15 రోజుల్లో సీఎం మార్పు ఖాయం: పాల్వాయి
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి మార్పుపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 రోజుల్లో సీఎం మార్పు ఖాయమని చెప్పారు. సీమాంధ్ర నుంచి కొత్త సీఎం వస్తారని వెల్లడించారు. 12 వారాల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడబోతోందని అన్నారు. హైదరాబాద్ శాంతిభద్రతలు కేంద్రం పరిధిలో ఉన్నా తమకు అభ్యంతరం లేదన్నారు. సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. అసెంబ్లీకి తెలంగాణ తీర్మానం రాదు.. నోట్ మాత్రమే వస్తుందని పాల్వాయి తెలిపారు.
కాగా, ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని మాజీ పి. శంకర్రావు కూడా ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా సీఎం రేసులో ఉన్నట్టు మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పాల్వాయి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.