'మల్కాజ్గిరిలో నా గెలుపు ఖాయం' | ysr congress party will win Malkajgiri MP seat, says dinesh reddy | Sakshi
Sakshi News home page

'మల్కాజ్గిరిలో నా గెలుపు ఖాయం'

Published Mon, Apr 28 2014 11:10 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

'మల్కాజ్గిరిలో నా గెలుపు ఖాయం' - Sakshi

'మల్కాజ్గిరిలో నా గెలుపు ఖాయం'

హైదరాబాద్ : మల్కాజ్‌ గిరిలో తన విజయం ఖాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్థి దినేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంపై నమ్మకం, పార్టీ ప్రజాదరణ, తన గత చరిత్రే గెలిపిస్తాయని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో సచ్చీలత తన ఒక్కడికే ఉందని, తనపై ఎలాంటి ఆరోపణలు లేవని దినేష్ రెడ్డి అన్నారు.

ప్రజలకు అందుబాటులో ఉండేందుకు టోల్ఫ్రీ నెంబరు ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చానని, ఆ మాట నిలబెట్టుకుని టోల్ఫ్రీ నెంబరు ఏర్పాటు చేశానని దినేష్ రెడ్డి తెలిపారు. మల్కాజ్ గిరిలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అలాగే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement