సైన్స్ సిటీకి వీడని గ్రహణం
సైన్స్ సిటీకి వీడని గ్రహణం
Published Fri, Nov 25 2016 2:25 AM | Last Updated on Mon, Sep 4 2017 9:01 PM
ఇంకా కేంద్రం వద్ద పెండింగ్
రెండున్నరేళ్లుగా కొలిక్కిరాని రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేపట్టనున్న ప్రతిష్టాత్మక సైన్స్ సిటీ ప్రాజెక్టు ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉండిపోయింది. కార్యరూపం ధరించడంలో తీవ్ర జాప్యం నెలకొంది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.140 కోట్లు కాగా, అందులో కేంద్రం వాటా రూ.66 కోట్లు, హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ) రూ.40 కోట్లు, ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యంలో మిగిలిన డబ్బును సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. 2013లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపారు. తెలంగాణ ఏర్పడ్డాక ఈ సైన్‌ససిటీ సాధనకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలు చేస్తోంది.
ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను కూడా కేంద్రానికి సమర్పించింది. ఈ ప్రతిపాదన కేంద్రం వద్ద పెండింగ్‌లో పడిపోవడంతో శాస్త్రసాంకేతిక అంశాలకు సంబంధించిన ఆయా ప్రణాళికలు ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాజెక్టు సాధన కోసం తాజాగా మళ్లీ ఢిల్లీస్థారుులో పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర విభజనకు పూర్వం 2014లో రంగారెడ్డి జిల్లా బుద్వేల్‌లో ఈ ప్రాజెక్టు స్థాపన కోసం 80 ఎకరాల స్థలాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి మళ్లీ ప్రతిపాదనలు పంపింది.
మిగతా ప్రాజెక్టులకు తలమానికంగా ఉండేలా...
ఈ ప్రాజెక్టు దేశంలోని మిగతా సైన్‌ససిటీలకు తలమానికంగా ఉండేలా ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పిల్లల్లో సైన్‌సపట్ల అవగాహన కల్పించేందుకు ఉపకరించే అనేక అంశాలను దానిలో అంతర్భాగం చేయాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. భౌతిక, రసాయన, జీవ శాస్త్రాలు, అంతరిక్ష పరిశోధన, అధునాతర రాకెట్ మోడల్స్, పవన శక్తి, భూగోళం తదితర శాస్త్ర, సాంకేతిక అంశాలతో దీనిని రూపొందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనిలో ఆయా శాస్త్ర, సాంకేతిక అంశాలకు సంబంధించిన పెవిలియన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇండోర్, ఔట్‌డోర్ ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేసి స్కూలు విద్యార్థులు, సైన్‌స, పరిశోధనపట్ల అభిరుచి ఉన్నవారిని ప్రోత్సహించేవిధంగా ఏర్పాట్లు చేయాలని ప్రతిపాదించారు.
మరిన్ని ప్రాజెక్టుల పరిస్థితి అంతే
హైదరాబాద్ పరిసరాల్లో సైన్‌ససిటీ ప్రాజెక్టుతోపాటు, 5-డీ థియేటర్ల ఏర్పాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సైన్‌స సెంటర్ల ఏర్పాటు, ప్రజోపాయో గమైన పరిశోధన, సైంటిస్ట్‌లు, అధ్యాప కులు, రీసెర్చ్ స్కాలర్లు, విద్యార్థులకు వివిధ శాస్త్ర,సాంకేతిక అంశాల్లో అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నా అవి కూడా ముందుకు సాగడం లేదు.
Advertisement