‘పవన్ కల్యాణ్ హటావో’ పుస్తక రచయితకు పోలీస్ భద్రత | 'Pawan Kalyan Hatao, Politics Bachao' Book Released | Sakshi
Sakshi News home page

‘పవన్ కల్యాణ్ హటావో’ పుస్తక రచయితకు పోలీస్ భద్రత

Published Fri, Dec 18 2015 2:38 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

‘పవన్ కల్యాణ్ హటావో’ పుస్తక రచయితకు పోలీస్ భద్రత - Sakshi

‘పవన్ కల్యాణ్ హటావో’ పుస్తక రచయితకు పోలీస్ భద్రత

సాక్షి, హైదరాబాద్: ‘పవన్ కల్యాణ్ హటావో.. పాలిటిక్స్ బచావో’ పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్‌కు ప్రభుత్వం పోలీస్ భద్రతను కల్పించింది. శుక్రవారం నుంచి ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో స్టాల్ నంబర్ 306లో ఆయన రాసిన పుస్తకాన్ని విక్రయించనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌తో పాటు ఆయన అభిమానుల నుంచి ముప్పు పొంచి ఉందని గురువారం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలసి వినతి పత్రం అందజేశారు.

తనకు పోలీస్ భద్రత కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శ్రీనివాస్‌కు భద్రత కల్పించాల్సిందిగా  హోం మంత్రి నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. పవన్‌కల్యాణ్ రాజకీయాల్లోకి రాక ముందు, వచ్చాక వివిధ సందర్భాల్లో ఆయన వ్యవహరించిన తీరును ఈ పుస్తకంలో వివరించానని శ్రీనివాస్ విలేకరులకు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement