విద్యార్థులు చదువుపాటు క్రీడల్లో రాణించాలని కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవపెద్ది శశివర్దన్‌రెడ్డి సూచించారు.
= కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ శశివర్దన్‌రెడ్డి
= టీ-20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
మహబూబాబాద్,న్యూస్‌లైన్ : విద్యార్థులు చదువుపాటు క్రీడల్లో రాణించాలని కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవపెద్ది శశివర్దన్‌రెడ్డి సూచించారు. మానుకోట ప్రీమియర్ లీగ్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్‌టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న టీ-20 క్రికెట్ టోర్నమెంట్‌ను ఆదివారం శశివర్దన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. క్రీడల్లో రాణించిన వారికి స్పోర్ట్స్ కోటల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలన్నారు.
క్రీడల్లో గెలుపోటములు సహజమేనని, ఆ విషయాన్ని క్రీడాకారులు గుర్తుంచుకోవాలన్నారు. క్రీడల్లో ప్రతిభను కనపరిచిన క్రీడాకారుడికి తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. కార్యక్రమంలో స్పీడ్‌బాల్ తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ బొడ్డుపల్లి ఉపేందర్, ఫిజికల్ డెరైక్టర్ రామన్న, జేఏసీ డివిజన్ కోకన్వీనర్ ఎండీ.ఫరీద్, టోర్నమెంట్ ఆర్గనైజర్లు దేశబోయిన శ్రీనివాస్, మెతుకు కుమారస్వామి, సయ్యద్ జాకీర్, క్రీడాకారులు పాల్గొన్నారు.
మానుకోటపై హైదరాబాద్ విజయం
తొలిమ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 23 పరుగుల తేడాతో మానుకోటపై విజయం సాధించింది. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బ్యాటింగ్‌ను ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టానికి 167 పరుగులు చేసింది. బ్యాట్స్‌మన్ పాండే 62 పరుగులు చేసి జట్టు విజయానికి కీలకపాత్ర పోషించాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన మానుకోట జట్టు 144 పరుగులు చేసి ఓటమి పాలైంది. బౌలర్ దేశబోయిన శ్రీనివాస్ మూడు వికెట్లు తీసి హైదరాబాద్ జట్టును ఇరకాటంలో పెట్టారు. బ్యాట్స్‌మన్ ఎం.చైతన్య 30 పరుగులు చేసినా జట్టు ఓటమి నుంచి తప్పించలేక పోయాడు.