పంజగుట్ట: ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ పుస్తక ప్రదర్శన (హైదరాబాద్ బుక్ ఫెయిర్)ను ఈ నెల 23 నుంచి జనవరి 1 వరకు తెలంగాణ కళాభారతి (ఎన్‌టీఆర్ స్టేడియం) లో నిర్వహించనున్నటు హెచ్‌బీఎఫ్ అధ్యక్షుడు జూలూరి గౌరీ శంకర్ తెలిపారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుక్ ఫెయిర్ వివరాలను ఆయన వెల్లడించారు. ఈసారి ప్రదర్శనలో 330 స్టాళ్లు ఉంటాయని, దేశ విదేశాలకు చెందిన పబ్లిషర్స్ పాల్గొంటారన్నారు.
సెలవు దినాల్లో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 వరకు, పనిదినాల్లో మధ్యాహ్నం 2:30 నుంచి 8:30 వరకు ఫెయిర్ జరుగుతుందని తెలిపారు. ప్రదర్శన ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిధిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు, జర్నలిస్టులకు ప్రవేశం ఉచితమన్నారు. పిల్లలకు బాలమేళ కార్యక్రమంలో భాగంగా ఫ్యాన్సీ డ్రెస్, మిమిక్రీ, చిత్రలేఖనం, ఒక్క నిమిషం తెలుగు, బాల కవి సమ్మెళనం, మ్యూజిక్ మసాల, బృంద నృత్య పోటీలు, పాటల పోటీలు (సోలో), వ్యాసరచన, కథలు చెప్పడం, రాయడం, వినూత్న కళాప్రదర్శన, సైన్స్‌తో మనం, మాట్లాడే బొమ్మ వర్క్‌షాప్ ఇలా ప్రతిరోజు పోటీలు నిర్వహిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment