Science City project
-
‘స్థలం కేటాయిస్తే సైన్స్ సిటీ ఏర్పాటు’
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో 25 ఎకరాల స్థలం కేటాయిస్తే సైన్సు సిటీ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. బేగంపేటలోని హరిత ప్లాజాలో శనివారం జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ సమితి (దిశ) సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నగరంలో జరుగుతున్న వివిధ పథకాలను సమీక్షించారు. ఇళ్ల నిర్మాణ వివరాలను జీßæచ్ఎంసీ అధికారులను అడిగి తెలుసుకొన్నారు. త్వరగా పూర్తి చేయాలని సూచించారు. జేఎన్‌యూహెచ్ స్కీమ్‌లో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. త్వరగా అందజేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన వెల్నెస్ సెంటర్ల గురించి ప్రశ్నించగా.. 152 బస్తీ దవాఖానాలు, యుహెచ్‌సీలను వెల్నెస్ సెంటర్లుగా మార్చినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. నగరంలోని టీబీ పేషంట్లను తాను దత్తత తీసుకుంటానని మంత్రి తెలిపారు. పీఎం స్వయంనిధి, ముద్ర రుణాలు అందరికీ అందేట్లు చూడా లని బ్యాంకు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హెచ్ఎండబ్ల్యూ ఎండీ దానకిషోర్, హైదరాబాద్ కలెక్టర్ అమోయ్ కుమార్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి, సంయుక్త సంచాలకులు ఎన్.సురేందర్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: నిలబడి.. కలబడేదెలా?.. భవిష్యత్తు కార్యాచరణపై టీపీసీసీ -
సైన్స్ సిటీకి వీడని గ్రహణం
ఇంకా కేంద్రం వద్ద పెండింగ్ రెండున్నరేళ్లుగా కొలిక్కిరాని రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేపట్టనున్న ప్రతిష్టాత్మక సైన్స్ సిటీ ప్రాజెక్టు ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉండిపోయింది. కార్యరూపం ధరించడంలో తీవ్ర జాప్యం నెలకొంది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.140 కోట్లు కాగా, అందులో కేంద్రం వాటా రూ.66 కోట్లు, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) రూ.40 కోట్లు, ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యంలో మిగిలిన డబ్బును సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. 2013లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపారు. తెలంగాణ ఏర్పడ్డాక ఈ సైన్ససిటీ సాధనకు టీఆర్ఎస్ ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను కూడా కేంద్రానికి సమర్పించింది. ఈ ప్రతిపాదన కేంద్రం వద్ద పెండింగ్‌లో పడిపోవడంతో శాస్త్రసాంకేతిక అంశాలకు సంబంధించిన ఆయా ప్రణాళికలు ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాజెక్టు సాధన కోసం తాజాగా మళ్లీ ఢిల్లీస్థారుులో పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర విభజనకు పూర్వం 2014లో రంగారెడ్డి జిల్లా బుద్వేల్‌లో ఈ ప్రాజెక్టు స్థాపన కోసం 80 ఎకరాల స్థలాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి మళ్లీ ప్రతిపాదనలు పంపింది. మిగతా ప్రాజెక్టులకు తలమానికంగా ఉండేలా... ఈ ప్రాజెక్టు దేశంలోని మిగతా సైన్ససిటీలకు తలమానికంగా ఉండేలా ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పిల్లల్లో సైన్సపట్ల అవగాహన కల్పించేందుకు ఉపకరించే అనేక అంశాలను దానిలో అంతర్భాగం చేయాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. భౌతిక, రసాయన, జీవ శాస్త్రాలు, అంతరిక్ష పరిశోధన, అధునాతర రాకెట్ మోడల్స్, పవన శక్తి, భూగోళం తదితర శాస్త్ర, సాంకేతిక అంశాలతో దీనిని రూపొందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనిలో ఆయా శాస్త్ర, సాంకేతిక అంశాలకు సంబంధించిన పెవిలియన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇండోర్, ఔట్‌డోర్ ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేసి స్కూలు విద్యార్థులు, సైన్స, పరిశోధనపట్ల అభిరుచి ఉన్నవారిని ప్రోత్సహించేవిధంగా ఏర్పాట్లు చేయాలని ప్రతిపాదించారు. మరిన్ని ప్రాజెక్టుల పరిస్థితి అంతే హైదరాబాద్ పరిసరాల్లో సైన్ససిటీ ప్రాజెక్టుతోపాటు, 5-డీ థియేటర్ల ఏర్పాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సైన్స సెంటర్ల ఏర్పాటు, ప్రజోపాయో గమైన పరిశోధన, సైంటిస్ట్‌లు, అధ్యాప కులు, రీసెర్చ్ స్కాలర్లు, విద్యార్థులకు వివిధ శాస్త్ర,సాంకేతిక అంశాల్లో అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నా అవి కూడా ముందుకు సాగడం లేదు. -
రెవె‘న్యూ’... భూమంత్రం
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: వివిధ అవసరాల నిమిత్తం కేటాయించిన భూములు నిరుపయోగంగా ఉంటే వాటిని వెనక్కు తీసుకోడానికి రెవెన్యూ యంత్రాంగం సిద్ధమవుతోంది. ఏళ్ల క్రితం భూములను దఖలు పర్చినా ఆ అవసరాలకు అనుగుణంగా వినియోగించని భూముల ను స్వాధీనం చేసుకోడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం జిల్లాలో ల్యాండ్ ఆడిట్‌ను ము మ్మరంగా చేపడుతోంది. వివిధ ప్రభుత్వ శాఖ ల ఆధీనంలో వినియోగానికి దూరంగా ఉన్న భూములను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాలో పారిశ్రామిక, గృహ, పర్యాటక అవసరాల నిమిత్తం రెవెన్యూ భూములను 15 ఏళ్ల క్రితం ఏపీఐఐసీ, వుడా, హౌసింగ్, జీవీఎంసీ, టూరిజం శాఖలకు దాదాపుగా 12 వేల ఎకరాల వరకు అప్పగించారు. కొన్ని ప్రైవేటు సంస్థలకు కూడా వివిధ ప్రాజెక్టు ల ఏర్పాటు కోసం ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కేటాయించారు. కానీ ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన భూములే కాకుండా ప్రభుత్వ సంస్థలకు అప్పగించిన భూములు కూడా చాలా వరకు నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. జిల్లా లో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో ఆయా ప్రభుత్వ శాఖలకు ఇచ్చినవి చాలా వర కు కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఆక్రమణదారుల నుం చి ఆ భూములను వెనక్కు తీసుకొనేందుకు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితు లు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి నిరుపయోగ భూములు కబ్జాకు గురికాకుండా పరిరక్షించడంతో పాటు వాటిని ఇతర అవసరాలకు వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం జాతీయ స్థాయి ప్రా జెక్టులకు భూములు అవసరముంది. సైన్స్ సిటీ, ఇతర ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల కోసం భూ ములను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిరుపయోగ భూములను వాటికి కేటాయించే అవకాశాలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు సుమారుగా 2500 ఎకరాల వ రకు వివిధ శాఖల ఆధీనంలో నిరుపయోగంగా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. అలాగే ఒక అవసరం కోసం భూములు తీసుకొని వాటిని ఇతర అవసరాలకు వినియోగిస్తున్న వాటి పై కూడా దృష్టి సారించారు. మరో రెండు వారాల్లో ల్యాం డ్ ఆడిట్ పూర్తవుతుంది. అనంతరం ప్రభుత్వ శాఖలతో పాటు ప్రైవేటు సంస్థల ఆధీనంలో ఏమేరకు భూమి వినియోగానికి దూరంగా ఉందో తేల్చి ఆయా సంస్థలకు అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. అనంతరం ఆ భూములను స్వాధీనం చేసుకోనున్నారు.