలోనే ఇవి అలవడితే అంతకంటే కావాల్సింది ఏముంది! ప్రపంచంలోకి దారి చూపే చదువు, ప్రపంచాన్ని చేరువ చేసే చదువు సాహిత్య రూపంలో ఉంటుంది. ఆ సాహిత్యం మంచి పుస్తకం రూపంలో హస్తభూషణమై ఉంటుంది.మనుషుల వివేకాన్ని కొలవదలిచినవాళ్లు ‘ఇప్పుడు ఏం చదువుతున్నారు?’ అని అడుగుతారు. చదవడం మాత్రమే సరిపోదు, ఆ చదువుతున్నది ఏమిటి? ‘నీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయన్నది విషయం కాదు, నీ దగ్గరున్న పుస్తకాలు ఎంత మంచివి అన్నదే ముఖ్యం’ అంటాడు గ్రీకు తత్వవేత్త సెనెకా. మంచిని ఎలా కొలవాలి? ‘మనల్ని గాయపరిచే, పోటుపొడిచే పుస్తకాలే మనం చదవాలి. తల మీద ఒక్క చరుపు చరిచి మేలుకొలపకపోతే అసలంటూ ఎందుకు చదవడం’ అంటాడు రచయిత ఫ్రాంజ్ కాఫ్కా. చదవడమే పెద్ద విషయం అయిన కాలంలో, దానికి ఇన్ని షరతులా అన్న ప్రశ్న రావడం సహజమే. ఎందుకంటే, ‘నేషనల్ లిటరసీ ట్రస్ట్’ నివేదిక ప్రకారం, భారతీయ చిన్నారుల్లో చదవడం దాదాపు సంక్షోభం స్థాయికి పడిపోయింది. 5–18 ఏళ్లవారిలో కేవలం మూడింట ఒక్కరు మాత్రమే తమ ఖాళీ సమయంలో చదవడాన్ని ఆనందిస్తామని చెప్పారు. కేవలం 20 శాతం మంది మాత్రమే, ప్రతిరోజూ ఏదో ఒకటి చదువుతున్నామని జవాబిచ్చారు. చదివే అలవాటును పెంచకపోతే, వికాసానికి దారులు మూస్తున్నట్టే!ఆధునిక తరానికి చదవడం మీద ఉత్సాహం కలిగించేలా, అయోమయ తరానికి రసజ్ఞత పెంచేలా ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ డిసెంబర్ 19 నుంచి 29 వరకు పాటు కాళోజీ కళాక్షేత్రం (ఎన్టీఆర్ స్టేడియం)లో జరగనుంది. మధ్యాహ్నం పన్నెండు నుంచి రాత్రి తొమ్మిది వరకు ఇది కొనసాగుతుంది. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ, హిందీలో పేరున్న భిన్న ప్రచురణకర్తలు, విక్రేతలు, రచయితల స్టాళ్లు సుమారు 350 వరకు ఏర్పాటవుతాయి. నూతన పుస్తకాల ఆవిష్కరణలు, ఉపన్యాసాలు ఉంటాయి. 1985 నుంచి జరుగుతున్న ఈ బుక్ ఫెయిర్‌ను ఈసారి పదిహేను లక్షల మంది సందర్శిస్తారని అంచనా. ‘మనం అనేక పండుగలు చేసుకుంటాం. కానీ పుస్తకాల పండుగ ప్రత్యేకమైనది. పెద్ద జాతరలో మంచినీళ్ల కుండ లాంటిది బుక్ ఫెయిర్. ఏ రకమైనా కావొచ్చుగాక, అసలు పుస్తకాల వైపు రాగలిగితే మనిషికి వివేకం, వివేచన పెరుగుతాయి. జీవిత సారాన్ని అందించేదే కదా పుస్తకమంటే! ‘ఏడు తరాలు’ లాంటి నవలకు మనం ఎట్లా కనెక్ట్ అయ్యాం! పుస్తకాలు, అక్షరాలు లేకపోతే మనం ఎక్కడుండేవాళ్లం? అందుకే ఈసారి నచ్చిన, మెచ్చిన, ప్రభావితం చేసిన పుస్తకం అంటూ పుస్తకం కేంద్రకంగా కొన్ని సెషన్లు నిర్వహిస్తున్నాం’ అని చెబుతున్నారు బుక్ ఫెయిర్ అధ్యక్షుడు ‘కవి’ యాకూబ్. అయితే, పుస్తకాల దుకాణాల కన్నా, దగ్గర్లోని బజ్జీల బండికి గిరాకీ ఎక్కువ అనే వ్యంగ్యం మన దగ్గర ఉండనే ఉంది. అన్నింటిలాగే ఇదీ ఒక ఔటింగ్, ఒక వినోదం, బయటికి వెళ్లడానికి ఒక సాకు... లాంటి ప్రతికూల అభిప్రాయాలు ఉండనే ఉన్నాయి. ఏ వంకతో వెళ్లినా దేవుడి దగ్గరికి వెళ్లగానే భక్తిగా కళ్లు మూసుకున్నట్టు, పుస్తకం చూడగానే ఆర్తిగా చేతుల్లోకి తీసుకుంటున్నప్పుడు ఏ కారణంతో వెళ్తేనేం? కాకపోతే వ్యక్తిత్వానికి సరిపడే, వివేకం– రసజ్ఞతలను పెంచే పుస్తకాలను ఎంపిక చేసుకోవడమే పెద్ద పని. దానికోసం కొంత పొల్లు కూడా చదవాల్సి రావొచ్చు. కానీ క్రమంగా ఒక ఇంట్యూషన్ వృద్ధి అవుతుంది. అదే చదువరి పరిణతి. -
హైదరాబాద్ : ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా కోటి దీపోత్సవం (ఫొటోలు)
-
నేటి నుంచి కోటి దీపోత్సవం
లక్డీకాపూల్: కార్తీకమాసాన్ని పురస్కరించుకుని భక్తి టీవీ ఆధ్వర్యంలో శనివారం నుంచి కోటి దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ప్రారంభమయ్యే ఈ దీపోత్సవం ఈ నెల 25 వరకు కొనసాగుతుంది. ప్రతి రోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో భాగంగా ప్రసిద్ధ జగద్గురువులు, పీఠాధిపతులు, ప్రవచనకర్తలు, దేశంలోని పలువురు ముఖ్యులు పాల్గొంటారు.ప్రతిరోజు భక్తులు స్వయంగా విశేష పూజలు నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎలాంటి రుసుము లేదని, ఎవరైనా రావచ్చని రచన టెలివిజన్ సంస్థ డైరెక్టర్ రఘు ఏలూరి తెలిపారు. దీపారాధన నిమిత్తం వత్తులు, నూనె, ప్రమిదలు వంటి పూజాద్రవ్యాలతో పాటూ ప్రసాదాలను కూడా ఉచితంగా ఏర్పాటు చేశామన్నారు. కుటుంబ సమేతంగా కోటి దీపోత్సవంలో పాల్గొనాలని ఆయన కోరారు. -
