కవాడిగూడ, న్యూస్‌లైన్: నేషనల్ బుక్ ట్రస్టు ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పుస్తక మేళాకు విశేష స్పందన వస్తోంది. ఆదివారం ఒక్క రోజే 20 వేల మందికి పైగా సందర్శించి నట్టు బుక్‌ఫెయిర్ ఇన్‌చార్జి పి.మోహన్ తెలిపా రు. ఎక్కువగా అకడమిక్, కథల పుస్తకాలు అమ్ముడుపోయాయన్నారు. వీటి తరువాత సామాజిక, రాజకీయ పుస్తకాలకు డిమాండ్ కని పించింది. అన్నిరకాల పుస్తకాలు ఒకే చోట లభించడంపై సందర్శకులు సంతోషం వ్యక్తం చేశారు. డి.వెంకటేశ్వర్‌రావు రచించిన ‘హౌ చిల్డ్రన్ లెర్న్ అండ్ హౌ స్కూల్స్ షుడ్ టీచ్’ పుస్తకాన్ని విద్యావేత్త చుక్కా రామయ్య ఆవిష్కరించారు.
పీకాక్ క్లాసిక్స్ ఆఫర్
ఈ ఎగ్జిబిషన్‌లోని స్టాల్స్‌లో వేటికవే సాటి. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక పబ్లిషర్లు స్టా ల్స్‌లో ప్రపంచ సాహిత్యాన్ని వివిధ భాషలలో అందజేస్తున్నారు. ‘పీకాక్ క్లాసిక్స్’ ప్రపంచ భాషల్లోని ఉత్తమ సాహిత్యాన్ని తేటతెలుగు లో అందిస్తోంది. తల్లిదండ్రులు, పాఠశాలల నుంచి గత ఏడాది లభించిన ఆదరణను దృష్టి లో ఉంచుకుని ఈసారి తమ స్టాల్ (ఎ84)లో తగ్గింపు ధరలకు పుస్తకాలు విక్రయిస్తున్నట్టు సంస్థ ఎడిటర్ ఎ.గాంధీ తెలిపారు.
అన్నీ ఒకే చోట
కావల్సిన పుస్తకాల కోసం ఒక్కో దుకాణం తిరగాలి. అయినా దొరుకుతాయన్న గ్యారెంటీ ఉండదు. ఈ ఫెయిర్‌లో అన్నీ అందుబాటులో ఉన్నాయి. సమాజంలో ఇతర వ్యక్తులతో ఎలా వ్యవహరించాలో తెలిపే పుస్తకాలు బాగా నచ్చాయి. అకడమిక్‌తో పాటు కొన్ని జనరల్ పుస్తకాలు నాకు ఇక్కడ లభించాయి.
- వేదప్రియ, విద్యార్థిని
ప్రపంచ స్థాయి పుస్తకాలు
ఈ ఫెయిర్‌లో సాధారణ పుస్తకాలతో పాటు ప్రపంచ స్థాయి పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అన్ని వయసుల వారికీ అవసరమైన అన్ని రకాల బుక్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఫెయిర్ ఎంతో బాగుంది.
- లక్ష్మీప్రసాద్, సందర్శకుడు
పుస్తక మేళా కిటకిట
Published Mon, Dec 9 2013 4:06 AM | Last Updated on Sat, Sep 2 2017 1:24 AM
Advertisement