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ సదర్ సమ్మేళనం (ఫొటోలు)
-
ఎన్టీఆర్ స్టేడియంలో కొలువుదీరిన పుస్తకాలు
శని, ఆదివారాలు రెండు రోజులు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 9 గంటల వరకు పుస్తక ప్రదర్శన కొనసాగనుంది. శనివారం సాయంత్రం 6 గంటలకు ‘గద్దరన్న యాదిలో’ సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పసునూరి రవీందర్ అధ్యక్షత వహించనున్నారు. ప్రొఫెసర్ ఖాసీం, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, ఏపూరి సోమన్న, అల్లం నారాయణ, ఘంటా చక్రపాణి, యశ్పాల్, మాస్టార్జీ తదితరులు పాల్గొంటారు. 11వ తేదీ ఆదివారం సాయంత్రం ‘నేటి బాలసాహిత్యం తీరుతెన్నులు’ అనే అంశంపై సదస్సు ఉంటుంది. మణికొండ వేదకుమార్, చొక్కాపు వెంకటరమణ, డా.సి.ఎ.ప్రసాద్, డా.విఆర్.శర్మ, అమరవాది నీరజ, దుర్గం బైతి, పెందోట వెంకటేశ్వర్లు పాల్గొంటారు. సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో పుస్తకాలు కొలువుదీరాయి. 36వ హైదరాబాద్ జాతీయ పుస్తక మహోత్సవానికి తరలివచ్చాయి. శుక్రవారం సాయంత్రం పుస్తక ప్రదర్శనను ప్రముఖ రచయిత, ఇంటినే గ్రంథాలయంగా మార్చుకున్న పుస్తక మహోద్యమకారుడు పద్మశ్రీ డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పుస్తకమే మనిషిని పరిపూర్ణం చేస్తుందన్నారు. పుస్తక ప్రదర్శన వేదికకు, ప్రాంగణానికి ప్రజాగాయకుడు గద్దర్, ఆచార్య రవ్వా శ్రీహరిల పేర్లు పెట్టడం అభినందనీయమన్నారు. పుస్తకమే వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుందని, పుస్తకాలు బాగా చదివిన వాళ్లే మహాత్ములయ్యారని చెప్పారు. తాను ఏర్పాటు చేసిన గ్రంథాలయంలో 2 లక్షలకు పైగా పుస్తకాలు ఉన్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ, పుస్తకమే ప్రపంచాన్ని ఏలుతోందన్నారు. అక్షరానికి మరణం లేదని చెప్పారు. పుస్తక ప్రదర్శన కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందజేస్తోందని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సీనియర్ పాత్రికేయులు శ్రీనివాస్‌రెడ్డి, కె.శ్రీనివాస్, సుధా భాస్కర్, ‘వీక్షణం’ వేణుగోపాల్, గద్దర్ కూతురు వెన్నెల తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం మంత్రి జూపల్లి కృష్ణారావు బుక్‌ఫెయిర్ ప్రాంగణంలో తెలంగాణ అమరుల స్తూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సకల రుగ్మతలకు విరుగుడు పుస్తక పఠనమేనని పేర్కొన్నారు. విభిన్న రంగాలపై అరుదైన గ్రంథాలు బుక్ఫెయిర్లో ఈసారి 365 స్టాళ్లను ఏర్పాటు చేశారు. విభిన్న రంగాలకు చెందిన లక్షలాది పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. జాతీయ స్థాయిలో పేరొందిన పలు ప్రచురణ సంస్థలు సరికొత్త పుస్తకాలను అందుబాటులోకి తెచ్చాయి. రచయితలు తాము రాసిన పుస్తకాలను స్వయంగా విక్రయించేందుకు ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేశారు. సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్లు, స్మార్ట్ఫోన్లు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలోనూ పుస్తకానికి ఏ మాత్రం ఆదరణ తగ్గలేదనేందుకు నిదర్శనంగా ప్రదర్శన ప్రారంభమైన మొదటి రోజే వేలాది మంది పుస్తకప్రియులు, సందర్శకులు తరలి వచ్చారు. బాలల సాహిత్యం, ఆధ్యాత్మికం, వ్యక్తిత్వ వికాసం, వైద్యం, ఆరోగ్యం, ఆయుర్వేదం, హోమియో వంటి వివిధ రంగాలకు చెందిన పుస్తకాలతో పాటు, చరిత్ర, సాహిత్యం, ప్రముఖుల జీవిత చరిత్రలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. మరోవైపు మాజీ ప్రధాని పీవీకి శుక్రవారం కేంద్రం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో పలువురు యువతీ యువకులు ఆయన పుస్తకాలను కొనుగోలు చేశారు. ఆయన రాసిన పుస్తకాలు, ఆయనపై వెలువడినవి రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ స్టాల్లో అందుబాటులో ఉన్నాయి. రైటర్స్ స్టాల్లో ‘రుద్ర ప్రయాగ చిరుతపులి’ వివిధ భాషల్లో ఇప్పటికే కోటికి పైగా అమ్ముడైన జిమ్‌కార్బెట్ రాసిన ‘ది మ్యాన్ ఈటింగ్ లియోపార్డ్ ఆఫ్ రుద్రప్రయాగ్’ పుస్తకం తెలుగులో ‘రుద్ర ప్రయాగ చిరుతపులి’గా వెలువడింది. అనేక సంవత్సరాలుగా తెలుగు పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ పుస్తకాన్ని 356– 360 స్టాళ్లలో అందుబాటులో ఉంచారు. -
‘చదువరి చెంతకు పుస్తకం’.. ప్రారంభం కానున్న జాతియ పుస్తక ప్రదర్శన!
సాక్షి, సిటీబ్యూరో: పుస్తక ప్రియులకు పండగే. చదువరులకు ఇక వరమే. ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన వచ్చేసింది. ఏటా డిసెంబర్ చివరి 10 రోజుల పాటు నిర్వహించే ప్రదర్శన ఈసారి ఎన్నికలు, ఇతరత్రా కారణాలతో రెండు నెలలు ఆలస్యమైంది. నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం పుస్తక ప్రదర్శన ప్రారంభం కానుంది. ఈ నెల 19 తేదీ వరకు కొనసాగనుంది. ‘చదువరి చెంతకు పుస్తకం’అనే లక్ష్యంతో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ గత ఏడేళ్లుగా ఈ పుస్తక ప్రదర్శనను నిర్వహిస్తోంది. ఏటా 6 నుంచి 7 లక్షల మందికి పైగా పుస్తకప్రియులు ప్రదర్శనలో పాల్గొంటున్నారు. నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలతో పాటు చరిత్ర, సామాజిక, తత్వ శాస్త్రాలు, విజ్ఞాన గ్రంథాలకు పాఠకాదరణ పెరిగింది. మరోవైపు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం కొన్ని ప్రచురణ సంస్థలు ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా పుస్తకాలను ముద్రించి అందుబాటులోకి తెస్తున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పుస్తకాలకు ఆదరణ పెరిగిందని పలు సర్వేలు పేర్కొంటున్నాయి. కోల్‌కతాలో గత జనవరిలో నిర్వహించిన పుస్తక ప్రదర్శనలో సుమారు 29 లక్షల మంది పాల్గొన్నట్లు అంచనా. హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు సైతం ప్రతి సంవత్సరం పాఠకుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఏటా లక్షలాది పుస్తకాలు అమ్ముడవుతున్నాయి. డిజిటల్ మీడియా వెల్లువలోనూ.. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వెల్లువలోనూ పుస్తకానికి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ‘సామాజిక చింతనకు, ప్రాపంచిక దృక్పథాన్ని అలవర్చుకొనేందుకు సాహిత్య అధ్యయనం ఒకటే మార్గం. సాహిత్యాన్ని జీవితంలో భాగంగా చేసుకున్నవాళ్లే గొప్ప విజేతలుగా నిలుస్తారు. అలాంటి అభిరుచి కలిగిన పాఠకులు కోట్లాది మంది ఉన్నారు’ అని హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అభిప్రాయపడ్డారు. సామాజిక మాధ్యమాలు ఉద్ధృతంగా వెల్లువెత్తినా గత ఏడేళ్లుగా పుస్తక ప్రదర్శనలు విజయవంతంగా కొనసాగడం, లక్షలాది పుస్తకాలు అమ్ముడు కావడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. మరోవైపు ప్రతి సంవత్సరం వందల కొద్దీ కొత్త పుస్తకాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. పుస్తక ప్రదర్శన స్ఫూర్తితో ఎంతోమంది రచయితలు తమ సృజనాత్మకతకు పదును పెట్టుకుంటున్నారు. ఈసారి పుస్తక ప్రదర్శనలో సదస్సులు, చర్చలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. కవులు, రచయితలు, కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సంవత్సరం 365 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వందలాది పుస్తక ప్రచురణ సంస్థలు ప్రదర్శనలో పాల్గొననున్నాయి. పిల్లలకు ప్రత్యేక పోటీలు.. బాల వికాస్ కార్యక్రమాల్లో భాగంగా పిల్లలకు వివిధ అంశాలలో పోటీలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోటీలు ఉంటాయి. జానపద నృత్యాలు, ఫ్యాన్సీడ్రెస్ పోటీలు, క్విజ్, మాట్లాడే బొమ్మ, పిల్లల గ్రంథాలయాల ఆవశ్యకతపై చర్చ, హస్తకళల వర్క్‌షాపు, గ్రూప్‌డ్యాన్స్, సోలోడ్యాన్స్, పాటలు, పద్యాలు, పెయింటింగ్, స్టోరీ టెల్టింగ్ తదితర అంశాలలో పోటీలు నిర్వహించనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రవేశం ఉచితం. ఇతరులకు ప్రవేశ రుసుము రూ.10. పుస్తక మహోత్సవంలో భాగంగా సాంస్కృతిక, కళా రూపాలను ప్రదర్శించనున్నారు. పుస్తక ప్రదర్శన ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8.30 గంటల వరకు, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. -
హైదరాబాద్ : కోటి దీపోత్సవం కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ (ఫొటోలు)
-
హైదరాబాద్ : కన్నుల పండుగగా ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం (ఫొటోలు)
-
హైదరాబాద్ : ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా కోటి దీపోత్సవం (ఫొటోలు)
-
హైదరాబాద్ లో శ్రీవారి వైభవోత్సవాలు...!
-
Hyderabad Book Fair 2022: పుస్తకం పులకిస్తోంది..!
ఆదివారం సెలవు రోజు.. ఆ ప్రాంగణం కిటకిటలాడింది.. టికెట్ కౌంటర్ల వద్ద అభిమానులు బారులు తీరారు.. టికెట్ పొంది లోనికి వెళ్లాలన్న ఆత్రుత వారిలో కనిపించింది.. ప్రదర్శన పూర్తయ్యాక ఎంతో సంతృప్తితో వెనుదిరిగారు. ఇది అవతార్ సినిమా థియేటర్ల ముందు సందడి కాదు. ఎన్టీయార్ స్టేడియంలో కొలువుదీరిన హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనను ఆదివారం 70 వేల మంది ప్రదర్శనను తిలకించారన్నది నిర్వాహకుల మాట. సాక్షి, హైదరాబాద్: చేతిలో సెల్‌ఫోన్ తప్ప పుస్తకం పట్టరంటూ నేటి తరంపై పెదవి విరుపులు ఎన్నో.. కొత్త పుస్తకాలు అచ్చు వేయడం, అచ్చేసిన పుస్తక విక్రయాలు పలచగా ఉండటం రచయితలకు నీరసాన్నిస్తోంది. పేజీలు తిప్పుతూ, కుదురుగా ఓ చోట కూర్చుని పుస్తకాలు చదివే అలవాటు వేగంగా తగ్గిపోతోందని ఎంతోమంది పుస్తక ప్రియుల నిట్టూర్పులు నిత్యం వింటూంటాం.. ఇవన్నీ నిత్యసత్యాలే. కానీ ఓసారి నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలోకి వచ్చి హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన ప్రాంగణాన్ని తిలకిస్తే మాత్రం పుస్తకానికి మళ్లీ మంచిరోజు వస్తోందా అన్న భావన కలగకమానదు. చిన్నారులు, యువకులు, నడి వయసు వారు, వృద్ధులు.. ఇలా తండోపతండాలుగా వచ్చి స్టాళ్లన్నీ కలియతిరిగి నచ్చిన పుస్తకాలను పట్టుకుని సంబరంగా వెళ్తున్నారు. కోల్‌కతా పుస్తక ప్రదర్శన తర్వాత జాతీయ స్థాయిలో అంత కీర్తిని మూటగట్టుకున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ 35వ ప్రదర్శన ఇప్పుడు విజయవంతంగా సాగుతోంది. నోట్ల రద్దు గందరగోళం ఉన్న తరుణంలో, కోవిడ్ భయాందోళనలు కొనసాగిన సమయంలోనూ సాగిన ఈ బుక్ ఫెయిర్ ఇప్పుడు.. పుస్తక ప్రియుల కోలాహలం మధ్య సందడిగా సాగుతోంది. ఇటు పుస్తకాలు, అటు చర్చాగోష్ఠులు, బయట జనం కోసం తినుబండారాల దుకాణాలు.. వెరసి ఆ ప్రాంతం జాతరను తలపిస్తోంది. అవీ ఇవీ.. ►ఈసారి పుస్తకప్రదర్శనలో 340 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రాంతీయ, జాతీయ స్థాయి కేంద్రాలున్నాయి. ►ఆధ్యాత్మికం మొదలు ఆటల వరకు జానపదం మొదలు అంతర్జాతీయ విషయాల వరకు ఇలా అన్ని రంగాల పుస్తకాలు కొలువుదీరాయి. ►పోటీ పరీక్షలకు ఉపయోగపడే వాటితోపాటు కాలం తెలియకుండా కొత్త ప్రపంచంలో ఓలలాడించే నవలలు, కులమత సాహిత్యం, అట్లాసులు, పంచాంగాలు.. ఇలా సర్వం అక్కడ సిద్ధంగా ఉన్నాయి. ►ఈసారి 8 రాష్ట్రాల నుంచి పబ్లిషర్స్ వచ్చి స్టాళ్లు ఏర్పాటు చేసుకున్నారు. గతంలో ఎన్నడూ ఇన్ని రాష్ట్రాల నుంచి రాలేదు. ►రచయితలు నేరుగా వారే తమ పుస్తకాలను పరిచయం చేసుకునేందుకు రైటర్స్ హాల్.. పేరుతో ప్రత్యేకంగా ఓ వేదిక ఏర్పాటు చేశారు. ►తెలుగు రచయితలకు రెండు స్టాళ్లు ఏర్పాటు చేశారు. వీటిల్లో స్థానిక రచయితల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రదర్శనకు రాలేకపోయిన జాతీయస్థాయి రచయితలు పలువురు వారి పుస్తకాలను పంపారు. వాటిని నిర్వాహకులే పుస్తక ప్రియుల ముందుంచి అమ్మిస్తున్నారు. ఆ డబ్బును రచయితలకు పంపుతామని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ►తెలంగాణ సీఎం కేసీఆర్‌పై పలువురు రచయితలు రాసిన పుస్తకాల ప్రదర్శనకు ప్రత్యేకంగా ‘మన ముఖ్యమంత్రి స్టాల్’ఏర్పాటు చేశారు. ఇందులో 24 రచనలున్నాయి. బాల్య స్నేహితులతో కలిసి వచ్చి..: వెంకటేశ్వరరావు ఓ ప్రైవేటు కంపెనీలో విభాగాధిపతిగా పనిచేస్తున్న విజయవాడకు చెందిన వెంకటేశ్వరరావు తన బాల్యమిత్రులతో కలిసి ఈ ప్రదర్శనకు వచ్చారు. నలుగురు మిత్రులు ముందే కావాల్సిన పుస్తక జాబితాతో వచ్చి వాటికోసం స్టాళ్లలో వెతికారు. కోరుకున్నవే కాకుండా, గతంలో చాలా ప్రాంతాల్లో దొరకని పుస్తకాలు కూడా లభించటంతో కొని మురిసిపోయారు. ‘పద్యం ఉంటేనే పుస్తకం చదవాలన్న ఆసక్తి నాలో కలుగుతుంది. ఆధునిక కాలంలో అలనాటి సాహిత్యం మరుగునపడొద్దని ఏరికోరి ఆ పుస్తకాలు చదువుతాను. ఇప్పుడలాంటి ఎన్నో పాత రచనలు సమీకరించాను’అని వెంకటేశ్వరరావు సంబరంగా చెప్పారు. పెద్ద బాలశిక్షా సంబరపడుతోంది.. ‘పెడదారి పడుతున్న ఈ సమాజానికి సంస్కారం అబ్బాలంటే పెద్ద బాలశిక్ష చదివించాలి’ అంటూ ఓ సినీ పాత్ర గంభీరంగా చెబుతుంది. పెద్దబాలశిక్ష అంటూ ఓ పుస్తకం కూడా ఉంటుందా అంటూ ఈ తరం ఆశ్చర్యపోతుంది. కానీ ఈ పుస్తక ప్రదర్శనలో పెద్దబాల శిక్ష నిజంగా మురిసిపోతోంది. ‘‘మా స్టాల్లో రోజుకు 40కి తగ్గకుండా పెద్దబాలశిక్ష పుస్తకాలు అమ్ముడవుతున్నాయి. ఇతర స్టాళ్లలోనూ వాటికి మంచి ఆదరణ ఉంది.’అని ఆనందంగా చెప్తున్నారు. – శ్యామల, అన్నపూర్ణ పబ్లిషర్స్ స్పందన గొప్పగా ఉంది జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌కు ఈసారి మరింత ఆదరణ కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రచురణ కర్త లు వారి రచనలతో పుస్తకప్రియుల ముందుకొచ్చారు. నేరుగా వారితో మాట్లాడుతూ పుస్తకాలు విక్రయిస్తున్నారు. కానీ, రచయితలే నేరుగా కొనుగోలుదారులతో మాట్లాడుతుండటం, ఆయా పుస్తకాల ప్రత్యేకతలను చర్చాగోష్ఠుల్లో వివరిస్తుండటం కొత్త అనుభూతిని పంచుతోంది. ప్రదర్శనకు ఈ నాలుగు రోజుల్లో 3 లక్షల మందివచ్చి ఉంటారని అంచనా. – కోయ చంద్రమోహన్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షుడు -
హైదరాబాద్ లో 35వ నేషనల్ బుక్ ఫెయిర్
-
Hyderabad Book Fair : ఎన్టీఆర్ స్టేడియంలో పుసక్త ప్రియుల సందడి (ఫొటోలు)
-
హైదరాబాద్ పుస్తకాల పండుగ.. నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం (ఫొటోలు)
-
Hyderabad Book Fair 2022: హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఎప్పటి నుంచి అంటే?
సాక్షి, హైదరాబాద్: దేశంలోని వివిధ రకాల సాహిత్యాన్ని ఏటా ఒక్కచోటకు తెచ్చే హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన మరోసారి పుస్తకప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 22 నుంచి జనవరి ఒకటి వరకు 35వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఎన్టీఆర్ స్టేడియంలో జరగనుంది. కోవిడ్ దృష్ట్యా సందర్శకుల ఆదరణ పెద్దగా ఉండదన్న ఉద్దేశంతో నిర్వాహకులు గతేడాది 260 స్టాళ్లనే ఏర్పాటు చేసినప్పటికీ పుస్తకప్రియులు భారీగా తరలిరావడంతో ప్రదర్శన విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ఈసారి 320 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఉపాధ్యక్షుడు కోయ చంద్రమోహన్ తెలిపారు. అంచెలంచెలుగా... నగరంలో నిజాంల కాలం నుంచే పుస్తకాలకు ఆదరణ ఉంది. అధికార భాష ఉర్దూతోపాటు తెలుగు, మరాఠీ, కన్నడ, హిందీ ఇంగ్లిష్ పుస్తకాలు చదివే ప్రజలు మొదటి నుంచీ ఇక్కడ ఉన్నారు. పాఠకుల అభిరుచికి తగిన విధంగానే పుస్తక ప్రచురణ సంస్థలు ఆవిర్భవించాయి. కోఠిలోని బడీచౌడీ పుస్తక బజార్‌గా వెలుగొందింది. అక్కడి పుస్తక విక్రేతలే హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా పుస్తక పఠనాన్ని పెంచే లక్ష్యంతో ఆవిర్భవించిన నేషనల్ బుక్ ట్రస్ట్ నగరంలోని పుస్తక ప్రచురణ సంస్థలు, విక్రయ సంస్థలతో కలసి 1986లో ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ను తొలిసారి కేశవ మెమోరియల్ స్కూల్ మెదానంలో ఏర్పాటు చేసింది. ఆ తరువాత నిజాం కళాశాల మైదానం, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం, నెక్లెస్‌రోడ్ తదితర ప్రాంతాల్లో పుస్తక ప్రదర్శనలు జరిగాయి. కథలు, నవలలు, గల్పికలు, చరిత్ర గ్రంథాలదే పుస్తక ప్రదర్శనల తొలినాళ్లలో అగ్రస్థానం. సోవియెట్ సాహిత్యం కూడా పాఠకులను బాగా ప్రభావితం చేసింది. క్రమంగా ప్రముఖుల జీవిత చరిత్రలు, పంచతంత్ర వంటి పిల్లల పుస్తకాలు ఆదరణ పొందాయి. అలాగే యోగా, ఆయుర్వేద, హోమియో వైద్య పుస్తకాలు సైతం బాగా అమ్ముడవుతున్నాయి. ఇటీవల కాలంలో పోటీపరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్ధులకు అవసరమయ్యే స్టడీ మెటీరియల్‌కు డిమాండ్ బాగా పెరిగింది. ఈ ఏడాది కూడా విభిన్న రంగాలకు చెందిన పుస్తకాలను ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
Hyderabad Book Fair 2023: పుస్తకాల రుతువు
ఆ నల్లటి వరుస కట్టిన అక్షరాల వెంట అక్షువులతో వెంబడిస్తే గుత్తులుగా కాసిన మామిడి పండ్ల చెట్టు కింద అశ్వాన్ని వదిలి సేదతీరుతున్న రాకుమారుడు కనిపిస్తాడు. కొమ్మపై కూచున్న జంట పక్షులు ఏవో అతనికి తెలియాల్సిన రహస్యం మరికాసేపట్లో చెవిన ఊదుతాయి. నల్లటి వరుస కట్టిన ఆ పంక్తుల వెంట పరిగెడితే కొత్త పెళ్లికూతురిని శోభనం రాత్రి చంపడమే వ్రతంగా పెట్టుకున్న రాకుమారుడు ఆ పెళ్లికూతురు మొదలెట్టిన గొలుసు కథల్లో గుడ్లు తేలేసి వ్రతం మరిచి ‘ఆ తర్వాత?’ అనే ప్రశ్నతో జీవితాంతం బతుకు వెళ్లమార్చడం చూస్తాము. కాగితం మీద వరుస కట్టిన పంక్తులు రాముడు కానలకు వెళ్లాక కౌసల్య పడిన శోకమెట్టిదన్న ఆలోచనను ఇస్తాయి. బోధిచెట్టు కింద దేహాన్ని క్షోభ పెట్టుకుంటున్న సిద్ధార్థుని సాక్షాత్కారం కోసం వేచి చూడమంటాయి. కరకు పళ్లు దిగబడి కాలి విముక్తి కోసం ఘీంకారం చేస్తున్న గజేంద్రుని మోక్షానికి శంఖు చక్రాలు వదిలి శ్రీ మహావిష్ణువును పరిగెత్తమంటాయి. రామలింగడు ఈ పంక్తులు పలకడానికే అంబ ఇచ్చిన ఒక చేతి పాలు, మరో చేతి పెరుగును కలిపి గొంతులోకి ఒంపుకున్న వైనం చెబుతాయి. పుటలు కొన్ని శ్రీనాథుని పల్లకీ మోస్తాయి. పుటలు కొన్ని పేదవాడి తెల్లని నవ్వును మల్లెలుగా విరబూస్తాయి. పుటల నిండా వీరుని ధీరకంపనం... వనిత దీక్షా కంకణం... పసిపిల్లల కేరింతలు... యువతీ యువకుల సల్లాపాలు... కన్నీటి ఉప్పదనం... త్యాగపు శౌర్యము... భీరువు ఆక్రందన... ఆలోచనల అలజడి... తేజోమూర్తి జీవన సందేశము. ఒక దేశ ‘తలసరి ఆదాయం’ ఎలా గణిస్తారోగాని ఒక దేశ ‘తలసరి సంస్కారం’ సగటున ఆ దేశపౌరుడు చదివిన పుస్తకాల సంఖ్యను బట్టి అవి ఎలాంటి పుస్తకాలన్న నాణ్యతను బట్టి గణించాలి. ఆహార కొరత వస్తేనో, విదేశీ మారకద్రవ్యం అడుగంటితేనో, ద్రవ్యోల్బణం విజృంభిస్తేనో మాత్రమే ఆ దేశం ప్రమాదంలో పడినట్టు కాదు. ఏ దేశ ప్రజలైతే నిజంగా పుస్తకాలు చదవడం మానేస్తారో, ఇంట పుస్తకాల అల్మారా లేకుండా జీవిస్తారో, ‘పుస్తకమా అది ఏమి’ అని ఫోన్ స్క్రీన్‌లో తల కూరుస్తారో ఆ దేశం నిజంగా ప్రమాదంలో పడినట్టు! వస్తు ప్రపంచం కంటే పుస్తక ప్రపంచం మేలైనది. ఇంట టివి, ఫ్రిజ్జు, కారు, ఐఫోన్ ఎన్ని కొన్నా మరోటేదో కావాలన్న అత్యాశను, పేడలో పడవేసే పేరాశను కలిగిస్తాయి. పుస్తకాలు? నీ పాదాలకు లేపనం రాసి హిమానీనదాల వరకూ తీసుకెళతాయి. నీ చీకటి కవాటాలను తెరిచి వెలుతురు వాకిళ్ల ఎదుట నిలబెడతాయి. నీ మూఢవిశ్వాసాలకు నువ్వే నవ్వుకునేలా చేస్తాయి. చైతన్యాన్ని కలిగించి నీ నిజస్థితి మీద అంచనా కట్టిస్తాయి. ద్వేషంతో, హైన్యంతో, వ్యవస్థీకృత దుర్లక్షణాలతో బతకాలన్న నీ పట్టుదలను అవి హరిస్తాయి. పుస్తకాలు నిన్ను పెట్రోలు కొట్టించమనవు. ఫుడ్డు ఆర్డర్ పెట్టమనవు. విలాసాలు అమేజాన్ చేయమనవు. అవి కోరేదల్లా తెరిచి చదవమనే! రెండు రాష్ట్రాల్లో 9 కోట్ల తెలుగు జనాభా. ఏ పుస్తకమూ 500 కాపీలు అమ్ముడుపోదు. అంటే కోటికి 100 మంది కూడా పుస్తకాలు కొనరు. సినిమా హీరోల కొరకు టికెట్టు రికార్డు స్థాయిలో కొంటారు. ‘నెక్ట్స్ సినిమా ఏమిటి?’ అని అడుగుతారు. ‘నువ్వు చదివిన పుస్తకం చెప్పు’ అని ఏ హీరోనీ ఎవరూ అడగరు. శ్రీమంతురాలైన సుధామూర్తి తానే శ్రీమంతులుగా భావించే ఒకరి ఇంటికి వెళ్లిందట. ‘అబ్బబ్బ... ఆ ఇంట మణిమాణిక్యాలు వజ్రవైఢూర్యాలు.. బంగారు సింహాసనాలు... అమూల్య కళాకృతులు... ఒక్కటే లోపం. ఒక్క పుస్తకం కనపడలేదు’ అని రాసింది. ఇలాంటి పేదరికంలో ఉన్న శ్రీమంతులు మనలో ఎందరు? పూర్వం తెలుగు ఇళ్లల్లో తప్పనిసరిగా ఎక్కాల పుస్తకం ఉండేది. శతకాలు ఉండేవి. పెద్ద బాలశిక్ష అయినా కనిపించేది. ఒక చిన్న గూటిలో ఇవి కూడా లేని స్థితికి తెలుగుజాతి ఎగబాకింది 10 వేల మంది తెలుగు కవులు ఉన్నారు. పక్క కవి పుస్తకం కొనరు. 5 వేల మంది తెలుగు కథకులు ఉన్నారు. పక్క రచయిత సంకలనం కొనరు. పాఠకుల మీద వంక పెడుతుంటారు. మొదట వీరే పుస్తకాలు కొనరు. రచయిత అంటే ఎవరు? సీనియర్ పాఠకుడు! మంచి కవి కావాలన్నా, మంచి కథకుడు కావాలన్నా మొదట జీవితంలో పాల్గొనాలి అనుభవం కోసం. తర్వాత పుస్తకాలు చదవాలి సాధన కోసం. జీవన స్పర్శ, పుస్తకాల సంపర్కం లేని శుష్కకవులతో, కథకులతో నిండి ఉంది నేటి మెజారిటీ తెలుగు సమాజం. ఇక మన పాఠకులు ‘మా పిల్లలు తెలుగు చదవరు’... ‘మాకు ఈ కథలు, కవిత్వం పడవు’ అంటూ ఉంటారు. నీకు రోటి పచ్చడి ఇష్టమైతే కనీసం రోటి పచ్చళ్ల మీద వచ్చిన పుస్తకమైనా కొను. ఇంట పుస్తకంగా కనపడుతూ ఉంటుంది. డిసెంబర్ 22 నుంచి జనవరి 1 వరకు హైదరాబాద్‌లో పుస్తకాల రుతువు. అంటే బుక్ ఎగ్జిబిషన్. వందలాది స్టాళ్ళు, వేలాది పుస్తకాలు, ఆవిష్కరణలు, ఉపన్యాసాలు, సాహితీకారుల దర్శనం, మిత్రుల కరచాలనం, చలిగాలుల్లో ఛాయ్‌తో చేసే కబుర్లు. తెలుగులో ఎందరో రచయితలు, కవులు, బుద్ధిజీవులు... ఈ బుక్ ఎగ్జిబిషన్‌కు తరలివచ్చే పాఠకుల మీద నమ్మకంతో కొత్త పుస్తకాలను విడుదల చేస్తున్నారు. పాత క్లాసిక్స్‌ను రీప్రింట్ చేస్తున్నారు. ‘ఈ పుస్తకాలు చదివి ఆనందించండి, ఆస్వాదించండి, ఆలోచించండి’ అని కొమ్ముబూర ఊది మరీ మొరపెట్టుకోనున్నారు. ఈ రుతువులో పాలుపంచుకోండి. పుస్తకాల చెట్టు నీడ ప్రతి ఇంటా పడుగాక! -
హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన.. పూర్తి వివరాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత హైదరాబాద్ బుక్ ఫెయిర్ జాతీయ స్థాయి పుస్తక ప్రదర్శనగా ఎదిగిందని సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఈనెల 22వ తేదీ నుంచి జనవరి 1 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ పుస్తక ప్రదర్శనను నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, మాజీ మంత్రి జోగు రామన్న, బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షుడు కోయ చంద్రమోహన్ తదితరులు మంగళవారం మంత్రిని కలిశారు. పుస్తక ప్రదర్శనకు తెలంగాణ కళా భారతి (ఎన్టీఆర్) స్టేడియంలో అనుమతివ్వాల్సిందిగా కోరారు. ఈ మేరకు మంత్రి ఉత్తర్వులు జారీచేశారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ 35 ఏళ్లుగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వహించడం అభినందనీయమన్నారు. అన్ని భాషల పుస్తకాలతో పాటు తెలుగు భాషా సంస్కృతి, తెలంగాణ చరిత్రకు సంబంధించిన పుస్తకాలు, దేశవ్యాప్తంగా 300 లకుపైగా పబ్లిషర్స్ రావడంతో ఇది జాతీయ పుస్తక ప్రదర్శనగా మారిందని తెలిపారు. (క్లిక్ చేయండి: ‘తానా’ అంతర్జాతీయ కార్టూన్ పోటీ.. విజేతలకు రూ. లక్ష నగదు) -
హైదరాబాద్ : ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం (ఫొటోలు)
-
హైదరాబాద్ : ఎన్టీఆర్ స్టేడియంలో వైభవంగా కోటి దీపోత్సవం (ఫొటోలు)
-
Photos : ఎన్టీఆర్ స్టేడియంలో కనుల పండువగా శ్రీవారి వైభవోత్సవాలు..
-
హైదరాబాద్ : ఎన్టీఆర్ స్టేడియంలో శోభాయమానంగా శ్రీవారి వైభవోత్సవాలు (ఫొటోలు)
-
Hyderabad: ఎన్టీఆర్ స్టేడియంలో వేడుకగా వెంకన్న వైభవోత్సవాలు (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో శ్రీవారి వైభవోత్సవాలు.. తరలివచ్చిన భక్తులు
సాక్షి, హైదరాబాద్: శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు మంగళవారం ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీనివాస కల్యాణం, శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవ ప్రాజెక్ట్ తిరుపతి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న వైభవోత్సవాలు 15వ తేదీ వరకు కొనసాగుతాయి. తిరుపతికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోలేని భక్తుల కోసం టీటీడీ నగరంలో వెంకటేశ్వర స్వామి మహోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో ప్రతి రోజు పది వేల మంది దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వర్షాల కారణంగా భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైభవోత్సవాలను ప్రచారం చేసేందుకు తిరుమల తిరుపతి నుంచి ప్రత్యేకంగా రూపొందించిన శ్రీ వెంకటేశ్వర స్వామి రథం నగరానికి వచ్చింది. అంతేకాకుండా ఇక్కడే లడ్డూలు తయారు చేసి భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. గోపూజ చేసిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తిరుపతికి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేని భక్తుల సౌకర్యార్థం ఎన్టిఆర్ స్టేడియంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఎన్టిఆర్ స్టేడియం ప్రాంగణంలో గోపూజ నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించి శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాల ప్రచార రధాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుపతికి వెళ్లి స్వామి వారిని దర్శించుకోలేని వారికోసం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నగరానికి తరలిరావడం ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. కార్యక్రమంలో నిర్వహకులు ముప్పవరపు హర్షవర్ధన్, బి.సుబ్బారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలివీ.. ఎన్టీఆర్ స్టేడియంలో 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగే రోజు వారి పూజా కార్యక్రమాలు 11న ఉదయం 6 గంటలకు సుప్రభాతం, 6.30 నుంచి 7.30 గంటల వరకు తోమాల సేవ, కొలుపు, అర్చన, 7.30 నుంచి 8.15 వరకు నివేదన, 8.15 నుంచి 8.30 వరకు పాద పద్మారాదన, ఉదయం 8.30 నుంచి 9.30 వరకు రెండో నివేదన, 9.30 నుంచి 10 గంటల వరకు వసంతోత్సవం, వీధి ఉత్సవం, ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు సర్వదర్శనం, సహస్ర దీపాలంకరణ సేవ సాయంత్రం 5.30 గంటల నుచి 6.30 వరకు, వీధి ఉత్సవం సాయంత్రం 6.30 నుంచి 7.30 వరకు, రాత్రి కైంకర్యం రాత్రి 7.30 నుంచి 8.30 వరకు, ఏకాంత సేవ రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు జరుగుతాయి. 15న... 15వ తేదీన ఉదయం ఆరు గంటలకు సుప్రభాతం, ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు తోమాల సేవ, కోలుపు, అర్చన 7.30 నుంచి 8.15, నివేదన 8.15 నుంచి 8.30 వరకు, పాదపద్మారాధన, ఉదయం 8.30 నుంచి 10.30 వరకు, పుష్పయాగం, రెండవ నివేదన 10.30 నుంచి 11 గంటల వరకు, సర్వదర్శనం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు, సహస్రదీపాలంకరణ సేవ, సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 వరకు శ్రీనివాస కళ్యాణం, సాయంత్రం 6.30నుంచి 8.30 వరకు తోమాల సేవ అర్చన, నివేధన రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకు జరుగుతాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హైదరాబాద్ : ఈనెల 11 నుంచి 15 వ తేదీ వరకు శ్రీవారి వైభవోత్సవాలు